ముంబై:ప్రకటనల వాచ్ డాగ్ ఆస్కి(ఏఎస్పీఐ) దిగ్గజ కంపెనీలకు షాకిచ్చింది. ముఖ్యంగా టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్, ఆటో మేజర్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం), హిమాలయా, టాటా టెలిసర్వీసెస్, సహా 134 సంస్థల ప్రకటనలను ఎడ్వర్టైజింగ్ స్టాండర్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తప్పు బట్టింది. ఇలాంటి ప్రకటనల్లో నిజాయితీ లేదనీ భారతీయ ప్రమాణాల మండలి తేల్చి చెప్పింది. ఇవి వాస్తవదూరంగా, ప్రజలను తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.
వీటిలో 44 ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగానికి చెందినవి. వీటితోపాటు 24 ఆహార-పానీయాలు, 8 వ్యక్తిగత సంరక్షణ విభాగాలవి. ఈ కంపెనీలు చెందిన యాడ్స్ తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని ఆస్కికి చెందిన వినియోగదారుల ఫిర్యాదుల మండలి (సీసీసీ) ఆక్షేపించింది. గ్లాక్సోస్మిత్ క్లైన్ కన్జూమర్ హెల్త్‌కేర్, జిలెట్, హిందుస్థాన్ యునిలీవర్ సహా 183 సంస్థల ప్రకటలపై ఫిర్యాదులు రాగా, 134 ప్రకటనలపై ఫిర్యాదులను ఆస్కి సమర్థించింది.
ముఖ్యంగా డొకోమో సర్వీసులకు చెందిన ప్రకటనలు 68 రూపాయల రీచార్జ్ పై 30 పైసలు నిమిషానికి ఎస్టీడీ, లోక్ కాల్స్ ప్రకటన హిందుస్థాన్ యూనీలీవర్ డియోడరెంట్, జిల్లెట్ వెక్టార్ ప్రకటనలను ఆస్కి తప్పు బట్టింది. కాగా ఆస్కి ప్రకటనపై స్పందించిన ఎంఅండ్ ఎం ప్రతినిధి సదరు ప్రకటన లోకల్ ఏజెన్సీ తయారు చేసిందనీ, తక్షణమే ఆ యాడ్ నిలిపివేయాల్సిందిగా ఆదేశాల్చినట్టు తెలిపింది.దీనిపై ఎయిర్ టెల్ ప్రతినిధి స్పందించారు. ఆస్కి నిర్ధారణలను అంగీకరించమని వ్యాఖ్యానించారు. అటు హిమాలయా కూడా ఆస్కి ఆక్షేపణలను ఖండిస్తూ స్పందించింది