రిలయన్స్ జియో(Jio), భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సహా భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది టారిఫ్(Tariff)లను 10 శాతం పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో 2024 జులైలో 25 శాతం వరకు టారిఫ్ పెంచిన విషయం తెలిసిందే. ఆపరేటర్లు మార్జిన్లపై దృష్టి పెడుతున్నారని, త్వరలో 5జీ నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టవచ్చని జెఫరీస్ నివేదిక తెలిపింది.
2025లో జియో లిస్టింగ్‌కు వెళ్లే అవకాశం ఉండడంతో కంపెనీ తన వృద్ధిని పెంచడానికి అధిక టారిఫ్‌లకు అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతీ ఎయిర్‌టెల్ తన రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిమెంట్ (ROCE)ను మెరుగుపరచడానికి టారిఫ్‌లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా ఉన్నందున టారిఫ్ పెంపునకు అనుకూలంగా ఉండవచ్చనే అభిప్రాయాలున్నాయి.
ఇదీ చదవండి: రూపాయి క్షీణత మంచిదే
టారిఫ్ పెంపు వల్ల సగటు వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) కనీసం 25% పెరుగుతుందని, ఇది మెరుగైన మార్జిన్ విస్తరణ, నగదు ప్రవాహ ఉత్పత్తికి దారితీస్తుందని భావిస్తున్నారు. భారతీ ఎయిర్ టెల్, జియోలకు మార్జిన్లు 170-200 బేసిస్ పాయింట్లు పెరగడంతో టెలికాం రంగం ఆదాయ వృద్ధి ఏడాదికి 15 శాతం పెరుగుతుందని జెఫరీస్ అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment