ASCI
-
98 శాతం యాప్‌లు మోసపూరితాలే!.. సర్వేలో కీలక విషయాలు
డిజిటల్ యుగంలో కొత్త యాప్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇందులో చాలావరకు మోసపూరితమైన యాప్స్ ఉన్నట్లు అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) ఓ నివేదికలో విడుదల చేసింది. భారతదేశంలోని 53 టాప్ యాప్‌లలో 52 యాప్స్ వినియోగదారులను తప్పుదారి పట్టించే రీతిలో ఉన్నాయని వెల్లడించింది.ఏఎస్సీఐ 53 యాప్‌ల నుంచి 12,000 స్క్రీన్లను విశ్లేషించిం ఒక్కో యాప్‌కు సగటున 2.7 మోసపూరిత నమూనాలు ఉన్నాయని సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది. ఇందులో ప్రైవసీ, ఇంటర్ఫేస్, డ్రిప్ ప్రైసింగ్ వంటి 12 విభిన్న మోసపూరిత నమూనాలు ఉన్నట్లు నివేదికలో బయటపడ్డాయి.పలు మోసపూరిత యాప్‌లను ఇప్పటికే 21 బిలియన్ సార్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇందులో హెల్త్ -టెక్, ట్రావెల్ బుకింగ్, ఈ కామర్స్, స్ట్రీమింగ్ సర్వీస్‌లు, గేమింగ్ సెక్టార్లు ఉన్నట్లు తెలుస్తోంది.కొన్ని షాపింగ్ యాప్స్ తక్కువ ధర, తప్పుడు విషయాలను వెల్లడిస్తూ.. యూజర్ల డేటాను గ్రహిస్తున్నాయి లేదా గోప్యతకు హాని కలిగిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి మోసపూరిత యాప్స్ ఉద్దేశపూరితంగానే ప్రజలను మోసం చేస్తున్నాయని ఏఎస్సీఐ నివేదికలో వెల్లడించింది. యాప్‌లు మన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని బలహీనపరుస్తాయని, మన వ్యక్తిగత సమాచారాన్ని కూడా ప్రమాదంలో పడేస్తాయని సర్వేలో స్పష్టం చేశారు. -
ఏఎస్సీఐ సంచలన రిపోర్ట్ - డిజిటల్ మీడియాలోనే ఎక్కువగా అవే!
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో (ఏప్రిల్–సెప్టెంబర్) అభ్యంతరకర ప్రకటనలు అత్యధికంగా డిజిటల్ మీడియాలోనే దర్శనమిచ్చాయని అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ (ఏఎస్సీఐ) ఒక నివేదికలో తెలిపింది. అయిదింట నాలుగొంతుల అభ్యంతర యాడ్లు డిజిటల్ మీడియా నుంచే ఉన్నట్లు వివరించింది. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోలిస్తే 2023–24 ప్రథమార్ధంలో ఏఎస్సీఐ 27 శాతం అధికంగా 3,501 ప్రకటనలను సమీక్షించింది. సమీక్షాకాలంలో ఫిర్యాదుల సంఖ్య 34 శాతం పెరిగి 4,491కి చేరింది. ఏఎస్సీఐ ప్రాసెస్ చేసిన ప్రకటనల్లో ఇన్ఫ్లుయెన్సర్ల కేసులు 22 శాతం ఉన్నాయి. ఎనిమిది ఉల్లంఘనలతో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. రంగాల వారీగా చూస్తే .. అత్యధికంగా హెల్త్‌కేర్‌లో, ఆ తర్వాత సంప్రదాయ విద్య, వ్యక్తిగత సంరక్షణ, గేమింగ్ విభాగాల్లో ఉల్లంఘనలు జరిగాయి. నాలుగింట మూడొంతుల ఫిర్యాదులను ఏఎస్సీఐ సుమోటోగా చేపట్టగా, వినియోగదారుల నుంచి వచ్చినవి 21 శాతం ఉన్నాయి. ఉల్లంఘనల్లో వాటాలు చూస్తే డిజిటల్ మీడియా 79 శాతం, ప్రింట్ మాధ్యమం 17 శాతం, టీవీ మాధ్యమం 3 శాతంగా ఉన్నాయి. -
సెలెబ్రిటీలపై ఫిర్యాదుల వెల్లువ.. లిస్ట్‌లో ఎంఎస్ ధోనీ టాప్!
ముంబై: వాణిజ్య ప్రకటనల్లో నటించేటప్పుడు ఆయా ఉత్పత్తుల మంచీ, చెడుల గురించి మదింపు చేయడంలో చాలా మటుకు సెలబ్రిటీలు విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని అడ్వర్టైజింగ్ పరిశ్రమ స్వీయ నియంత్రణ సంస్థ ఏఎస్సీఐ తెలిపింది. ఇదీ చదవండి: ChatGPT false: క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్.. చాట్‌జీపీటీ చేసిన ఘనకార్యం ఇది! 2022 ఆర్థిక సంవత్సరంలో 55 ప్రకటనలకు సంబంధించి సెలబ్రిటీలపై ఫిర్యాదులు రాగా గత ఆర్థిక సంవత్సరం ఇది ఏకంగా 803 శాతం పెరిగి 503 యాడ్లకు చేరింది. వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం ప్రకారం సెలబ్రిటీలు తాము నటించే యాడ్ల గురించి ముందస్తుగా మదింపు చేయాలి. కానీ ఏఎస్సీఐ పరిశీలించిన 97 శాతం కేసుల్లో సెలబ్రిటీలు ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారు. ఎంఎస్ ధోనీ టాప్ పది ఉల్లంఘనలతో క్రికెటర్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) సెలబ్రిటీల లిస్టులో అగ్రస్థానంలో ఉండగా, ఏడు ఉల్లంఘనలతో యాక్టర్ కమెడియన్ భువన్ బామ్ రెండో స్థానంలో ఉన్నారు. గేమింగ్, క్లాసికల్ విద్య, హెల్త్‌కేర్, వ్యక్తిగత సంరక్షణ విభాగాల్లో అత్యధికంగా నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి. గత ఆర్థిక సంవత్సరం వివిధ మీడియా ఫార్మాట్లలో ఏఎస్‌సీఐకి 8,951 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో 7,928 కంప్లైంట్లను సమీక్షించింది. ఇదీ చదవండి: Mahila Samman Scheme: గుడ్‌న్యూస్.. మహిళా సమ్మాన్ డిపాజిట్‌పై కీలక ప్రకటన -
ఫాలోవర్లపై ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం.. 79 శాతం మంది కొనేందుకు రెడీ!
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో తమ కంటెంట్‌తో లక్షలాది మంది నెటిజన్లను ‘ఫాలోవర్లు’గా మార్చుకుంటున్న వ్యక్తులు ఇటీవలి కాలంలో ఇన్ఫ్లుయెన్సర్లుగా సరికొత్త పాత్ర పోషిస్తున్నారు. విషయ పరిజ్ఞానం, చలాకీ మాటలతో విజ్ఞానం, వినోదం అందిస్తూనే వివిధ సంస్థల ఉత్పత్తులను ప్రచారం చేస్తూ వాటిని కొనేలా ‘ఫాలోవర్ల’ను ప్రభావితం చేస్తున్నారు. ఉత్పత్తుల తయారీ సంస్థలకు కొనుగోళ్లు పెంచడంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పాత్ర నిర్ణయాత్మకంగా మారుతోందని అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) చేపట్టిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. 79% మందిలో నమ్మకం... దేశంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రచారం చేస్తున్న వస్తువులను కొనేందుకు 70 శాతం మంది ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు సర్వేలో వెల్లడైంది. ‘ఇన్ఫ్లుయెన్సర్ ట్రస్ట్ రిపోర్ట్’పేరిట 18 ఏళ్లకు పైబడిన వారిపై నిర్వహించిన ఈ సర్వేలో తాము ఈ ఇన్ఫ్లుయెన్సర్లు చెబుతున్న విషయాలను విశ్వసిస్తున్నట్లు 79 శాతం మంది పేర్కొన్నారు. వారిలో 30 శాతమైతే సంపూర్ణంగా నమ్ముతున్నట్లు తెలపగా 49 శాతం మంది ఎంతో కొంత విశ్వసిస్తున్నట్లు తెలియజేశారు. నివేదికలోని ముఖ్యాంశాలు... ►సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎండార్స్ చేసిన వస్తువుల్లో కనీసం ఒకటైనా కొనుగోలు చేశామన్న 90 శాతం మంది నెటిజన్లు. ►వారు సూచించిన లేదా పేర్కొన్న ఉత్పత్తుల్లో మూడుకన్నా ఎక్కువే కొంటున్నామన్న వారు 61 శాతం (25 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య వారు). ►ఇన్ఫ్లుయెన్సర్లు పారదర్శకంగా, నిజాయితీగా వ్యవహరించడంతోపాటు ఆయా బ్రాండ్లతో తమకున్న సంబంధాల గురించి దాచకుండా బయటపెట్టినప్పుడే వినియోగదారులు వారిని విశ్వసిస్తున్నారు. ►సెలబ్రిటీలుగా, ఇన్ఫ్లుయెన్సర్లుగా వారు గడిపే జీవనశైలి, వ్యక్తిగత జీవితం, అనుభవాలు కస్టమర్ల విశ్వాసాన్ని పెంచుతున్నాయి. ►ఒకవేళ ఇన్ఫ్లుయెన్సర్లలో విశ్వసనీయత కొరవడితే వారిని ‘ఫాలోవర్లు’నమ్మే పరిస్థితి లేదు. ఫిర్యాదులు సైతం ఉన్నాయి... వివిధ బ్రాండ్లు, ఇన్ఫ్లుయెన్సర్లకు సంబంధించి ఆస్కికి 2,767 ఫిర్యాదులు (2021–22లో 1,592, 2021–22 ఏప్రిల్–డిసెంబర్ల మధ్య 1,175) అందాయి. ఇందులో వర్చువల్ డిజిటల్ అసెట్స్, పర్సన్కేర్ వంటి అంశాలపై వినియోగదారుల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు నమోదయ్యాయి. దీంతో ఆయా సంస్థలు, ఉత్పత్తులతో ఉన్న అనుబంధం, ఇతర అంశాలను తెలియజేయాలంటూ ఇన్ఫ్లుయెన్సర్లను 2021 మేలో ఏఎస్సీఐ కోరింది. 500 కోట్ల నెటిజన్లు.. ప్రపంచంలోని సగం జనాభాకు పైగా... అంటే దాదాపు 500 కోట్ల మంది సోషల్ మీడియాలోని ఏదో ఒక వేదికపై యాక్టివ్‌గా ఉన్నారు. 2027కల్లా ఈ సంఖ్య 600 కోట్లకు పెరుగుతుందని నిపుణుల అంచనా. పనిచేస్తున్న మార్కెటింగ్ వ్యూహాలు సోషల్ మీడియాలో ప్రముఖ వ్యక్తులు ఉపయోగిస్తున్న లేదా ప్రచారం చేస్తున్న వస్తువులను ‘ఫాలోవర్లు’కొనుగోలు చేసేలా చేయడంలో మార్కెటింగ్ వ్యూహాలు బాగా పనిచేస్తున్నాయి. ఆన్లైన్ మార్కెటింగ్ అందుబాటులోకి వచ్చాక ఎవరూ వ్యక్తిగతంగా షాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే నచ్చిన ఉత్పత్తులను ఉన్న చోటు నుంచే వెతికి కొనుగోలు చేయడం నిమిషాల వ్యవధిలోనే పూర్తవుతోంది. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ -
GenderNext: ప్రకటనల్లో నేటి మహిళ
కురులకు షాంపూలు.. మేనికి సబ్బులు.. వంటింట్లో కుకర్, మిక్సీలకే కాదు పురుషులు వాడే షేవింగ్ క్రీములకూ మహిళలను చూపించనిదే ఏ ప్రకటనా ఉండదనే విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రకటనల్లో మహిళా శక్తిని ఏ విధంగా చూపుతున్నారనే అంశం మీద అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆస్కీ), ఫ్యూచర్ బ్రాండ్స్ ఆధ్వర్యంలో జెండర్ నెక్ట్స్ పేరిట ఓ స్టడీ నిర్వహించింది. ‘నేటి ఆధునిక రోజుల్లోనూ వాణిజ్య ప్రకటనల్లో చాలా వరకు మహిళల్ని ఇంకా మూస పద్ధతిలోనే చూపిస్తున్నారు’ అనేది ఈ స్టడీలో తేలింది. ప్రకటనల రంగంలో మహిళల ప్రాతినిధ్యంపై చేసిన లోతైన పరిశీలన ఇది. దాదాపు 600 ప్రకటనల్ని పరిశీలించిన అనంతరం మహిళల శక్తిని తక్కువ చేసి చూపుతున్నట్టు జెండర్ నెక్ట్స్ స్టడీ నిరూపించింది. ఆకాశమే హద్దుగా ఎదుగుతున్న నేటి మహిళను ఆంక్షల్లో చూపెట్టడం సరికాదన్న విషయాన్ని స్పష్టం చేసింది. సంధించిన బాణాలు పర్సనల్ కేర్, ఫ్యాషన్, బ్యూటీ, హెల్త్, గాడ్జెట్స్, వీల్స్, విద్య, మనీ... సంబంధిత ప్రకటనలపై స్టడీ చేసిన అనంతరం కొన్ని ప్రశ్నలను రూపొందించి, వాటిని ఆన్లైన్ వేదిక ద్వారా ‘నేటి కాలంలో ప్రకటనలు మహిళల్ని ఎలా చూపిస్తున్నాయి? మహిళలు తమను తాము ఎలా భావిస్తున్నారు? తమను ఎలా చూపాలనుకుంటున్నారు?’ అనే ప్రశ్నలకు వృత్తి ఉద్యోగాలలో ఉన్న మహిళల నుంచి సమాధానాలు రాబట్టింది. ఈ పరిశోధనలో భాగంగా అన్ని రకాల ప్రకటనలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం జెండర్ నెక్ట్స్ స్టడీకి ప్రధాన ఆథర్ గా వ్యవహరించిన లిపికా కుమరన్ మాట్లాడుతూ ‘ప్రకటనల్లో సానుకూల అంశాలున్నప్పటికీ, మెయిన్ స్ట్రీమ్ అడ్వర్టయిజింగ్‌లో కొన్ని హానికరమైన స్టీరియో టైప్స్ పాత్రలున్నాయ’న్నారు. మహిళలకు సవాల్! మహిళలు ఆహారం తీసుకునే అలవాటును అత్యంత సున్నితంగా చూపడం పట్ల స్టడీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే మిగిలిన వారంతా విశ్రాంతిగా కూర్చుని ఉండగా మహిళలు ఆపసోపాలు పడుతూ ఇంట్లో పనులు చేస్తున్నట్టు చూపడం, షాపింగ్‌లో అధికంగా ఖర్చు చేసేవారన్నట్టు, బ్యూటీ యాడ్స్‌లో మగవాళ్ల చూపులకు నచ్చే విధంగా ఉండేలా చూపడం, టెక్నాలజీ, గాడ్జెట్స్ వాడకంలో మహిళల శక్తి తక్కువ అన్నట్టు చూపడంతో పాటు మగ సెలబ్రిటీలు మహిళలకు సవాళ్లు విసురుతుండడం, ఆదేశాలు ఇస్తుండడం.. వంటివి అభ్యంతరకరంగా తేల్చారు. డిటర్జెంట్, ఫుడ్‌కు సంబంధించినవన్నీ మహిళల చేత మహిళలకోసమే రూపొందించినట్టుగా ఉండటం కూడా ఇందులో ప్రధానంగా గుర్తించారు. అంగీకరించని నేటి తరం ప్రకటనలపై విభిన్న వర్గాల మహిళలు సైతం ఈ అభ్యంతరాల్ని సమర్థించారు. స్వయం సమృద్ధి దిశగా తమ ప్రయాణానికి ప్రకటనలు నేస్తాలు కావాలని వారు ఆకాంక్షిస్తున్నారు. ఇంట్లో పనంతా నెత్తినేసుకునేలా చూపడాన్ని నవ యువ వధువులు అంగీకరించడం లేదు. అలాగే మహిళా దినోత్సవం రోజున ఇచ్చే ప్రకటనల్లో... ఎన్నో కష్టాల తర్వాత మహిళలు విజేతలు అయినట్టుగా చూపడం కూడా ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ పరిశోధన ఫలితాల అనంతరం ప్రకటనల్లో మహిళల పాత్ర మెరుగుదలకు గాను అస్కీ పలు ప్రతిపాదనలు చేసింది. ఈ అధ్యయనం కోసం జాతీయ, ప్రాంతీయ ప్రకటనదారులు, ఏజెన్సీ, విధాన నిర్ణేతలు, న్యాయవాదులు .. ఇలా అందరు నిపుణులు సంప్రదించారు. ‘ప్రకటనలలో మహిళలను హానికరమైన మూసపద్ధతుల్లో చూపడం వల్ల యువతుల మానసిక స్థితిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని, వీటి వల్ల వారు సమాజంలో తమ విలువను ఏ విధంగా చూస్తారు’ అనే అంశాన్ని ఈ స్టడీ వెలుగులోకి తీసుకువచ్చింది. ఇటీవల ఒక పాల ఆధారిత ఉత్పత్తి కంపెనీ తన యానివర్సరీ వేడుకల్లో భాగంగా ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో భార్య, అమ్మ, అత్త, అమ్మమ్మ స్థానంలో ఉన్న ఆడవాళ్లందరూ మగవాళ్లకు రుచికరమైన వంటలు చేసి పెట్టేవారిగానే చూపారన్న అభియోగాలను సోషల్‌మీడియా వేదికగా ఎదుర్కొంటోంది. -
క్రిప్టో కరెన్సీ.. ఇది చాలా రిస్క్ గురూ!
ముంబై: క్రిప్టో కరెన్సీలు, నాన్–ఫంజిబుల్ టోకెన్ల ప్రకటనలకు సంబంధించి అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలి ఏఎస్సీఐ మార్గదర్శకాలు ప్రకటించింది. వీటి ప్రకారం ఇకపై ఈ సాధనాల ప్రకటనల్లో ఇవి ‘అవ్యవస్థీకృతమైనవి, అత్యధిక రిస్కులకు అవకాశమున్నవి‘ అని పేర్కొనడం తప్పనిసరి కానుంది. ఇలాంటి లావాదేవీల వల్ల నష్టం వాటిల్లితే నియంత్రణ సంస్థలపరంగా పరిష్కార మార్గాలేమీ ఉండకపోవచ్చని కూడా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ ప్రస్ఫుటంగా కనిపించేలా ఉండాలి. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి. క్రిప్టోలుగా వ్యవహరించే అన్ని వర్చువల్ డిజిటల్ అసెట్స్ (వీడీఏ), నాన్ ఫంజిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్టీ)కు ఇవి వర్తిస్తాయి. వివాదాస్పద క్రిప్టో సాధనాలు, సర్వీసుల ప్రకటనలు మార్కెట్‌ను ముంచెత్తుతున్న నేపథ్యంలో పరిశ్రమ వర్గాలు, ప్రభుత్వం, ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలతో సంప్రదింపుల మేరకు ఏఎస్సీఐ తాజా గైడ్‌లైన్స్ రూపొందించింది. ఈ అసెట్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఇంకా చట్టమేదీ చేయకపోయినప్పటికీ.. వీటి లావాదేవీలపై వచ్చే లాభాల మీద పన్ను వేయాలని మాత్రం ఇటీవల బడ్జెట్లో ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఓవైపు క్రిప్టోలను పూర్తిగా నిషేధించాలని ఆర్బీఐ పట్టుబడుతుండగా మరోవైపు ప్రభుత్వం మాత్రం పన్ను విధించాలని ప్రతిపాదించడం అనేది వీటికి చట్టబద్ధత కల్పించే ప్రయత్నంగా భావించవచ్చని పరిశ్రమ చెబుతోంది. నిబంధనలు.. ► ప్రింట్ ప్రకటనల్లో అయిదో వంతు స్థలాన్ని డిస్‌క్లెయిమర్ కోసం కేటాయించాలి. వీడియో ప్రకటన అయితే, ఆఖర్లో సాదా బ్యాక్‌గ్రౌండ్‌పై టెక్ట్స్‌ను సాధారణ వేగంతో వాయిస్ ఓవర్ ద్వారా చెప్పాల్సి ఉంటుంది. వీడియో యాడ్లలో కనీసం అయిదు సెకన్ల పాటైనా చూపాలి. అదే రెండు నిమిషాలు పైగా సాగే ప్రకటనల్లోనైతే యాడ్ ప్రారంభం కావడానికి ముందు, ఆ తర్వాత ఆఖర్లోనూ చూపాలి. ఆడియో, సోషల్ మీడియా పోస్టులు మొదలైన వాటికి కూడా ఇది వర్తిస్తుంది. ► కరెన్సీ, సెక్యూరిటీలు, కస్టోడియన్, డిపాజిటరీలు మొదలైన పదాలన్నీ నియంత్రణ సంస్థ పరిధిలోని ఉత్పత్తులుగా ప్రజలు భావించే అవకాశం ఉన్నందున వీడీఏ సాధనాలు లేదా సర్వీసుల ప్రకటనల్లో అడ్వర్టైజర్లు వీటిని వాడకూడదు. ► ఆయా సాధనాలకు సంబంధించి గత పనితీరు గురించి పాక్షికంగా కూడా చూపకూడదు. మైనర్లతో యాడ్స్ తీయకూడదు. ► భవిష్యత్తులో కచ్చితంగా లాభాలు పెరుగుతాయనే హమీ ఇచ్చే పదజాలం వాడకూడదు. ► వీడిఏ సాధనాల్లోని రిస్కులను తగ్గించి చూపే విధంగా ప్రకటనలు ఉండకూడదు. అలాగే నియంత్రిత అసెట్స్‌తో పోల్చి చూపకూడదు. ► వినియోగదారులు తప్పుదోవ పట్టకుండా చూసే క్రమంలో.. యాడ్స్‌లో నటించే సెలబ్రిటీలూ ప్రకటనల్లో చెప్పే విషయాల గురించి క్షుణ్నంగా తెలుసుకుని వ్యవహరించాలి. -
మనకూ బ్రాండ్ ఉండాలి.. సర్కార్ బ్రాండ్‌తో మార్కెటింగ్
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో ప్రైవేట్ రంగం నుంచి వస్తున్న కూరగాయలు, పండ్లు, సుగంధద్రవ్యాలు వంటి ఉత్పత్తులపై వినియోగదారుల్లో ఎన్నో సందేహాలు ఉంటున్నాయని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కీ) అభిప్రాయపడింది. అందుకే ప్రభుత్వమే ఒక బ్రాండ్‌ను నెలకొల్పి ఉద్యాన ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తే, ఒకవైపు వినియోగదారులకు ప్రయోజనం కలగడంతో పాటు రైతులకూ లాభాలు వస్తాయని సిఫారసు చేసింది. తెలంగాణలో ఉద్యాన పంటల సాగు, ఉత్పత్తి, అవసరాలపై ఏం చేయాలన్న అంశంపై ప్రభుత్వం ఆస్కీని అధ్యయనం చేయమని కోరింది. ఈ నేపథ్యంలో ఆస్కీ పలు సిఫారసులతో కూడిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీనిపై ప్రభుత్వం పలు దఫాలుగా చర్చించింది. ముఖ్యమంత్రికి కూడా ఈ నివేదికను అందజేసినట్లు ఉద్యానశాఖ వర్గాలు తెలిపాయి. ఉద్యానశాఖ అధికారులు కేవలం ఆఫీసులకే పరిమితం అవుతున్నారని, క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు వెళ్లి ఏ పంట.. ఎలా పండిస్తే ఏ మేరకు లాభం ఉంటుందో వివరించి చెప్పాలని సూచించింది. అదనంగా 2 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు రాష్ట్ర అవసరాలకు సరిపడా కూరగాయలు, పండ్లు పండాలంటే సాగు విస్తీర్ణం, ఉత్పత్తి పెరగాలని ఆస్కీ స్పష్టం చేసింది. అందుకోసం వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో అదనంగా రెండు లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగును పెంచాలని సిఫార్సు చేసింది. దీంతో ఉద్యాన ఉత్పత్తుల విలువ దాదాపు రూ. 40 వేల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గి, ఎగుమతులు కూడా పెరుగుతాయని తెలిపింది. ఉద్యాన ఉత్పత్తులను పెంచాలంటే, ఉద్యాన శాఖకు ప్రతీ ఏటా బడ్జెట్లో రూ. 1,700 కోట్లు కేటాయించాలని సూచించింది. అలాగే ఉద్యానశాఖలో అధికారులు, ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెంచాలని, అందుకోసం నియామకాలు చేపట్టాలని సిఫారసు చేసింది. క్రాప్ క్లస్టర్ల ఏర్పాటు రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల లోటు భారీగా ఉందని, వాటి కొరత తీరాలంటే క్రాప్ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ‘పండ్ల సాగుకు ఐదు క్లస్టర్లు, కూరగాయలకు తొమ్మిది, పూలకు ఒకటి, సుగంధ ద్రవ్యాలకు ఐదు క్లస్టర్లు ఉండేలా ప్రణాళిక రచించాలి. అందుకోసం ప్రతి జిల్లాలో అక్కడి వాతావరణ పరిస్థితులు, నేలల స్వభావం, నీటి వసతిని పరిశీలించాలి. రైతులు తమ పంటల పొలాల గెట్ల వద్ద టేకుతో పాటు చింత, జామ, వెదురు తదితరమైనవి వేసుకునేలా అవగాహన కల్పించా’లని తెలిపింది. అక్టోబర్ నెలలో ఉల్లిగడ్డ దిగుమతులు రాష్ట్రానికి ఎక్కువగా పెరుగుతున్నాయి. ఫలితంగా ధరలు తగ్గి, రైతులకు నష్టం వస్తోంది. అందుకే అక్టోబర్‌లో ఉల్లిగడ్డ దిగుమతులు తగ్గించాలని సూచించింది. ఆలుగడ్డ పండిస్తే రైతులకు గిట్టుబాటు అవుతుందని, దాన్ని 27 వేల ఎకరాల్లో సాగు చేసేలా చూడాలంది. 16 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో పండించాలని పేర్కొంది. మరికొన్ని సిఫారసులు ►ఖరీఫ్, రబీలలో కొన్ని రకాల కూరగాయలు అదనంగా వస్తున్నాయి. వాటికి డిమాండ్ వచ్చేలా ప్రణాళిక రచించాలి. ►వేసవిలో వస్తున్న కొరతను అధిగమించేలా ఉత్పత్తి, సరఫరా పెంచాలి. ►ఉద్యాన ఉత్పత్తులకు కోల్డ్‌చైన్లు ముఖ్యం. ప్రీ కూలింగ్, కోల్డ్ స్టోరేజ్‌లు, రైసెనింగ్ చాంబర్లు (పండ్లను మగ్గబెట్టేందుకు) ఏర్పాటు చేయాలి. ►5 వేల మెట్రిక్ టన్నులతో 30 కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, 300 రైసెనింగ్ చాంబర్లు, ప్రతి కూరగాయల మార్కెట్‌కు ఒక రిఫ్రిజిరేటర్ ఉండాలి. ►రెడీ టు సర్వ్‌లో భాగంగా డ్రైయింగ్, ఓస్మోటిక్ డీ హైడ్రేషన్, పల్పింగ్ జ్యూస్ చేసే ప్రాసెసింగ్ సౌకర్యాలు కల్పించాలి. ►మార్కెట్ ఇంటెలిజెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. -
ఆస్కీ నూతన డీజీగా ప్రొఫెసర్ నిర్మల
హైదరాబాద్: అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కీ) నూతన డైరెక్టర్ జనరల్ (డీజీ)గా ప్రొఫెసర్ నిర్మల అఫ్సింగీకర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆస్కీ చైర్మన్ పద్మనాభయ్య ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న విశ్రాంత ఐఏఎస్ అధికారి ఆర్‌హెచ్.ఖ్వాజా రాజీనామా చేయటంతో ఆమెను నియమించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..సంస్థ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో భౌతిక శాస్త్రంలో ఎంటెక్ చేసిన నిర్మల, ఐఐఎం బెంగళూర్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. ఆమె సేవలకు గుర్తింపుగా పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. -
తప్పుడు ప్రకటనలపై కంపెనీలకు ఏఎస్సీఐ అక్షింతలు
న్యూఢిల్లీ: తప్పుదోవ పట్టించే ప్రకటనలపై అడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి (ఏఎస్సీఐ) జులైలో 165 పైచిలుకు ఫిర్యాదులు అందాయి. వీటిలో 116 ప్రకటనల విషయంలో ఆయా సంస్థలు నిబంధనలు ఉల్లంఘించాయని ఏఎస్సీఐ నిర్ధారించింది. ఇందులో ఐటీసీ, గోద్రెజ్ కన్సూ్యమర్, హెచ్‌యూఎల్, ఎయిర్టెల్ వంటి పెద్ద కంపెనీల యాడ్స్ కూడా ఉన్నాయి. ‘క్లాస్మేట్’ బ్రాండ్ నోట్‌బుక్‌లో రాస్తే గుండ్రని రాతకు టీచర్ 2 మార్కులు ఎక్కువ ఇస్తారనే ఐటీసీ యాడ్‌ని తప్పు పడుతూ.. రాతకు.. నోట్బుక్కుకు సంబంధం లేదని సాధారణ నోట్‌బుక్ పేపరుపై కూడా అందంగా రాయొచ్చని ఏఎస్సీఐ వ్యాఖ్యానించింది. అలాగే త్రిఫల, ఆమ్ల, బిభీతకి మూలికల మేళవింపుతో తయారు చేసిన క్లినిక్ ప్లస్ ఉత్పత్తి జుట్టుకు బలాన్నిస్తుందన్న హిందుస్తాన్ యూనిలీవర్ ప్రకటనను కూడా ఆక్షేపించింది. జుట్టు బలానికి, త్రిఫలకి ముడిపెట్టడం తప్పుదోవ పట్టించేదేనని పేర్కొంది. ’’భారతదేశపు అత్యంత ఇంధన పొదుపు గ్రీన్ ఇన్వర్టర్ ఏసీ’’ అన్న గోద్రెజ్ ప్రకటన కూడా తప్పుదోవ పట్టించేదిగానే ఉందని కౌన్సిల్ తప్పుబట్టింది. -
ఆపిల్, ఎయిర్టెల్ సహా కంపెనీలకు చుక్కెదురు
న్యూఢిల్లీ: ప్రకటనల వాచ్ డాగ్ ఆస్కి(ఎడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) దిగ్గజ కంపెనీలకు షాకిచ్చింది. ముఖ్యంగా టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్, స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఆపిల్, కోకా కోలా ఇండియా సహా 143 కంపెనీలు తప్పుదోవపట్టించే ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నాయని ఆరోపించింది. ఇలాంటి ప్రకటనల్లో నిజాయితీ లేదనీ భారతీయ ప్రమాణాల మండలి తేల్చి చెప్పింది. ఇవి వాస్తవదూరంగా, ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. మొత్తం 191 ఫిర్యాదులు అందగా వీటిని పరిశీలించిన అనంతరం 143 ప్రకటనలను ఎడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తప్పు బట్టింది. దేశంలో అత్యంత భద్రత గల ఈ వాలెట్ గా ప్రచారం చేసుకుంటున్న డిజిటల్ పేమెంట్ సంస్థ మొబీ క్విక్ కు కూడా ఆస్కి షాకిచ్చింది. వీటితోపాటు హెచ్‌యుఎల్, నివియా, అమూల్, ఒపెరా, స్టాండర్ట్స్ చార్టర్బ్యాంక్ , ఒపెరా, పెర్నాడ్ రికార్డ్ తదితర 191 కంపెనీలపై కస్టమర్ కస్టమర్ ఫిర్యాదుల కౌన్సిల్ రెగ్యులేటరీ కి ఫిర్యాదు చేసింది. వినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగా కంపెనీలు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నాయన్నవాదనలను ఆస్కి సమర్ధించింది. వీటిల్లో ఆరోగ్య కేటగిరిలో 102 ఫిర్యాదులు, ఎడ్యుకేషన్ కేటగిరీలో 20, పెర్సనల్ కేర్ రంగంలో 7, ఆహారం, పానీయాలు మరియు ఇతర వర్గాలకు చెందిన ఎనిమిది ఫిర్యాదులను అంగీకరించింది. ముఖ్యంగా ఐ ఫోన్ 7 వేరియంట్ తప్పుడు ఇమేజ్‌తో ప్రచారం చేస్తోందని ఆరోపించింది. దీంతోపాటు ఇంకా 143 ఇతర ఫిర్యాదులను ఆస్కి అంగీకరించింది. వీటిల్లో కోకాకాలా థమ్స్యాప్, ఎయిర్ టెల్ ఉచిత ఆఫర్లు ఉన్నాయి. ప్రముఖ టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్టెల్ వ్యతిరేకంగా మూడు ఫిర్యాదులను ఆస్కి సమర్థించింది. ఎయిర్టెల్-వీ ఫైబర్ అప్‌గ్రేడ్ ద్వారా ఉచిత కాల్స్ స్థానిక + లోకల్ అనే ప్రకటన తప్పుదారి పట్టించేదిగా ఉందని వాదించింది. వినియోగదారుల దృష్టినుంచి ఇది ఫ్రీ ఆఫర్ కాదని, రూ.149 చార్జ్ చేయడంతోపాటు, 500 ఎంబీ డేటా బదులుగా 300 ఎంబీ డేటా మాత్రమే లభిస్తోందని పేర్కొంది. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి ఎయిర్ టెల్ నిరాకరించింది. ఎఫ్ఎంసీజీ మేజర్ హెచ్‌యుఎల్ రిన్యాంటి బాక్టీరియాపై ప్రకటనను ఆస్కి తప్పుబట్టింది. అయితే ఈ అభ్యంతరాలపై స్పందించిన సంస్థ ఆస్కి నిబంధనలను, సూచనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది. కోకా కోలా ప్రకటన వివాదాస్పందంగా ఉందని, ప్రమాదకరమైన ప్రాక్టీస్‌కు దారితీస్తుందని, దీన్ని వీక్షకులు ఆచరించకూడదని రెగ్యులేటరీ చెప్పింది. అయితే మొత్తం ప్రకటన అభ్యంతరకరంగా లేనప్పటికీ ప్రమాదకరమైన పద్ధతులను, నిర్లక్ష్యాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పింది. దీనిపై కోకా కోలా భారతదేశం ప్రతినిధి స్పందించారు. ఫిర్యాదుల మేరకు ప్రకటనను సరిచేస్తున్నట్టు తెలిపింది. టీవీ,డిజిటల్ మీడియాలో ఈ ప్రకటనను అప్డేట్ చేసినట్టు చెప్పింది. మెబీక్విక్ "అతిశయోక్తులతో తప్పుదారి" పట్టిస్తోందని గుర్తించినట్టు చెప్పింది. -
వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న కంపెనీలు!
వాస్తవ విరుద్దంగా ప్రకటనలు: ఏఎస్సీఐ న్యూఢిల్లీ: యాపిల్ ఐఫోన్ 7 ప్రకటనను ఎప్పుడైనా పరిశీలనగా చూశారా...? నిజానికి ఆ ప్రకటనలో చూపించేది ఐఫోన్ 7 కాదు. ఐఫోన్ 7ప్లస్. అంటే మెరుగైన ఉత్పత్తిని చూపిస్తూ వినియోగదారులను ఆకర్షించేలా ఈ ప్రకటన ఉన్నట్టు అర్థమవుతోంది. ఇలా 143 వాణిజ్య ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ప్రకటనల ప్రమాణాల కౌన్సిల్ (ఏఎస్సీఐ) ప్రకటించింది. వీటిలో కోకకోలా, భారతీ ఎయిర్టెల్ వంటి దిగ్గజ కంపెనీలవి సైతం ఉన్నాయి. మొబిక్విక్, హిందూస్తాన్ యునిలీవర్, నివియా, అముల్, ఓపెరా, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ తదితర సంస్థలకు సంబంధించి 191 ఫిర్యాదులు ఏఎస్సీఐ ఆధ్వర్యంలోని ఫిర్యాదుల కౌన్సిల్‌కు ముందుకు వచ్చాయి. వీటిలో 143 ప్రకటనలు నిజంగానే తప్పుదోవ పట్టిస్తున్నవిగా ఏఎస్సీఐ తేల్చింది. వీటిలో ఆరోగ్య రంగానికి చెందినవి 102, విద్యా రంగ ప్రకటనలు 20, వ్యక్తిగత సంరక్షణ విభాగంలో 7, ఆహార పానీయాల విభాగంలో 6, ఇతర విభాగాల నుంచి 8 ఉన్నాయి. -
జియో ఫిర్యాదు: ఎయిర్ టెల్కు దెబ్బపడింది
రిలయన్స్ జియో ఫిర్యాదుతో ఎయిర్ టెల్ కు దెబ్బపడింది. 'ఫాస్టెస్ట్ మొబైల్ నెట్ వర్క్' తమదేనంటూ ప్రచారాన్ని నిర్వహిస్తున్న ప్రమోషనల్ క్యాంపెయిన్ ను ఆపివేయాలని దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ ను వ్యాపార ప్రకటనల వాచ్ డాగ్ ఆదేశించింది. రిలయన్స్ జియో ఫిర్యాదుతో ఎయిర్ టెల్ కు అడ్వర్ టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్సీఐ) ఈ ఆదేశాలు జారీచేసింది. 2017 ఏప్రిల్ 11 వరకు టీవీ కమర్షియల్ లలో, వెబ్ సైట్ అడ్వర్ టైజ్మెంట్లో దీన్ని ఉపసంహరించుకోవాలని లేదా తగిన విధంగా సవరించుకోవాలని ఎయిర్ టెల్ కు ఏఎస్సీఐ సూచించింది. బ్రాడ్ బ్యాండ్ టెస్టర్ ఊక్లా ఎయిర్ టెల్ కు దేశంలోనే 'ఫాస్టెస్ట్ మొబైల్ నెట్ వర్క్ ' గా డిక్లేర్ చేసింది. కానీ ఊక్లా టెస్టింగ్ ను తప్పుబడుతూ జియో, ఏఎస్సీఐను ఆశ్రయించింది. అయితే ఏఎస్సీఐ నిర్ణయాన్ని తాము ఆమోదించేది లేదని, నిబంధనల ప్రకారమే తాము దీన్ని వాడుకుంటున్నట్టు అప్పీల్ దాఖలు చేస్తామని ఎయిర్ టెల్ చెబుతోంది. గ్లోబల్ మొబైల్ స్పీడ్ టెస్ట్ ఊక్లానే ఫాస్టెస్ట్ మొబైల్ నెట్ వర్క్ గా తమల్ని గుర్తించిందని పేర్కొంది. పారదర్శకత, విశ్వసనీయమైన డేటాతోనే తాము ఎయిర్ టెల్ కు ఈ ట్యాగ్ ఇచ్చినట్టు ఊక్లా కూడా స్పష్టంచేసింది. -
ఎయిర్ టెల్ చెప్పేదంతా అబద్ధం: జియో
టెలికాం కంపెనీల మధ్య వార్ ఇప్పట్లో సమసిపోయేటట్లు కనిపించడం లేదు. టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ పై రిలయన్స్ జియో మరోసారి తీవ్ర ఆరోపణలు చేసింది. దేశంలోనే తమదే ఫాస్టెస్ట్ నెట్ వర్క్ అని చెప్పుకుంటూ ఎయిర్ టెల్ తప్పుదోవపట్టిస్తుందని ఆరోపించింది. బ్రాండ్ బ్యాండ్ స్పీడ్ టెస్టర్ ఊక్లాతో కుట్రలు పన్నుతూ ఎయిర్ టెల్ తప్పుడు ప్రకటనలు చేస్తుందని తెలిపింది. ఈ విషయంపై అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఏఎస్సీఐ) వద్ద రిలయన్స్ జియో ఫిర్యాదుచేసింది. ఫాస్టెస్ట్ నెట్ వర్క్ తమదేనంటూ ఎయిర్ టెల్ చెప్పేదంతా అబద్ధమని, తప్పుడుదోవ పట్టిస్తుందని జియో ఆ ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఇండియాలో ఫాస్టెస్ట్ మొబైల్ నెట్ వర్క్ గా తమకు ఊక్లా రేటింగ్ ఇచ్చిందని ఎయిర్ టెల్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. తమ ప్రకటనలో కూడా అన్ని క్లియర్ గా పేర్కొన్నామని చెప్పారు. ఊక్లా తన పాపులర్ స్పీడ్ టెస్ట్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా మొబైల్ కస్టమర్లు వాడే మోడరన్ డివైజస్ లోకి లాగిన్ అయి, లక్షల కొలదీ ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ లను నిర్వహిస్తుందని ఎయిర్ టెల్ అధికార ప్రతినిధి తెలిపారు. అన్ని మొబైల్ టెస్ట్ లు దీనిలో కలిసి ఉంటాయన్నారు. అయితే ఊక్లా డబ్బుల తీసుకుని ఇలాంటి అవార్డులు ఇస్తుందని ముఖేష్ అంబానీ సంస్థ జియో ఆరోపిస్తోంది. ఊక్లాకు లీగల్ నోటీసు పంపుతామని తెలిపింది. ఊక్లా బ్రాండ్ బ్యాండ్ టెస్టింగ్, వెబ్ ఆధారిత నెట్ వర్క్ డయాగ్నోస్టిక్ అప్లికేషన్స్ లో గ్లోబల్ లీడర్. -
దిగ్గజ కంపెనీలకు షాకిచ్చిన ఆస్కి
ముంబై:ప్రకటనల వాచ్ డాగ్ ఆస్కి(ఏఎస్పీఐ) దిగ్గజ కంపెనీలకు షాకిచ్చింది. ముఖ్యంగా టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్, ఆటో మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం), హిమాలయా, టాటా టెలిసర్వీసెస్, సహా 134 సంస్థల ప్రకటనలను ఎడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తప్పు బట్టింది. ఇలాంటి ప్రకటనల్లో నిజాయితీ లేదనీ భారతీయ ప్రమాణాల మండలి తేల్చి చెప్పింది. ఇవి వాస్తవదూరంగా, ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. వీటిలో 44 ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగానికి చెందినవి. వీటితోపాటు 24 ఆహార-పానీయాలు, 8 వ్యక్తిగత సంరక్షణ విభాగాలవి. ఈ కంపెనీలు చెందిన యాడ్స్ తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆస్కికి చెందిన వినియోగదారుల ఫిర్యాదుల మండలి (సీసీసీ) ఆక్షేపించింది. గ్లాక్సోస్మిత్ క్లైన్ కన్జూమర్ హెల్త్‌కేర్, జిలెట్, హిందుస్థాన్ యునిలీవర్ సహా 183 సంస్థల ప్రకటలపై ఫిర్యాదులు రాగా, 134 ప్రకటనలపై ఫిర్యాదులను ఆస్కి సమర్థించింది. ముఖ్యంగా డొకోమో సర్వీసులకు చెందిన ప్రకటనలు 68 రూపాయల రీచార్జ్ పై 30 పైసలు నిమిషానికి ఎస్టీడీ, లోక్ కాల్స్ ప్రకటన హిందుస్థాన్ యూనీలీవర్ డియోడరెంట్, జిల్లెట్ వెక్టార్ ప్రకటనలను ఆస్కి తప్పు బట్టింది. కాగా ఆస్కి ప్రకటనపై స్పందించిన ఎంఅండ్ ఎం ప్రతినిధి సదరు ప్రకటన లోకల్ ఏజెన్సీ తయారు చేసిందనీ, తక్షణమే ఆ యాడ్ నిలిపివేయాల్సిందిగా ఆదేశాల్చినట్టు తెలిపింది.దీనిపై ఎయిర్ టెల్ ప్రతినిధి స్పందించారు. ఆస్కి నిర్ధారణలను అంగీకరించమని వ్యాఖ్యానించారు. అటు హిమాలయా కూడా ఆస్కి ఆక్షేపణలను ఖండిస్తూ స్పందించింది -
‘ఆస్కి’లో అంతర్జాతీయ స్థాయి ఎంబీఏ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : అంతర్జాతీయ స్థాయిలో డ్యూయల్ డిగ్రీ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రాంను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కి) అక్టోబరులో ప్రారంభిస్తోంది. కోర్సు కాల వ్యవధి 18 నెలలు. ఇందులో భాగంగా అభ్యర్థులకు నెల రోజులపాటు యూరప్‌లోనూ బోధన ఉంటుంది. మొత్తంగా 15 వారాలు మాత్రమే తరగతులకు హాజరైతే చాలు. విద్యనభ్యసించే వారికి, వారు పనిచేస్తున్న కంపెనీలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకే ఈ విధంగా కోర్సును డిజైన్ చేశారు. సంస్థలు ఎదుర్కొంటున్న సవాళ్లపై లోతైన అవగాహన, వ్యాపార అవకాశాలు, ఆచరణీయ వ్యూహరచన, వాస్తవ పరిష్కారాలపై బోధన ఉంటుందని ఆస్కి సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎం.చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలిపారు. -
ఆస్కీ నూతన చైర్మన్‌గా పద్మనాభయ్య
హైదరాబాద్: ప్రఖ్యాత అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) నూతన చైర్మన్‌గా పద్మభూషణ్ అవార్డు గ్రహీత కె.పద్మనాభయ్య నియామకం అయ్యారు. ఆయన ఐఏఎస్ 1961 బ్యాచ్‌కు చెందిన అధికారి. కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ఈ సందర్భంగా పద్మనాభయ్య మాట్లాడుతూ.. ‘1956లో స్థాపించినప్పటి నుంచీ ఐఐఎంలు, ఇతర బిజినెస్ స్కూళ్లు వచ్చే వరకు ఆస్కీ దేశంలోనే టాప్ సంస్థగా ఉంది. ఆస్కీకి తిరిగి పునర్వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తా..’’ అని పేర్కొన్నారు. -
సుందర సౌధం
‘బెల్లా విస్టా’ గురించి నేటి తరం వారికి ఎంత మాత్రం తెలుసో ఎవరికి వారుగానే జవాబివ్వాలి. నేరుగా వారికి తెలియదనడం భావ్యం కాదు కదా!! బెల్లా విస్టా అనికాకుండా, ఆస్కీ అని అంటే, లేదా Administrative Staff College of India (ASCI) గురించి వాకబు చేస్తే చాలామంది సులువుగా గుర్తుపడతారు. ఆస్కీ భవనాలనే, నిజాం కాలంలో బెల్లావిస్టా అని పిలిచేవారు. ‘బెల్లావిస్టా’ లాటిన్ పదం.. అంటేa beautiful view అని అర్థం. తెలుగులో చెప్పాలంటే, చూడచక్కని అందమైన ప్రాంతం. పేరుకు తగ్గట్లే ఎత్తై వృక్షాలు, పచ్చని పచ్చిక బయళ్లతో చల్లని వాతావరణంలో ఖైరతాబాద్ జంక్షన్లో ప్రశాంతంగా ఉండే ఈ అందమైన భవనాలలో సుమారు అర్ధ శతాబ్ద కాలంగా అనేక ప్రభుత్వ-ప్రభుత్వేతర సంస్థల్లోని ఉన్నతాధికారులకు ఆస్కీ పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. నిజాం కుమారుడి నివాసం.. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, నాటి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ టి.టి. కృష్ణమాచారి ప్రోత్సాహంతో, మారుతున్న సామాజిక అవసరాలకు అనుగుణంగా ఆధునిక రీతిలో ప్రభుత్వ అధికారులకు తగిన శిక్షణ ఇప్పించాల్సిన అవసరాన్ని గుర్తించి ఏర్పాటు చేసిన శిక్షణ సంస్థ ఆస్కీ. 1919 ప్రాంతంలో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆస్థానంలోని ప్రధానమంత్రి సర్ అలీ ఇమామ్ అధికార నివాసంగా ఈ బంగళా నిర్మాణం జరిగింది. ఈ బంగళా ప్రక్కనే వున్న ‘లేక్‌వ్యూ’ గెస్ట్‌హౌస్ ప్రధానమంత్రి అధికార కార్యాలయంగా వుండేది. ప్రధానమంత్రి సర్అలీ ఇమామ్ 1922 ప్రాంతంలో తన పదవీ బాధ్యతల నుంచి తప్పుకుని హైదరాబాద్‌ను వదలిపెట్టి వెళ్లిపోయారు.ఆ తర్వాత, ఈ బంగళాను ఆధునీకరించి నిజాం పెద్ద కుమారుడి నివాసంగా కేటా యించారు. ప్రిన్స్ ఆఫ్ బేరార్, commander in chief of the state's armed forces హోదాలో నిజాం కుమారుడికి ఈ బంగళా కేటాయించారు. ఏడో నిజాం పాలన 1911 నుంచి 1948 వరకు కొనసాగింది. నిజాం నవాబుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడి పేరు మీర్ హిమాయత్ అలీఖాన్(1907). ఈయన్నే ఆజాం ఖాన్‌గా కూడా స్థానికులు పిలిచేవారు. రెండో కొడుకు పేరు - మీర్ సుజాత్ అలీఖాన్. ఈయన్ని ‘మౌజాంగా’ పిలిచేవారు. ఈయన సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు (1912) చైర్మన్‌గా ఉండేవాడు. ఈయన హిల్‌ఫోర్ట్ ప్యాలెస్‌లో ఉండేవాడు. ప్రస్తుతం దీనినే రిడ్జ్ హోటల్‌గా పిలుస్తున్నారు. నిజాం సోదరులు ఇద్దరూ 1931 నవంబర్ 12న ఫ్రాన్స్-దేశంలోని ‘నైస్’ అనే ప్రాంతంలో వివాహం చేసుకున్నారు. నిజాం పెద్ద కుమారుడు టర్కీ దేశపు ఆఖరి సుల్తాన్ అబ్దుల్ మాజిద్, ఏకైక కుమార్తె ప్రిన్సెస్ దారుషెవార్ను వివాహం చేసుకున్నాడు. దారుషెవార్ అంటే ‘మంచి ముత్యం’ అని అర్థం. కాగా, నిజాం రెండో కుమారుడు ప్రిన్సెస్ నిలోఫర్‌ను వివాహమాడారు. నిలోఫర్ అంటే కమలం అని అర్థం. ప్రిన్సెస్ నిలోఫర్‌కు దారుషెవార్తో దగ్గరి బంధుత్వం వుంది. ఫ్రాన్స్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలకు నిజాం గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ హాజరు కాలేదు. నూతన వధూవరులు నగరానికి తిరిగి వచ్చాక, 1931 డిసెంబర్ 31న, నిజాం ప్రభువు చౌమహల్లా ప్యాలెస్‌లో వైభవోపేతంగా రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. రైలు కూతకు కోత.. ఆ రోజుల్లో బెల్లావిస్టా చాలా ప్రశాంతంగా ఉండేది. బంగళా ఎదురుగా హుస్సేన్‌సాగర్ కనిపిస్తూ వుండేది. ఆ సాగర్ తీరాన రైలు మార్గంపై ఒకే ఒకరైలు ఎలాంటి శబ్దం చేయకుండా, హారన్ మోగించకుండా నిశ్శబ్దంగా ముందుకు సాగేది. ఈ ప్రాంతం చేరువలోకి రాగానే, రైలు ఇంజన్ డ్రైవర్ హారన్ మోగించరాదనే ఆదేశాలు ఉండేవి. అలా ‘బెల్లావిస్టా’ అప్పట్లో భూతల స్వర్గంగా ఒక వెలుగు వెలిగింది. భారత స్వాతంత్య్రానంతరం నిజాం కుమారుడికి ప్రిన్స ఆఫ్ బేరార్, (కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఆర్మడ్ ఫోర్సెస్) హోదాలు తొలగిపోయాయి.అనంతరం, అధికార బంగళా ఖాళీ చేసి పంజగుట్టలోని ఎత్తయిన కొండపై గల బైటల్ అజీజ్ బంగళాకు మారాడాయన. అందుకే అమ్మాం ప్రస్తుతం నాగార్జున గ్రూపు సంస్థలు ఈ భవనంలో వున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడ్డాక ముందుగా బెల్లావిస్టా భవనాలను గెస్ట్‌హౌస్‌కు కేటాయించారు. తర్వాత కొన్నాళ్లకు 1957 డిసెంబర్లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ)కోసం కేటాయించారు. ఆస్కీ కోసం అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెల్లావిస్టాను రూ.12 లక్షలకు అమ్మివేసింది. అతి ఖరీదైన బంగళాను కారు చౌకగా ప్రభుత్వం అమ్మివేసిందని రాష్ర్ట అసెంబ్లీలో చర్చ జరిగిందట. తక్కువ ఖరీదుకైనా ఒక మంచి సంస్థకు,ఒక మంచి పని కోసం కేటాయించామని, ఏదో ప్రైవేట్ వ్యక్తులకు అమ్మలేదని ప్రభుత్వం ప్రకటించింది. - మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com