Telecom sector
-
టెల్కోల ఆశలన్నీ ప్రభుత్వం పైనే!
సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఏజీఆర్) బకాయిలకు సంబంధించి టెలికాం కంపెనీలు ఆశలు పెంచుకుంటున్నారు. ఈ బకాయిలను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన తుది రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టివేసింది. దాంతో దేశంలోని టెలికాం ఆపరేటర్లు బకాయిల ఉపశమనం కోసం ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు.సుప్రీంకోర్టు చర్యలుఏజీఆర్ లెక్కల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (డాట్) దిద్దుబాట్లు కోరుతూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిటెల్ వంటి టెలికాం కంపెనీలు సుదీర్ఘ న్యాయపోరాటం చేశాయి. కానీ 2025 జనవరి 28న సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పుతో వాటి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, సంజయ్ కుమార్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అంశాన్ని పునఃసమీక్షించడంలో ఎలాంటి అర్హత లేదని తేల్చింది. రివ్యూ పిటిషన్లు, దానికి మద్దతుగా ఉన్న కారణాలను క్షుణ్ణంగా పరిశీలించామని, అయితే 2021 జులై 23న ఇచ్చిన ఉత్తర్వులను పునఃసమీక్షించడానికి ఎలాంటి కారణం లేదని కోర్టు పేర్కొంది. ఈ తీర్పుతో టెలికాం ఆపరేటర్లకు ఇకపై న్యాయపరమైన ఆధారం లేకుండా పోయింది. దాంతో ప్రభుత్వ సాయం కోరాలని టెలికాం కంపెనీలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది.సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం (ఎజీఆర్) అనేది ప్రభుత్వం, టెలికాం ఆపరేటర్ల మధ్య రుసుము-భాగస్వామ్య యంత్రాంగ విధానం. ఫిక్స్డ్ లైసెన్స్ ఫీజు మోడల్ స్థానంలో 1999లో అవలంబించిన రెవెన్యూ షేరింగ్ మోడల్లో భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు. ఈ మోడల్ కింద టెలికాం కంపెనీలు తమ ఏజీఆర్‌లో కొంత శాతాన్ని వార్షిక లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల రూపంలో ప్రభుత్వంతో పంచుకోవాల్సి ఉంటుంది.ఏజీఆర్ లెక్కింపు ఇలా..టెలికాం, నాన్ టెలికాం వనరుల నుంచి కంపెనీ ఆర్జించిన అన్ని ఆదాయాలను ఏజీఆర్‌లో చేరుస్తారు. ఇందులో ప్రధాన టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం, వడ్డీ ఆదాయం, డివిడెండ్, ఆస్తుల అమ్మకంపై లాభం, అద్దె రశీదులు వంటి ప్రధానేతర వనరులు ఉంటాయి. టెలికాం కంపెనీల స్థూల ఆదాయాల ఆధారంగా డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) లైసెన్స్ ఒప్పందాల్లో నిర్వచించిన విధంగా ఏజీఆర్‌ను లెక్కిస్తుంది. స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలకు 3-5 శాతం, లైసెన్సింగ్ ఫీజుకు 8 శాతం ఛార్జీలు వసూలు చేస్తున్నారు.ఇదీ చదవండి: 100 గిగావాట్ల అణుశక్తి లక్ష్యానికి తోడ్పాటువివాదం ఏమిటంటే..ఏజీఆర్‌లో కీలక టెలికాం సేవల నుంచి వచ్చే ఆదాయం మాత్రమే ఉండాలని టెలికాం ఆపరేటర్లు వాదిస్తున్నాయి. టెలికాం శాఖ మాత్రం అన్ని ఆదాయాలు అందులో పరిగణిస్తారని పేర్కొంటుంది. సుప్రీంకోర్టు 2019లో డాట్ నిర్వచనాన్ని సమర్థించింది. ఇది టెలికాం ఆపరేటర్లపాలిట శాపంగా మారింది. దాంతో ఇప్పటివరకు బకాయిపడిన, ప్రభుత్వంతో పంచుకోని ఆదాయాన్ని వెంటనే చెల్లించేలా తీర్పు వెలువడింది. దాంతో ప్రభుత్వంతో మంతనాలు సాగించేందుకు టెలికా కంపెనీలు సిద్ధమవుతున్నాయి. -
ఎయిర్టెల్ లాభాల ట్యూన్
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్ (క్యూ3)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 5 రెట్లు పైగా దూసుకెళ్లి రూ. 16,135 కోట్లకు చేరింది. గతేడాది (2023–24) ఇదే కాలంలో కేవలం రూ.2,876 కోట్లు ఆర్జించింది. ఇండస్ టవర్స్ బిజినెస్ కన్సాలిడేషన్ కారణంగా రూ. 14,323 కోట్లు ఆర్జించినట్లు కంపెనీ పేర్కొంది. రూ. 1,194 కోట్ల విదేశీ మారక లాభం అందుకుంది. మరోపక్క రూ. 128 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభించింది. మొత్తం ఆదాయం సైతం 19% ఎగసి రూ. 45,129 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 37,900 కోట్ల టర్నోవర్ అందుకుంది. ఈ కాలంలో ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 233 నుంచి రూ. 245కు బలపడింది. ప్రస్తుత సమీక్షా కాలంలో ఎయిర్టెల్ దేశీ బిజినెస్ 25%జంప్‌చేసి రూ. 34,654 కోట్లను తాకింది. దాదాపు రూ. 7,546 కోట్ల అనూహ్య లాభాలు ఆర్జించింది.ఫలితాల నేపథ్యంలో షేరు 2.5% క్షీణించి రూ. 1,620 వద్ద ముగిసింది. -
కాలర్ ఐడీ ఫీచర్‌ను వెంటనే అమలు చేయాలని ఆదేశాలు
మోసపూరిత కాల్స్‌ను అరికట్టడానికి భారత టెలికమ్యూనికేషన్ శాఖ(DoT) చర్యలు తీసుకుంటోంది. కాలర్ ఐడీ ఫీచర్‌ను అన్ని టెలికాం అపరేటర్లు వెంటనే అమలు చేయాలని ఆదేశించింది. మొబైల్ ఫోన్లలో కాలింగ్ నేమ్ ప్రజెంటేషన్ (CNAP) సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తెలిపింది. ఇన్ కమింగ్ కాల్స్‌కు సంబంధించి ఎవరు కాల్ చేశారో పేరు డిస్ ప్లే అయ్యేలా ఈ చర్యలు ఉపయోగపడనున్నాయి. దాంతో స్పామ్, స్కామ్ కాల్స్‌ను కట్టడి చేయవచ్చని డాట్ అంచనా వేస్తుంది.ఇటీవల టెలికాం ఆపరేటర్లతో జరిగిన సమావేశంలో సీఎన్ఏపీ సర్వీసులో ఆలస్యం జరగకుండా వెంటనే అమలు చేయాల్సిన అవసరాన్ని టెలికాం శాఖ నొక్కి చెప్పింది. టెలికాం కంపెనీలు ఈ టెక్నాలజీ కోసం ఇప్పటికే ట్రయల్స్ ప్రారంభించాయి. కానీ సాంకేతిక పరిమితుల కారణంగా 2జీ వినియోగదారులకు దీన్ని అమలు చేయడం సవాలుగా మరినట్లు అధికారులు తెలిపారు.ఇప్పటికే ఈ సేవలందిస్తున్న ప్రైవేట్ కంపెనీలుకాల్ చేసింది ఎవరనే వివరాలు డిస్ప్లేపై కనిపించడంతో కాల్ రిసీవ్ చేసుకునేవారికి సీఎన్ఏపీ సర్వీసు ఎంతో ఉపయోగపడుతుంది. దీని ద్వారా స్పామ్, స్కామ్ కాల్స్‌కు గురయ్యే ప్రమాదం తగ్గుతుంది. అయితే ఇప్పటికే ట్రూకాలర్ వంటి కొన్ని కంపెనీలు.. తమకు కాల్స్ చేసే వారి పేరును రిసీవర్ ఫోన్(mobile phones) డిస్ప్లేపై వచ్చేలా సేవలందిస్తున్నాయి. ప్రభుత్వం ఈ కొత్త సర్వీసు తీసుకురావడంతో ఈ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.అంతర్జాతీయ కాల్స్‌కు ఇలా..సీఎన్ఏపీ సర్వీస్‌తో పాటు, వినియోగదారులు అంతర్జాతీయ కాల్స్ ద్వారా మోసపోకుండా నిరోధించడానికి +91 కాల్స్‌ను అంతర్జాతీయ కాల్స్‌గా మార్క్ చేయాలని టెలికాం శాఖ టెల్కోలకు సూచించింది. ఇటీవల అంతర్జాతీయ స్కామ్ కాల్స్ పెరగడం ఎక్కువవుతుందని, ఈ చర్యల వల్ల ప్రమాదాన్ని కట్టడి చేసే అవకాశం ఉంటుందని తెలిపింది.సవాళ్లున్నా అమలుకు సిద్ధంసీఎన్ఏపీ సర్వీసు కోసం ట్రయల్స్ ఇంకా కొనసాగుతున్నాయి. అయితే కాల్స్ ఒక టెలికాం సర్కిల్లో ప్రారంభమమై మరొక సర్కిల్లో ముగుస్తాయి. గ్రౌండ్ రియాలిటీలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ సర్వీసును తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని మొబైల్ పరిశ్రమ నిపుణులు వాదిస్తున్నారు. ఏదేమైనా టెక్నికల్ సవాళ్లు ముగిసి, వ్యవస్థ స్థిరపడిన తర్వాత ఈ సేవను అమలు చేస్తామని టెల్కోలు తెలిపాయి.ఇదీ చదవండి: పాలసీబజార్ కార్యాలయంలో జీఎస్టీ సోదాలు -
మొబైల్ రీఛార్జ్ మరింత భారం కానుందా..?
రిలయన్స్ జియో(Jio), భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సహా భారతదేశంలోని టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది టారిఫ్(Tariff)లను 10 శాతం పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో 2024 జులైలో 25 శాతం వరకు టారిఫ్ పెంచిన విషయం తెలిసిందే. ఆపరేటర్లు మార్జిన్లపై దృష్టి పెడుతున్నారని, త్వరలో 5జీ నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టవచ్చని జెఫరీస్ నివేదిక తెలిపింది.2025లో జియో లిస్టింగ్‌కు వెళ్లే అవకాశం ఉండడంతో కంపెనీ తన వృద్ధిని పెంచడానికి అధిక టారిఫ్‌లకు అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతీ ఎయిర్టెల్ తన రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిమెంట్ (ROCE)ను మెరుగుపరచడానికి టారిఫ్‌లను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా ఉన్నందున టారిఫ్ పెంపునకు అనుకూలంగా ఉండవచ్చనే అభిప్రాయాలున్నాయి.ఇదీ చదవండి: రూపాయి క్షీణత మంచిదేటారిఫ్ పెంపు వల్ల సగటు వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) కనీసం 25% పెరుగుతుందని, ఇది మెరుగైన మార్జిన్ విస్తరణ, నగదు ప్రవాహ ఉత్పత్తికి దారితీస్తుందని భావిస్తున్నారు. భారతీ ఎయిర్ టెల్, జియోలకు మార్జిన్లు 170-200 బేసిస్ పాయింట్లు పెరగడంతో టెలికాం రంగం ఆదాయ వృద్ధి ఏడాదికి 15 శాతం పెరుగుతుందని జెఫరీస్ అంచనా వేసింది. -
స్పెక్ట్రమ్‌ను సమానంగా కేటాయించాలని డిమాండ్
బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం (BIF) ప్రాతినిధ్యం వహిస్తున్న భారతదేశంలోని టెక్ సంస్థలు(Tech firms) 6 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌ను సమానంగా కేటాయించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. స్పెక్ట్రమ్(Spectrum) 5జీ సేవలు, వై-ఫై రెండింటికీ ఈ బ్యాండ్ కీలకం కావడంతో దీని కేటాయింపుపై చర్చ తీవ్రమైంది.టెలికాం ఆపరేటర్లకు ప్రత్యేకంగా 6 గిగాహెర్ట్జ్ బ్యాండ్ (6425-7125 మెగాహెర్ట్జ్)లో ఎగువ భాగాన్ని కేటాయించేందుకు టెలికమ్యూనికేషన్ల శాఖ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ నిర్ణయంపై మెటా, అమెజాన్, గూగుల్‌తో సహా ఇతర టెక్ కంపెనీల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ విధానం వల్ల తమ వినియోగదారులకు పేలవమైన కనెక్టివిటీ ఉంటుందని ఆయా సంస్థలు వాదిస్తున్నాయి.టెక్ సంస్థల వాదనలుఇండోర్ కనెక్టివిటీ: ప్రస్తుతం 80% కంటే ఎక్కువ డేటా వినియోగం ఇండోర్(ఇంటి లోపల)లో ఉండే కస్టమర్ల ద్వారానే జరుగుతుంది. టెలికాం ఆపరేటర్లకు ఎక్కువ బ్యాండ్ కేటాయించడం వల్ల అధిక ఫ్రీక్వెన్సీ కారణంగా తమ సేవలు సమర్థంగా ఉండవని టెక్ కంపెనీలు చెబుతున్నాయి.ప్రపంచ దేశాల మాదిరగానే..: వై-ఫై, ఇన్నోవేషన్ కోసం అమెరికా సహా 84 దేశాలు 6 గిగాహెర్ట్జ్ బ్యాండ్‌లో 500 మెగాహెర్ట్జ్ లైసెన్స్ పొందాయి. వై-ఫై, మెరుగైన కనెక్టివిటీని అందించడానికి ఇండియాలోనూ ప్రపంచ దేశాల మాదిరిగానే వ్యవహరించాలని టెక్ సంస్థలు వాదిస్తున్నాయి.నేషనల్ డిజిటల్ ఎకానమీ: కేవలం టెలికాం ఆపరేటర్లకే అధిక బ్యాండ్(Band) కేటాయించడం సరికాదని అంటున్నాయి. విశ్వసనీయ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే జాతీయ లక్ష్యానికి ఇది విరుద్ధమని టెక్ సంస్థలు భావిస్తున్నాయి.టెలికాం ఆపరేటర్ల వాదనలుస్పెక్ట్రమ్ కొరత: అంతరాయం లేని 5జీ సేవలను అందించడానికి స్పెక్ట్రమ్ కొరత ఉంది. దాన్ని పరిష్కరించడానికి 6 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ అవసరమని టెలికాం ఆపరేటర్లు అంటున్నారు.మౌలిక సదుపాయాలకు ఖర్చులు: వై-ఫై కోసం తక్కువ బ్యాండ్ కేటాయించడం వల్ల మౌలిక సదుపాయాల ఖర్చులు పెరుగుతాయి. సర్వీస్ క్వాలిటీ నిలిపేందుకు తక్కువ దూరాల్లో ఎక్కువ టవర్లు అవసరమవుతాయి.ఇదీ చదవండి: ఆర్బీఐ అంచనాలకు డేటా ఆధారిత విధానంప్రభుత్వ వైఖరి..టెలికాం శాఖ తన నిర్ణయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ కార్యదర్శుల కమిటీ వివరాల ప్రకారం బ్యాండ్‌లో ఎక్కువ విభాగాన్ని 5జీ, 6జీ వంటి అంతర్జాతీయ మొబైల్ టెలికమ్యూనికేషన్స్ (IMT) సేవల కోసం రిజర్వ్ చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ విభాగంలో మరింత సమర్థంగా సేవలందేలా ఉపగ్రహ కార్యకలాపాలను అధిక కెయు-బ్యాండ్ (12 గిగాహెర్ట్జ్)కు మార్చాలని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలిసింది. -
సైబర్ నేరాలపై వినూత్నంగా అవగాహన
దేశంలో సైబర్ నేరాలు అంతకంతకూ పెరుగుతుండడంతో టెలికం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కాలర్ ట్యూన్స్ ద్వారా సైబర్ నేరాలపట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని నడుం బిగించింది. ఈ మేరకు టెలికం కంపెనీలకు ఆదేశాలు వెలువరించింది. ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని టెల్కోలను ఆదేశించింది.హోమ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్‌క్రైమ్ కో–ఆర్డినేషన్ సెంటర్ ఈ కాలర్ ట్యూన్స్‌ను టెలికం కంపెనీలకు అందిస్తుంది. టెలికం కంపెనీలు మొబైల్ కస్టమర్లకు ప్రతిరోజు 8–10 కాల్స్‌కు ఈ సందేశాన్ని వినిపిస్తాయి. ప్రతి వారం కాలర్ ట్యూన్‌ను మారుస్తారు. ఇలా మూడు నెలలపాటు కాలర్ ట్యూన్స్ ద్వారా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కొన్ని కాల్స్ భారత్‌లో నుంచే వచ్చినట్లు కనిపిస్తాయి. వాస్తవానికి అందులో చాలా వరకు అంతర్జాతీయ స్పూఫ్డ్ ఇన్కమింగ్ కాల్స్ ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వాటిని వెంటనే గుర్తించి బ్లాక్ చేసే వ్యవస్థను కేంద్రం, అలాగే టెలికం సర్వీస్ ప్రొవైడర్లు రూపొందించారు.ఇదీ చదవండి: ‘భారత్ మార్కెట్‌కు కట్టుబడి ఉన్నాం’ఇటీవల నకిలీ డిజిటల్ అరెస్టులు, ఫెడెక్స్ స్కామ్‌లు, ప్రభుత్వం, పోలీసు అధికారులుగా నటించడం మొదలైన కేసులలో సైబర్ నేరస్థులు ఇటువంటి అంతర్జాతీయ స్పూఫ్డ్ కాల్స్ చేసినట్టు ప్రభుత్వం గుర్తించింది. 2024 నవంబర్ 15 వరకు 6.69 లక్షలకు పైగా సిమ్ కార్డ్‌లు, 1,32,000 ఐఎంఈఐలను కేంద్రం బ్లాక్ చేసింది. -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు తీపికబురు
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) తన కస్టమర్లకు శుభవార్త అందించింది. సమీప భవిష్యత్తులో టారిఫ్ రేట్లను పెంచబోమని బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ రవి స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో బీఎస్ఎన్ఎల్కు కస్టమర్లు పెరుగుతున్న నేపథ్యంలో స్పామ్ బ్లాకర్స్, ఆటోమేటెడ్ సిమ్ కియోస్క్‌లు, డైరెక్ట్-టు-డివైస్ సేవలు వంటి కొత్త ఆఫర్లను తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న వినియోగదారులను నిలుపుకోవడంతోపాటు కొత్తవారిని ఆకర్షించడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడుతాయని చెప్పారు.సెప్టెంబర్ 2024లో బీఎస్ఎన్ఎల్ ఊహించని విధంగా 8.5 లక్షల మంది సబ్స్క్రైబర్లను పొందింది. ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీలకు ఈమేరకు కస్టమర్లు తగ్గుతున్నారు. జులైలో ప్రైవేట్ టెలికాం సంస్థలు 10 శాతం నుంచి 27 శాతం వరకు టారిఫ్ రేట్లను పెంచడంతో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్కు మళ్లుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఇటీవల కాలంతో దాదాపు కోటి మంది చందాదారులను కోల్పోయాయి. జియో ఒక్కటే 79.69 లక్షల మంది సబ్స్క్రైబర్లను నష్టపోయింది.ఇదీ చదవండి: రిపేర్ బిల్లు చూసి చిర్రెత్తిన కస్టమర్!మెరుగైన సేవలందిస్తే మేలు..ప్రస్తుతం జియో 46.37 కోట్లు, ఎయిర్టెల్ 38.34 కోట్లు, బీఎస్ఎన్ఎల్ 9.18 కోట్ల మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. బీఎన్ఎన్ఎల్కు సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ ప్రైవేట్ పోటీదారులతో పోల్చితే 4జీ, 5జీ సేవలందించడంతో చాలా వెనకబడి ఉంది. వినియోగదారుల పెంపును ఆసరాగా చేసుకుని విభిన్న విభాగాల్లో మెరుగైన సేవలందిస్తే మరింత మంది సబ్స్రైబర్లు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
రెండేళ్లలో రూ.5 లక్షల కోట్ల ఆదాయం
దేశీయంలో టెలికాం సంస్థల వార్షిక ఆదాయం వచ్చే రెండేళ్లలో రూ.ఐదు లక్షల కోట్లకు చేరుతుందని భారత టెలికా విభాగం(డాట్) తెలిపింది. ప్రభుత్వం గతంలో తీసుకున్న సులభతర వాణిజ్య చర్యల వల్ల ఇది సాధ్యమవుతుందని డిజిటల్ కమ్యూనికేషన్ కమిషన్ సభ్యుడు మనీశ్ సిన్హా అంచనా వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దేశంలో టెలికాం రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. రాబోయే రెండేళ్లలో టెలికాం కంపెనీల వార్షికాదాయాలు రూ.5 లక్షల కోట్లకు చేరవచ్చు. ప్రభుత్వం కొంతకాలంగా ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. ఇందులో భాగంగా సులభతర వ్యాపార చర్యలను అనుసరిస్తున్నారు. దాంతో ఈ రంగం వృద్ధి బాటలో పయనిస్తోంది. అయితే స్పెక్ట్రమ్ కేటాయింపు విషయంలో మాత్రం ప్రస్తుత పద్ధతులను సమీక్షించుకోవాలి. స్పెక్ట్రమ్‌ను ప్రస్తుతం పది లేదా ఇరవై ఏళ్లకు కేటాయిస్తున్నారు. ఈ కాలపరిమితి మార్చాల్సి ఉంది. తక్కువ గడువుకు స్పెక్ట్రమ్‌ను మంజూరు చేయాలి. స్పెక్ట్రమ్ వినియోగం, సామర్థ్యం, ఆర్థిక విలువల విషయంలో సమస్యలున్నాయి. నిత్యం కంపెనీల వృద్ధి పెరుగుతోంది. అందుకు భిన్నంగా పదేళ్లు, ఇరవై ఏళ్ల వరకు స్పెక్ట్రమ్ అనుమతులుండడంపై చర్చించాలి’ అన్నారు.ఇదీ చదవండి: రూ.5.18 లక్షలు.. జీతం కాదు.. ఇంటి అద్దె!టెలికాం నియత్రణ సంస్థ ట్రాయ్ నివేదిక ప్రకారం.. 2023-24లో టెలికాం నెట్వర్క్ కంపెనీలు రూ.3.36 లక్షల కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేశాయి. ఈ ఏడాది వీటి ఆదాయం రూ.4 లక్షల కోట్లకు చేరుతుందని సిన్హా అంచనా వేశారు. ఇదిలాఉండగా, టెలికాం కంపెనీలు తమకు తోచినట్లుగా టారిఫ్‌ను పెంచుతూ పోతున్నాయనే వాదనలున్నాయి. జులైలో జియో, ఎయిర్టెల్ వంటి ప్రముఖ సంస్థలు గతంలో కంటే 20 శాతం వరకు టారిఫ్ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. చేసేదేమిలేక వినియోగదారులు దాన్ని చెల్లిస్తున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని బీఎస్ఎన్ఎల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి అన్ని ప్రదేశాల్లో 4జీ, 5జీ సేవలందిస్తే మరింత మేలు జరుగుతుందని కస్టమర్లు భావిస్తున్నారు. -
‘స్మార్ట్’ స్టోర్స్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చమురు నుంచి టెలికామ్ వరకూ అన్ని రంగాల్లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న రిలయన్స్... తన రిటైల్ బిజినెస్‌ను మరింతగా విస్తరిస్తోంది. ప్రస్తుతం సుమారు 900 పైచిలుకు ఉన్న బిగ్ బాక్స్ స్టోర్స్ (స్మార్ట్ బజార్, స్మార్ట్ స్టోర్స్) సంఖ్యను వచ్చే ఏడాది ఆరంభానికల్లా వెయ్యికి పెంచుకోనుంది. చిన్న పట్టణాల్లో కూడా స్టోర్స్‌కి ఆదరణ లభిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లోనూ గణనీయంగా విస్తరిస్తున్నట్లు సంస్థ రిలయన్స్ రిటైల్ సీఈవో (గ్రోసరీ రిటైల్ బిజినెస్) దామోదర్ మాల్ తెలియజేశారు. ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన... రిలయన్స్ రిటైల్‌కి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరణకు చేస్తున్న ప్రయత్నాలను సమగ్రంగా వివరించారు. ఐఐటీ, ఐఐఎంలో విద్యాభ్యాసం చేసిన దామోదర్, యూనిలీవర్లో తన కెరీర్‌ను ఆరంభించారు. వ్యాపారవేత్తగా సొంతంగా సూపర్‌మార్కెట్ వెంచర్‌ను కూడా నిర్వహించారు. ఫ్యూచర్ గ్రూప్ తర్వాత రిలయన్స్ రిటైల్‌లో వేల్యూ ఫార్మాట్‌కి (స్మార్ట్ బజార్, రిలయన్స్ ఫ్రెష్ మొదలైనవి) సంబంధించిన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే భారతీయ వినియోగదారుల పోకడలను, సూపర్ మార్కెట్ల తీరుతెన్నులను గురించి వివరిస్తూ ‘సూపర్మార్కెట్వాలా’, ‘బీ ఎ సూపర్మార్కెట్వాలా’ పుస్తకాలు కూడా రాశారు. రిలయన్స్ రిటైల్ కార్యకలాపాలపై మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.తెలుగు రాష్ట్రాలకు చాలా ప్రాధాన్యం ఉంది... రిలయన్స్ రిటైల్‌కి దేశవ్యాప్తంగా కార్యకలాపాలు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలకు చాలా ప్రాధాన్యముంది. ఎందుకంటే తొలి రిటైల్ స్టోర్‌ను హైదరాబాద్‌లోనే ప్రారంభించాం. అలాగే తక్కువ ప్రాంతంలో ఎక్కువ స్టోర్స్ ఉన్నది కూడా ఇక్కడే. పండ్లు, ఎఫ్ఎంసీజీ, దుస్తులు, ఆహారోత్పత్తులు మొదలైనవన్నీ లభించే మా స్మార్ట్ బజార్ స్టోర్స్‌కి కూడా ఇక్కడ ప్రాధాన్యం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో వివిధ ఫార్మాట్లకు సంబంధించి 180 పైచిలుకు స్టోర్స్ ఉండగా వీటిలో 75 పైగా బిగ్ బాక్స్ స్టోర్స్ ఉన్నాయి. తెలంగాణలోనూ వివిధ ఫార్మాట్ల స్టోర్స్ 145 పైచిలుకు ఉండగా వాటిలో సుమారు 45 బిగ్ బాక్స్ ఫార్మాట్లో ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి 330 పైగా స్టోర్స్ ఉన్నాయి. ఇక చిన్న పట్టణాల విషయానికొస్తే, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లోని తణుకు, మదనపల్లె మొదలైనవి... అలాగే తెలంగాణలో బోధన్, సిద్దిపేట్ వంటి టౌన్లలో కూడా మా స్టోర్స్‌ను విస్తరించాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మా బిగ్ బాక్స్ స్టోర్స్ 900 పైచిలుకు ఉండగా వచ్చే ఏడాది ఆరంభం నాటికి ఈ సంఖ్యను వెయ్యికి పెంచుకోబోతున్నాం. పెద్ద నగరాల్లోలాగే చిన్న పట్టణాల్లోనూ వేల్యూ యాడెడ్, ప్రీమియం ఉత్పత్తుల కు మంచి డిమాండ్ ఉంటోంది. ఇక్కడి నుంచే భారీగా కొనుగోళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఆహారోత్పత్తులకు గణనీయమైన డిమాండ్ ఉంది. ఇక్కడ వాటి విక్రయాలు ఎక్కువ. దేశవ్యాప్తంగా ఉత్పత్తులను విక్రయించుకునేలా స్థానిక వ్యాపారులకు అవకాశాలు కల్పిస్తున్నాం. పలు లోకల్ బ్రాండ్లకు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పిస్తున్నాం. ఎంట్రప్రెన్యూర్లతో కలిసి పని చేస్తున్నాం. ప్రాంతీయంగా వినియోగదారులతో మరింతగా మమేకం అవుతూ ఇటీవల పలు స్టోర్స్‌లో బతుకమ్మ వేడుకలను కూడా నిర్వహించాం.మెరుగ్గా పండుగ సీజన్.. ప్రస్తుతం పండుగ వేడుకలు భారీ స్థాయిలో ఉంటున్నాయి. వివిధ పండుగలను కలిసి జరుపుకుంటున్నారు. సాధారణంగా కొన్నాళ్ల క్రితం వరకు ఒక ప్రాంతానికి పరిమితమైన నవరాత్రి, దాండియా, పూజో మొదలైన వాటిని ఇపుడు మిగతా ప్రాంతాల వారు కూడా చేసుకునే ధోరణి పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి, వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి మొదలైనవి పెద్ద స్థాయిలో జరుపుకుంటారు. ఇలాంటి పండుగ సీజన్లో ఆహారోత్పత్తులు, దుస్తులు, బహుమతులు మొదలైన వాటికి డిమాండ్ గణనీయంగా ఉంటుంది. కాబట్టి వివిధ ప్రాంతాల్లో వివిధ వర్గాల నుంచి ఉండే డిమాండ్‌కి అనుగుణంగా మా స్టోర్స్‌ను నిర్వహిస్తున్నాం. పండుగ సీజన్ సందర్భంగా మరిన్ని ఆఫర్లు అందిస్తున్నాం. మా స్టోర్స్ విషయానికొస్తే పండుగ సీజన్ చాలా సానుకూలంగా ప్రారంభమైంది. వివిధ కేటగిరీలవ్యాప్తంగా విక్రయాలు బాగున్నాయి. పూజాద్రవ్యాలు, దుస్తులు మొదలైన వాటికి డిమాండ్ ఉంటోంది. ఆఫ్‌లైన్, ఆన్లైన్ రిటైల్ పోటీపడుతున్నాయని అనుకోవడం కన్నా ఒకదానికి మరొకటి అనుబంధంగా ఉంటున్నాయని చెప్పవచ్చు. అందుకే వీటన్నింటినీ కలిపి ఆమ్నిచానల్గా వ్యవహరిస్తున్నాం. ఇక, ఆన్లైన్లో ఫేక్ ఆఫర్ల విషయాల్లో వినియోగదారులు జాగ్రత్త వహించక తప్పదు. అపరిచితుల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయకుండా, విశ్వసనీయమైన చోటే కొనుగోలు చేయడం శ్రేయస్కరం. -
ఫ్రాన్స్‌లో కమ్యూనికేషన్ లైన్ల ధ్వంసం
పారిస్: పారిస్‌లో ఒలింపిక్స్ ప్రారంభం రోజున శుక్రవారం రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించిన గుర్తు తెలియని దుండగులు..ఈసారి టెలీకమ్యూనికేషన్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో ఒలింపిక్స్ ఈవెంట్లు జరుగుతుండగా పలు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ కేబినెట్లలోని కేబుల్‌ను, సెల్‌ఫోన్, ల్యాండ్ లైన్లను దుండగులు ధ్వంసం చేసినట్లు ఫ్రాన్సు ప్రభుత్వం తెలిపింది. నష్టం తీవ్రత, ఒలింపిక్ కార్యక్రమాలపై ఏమేరకు ప్రభావం పడిందనే విషయాలను ప్రభుత్వం వెల్లడించలేదు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం వరకు స్థానికంగా టెలీకమ్యూనికేషన్ సేవలకు అంతరాయం కలిగినట్లు మాత్రమే సంబంధిత మంత్రిత్వ శాఖ వివరించింది. పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు ఈ పరిణామంపై ఎటువంటి ప్రకటనా చేయలేదు. -
టారిఫ్‌ల పెంపుతో టెల్కోలకు అధిక లాభాలు
న్యూఢిల్లీ: టారిఫ్‌ల పెంపుతో దేశీయంగా టాప్ మూడు టెలికం కంపెనీలకు ప్రతి యూజరుపై సగటున వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) 15 శాతం పెరగవచ్చని రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ ఒక నివేదికలో తెలిపింది. దీంతో ఆపరేటర్ల నిర్వహణ లాభాలు 2025 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 20–22 శాతం మేర పెరుగుతాయని పేర్కొంది. స్పెక్ట్రం కొనుగోలు, 5జీ సేవలపై భారీగా ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు, ఆ పెట్టుబడులపై రాబడి పొందడానికి తంటాలు పడుతున్న నేపథ్యంలో ఇది సానుకూలంగా పరిణమించగలదని కేర్ రేటింగ్స్ తెలిపింది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 191గా ఉన్న ఏఆర్పీయూ ఈ ఆర్థిక సంవత్సరం 15 శాతం వృద్ధితో రూ. 220కి చేరవచ్చని విశ్లేషించింది. ప్రతి రూ. 1 ఏఆర్పీయూ పెరుగుదలతో పరిశ్రమ నిర్వహణ లాభాలు రూ. 1,000 కోట్ల స్థాయిలో పెరుగుతాయని తెలిపింది. ఏఆర్పీయూ, లాభాల పెరుగుదలతో టెక్నాలజీలను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు, నెట్‌వర్క్‌ను విస్తరించుకునేందుకు టెల్కోలకు వెసులుబాటు లభించగలదని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ రుణ భారం కొంత దిగి వస్తుందని నివేదిక తెలిపింది. ఇటీవల జూన్‌లో ముగిసిన స్పెక్ట్రం వేలంలో టెల్కోలు పెద్దగా పాల్గొనకపోవడంతో .. రాబోయే రోజుల్లో రుణ భారం క్రమంగా మరింత తగ్గగలదని పేర్కొంది. -
26 నుంచి కొత్త టెలికం చట్టం
న్యూఢిల్లీ: టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 కింద కొన్ని నిబంధనలు ఈ నెల 26 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1885.. వైర్లెస్ టెలిగ్రాఫ్ చట్టం, 1993.. టెలిగ్రాఫ్ వైర్స్ చట్టం, 1950 స్థానంలో కొత్త చట్టం పాక్షికంగా అమలు కానుంది. ‘‘ద టెలికమ్యూనికేషన్స్ యాక్ట్, 2023 అమలు తేదీని జూన్ 26గా నిర్ణయించడమైనది. నాటి నుంచి చట్టంలోని 1, 2, 10 నుంచి 30 వరకు, 42 నుంచి 44 వరకు, 46, 47, 50 నుంచి 58 వరకు, 61, 62 సెక్షన్లు అమల్లోకి వస్తాయి’’అని ప్రభుత్వ నోటిఫికేషన్ స్పష్టం చేసింది. కొత్త చట్టంలోని నిబంధనల కింద కేంద్ర సర్కారు జాతి భద్రత ప్రయోజనాల పరిరక్షణ, యుద్ధ సమయాల్లో టెలికమ్యూనికేషన్ల నెట్‌వర్క్‌లు లేదా సేవలను తన ఆ«దీనంలోకి తీసుకోవడంతోపాటు నిర్వహించగలదు. స్పామ్, హానికారక కాల్స్, ఎస్ఎంఎస్ల నుంచి (సమాచారం) వినియోగదారులకు రక్షణ కలి్పంచడం తప్పనిసరి. -
త్వరలో యూఎస్ఎస్డీ కాల్ ఫార్వర్డ్ సదుపాయం రద్దు.. ఎందుకంటే..
కాల్ ఫార్వర్డ్ సేవలు వినియోగించుకుంటున్న యూజర్లు ఇకపై వాటిని వాడుకునేందుకు ఇతర పద్ధతులను పాటించాలని టెలికాం విభాగం తెలిపింది. యూఎస్ఎస్డీ కాల్ ఫార్వర్డింగ్‌లను ఏప్రిల్ 15 నుంచి నిలిపివేయాలని టెలికాం విభాగం (డాట్) టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా ఆ సేవలను తిరిగి యాక్టివేట్ చేసుకునేలా ఆపరేటర్లు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పింది. అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ ద్వారా కాల్ ఫార్వర్డింగ్ సదుపాయం అందిస్తున్నారు. దీన్ని ఐఎమ్ఈఐ నంబర్లు, మొబైల్ ఫోన్ బ్యాలెన్స్‌లను తనిఖీ చేసుకోవడానికి ఉపయోగిస్తారు. వీటిని *401# సేవలుగా వీటిని పిలుస్తుంటారు. యూఎస్ఎస్డీ కాల్ ఫార్వర్డ్ సదుపాయాన్ని కొందరు నిబంధనలకు విరుద్ధంగా ఇతర కార్యకలాపాలకు వినియోగిస్తుండడంతో టెలికా విభాగం ఈ చర్యలకు పూనుకుంది. మొబైల్ ఫోన్ల ద్వారా పెరుగుతున్న ఆన్లైన్ మోసాలకు చెక్ పెట్టేందుకు టెలికాం విభాగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. యూఎస్ఎస్డీ ఆధారిత కాల్ ఫార్వర్డింగ్ సేవలున్న ప్రస్తుత వినియోగదారులు అందరూ ప్రత్యామ్నాయ పద్ధతుల్లో తిరిగి వీటిని యాక్టివేట్ చేసుకోవాలని డాట్ ప్రకటన జారీ చేసింది. ఇదీ చదవండి: సమస్య పరిష్కారానికి ఇరవై గంటల జూమ్‌కాల్ -
నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచిన టెలికాం కంపెనీలు.. ఎందుకంటే..
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ట కాసేపట్లో జరగబోతుంది. రామ మందిర ప్రారంభ వేడుకల్లో కార్పొరేట్ సంస్థలు సందడిగా పాల్గొంటున్నాయి. దాదాపు 7000 మంది అతిథులు కార్యక్రమానికి హాజరుకానున్నారు. దేశంలోని కోట్లమంది ఈ క్రతువును పరోక్షంగా టీవీలు, సామాజిక మాధ్యమాలు, ఇతర మీడియాల్లో వీక్షించే అవకాశం ఉంది. దాంతో ఇప్పటికే టెలికాం సంస్థలు అందుకు సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ప్రతిష్టాపన పూర్తయిన తర్వాత రోజూ మూడు నుంచి ఐదు లక్షల మంది సందర్శకులు అయోధ్యను సందర్శించే అవకాశం ఉందని అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దేశీయ టెలికాం సంస్థలైన వొడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ అయోధ్యలో తమ నెట్వర్క్ సామర్థ్యాన్ని మెరుగుపరిచాయి. రామమందిర ప్రతిష్ఠాపన నేపథ్యంలో అయోధ్యలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో నెట్వర్క్ మౌలిక సదుపాయాలు, సామర్థ్యాన్ని పెంచినట్లు తెలిపాయి. దీంతో వినియోగదారులు స్పష్టమైన వాయిస్ కాల్స్, హై-స్పీడ్ డేటా, వీడియో స్ట్రీమింగ్ వంటి సదుపాయాల్ని పొందొచ్చని చెప్పాయి. ఇదీ చదవండి: అయోధ్యలో హూటల్ రూం ధర ఎంతంటే..? అయోధ్య రైల్వే స్టేషన్, రామమందిర ప్రాంగణం, విమానాశ్రయం, ప్రధాన ప్రాంతాలు, నగరంలోని హోటళ్లతో సహా అన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో తమ నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచినట్లు వెల్లడించాయి. లఖ్‌నవూకు అనుసంధానించే హైవేలతో సహా నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో పటిష్ట సిగ్నలింగ్ కోసం స్పెక్ట్రమ్ సామర్థ్యాన్ని మెరుగుపరిచినట్లు వొడాఫోన్ ఐడియా పేర్కొంది. అదనపు నెట్వర్క్ సైట్లు, అంతరాయం లేని నెట్వర్క్ అందించటం కోసం ఆప్టిక్ ఫైబర్ కేబుల్‌ను ఏర్పాటు చేసినట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. -
కీలక టారిఫ్‌లను తొలగించనున్న జియో, ఎయిర్టెల్?
ఖర్చులను తట్టుకోవడానికి టెలికం రంగ సంస్థలు టారిఫ్‌లను పెంచడానికి రెడీ అవుతున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్టెల్ ప్రీమియం కస్టమర్లకు ప్రస్తుతం అందించే తమ అన్లిమిటెడ్ 5జీ డేటా ప్లాన్లను ఆపేసే అవకాశం ఉంది. ఆదాయం పెంపునకు 2024 జూన్ నుంచి 4జీతో పోలిస్తే 5జీ సేవలకు కనీసం 5-10శాతం ఎక్కువ ఛార్జీ విధించవచ్చని టెలికం రంగ నిపుణులు చెబుతున్నారు. టెలికం కంపెనీలు 5జీ సేవల కోసం భారీగా ఇన్వెస్ట్ చేశాయి. ఈ ఖర్చును రాబట్టుకోవడానికి 2024 సెప్టెంబర్ క్వార్టర్లో రెండు టెలికాం ఆపరేటర్లు మొబైల్ టారిఫ్‌లను కనీసం 10శాతం పెంచాలని భావిస్తున్నట్టు సమాచారం. కస్టమర్లను 5జీకి అలవాటు చేయడానికి, ఇప్పటికే ఉన్న వినియోగదారులను ఆకర్షించడానికి ఈ రెండు కంపెనీలు 5జీ అన్లిమిటెడ్ డేటా ఆఫర్లతో పాటు 4జీ ధరలకే 5జీ సేవలను అందిస్తున్నాయి. జనం 5జీకి అలవాటు పడటం మొదలైనందున కంపెనీలు మానిటైజేషన్‌పై దృష్టిసారించినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ రెండు సంస్థలు కొన్ని నెలల్లో 5జీ- కోసం ప్లాన్లను ప్రకటించవచ్చని జెఫ్రీస్ ఒక రీసెర్చ్ నోట్లో తెలిపింది. ఎయిర్టెల్, జియో 5జీ రేట్లు 4జీ కంటే 5-10శాతం ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది. ఇటువంటి ప్లాన్లకు 30-40శాతం అదనపు డేటాను జోడించి మార్కెట్ షేరును పెంచుకొని, లాభాలు పొందవచ్చని తెలిసింది. ఇదీ చదవండి: రోజూ రూ.3 కోట్లు మాయం! ఎలా మోసం చేస్తున్నారంటే.. తగిన సమయంలో ఛార్జీలు పెంచడానికి వెనకాడబోమని గతంలో ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ అన్నారు. ప్రతి కస్టమర్ నుంచి వచ్చే నెలవారీ సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) ప్రస్తుతం ఉన్న రూ.200 నుంచి దాదాపు రూ.250కి పెంచుకుంటామని ప్రకటించారు. జియో, ఎయిర్‌టెల్‌కు కలిపి ఇప్పటికే 12.5 కోట్ల మంది 5జీ యూజర్లు ఉన్నారు. దేశం మొత్తం 5జీ యూజర్ బేస్ 2024 చివరి నాటికి 20 కోట్ల వరకు ఉంటుందని అంచనా. -
Telecom Bill 2023: టెలికం సేవలపై కేంద్రం నియంత్రణ
న్యూఢిల్లీ: జాతి భద్రత దృష్ట్యా టెలికమ్యూనికేషన్ సేవలను తాత్కాలికంగా నియంత్రణలోకి తెచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వానికి అధికారం కలి్పంచే కీలకమైన టెలికమ్యూనికేషన్స్ బిల్లు–2023ను గురువారం పార్లమెంట్ ఆమోదించింది. వేలం ప్రక్రియతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా గ్లోబల్ సర్విస్ ప్రొవైడర్లకు శాటిలైట్ స్పెక్ట్రమ్ కేటాయింపులు జరిపేందుకు కూడా ఈ బిల్లులో నిబంధనలున్నాయి. టెలికమ్యూనికేషన్స్ బిల్లు– 2023ను లోక్‌సభ బుధవారమే ఆమోదించగా గురువారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. బిల్లును టెలికమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సభలో ప్రవేశపెట్టారు. టెలికం బిల్లు ప్రభుత్వ జోక్యానికి ఎక్కువ తావిచ్చేలా ఉందంటూ పలువురు వ్యక్తం చేసిన ఆందోళనలపై మంత్రి బదులిస్తూ.. వలస పాలన కాలం నాటి పురాతన చట్టాల స్థానంలో ఈ బిల్లును తీసుకువచ్చామన్నారు. ‘టెలికం రంగంలో ఎంతో క్లిష్టమైన నిబంధనలతో కూడిన 100కు పైగా రకాల లైసెన్సులున్నాయి. ఈ బిల్లులో వీటన్నిటినీ తొలగించి, ఒకే ఒక అధికార వ్యవస్థ కిందికి తెచ్చాం. స్పెక్ట్రమ్ కేటాయింపులు పారదర్శకంగా ఉండేందుకు పలు చర్యలు ప్రతిపాదించాం. ఒకటో షెడ్యూల్లోని ఏవో కొన్ని ప్రత్యేక కేటగిరీలను మినహాయిస్తే స్పెక్ట్రమ్ కేటాయింపులన్నీ ఇకపై వేలం ద్వారానే జరుగుతాయి’అని మంత్రి వివరించారు. ‘బిల్లులో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాత్రకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు. జాతి భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం టెలికం సేవలను తాత్కాలికంగా అధీనంలోకి తెచ్చుకునేందుకు ఉద్దేశించిన నిబంధన ఇప్పటికే అమల్లో ఉంది. తాజాగా దీనిని మరింత బలోపేతం చేశాం. కొత్తగా ఏర్పాటు చేసిన డిజిటల్ భారత్ నిధి దేశంలో టెలికం రంగ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఉపయోగపడుతుంది’అని మంత్రి వివరించారు. పార్లమెంట్ ఆమోదం అనంతరం ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. రాష్ట్రపతి ఆమోదంతో చట్ట రూపం దాల్చనుంది. బిల్లు ముఖ్యాంశాలు.. ► శాంతి భద్రతలు, దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే పరిస్థితులున్నాయని భావించినప్పుడు టెలికం నెట్వర్క్ మొత్తాన్ని ప్రభుత్వం తన నియంత్రణలోకి తీసుకోవచ్చు. ప్రజాప్రయోజనాల పరిరక్షణ నిమిత్తం సందేశా(మెసేజీ)లను రహస్యంగా వినొచ్చు, ప్రసారాలను నిలిపివేయవచ్చు. ► ప్రకృతి విపత్తుల సమయాల్లోనూ ప్రభుత్వానికి ఇటువంటి అధికారాలు దఖలు పడతాయి. ► పై పరిస్థితుల్లో కేంద్రం నేరుగా, లేదా కేంద్రం తరఫున రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రత్యేక అధికారికి టెలికం సర్వి సులను లేదా టెలికం నెట్‌వర్క్‌ను నియంత్రణలోకి తీసుకునే అధికారం సమకూరుతుంది. ► ఎవరైనా అనధికారి టెలికం నెట్‌వర్క్‌ను, పరికరాలను, రేడియోలను వినియోగిస్తున్నారని తేలితే ప్రభుత్వం ఏ భవనాన్ని లేదా విమానం, నౌక సహా ఎటువంటి వాహనాన్ని అయినా తనిఖీ చేయొచ్చు, స్వా«దీనం చేసుకోవచ్చు. ► వాణిజ్య అవసరాలకు స్పెక్ట్రమ్‌లను వేలం ద్వారానే కేటాయించాలన్న దేశీయ టెలికం సేవల సంస్థలు జియో, వొడాఫోన్ ఐడియా అభ్యర్థనలను తోసిపుచ్చుతూ ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ సేవలందించే కంపెనీలకు పాలనా అనుమతుల ద్వారానే స్పెక్ట్రమ్‌లను కేటాయించేలా నిబంధనలను బిల్లులో పొందుపరిచారు. ► పాలనా అనుమతుల ప్రకారం..స్పెక్ట్రమ్ కేటాయింపులను దేశంలో, అంతర్జాతీయంగా సుదూర శాటిలైట్ సర్వి సెస్, విశాట్..విమానయానం, సముద్రయానంతో అనుసంధానమయ్యే నెట్‌వర్క్‌లు, బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ వంటి సంస్థలు పొందగలవు. ► ఇంటర్నెట్ ఆధారిత సందేశాలకు, కాల్స్ చేసుకోవడానికి వీలు కలి్పంచే వాట్సాప్, టెలిగ్రామ్, గూగుల్ మీట్ వంటి యాప్‌లకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనలు వర్తిస్తాయి. వీటిని టెలికం చట్ట పరిధి నుంచి తొలగిస్తారు. ► ఓటీటీ(ఓవర్ ది టాప్) యాప్‌లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) పరిధి నుంచి తొలగిస్తూ బిల్లులో ప్రతిపాదించారు. అనధికార ట్యాపింగ్‌లకు.. మూడేళ్ల జైలు, రూ.2 కోట్ల జరిమానా అక్రమంగా, అనుమతుల్లేకుండా ఫోన్ సందేశాలను రహస్యంగా విన్నా, ట్యాపింగ్‌కు పాల్పడినా భారీ జరిమానాతోపాటు కఠిన శిక్ష విధించే నిబంధనలు ఈ బిల్లులో ఉన్నాయి. దేశ ప్రయోజనాలకు, మిత్రదేశాలతో సత్సంబంధాలకు భంగం కలిగించేలా టెలికం సేవలను దుర్వినియోగపరచడం నేరంగా పరిగణిస్తారు. దోషులకు మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.2 కోట్ల వరకు జరిమానా, నేర తీవ్రతను బట్టి ఈ రెండూ విధించే అవకాశం ఉంది. నేరగాళ్లకు ప్రత్యక్షంగా, పరోక్షంగా టెలికం సేవలను అందించే సంస్థలపైనా చర్యలుంటాయి. కాల్ డేటా, ఇంటర్నెట్ ప్రొటోకాల్ డేటా రికార్డుల విషయంలో అక్రమాలకు పాల్పడినా శిక్ష, జరిమానా తప్పదు. టెలికం నెట్‌వర్క్‌లకు, టెలీకం సదుపాయాలకు ఉద్దేశ పూర్వకంగా నష్టం కలిగించే వారికి రూ.50 లక్షల వరకు జరిమానా విధించాలని బిల్లులో ప్రతిపాద నలున్నాయి. తప్పుడు ధ్రువ పత్రాలతో సిమ్.. రూ. 50 లక్షల జరిమానా, జైలు తప్పుడు ధ్రువపత్రాలతో సిమ్ కార్డు పొందే వారికి రూ.50 లక్షల జరిమానాతోపాటు మూడేళ్ల జైలు శిక్షకు ఈ బిల్లు వీలు కలి్పస్తోంది. ఎక్కువ సంఖ్యలో సిమ్ కార్డులను వాడి ‘సిమ్‌బాక్స్’తో అక్రమాలకు పాల్పడే వారికి, ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఇతరుల ఫోన్ నంబర్లను స్పూఫింగ్ చేస్తూ మోసాలకు పాల్పడే వారికి కూడా ఇవే శిక్షలుంటాయి. సిమ్ దురి్వనియోగాన్ని అడ్డుకట్ట వేయడంతోపాటు ఇతరులకు వివిధ మార్గాల్లో ఇబ్బంది కలిగించే కాలర్లపైనా చర్యలకు ఇందులో వీలుంది. వినియోగదారులు తమ ఫిర్యాదులను ఆన్లైన్ లో నమోదు చేసుకుని, పరిష్కారం పొందేందుకు సైతం బిల్లులో ఏర్పాట్లున్నాయి. -
ప్రభుత్వ అధీనంలోకి టెలికాం, ఓటీటీ సర్వీసులు..? భారీ మార్పులు ఇవే..
ఇంటర్నెట్తో నడిచే కాలింగ్/ మెసేజింగ్ యాప్స్‌తోపాటు ఓటీటీలపై ఇకనుంచి ప్రభుత్వం ఆధిపత్యం కొనసాగనుందని వాదనలు వస్తున్నాయి. తాజాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో టెలికమ్యూనికేషన్స్ డ్రాప్ట్ బిల్లు 2023ను ప్రవేశపెట్టింది. కేంద్ర టెలికం, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఇది అమల్లోకి వస్తే ఓటీటీ, ఇంటర్నెట్తో నడిచే కాలింగ్/ మెసేజింగ్ యాప్స్ టెలికమ్యూనికేషన్ శాఖ పరిధిలోకి వస్తాయి. దేశ భద్రతకు ముప్పు అనిపిస్తే ఎలాంటి నెట్వర్క్ లేదా టెలికమ్యూనికేషన్ సేవలనైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి లేదా నిలిపివేయడానికి అనుమతి ఉంటుంది. తాజా డ్రాఫ్ట్ బిల్లుతో టెలికాం రంగాన్ని నియంత్రించేలా 138 ఏళ్ల భారతీయ టెలిగ్రాఫ్ చట్టాన్ని మార్చాలని కేంద్ర యోచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఆగస్టులోనే కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారాన్ని కట్టడి చేయాలని కూడా కేంద్రం భావిస్తున్నట్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని టెలికాం కంపెనీల ప్రవేశ రుసుము, లైసెన్స్ ఫీజు, పెనాల్టీ మొదలైనవాటిని మాఫీ చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండాలనే ప్రపోజల్ కూడా ఈ బిల్లులో ఉందని తెలిసింది. ఒకేవేళ ఈ బిల్లు అమల్లోకి వస్తే వీటిలో భారీ మార్పు ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: పదాలతో సంగీతం..! ఎలాగో చూడండి.. -
వైట్ కాలర్ ఉద్యోగాలకు డిమాండ్ డౌన్
ముంబై: ఐటీ–సాఫ్ట్వేర్, టెలికం, విద్యా రంగాల్లో నియామకాలు మందగించిన నేపథ్యంలో అక్టోబర్–నవంబర్‌లో వైట్ కాలర్ ఉద్యోగాలకు హైరింగ్ తగ్గింది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12 శాతం క్షీణించింది. నౌకరీ జాబ్‌స్పీక్ సూచీకి సంబంధించిన నివేదిక ప్రకారం 2022 అక్టోబర్–నవంబర్‌లో 2,781 జాబ్ పోస్టింగ్స్ నమోదు కాగా ఈసారి అదే వ్యవధిలో 2,433 పోస్టింగ్స్ మాత్రమే నమోదయ్యాయి. నౌకరీడాట్‌కామ్‌లో సంస్థలు పోస్ట్ చేసే ఉద్యోగావకాశాలను బట్టి దేశీయంగా ప్రతి నెలా నియామకాల ధోరణిని నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ సూచిస్తుంది. మేనేజర్లు, క్లర్కులు, అడ్మిని్రస్టేషన్ సిబ్బంది మొదలైన ఆఫీసు ఆధారిత కొలువులను వైట్ కాలర్ ఉద్యోగాలుగా వ్యవహరిస్తారు. నివేదికలోని మరిన్ని విశేషాలు.. ► టెలికంలో 18 శాతం, విద్యా రంగంలో 17 శాతం, రిటైలింగ్ రంగంలో 11 శాతం మేర వైట్ కాలర్ నియామకాలు తగ్గాయి. ఆతిథ్య, ట్రావెల్, ఆటో, ఆటో విడిభాగాల రంగాల్లో హైరింగ్‌లో పెద్దగా మార్పులేమీ లేవు. ►ఇంధన కంపెనీలు వేగంగా కార్యకలాపాలు విస్తరిస్తుండటం, దేశవ్యాప్తంగా కొత్త రిఫైనరీలను ఏర్పాటు చేస్తుండటం వంటి సానుకూల పరిణామాలతో ఆయిల్, గ్యాస్ రంగాల్లో హైరింగ్ 9 శాతం పెరిగింది. ►కొత్త ఉద్యోగావకాశాలు ఫార్మా రంగంలో 6 శాతం, బీమా రంగంలో 5 శాతం పెరిగాయి. ►ఐటీ రంగంలో మొత్తం మీద హైరింగ్ 22 శాతం క్షీణించింది. అయితే అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్‌లో నియామకాలు 1 శాతం మేర పెరిగాయి. ►ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ సంబంధ మెషిన్ లెరి్నంగ్ ఇంజినీర్లకు అవకాశాలు 64 శాతం మేర, ఫుల్ స్టాక్ డేటా సైంటిస్టులకు కొత్త ఉద్యోగాలు 16 శాతం మేర పెరిగాయి. ►మెట్రోలతో పోలిస్తే నాన్–మెట్రోల్లోనే ఎక్కువగా హైరింగ్ కార్యకలాపాలు ఉన్నాయి. వదోదరలో అత్యధికంగా 9 శాతం కొత్త ఉద్యోగాల పోస్టింగ్స్ నమోదయ్యాయి. ►ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై వంటి మెట్రోల్లో నియామకాలు చెరి 12 శాతం మేర, ఐటీ ప్రధానమైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణెలో వరుసగా 20 శాతం, 18 శాతం, 21 శాతం, 18 శాతం మేర హైరింగ్ క్షీణించింది. ►2023 ఆసాంతంలో కనిపించిన ట్రెండ్‌కి అనుగుణంగా అక్టోబర్–నవంబర్‌లో కూడా సీనియర్ ప్రొఫెషనల్స్ వైపే కంపెనీలు మొగ్గు చూపాయి. 16 ఏళ్ల పైబడి అనుభవమున్న సీనియర్ నిపుణుల నియామకాలు 26 శాతం పెరిగాయి. ఫ్రెషర్లకు కొత్త ఆఫర్లు 13 శాతం పడిపోయాయి. -
అందుబాటు చార్జీల్లో టెలికం సేవలే ప్రభుత్వ లక్ష్యం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత చౌకగా టెలికం సరీ్వసులు భారత్‌లో అందుబాటులో ఉండేలా చూడాలనేది ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశీయంగా 5జీ సేవలను ఆవిష్కరించాకా ఇప్పటివరకు టెల్కోలు వాటి నుంచి పూర్తి స్థాయిలో ఆదాయాన్ని అందుకోవడం ఇంకా మొదలుపెట్టని నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 5జీ నెట్‌వర్క్‌పై చేస్తున్న పెట్టుబడులను టెల్కోలు తిరిగి రాబట్టుకోవాలంటే వచ్చే మూడేళ్లలో ప్రతి యూజరుపై సగటున వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) రూ. 270–300గా ఉండాలనేది విశ్లేషకుల అంచనా. ప్రస్తుతం అంతర్జాతీయంగా సగటున ఏఆర్పీయూ రూ. 600–850గాను, చైనాలో రూ. 580గాను ఉండగా.. భారత్‌లో ఇది రూ. 140–200 స్థాయిలో ఉంది. మరోవైపు, 6జీ టెక్నాలజీ విషయంలో ప్రపంచానికి సారథ్యం వహించే స్థాయిలో ఉండాలని టెలికం రంగానికి ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం నిర్దేశించారని వైష్ణవ్ చెప్పారు. ఇందుకోసం పరిశ్రమ, విద్యావేత్తలు, విద్యార్థులు, ప్రభుత్వ అధికారులతో భారత్ 6జీ కూటమిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇందులో యాంటెన్నా గ్రూప్, వేవ్‌ఫామ్ గ్రూప్, ఎక్విప్మెంట్ గ్రూప్ అంటూ వివిధ గ్రూప్‌లు ఉన్నాయని, అవన్నీ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై నిరంతరం కృషి చేస్తున్నాయని చెప్పారు. టెలికం రంగాన్ని చక్కదిద్దేందుకు ప్రభుత్వం సంస్కరణలు అమలు చేస్తోందని వివరించారు. టెలికం టారిఫ్‌లు మరింత పెరగాలి భారతి ఎయిర్టెల్ సీఈవో విఠల్ వ్యాఖ్యలు భారత్‌లో టెలికం టారిఫ్‌లు అత్యంత చౌకగా ఉన్నాయని, ఇవి ఇంకా పెరగాల్సి ఉందని భారతి ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ వ్యాఖ్యానించారు. టెలికం పరిశ్రమ లాభదాయకంగా మారాల్సిన అవసరం ఉందని ఇన్వెస్టర్లతో సమావేశంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. ‘పెట్టుబడులను కొనసాగించాలన్నా, భారత్ నిర్దేశించుకున్న డిజిటల్ లక్ష్యాలను సాధించడంలో తోడ్పడాలన్నా టెలికం పరిశ్రమ లాభదాయకంగా ఉండాలి. సగటున ప్రతి యూజరుపై వచ్చే ఆదాయంపరంగానైనా (ఆర్పు), ప్రతి జీబీకి రేటుపరంగానైనా భారత్‌లో టారిఫ్‌లు చాలా చౌకగా ఉన్నాయి. ఇవి పెరగాల్సిన అవసరం ఉంది. టారిఫ్‌లు పెరుగుతాయా లేదా అనేది కాదు ప్రశ్న.. ఎప్పుడు పెరుగుతాయనేదే ప్రశ్న. అయితే, ఇదంతా మా చేతుల్లో లేదు. వేచి చూడటం తప్ప‘ అని ఆయన పేర్కొన్నారు. 5జీ విషయానికొస్తే నాణ్యమైన సర్వీసులను అందుబాటు ఉంచుతూనే ఓవరాల్‌గా టారిఫ్‌ల పెంపు కొనసాగించాలనేది తమ ఉద్దేశమని విఠల్ తెలిపారు. 5జీ నెట్‌వర్క్‌ను అత్యంత వేగంగా, అత్యధికంగా ఏర్పాటు చేసామంటూ దండోరా వేసుకునేందుకు తామేమీ పోటీపడటం లేదని విఠల్ చెప్పారు. 5జీ అనేది దీర్ఘకాలిక ప్రయాణమని, ఈ టెక్నాలజీ ఉపయోగపడే అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం 5జీ ఉచితంగా లభిస్తున్నందుకే వినియోగం అత్యధికంగా ఉంటోందని, టారిఫ్‌లు వేసినప్పటి నుంచే అసలైన వినియోగం తెలుస్తుందని విఠల్ అభిప్రాయపడ్డారు. -
ఐటీలో పరిశోధనలకు ప్రోత్సాహంపై ట్రాయ్ కసరత్తు
న్యూఢిల్లీ: టెలికం, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ రంగాల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించే మార్గాలను అన్వేíÙంచడంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పరిశ్రమ వర్గాలతో సంప్రదింపుల కోసం చర్చాపత్రాన్ని విడుదల చేసింది. ఐసీటీ రంగంలో ఆర్అండ్డీ కార్యకలాపాల కోసం ప్రస్తుతమున్న విధానం సరిపోతుందా లేక ప్రత్యేక ఏజెన్సీ ఏదైనా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా అనే విషయంపై అభిప్రాయాలను కోరింది. అలాగే, ప్రైవేట్ రంగం ఆర్అండ్డీని చేపట్టేలా ప్రోత్సహించేందుకు ట్యాక్స్ మినహాయింపులు, ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాలు వంటి విధానాలు ఎంత వరకు ఉపయోగకరంగా ఉంటాయనేది తెలపాలని సూచించింది. దీనితో పాటు పలు ప్రశ్నలను చర్చాపత్రంలో ట్రాయ్ పొందుపర్చింది. వాటిల్లో కొన్ని.. ► ఆర్అండ్డీ ప్రోగ్రామ్‌లకు తగినన్ని నిధులను, సకాలంలో మంజూరు చేసేందుకు పారదర్శకమైన విధానాన్ని అమలు చేయడానికి ఏమేమి చర్యలు తీసుకోవచ్చు? ► నవకల్పనల స్ఫూర్తిని పెంపొందించాలంటే రాష్ట్రాలకు ర్యాంకింగ్ విధానాన్ని అమలు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందా? ► భారత్‌లో పేటెంట్ ఫైలింగ్ వ్యయాలను తగ్గించాల్సిన అవసరం ఉందా? ఒకవేళ సమాధానం అవును అయితే, ఎలా చేయొచ్చు? -
పెరిగిన నియామకాలు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు నియామకాలు 23 శాతం పెరిగినట్టు క్వెస్‌కార్ప్ సంస్థ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు ఈ మేరకు వృద్ధి నమోదైనట్టు నియామక సేవలు అందించే ఈ సంస్థ తెలిపింది. రిటైల్, టెలికం రంగాలు నియామకాల్లో ముందున్నాయి. ఏప్రిల్–ఆగస్ట్ మధ్య మొత్తం 32,000 జాబ్లకు పోస్టింగ్‌లు పడినట్టు పేర్కొంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ (బీఎఫ్ఎస్ఐ), రిటైల్, టెలికం రంగాలు జోరును చూపించాయి. ప్రొడక్షన్ ట్రైనీ, బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, కలెక్షన్ ఆఫీసర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, బ్రాడ్‌బ్యాండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, వేర్‌హౌస్ అసోసియేట్, కస్టమర్ రిలేషన్ షిప్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎక్కువ నోటిఫికేషన్లు నమోదయ్యాయి. ‘‘పండుగల సీజన్‌కు వ్యాపార సంస్థలు సిద్ధమవుతున్నాయి. దీంతో హైరింగ్‌కు సానుకూల ధోరణి నెలకొంది. ద్రవ్యోల్బణం, లాభదాయకతపై ఒత్తిళ్లు నెలకొన్నప్పటికీ.. తయారీ, బీఎఫ్ఎస్ఐ, రిటైల్‌లో చెప్పుకోతగ్గ మేర నియామకాల్లో వృద్ధి నమోదైంది’’అని క్వెస్‌కార్ప్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు. రిటైల్ పరిశ్రమలో తాత్కాలిక కారి్మకులకు డిమాండ్ 9 శాతం పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. తన ప్లాట్‌ఫామ్‌పై నమోదైన జాబ్ పోస్టింగ్‌ల ఆధారంగా క్వెస్ కార్ప్ ఈ వివరాలు వెల్లడించింది. -
బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు పెరిగారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా టెలికం చందాదార్ల సంఖ్య 2023 మే నెల చివరినాటికి 117.257 కోట్లకు చేరింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సంఖ్య 117.252 కోట్లు ఉంది. ఏప్రిల్‌తో పోలిస్తే మే నెల వృద్ధి కేవలం 0.004 శాతం మాత్రమేనని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజా గణాంకాల్లో వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో టెలికం సబ్‌స్రై్కబర్ల సంఖ్య ఏప్రిల్‌తో పోలిస్తే 51.864 కోట్ల నుంచి 51.914 కోట్లకు ఎగసింది. పట్టణ ప్రాంతాల్లో వినియోగదార్ల సంఖ్య 65.388 కోట్ల నుంచి 65.343 కోట్లకు చేరింది. ఇక బ్రాడ్‌బ్యాండ్ మొత్తం చందాదార్ల సంఖ్య 85.094 కోట్ల నుంచి 85.681 కోట్లకు పెరిగింది. వైర్లెస్ చందాదార్లు..: మొబైల్ సబ్‌స్రై్కబర్ల సంఖ్య ఈ ఏడాది ఏప్రిల్‌లో 114.313 కోట్లు ఉంటే, మే నెలలో ఈ సంఖ్య 114.321 కోట్లకు చేరింది. రిలయన్స్ జియో కొత్తగా 30 లక్షల మందిని చేర్చుకోవడంతో సంస్థ మొత్తం మొబైల్ చందాదార్ల సంఖ్య 43.63 కోట్లను తాకింది. భారతీ ఎయిర్టెల్ నూతనంగా 13.2 లక్షల మందిని సొంతం చేసుకుంది. దీంతో ఈ కంపెనీ వైర్లెస్ సబ్‌స్రై్కబర్ల సంఖ్య 37.23 కోట్లకు చేరుకుంది. వొడాఫోన్ ఐడియాను మే నెలలో 28 లక్షల మంది కస్టమర్లు వీడారు. -
6జీ సంకల్పం నెరవేరగలదా?
రేపటితరం టెలీ కమ్యూనికేషన్ టెక్నాలజీగా చెబుతున్న 6జీపై భారత్ ఓ దార్శనిక పత్రం విడుదల చేసింది. ఇటీవలే దేశంలో ప్రవేశపెట్టిన 5జీ టెక్నాలజీతో పోల్చినా ఎన్నో రెట్లు మెరుగైందీ 6జీ. ఇది వాస్తవ రూపం దాలిస్తే సమాచారం ఏకంగా సెకనుకు ఒక టెరాబిట్ వేగంతో ప్రయాణిస్తుంది. 5జీతో పోల్చితే వందరెట్లు ఎక్కువ వేగం! దార్శనిక పత్రం లక్ష్యం చౌకైన, సర్వవ్యాప్తమైన, సుస్థిర టెక్నాలజీల అభివృద్ధి. కానీ ఈరోజుకూ దేశంలో సుమారు 35,000 గ్రామాల్లో కనీసం 2జీ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా లేకపోవడం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దార్శనిక పత్రం పెద్ద ఆశయాలతో కూడి ఉన్నదని చెప్పక తప్పడం లేదు. 6జీ డాక్యుమెంట్ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా చూసుకోవాలి. 6జీ టెక్నాలజీతో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు నమోదయ్యే అవకాశం ఉంది. అందుకే భారత్ ఈ విషయమై కేవలం దార్శనిక పత్రాన్ని జారీ చేయడంతోనే సరిపెట్టకూడదు. పరిశోధనలకు తగినన్ని నిధులు కేటాయించడంతోపాటు 6జీ టెక్నాలజీ విషయంలో అంతర్జాతీయ ప్రొటోకాల్, ప్రమాణాల నిర్ధారణ విషయంలోనూ చురుకుగా పాలు పంచుకోవాలి. ఈ పనులు చేయకపోతే 6జీ కేవలం భారత్‌కున్న ఆశల్లో ఒకటిగా మిగులుతుంది. అనూహ్యమైన ప్రభావం... 6జీ టెక్నాలజీ పూర్తిస్థాయిలో సాకరమైతే కలిగే ప్రయోజనాలు అనూహ్యం. విద్య, ఆరోగ్యం, రవాణాలతోపాటు మానవ జీవితంలోని ప్రతి పార్శా్వన్నీ ఇది స్పృశిస్తుందనడంలో ఎలాంటి సందే హమూ లేదు. రక్షణ రంగ నిపుణుల అంచనాల ప్రకారం, 6జీ టెక్నా లజీని అంతరిక్ష, అణుశక్తి రంగాల మాదిరిగానే ఓ వ్యూహాత్మక రంగంగా పరిగణించి పెట్టుబడులు పెట్టాలి! ఇదే విషయాన్ని మూడేళ్ల క్రితం లెఫ్టినెంట్ జనరల్ ఎస్.ఎస్.మెహతా ‘ద ట్రిబ్యూన్ ’లో రాసిన ఒక వ్యాసంలో విస్పష్టంగా పేర్కొన్నారు. 6జీ టెక్నాలజీతో టాక్టయిల్ ఇంటర్నెట్, హోలోగ్రాఫిక్ కమ్యూ నికేషన్ వంటివి సాధ్యమవుతాయి. ఆగ్మెంటెడ్, వర్చువల్, మిక్స్డ్ రియాటీలకూ ఈ టెక్నాలజీ సాయం అందిస్తుంది. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థలను సమూలంగా మార్చగలిగేంత శక్తి కూడా ఈ టెక్నాలజీలకు ఉంది. ఇవన్నీ సాధ్యం కావాలంటే కొత్త కొత్త నెట్వర్క్ టెక్నాలజీలు, పరికరాలు, ప్రమాణాలు అవసరమవుతాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న 5జీ టెక్నాలజీ పూర్తి సామర్థ్యాన్నే మనం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉండగా, తరువాతి తరం టెక్నాలజీ అభివృద్ధికి రంగం సిద్ధమవుతోందన్నమాట! భారత్ ఇటీవలే విడుదల చేసిన 6జీ దార్శనిక పత్రంలో భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికామ్ మార్కెట్ అని పేర్కొన్నారు. పూర్తిస్థాయి టెక్నాలజీ సృష్టికర్తగా, తయారీదారుగా ఎదగాలని కూడా సంకల్పం చెప్పుకొంది. కాబట్టి 6జీ టెక్నాలజీ తీరుతెన్నులను నిర్ణ యించే ప్రక్రియలో భారత్ కూడా భాగస్వామి కావాలి. అంతరిక్ష రంగంలో ప్రపంచం మొత్తమ్మీద అగ్రస్థానంలోకి చేరేందుకు ఏం చేయాలో ఆలోచించమని ప్రభుత్వం గతేడాదే ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. మార్చి 22న ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన డాక్యుమెంట్– పారిశ్రామిక వర్గాలు, విద్యాసంస్థలు, సర్వీస్ ప్రొవై డర్లు ఏఏ అంశాలపై పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలో గుర్తించమని చెబుతోంది. ఇది రెండు దశల్లో జరిగేందుకు అవకాశముంది. తొలిదశ (2023 –25)లో ప్రాథమికమైన పరిశోధన, మేధోహక్కుల అభివృద్ధి జరిగితే, రెండో దశ (2025–30) వాణిజ్యీకరణ. దార్శనిక పత్రం లక్ష్యం చౌకైన, సర్వవ్యాప్తమైన, సుస్థిర టెక్నా లజీల అభివృద్ధి. ఇది చాలా కష్టసాధ్యమైన పని. ఎందుకంటే ప్రస్తుతం ఉపయోగిస్తున్న 5జీ టెక్నాలజీలకు ఈ లక్షణాలేవీ లేవు. అంటే... 6జీ ద్వారా టెక్నాలజీ పరంగా భారీ పురోగమనం జరగా లన్న లక్ష్యాన్ని భారత్ నిర్దేశించుకుంది. అంతేకాదు, అవన్నీ చౌకగా చేయాలి. అన్నిచోట్ల అందుబాటులో ఉండేలా చూడాలి. (కానీ ఈరోజుకూ దేశంలో సుమారు 35,000 గ్రామాల్లో కనీసం 2జీ ఇంట ర్నెట్ కనెక్షన్ కూడా లేకపోవడం గమనార్హం). సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సరేసరి. వీటికి తోడు కేవలం భారత్‌కు మాత్రమే కాకుండా... 6జీ టెక్నాలజీలన్నీ ప్రపంచం మొత్తానికి అందే ఏర్పాట్లూ చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ దార్శనిక పత్రం పెద్ద ఆశయాలతో కూడి ఉన్నదని చెప్పక తప్పడం లేదు. 6జీ టెక్నాలజీపై పట్టు సాధించడం ద్వారా పెత్తనం చలాయించవచ్చునన్న అంచనాలతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని కార్యక్రమాలు చకచకా నడుస్తున్నాయి. పరిశ్రమ వర్గాలతో కూడిన ‘నెక్స్ట్–జీ అలయన్స్ ఆఫ్ నార్త్ అమెరికా’ సుమారు 50 టెక్నాలజీల అభివృద్ధి అవసరాన్ని గుర్తించింది. రేడియో టెక్నాలజీలు, నెట్వర్క్ ఆర్కిటెక్చర్, సెక్యూరిటీ, ప్రైవసీ వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. మరోవైపు దక్షిణ కొరియా 2021లోనే యూనివర్సిటీల్లో 6జీ టెక్నా లజీపై పరిశోధనలు చేసేందుకు మూడు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలాగే చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పరస్పర సహకారంతో పరిశోధనలు చేసేలా ప్రోత్సహిస్తోంది. యూరోపియన్ దేశాలు కూడా తెలివైన నెట్‌వర్క్‌ల ఏర్పాటు, మేనేజ్మెంట్లను దృష్టిలో ఉంచుకుని ప్రయత్నాలు చేస్తున్నాయి. చైనా, జపాన్ లలోనూ 6జీ టెక్నాలజీకి సంబంధించి వేర్వేరు అంశాలపై పరిశోధనలకు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. మన దృక్కోణంలో... భారతదేశపు 6జీ విజన్ డాక్యుమెంట్ ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనలు జరుగుతున్న రంగాలు, భారతీయ దృక్కోణంలో పరిశోధనలు చేపట్టాల్సిన అంశాలపై దృష్టి పెట్టింది. ఈ డాక్యుమెంట్లో పేర్కొన్న అంశాలు, వ్యూహాలు, కార్యక్రమాల రూపం సంతరించుకోవాలంటే ‘ఆర్ అండ్ డీ’కి దీర్ఘకాలం పెట్టుబడులు అవసరమవుతాయి. నెక్స్ట్–జీ అలయన్స్‌లో ప్రఖ్యాత టెలికామ్ కంపెనీలు ఏటీ అండ్ టీ, బెల్, ఇంటెల్, శాంసంగ్, ఆపిల్, డెల్, సిస్కో, ఎరిక్సన్ , గూగుల్, హెవ్లెట్ ప్యాకర్డ్, ఎల్జీ, మైక్రోసాప్ట్, నోకియా తదితర కంపెనీలు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నాయి. కొరియా, జపాన్ , యూరప్‌లలో 6జీ సంబంధిత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది, చురుకుగా పాల్గొంటున్నది ఈ భారీ కంపెనీలే. అక్కడి ప్రభుత్వాలు కూడా సానుకూలంగా వాటికి మద్దతు పలుకు తున్నాయి. మన దేశంలో పరిస్థితి పూర్తిగా భిన్నం. మొత్తం ప్రభుత్వం ఆధ్వ ర్యంలో నడుస్తోంది. టెలికామ్ రంగంలోని తయారీదారులు, సేవలందించేవారు పాల్గొంటారని ఆశించవచ్చు కానీ... నేతృత్వం మాత్రం ప్రభుత్వం వద్ద ఉండే అవకాశాలే ఎక్కువ. పరిశోధనల విషయానికి వస్తే ఐఐటీల్లాంటి విద్యాసంస్థలు ఇప్పటికే కొన్ని కొత్త, వినూత్న టెక్నాలజీలపై పనిచేస్తున్నాయి. వాటికి మరింత ప్రోత్సాహం అందించాలి. 6జీ వాణిజ్యీకరణ విషయానికి వస్తే పరిశ్రమ వర్గాలు, విద్యాసంస్థల భాగస్వామ్యం తప్పనిసరి. 6జీ టెక్నాలజీలో భాగమైన సైబర్ ఫిజికల్ సిస్టమ్స్‌పై డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐదేళ్ల క్రితమే ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టినా ఇప్పటివరకూ సాధించింది కొంతే. విజన్ డాక్యుమెంట్లో నిధుల అంశంపై అంత స్పష్టత లేదు. భారీ మొత్తంతో ఒక నిధిని ఏర్పాటు చేస్తామని మాత్రమే ఈ డాక్యు మెంట్ చెబుతోంది. ఈ నిధి పదేళ్ల కాలానికి దాదాపుగా రూ.10,000 కోట్ల వరకూ ఉండవచ్చునని అంటోంది. ఈ నిధి ప్రభుత్వానిదా, కాదా? అన్నదాంట్లోనూ అస్పష్టతే. టెలికామ్ రంగంలో భారతదేశం దేశీయంగా తయారు చేసిన గొప్ప టెక్నాలజీ ఏదైనా ఉందీ అంటే అది 1980ల నాటి డిజిటల్ రూరల్ స్విచ్! గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ టెలిఫోన్ ఎక్స్ఛేంజీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం అప్పట్లో ‘ద సెంటర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ–డాట్)ను ఏర్పాటు చేసింది. మూడేళ్ల సమయం రూ.36 కోట్ల నిధులు కేటాయించింది. ప్రాజెక్టు విజయవంతమైంది. ఈ టెక్నాలజీని ప్రైవేట్ సంస్థలకు అందించారు. తరువాతి కాలంలో చాలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ వినియోగించారు. 6జీ విషయంలోనూ ఇదే తరహా పద్ధతిని అనుసరించడం మేలు. ఈ అత్యవసరమైన చర్యలన్నీ తీసుకోకపోతే 6జీ డాక్యుమెంట్ కేవలం కాగితాలకే పరిమితమవుతుంది! దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
117 కోట్లకు టెలికం చందాదారులు
న్యూఢిల్లీ: దేశంలో టెలికం చందారుల సంఖ్య గతేడాది ముగింపునకు 117 కోట్లు దాటింది. కొత్త చందాదారులను ఆకర్షించడంలో ఎప్పటి మాదిరే 2022 డిసెంబర్ నెలలోనూ రిలయన్స్ జియో, ఎయిర్టెల్ మంచి పనితీరును చూపించాయి. రిలయన్స్ జియో 17 లక్షల కొత్త కస్టమర్లను సంపాదించగా, భారతీ ఎయిర్టెల్ 15.2 లక్షల కొత్త కస్టమర్లను చేర్చుకున్నట్టు ట్రాయ్ నివేదిక వెల్లడించింది. ఇక మరో ప్రైవేటు టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) 24.7 లక్షల కస్టమర్లను డిసెంబర్ నెలలో నష్టపోయింది. మొబైల్ చందాదారుల సంఖ్య 2022 నవంబర్ నాటికి 1,143.04 మిలియన్లుగా ఉంటే, డిసెంబర్ చివరికి 1,142.93 మిలియన్లకు తగ్గింది. వైర్‌లైన్ సబ్‌్రస్కయిబర్లు డిసెంబర్ చివరికి 2.74 కోట్లకు పెరిగారు. వైర్‌లైన్ విభాగంలో రిలయన్స్ జియో 2,92,411 మంది కొత్త కస్టమర్లు సంపాదించింది. భారతీ ఎయిర్టెల్ 1,46,643 మంది కస్టమర్లను సొంతం చేసుకుంది. ప్రభుత్వరంగ ఎంటీఎన్ఎల్ 1.10 లక్షల మంది వైర్‌లైన్ సబ్ర్‌స్కయిబర్లను కోల్పోయింది. టెలికం సేవల్లో ఇప్పటికీ సమస్యలే.. లోకల్ సర్కిల్స్ సర్వేలో వెల్లడి దేశంలో టెలికం వినియోగదారులు నేటికీ సేవలు పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కాల్స్డ్రాప్, కాల్ కనెక్టింగ్ సమస్యలు వారిని వేధిస్తున్నాయి. లోకల్‌సర్కిల్స్ ఇందుకు సంబంధించి చేసిన ఆన్లైన్ సర్వేలో ఈ వివరాలు తెలిశాయి. 28 శాతం మంది కస్టమర్లు తాము ఎలాంటి అవాంతరాల్లేని 4జీ, 5జీ సేవలు ఆనందిస్తున్నట్టు చెప్పగా.. 32 శాతం మంది తాము డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ అన్ని వేళల్లోనూ అంతరాయాల్లేని సేవలను పొందలేకపోతున్నట్టు తెలిపారు. 69 శాతం మంది తాము కాల్ కనెక్షన్/కాల్ డ్రాప్ సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పారు. దేశవ్యాప్తంగా 42,000 మంది నుంచి ఈ అభిప్రాయాలను లోకల్‌సర్కిల్స్ తెలుసుకుంది. కాల్ కనెక్షన్, కాల్ డ్రాప్‌పై సంధించిన ప్రశ్నకు 10,927 మంది స్పందించారు. వీరిలో 26 శాతం మంది తాము నివసించే ప్రాంతంలో ఎయిర్టెల్, జియో, వొడాఐడియా సేవలు మంచి కవరేజీతో ఉన్నట్టు చెప్పగా.. 51 శాతం మంది కవరేజీ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు పేర్కొన్నారు. -
వొడాఫోన్‌కు 2023 కీలక సంవత్సరం కానుంది!
న్యూఢిల్లీ: టెలికం రంగానికి 2023 చాలా కీలక సంవత్సరంగా ఉండనుందని బ్రోకరేజి సంస్థ సీఎల్ఎస్ఏ పేర్కొంది. పరిశ్రమలో లాభసాటైన మూడో సంస్థగా కొనసాగగలదా లేదా అనే కోణంలో వొడాఫోన్ ఐడియాకు (వీఐఎల్) ఇది నిర్ణయాత్మకమైన ఏడాదిగా ఉండనుందని తెలిపింది. అలాగే డేటా వినియోగం, టారిఫ్‌ల పెంపు ఆధారిత ఆదాయ వృద్ధి .. పరిశ్రమకు కీలకంగా ఉంటుందని ఒక నివేదికలో సీఎల్ఎస్ఏ వివరించింది. దీని ప్రకారం 2023లో దేశీ మొబైల్ మార్కెట్లో 5జీ సేవల విస్తరణ, టారిఫ్‌ల పెంపు, రిలయన్స్ జియో పబ్లిక్ ఇష్యూ మొదలైనవి ప్రధానాంశాలుగా ఉండబోతున్నాయి. ప్రైవేట్ నెట్‌వర్క్‌లను అనుమతించిన పక్షంలో వ్యాపార సంస్థలకు ఇచ్చే 5జీ సర్వీసుల ద్వారా టెల్కోలకు వచ్చే ఆదాయాలకు కొంత గండి పడే అవకాశం ఉంది. 2022లో 14 శాతం పెరిగిన దేశీ మొబైల్ రంగం ఆదాయం 2023లో కూడా దాదాపు అదే స్థాయిలో వృద్ధి చెందవచ్చు. టారిఫ్‌ల పెంపు, డేటా వినియోగం పెరుగుదల ఇందుకు తోడ్పడనున్నాయి. టారిఫ్‌లను పెంచే విషయంలో భారతి ఎయిర్టెల్ అన్నింటికన్నా ముందు ఉండవచ్చని.. వీఐఎల్, రిలయన్స్ జియో దాన్ని అనుసరించవచ్చని సీఎల్ఎస్ఏ నివేదిక పేర్కొంది. నిధుల సమీకరణలోను, బకాయిలకు బదులు కేంద్రానికి వాటాలు ఇచ్చే ప్రతిపాదనల అమల్లో జాప్యాల కారణంగా వీఐఎల్ ఆర్థిక సంక్షోభం అవకాశాలు పూర్తిగా సమసిపోలేదని తెలిపింది. వీఐఎల్ మార్కెట్ వాటా తగ్గుతూ జియో, ఎయిర్టెల్ మార్కెట్ పెరగడం కొనసాగవచ్చని సీఎల్ఎస్ఏ వివరించింది. మొత్తం మీద యూజర్లపై వచ్చే సగటు ఆదాయం, డేటా వినియోగం పెరగడం ద్వారా టెలికం పరిశ్రమ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 14 శాతం వృద్ధితో 2025 ఆర్థిక సంవత్సరం కల్లా రూ. 2,84,600 కోట్లకు చేరవచ్చని తెలిపింది. చదవండి: భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు! -
సాంకేతిక అద్భుతాలు చూడవచ్చు
2023లో సాంకేతిక పరిజ్ఞాన పెరుగుదల ఎంత ఉంటుందో ఊహించలేం. న్యాయ, అకౌంట్ల సంబంధిత రంగాల్లో; ఉద్యోగుల ఎంపిక వంటి అంశాల్లో కృత్రిమ మేధను పెద్ద ఎత్తున వాడే అవకాశం ఉంది. టెలికమ్యూనికేషన్స్ రంగంలో 5జీ విప్లవాత్మక మార్పులు తేనుంది. ‘నెట్‌ఫ్లిక్స్’లో ఓ సిరీస్ పూర్తి సీజన్‌ను ఒక్క నిమిషంలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. గిగాబైట్ల సైజులో ఉండే వైద్యసంబంధిత నివేదికలను ఎక్కడో ఉన్న స్పెషలిస్టు డాక్టరు దగ్గరికి ఇట్టే చేర్చవచ్చు. తద్వారా టెలీమెడిసిన్కు మంచి ఊపు వస్తుంది. ఇక విద్యుత్తుతో నడిచే ద్విచక్రవాహనాలతోపాటు నగరంలో సరుకుల రవాణాకు ఉపయోగించే ఆటోరిక్షా, చిన్నసైజు ట్రక్కులు ఎక్కువ కానున్నాయి. సాంకేతిక పరిజ్ఞాన రంగం ఈ ఏడాది కొంత స్తబ్ధుగానే గడిచిందని చెప్పాలి. క్రిప్టో కరెన్సీ సుమారు రెండు లక్షల కోట్ల డాలర్ల సంపదను తుడిచి పెట్టేసింది. క్రిప్టో కరెన్సీ ఆది నుంచీ ఎండమావేనని కొందరు వాదించవచ్చు. ‘క్రంచ్ బేస్’ అంచనాల ప్రకారం వెంచర్ క్యాపిటల్స్ మద్దతుతో నడుస్తున్న కంపెనీలు ఈ ఏడాది మూడో త్రైమాసికంలో సుమారు 290 కోట్ల డాలర్ల నష్టాలు చవిచూశాయి. ఈ రకమైన మందగమన పరిస్థితులు ఇప్పుడప్పుడే సర్దుకుంటా యన్న సూచనలు కనిపించడం లేదు. మరోవైపు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకు పెద్ద ఎత్తున పెడుతున్న కోతలూ కొనసాగు తున్నాయి. ఏడాది ముగిసి 2023లోకి అడుగుపెడుతున్న సమ యంలో నేర్చుకున్న పాఠాలను ఒక్కసారి నెమరేసుకుని... భవి ష్యత్తు కోసం ఎదురుచూడాలి. నా అంచనా ప్రకారం వచ్చే ఏడాది టెక్నాలజీ కంపెనీలకు బాగానే ఉండనుంది. జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని అనుకుంటున్నాను. ప్రపంచ స్థాయిలో స్థూల ఆర్థిక వ్యవస్థ ఒడి దుడుకుల ప్రభావం కొంత ఉన్నప్పటికీ భారత్‌లో ఆర్థిక వ్యవస్థ, మరీ ముఖ్యంగా కార్పొరేట్ రంగం డిజిటలీకరణ వేగం పుంజుకుంటూం డటం ద్వారా ఐటీ రంగానికి లాభం చేకూరనుంది. ఈ నేపథ్యంలో భారతీయ దృక్కోణం నుంచి చూస్తే ఐదు రంగాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. ఐటీ సేవల రంగానికి ఢోకా లేదు ఐటీ సేవల రంగంలోని కంపెనీలు మందగమనం ప్రభావాన్ని దాటేయగలవు. 2000-01 నాటి డాట్‌కామ్ సంక్షోభాన్నీ, 2008-09 నాటి ఆర్థిక మాంద్యాన్నీ కూడా గట్టెక్కగలిగిన 2,500 కోట్ల డాలర్ల విలువైన ఐటీ సేవల రంగం ఇప్పటికే అసంఖ్యాకమైన టెక్నాలజీ, బిజినెస్ మోడళ్లలో మార్పులను చవిచూసిన విషయం తెలిసిందే. ఈ అడ్డంకులన్నింటినీ దాటుకుని ఐటీ సేవల రంగం నిత్యం రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. అంతేకాదు, ఈ కాలపు కంపెనీలు కల గనే స్థాయిలో నెట్ మార్జిన్లు కూడా 20 శాతం వరకూ నమోదు చేశాయి. ‘టీసీఎస్’ను ఉదాహరణగా తీసుకుంటే... 2008-09లో ఈ కంపెనీ 23 శాతం వృద్ధి చెందింది. అప్పట్లో ఇది కేవలం 600 కోట్ల డాలర్ల కంపెనీ మాత్రమే. ఇప్పుడది ఏకంగా 2,000 కోట్ల డాలర్ల కంపెనీ. అంతేస్థాయిలో రెండంకెల వృద్ధి అంచనాలు వేస్తోంది. ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా నడుస్తున్నప్పుడు కంపెనీలు తమ ఖర్చులు తగ్గించు కునేందుకుగాను ఔట్‌సోర్సింగ్‌ను ఎక్కువ చేస్తాయి. ఇది భారతీయ ఐటీ కంపెనీలకు లాభదాయకం. అంతేకాకుండా, భారతీయ కంపెనీలు క్లౌడ్ వంటి ఈ కాలపు టెక్నాలజీల్లోనూ ముందువరసలో ఉండటమే కాకుండా, కంపెనీల డిజిటలీకరణలోనూ కీలకంగా ఎదిగాయి. దేశంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డిజిటల్ మౌలిక సదుపాయాలు చక్కగా అమరి ఉన్నాయిప్పుడు. అకౌంట్ అగ్రిగేటర్ కూడా అందుబాటులోకి రానుంది. ఫలితంగా చిన్న చిన్న వ్యాపా రులకు కూడా రుణాల లభ్యత మెరుగయ్యే అవకాశాలున్నాయి. అలాగే కొంచెం పేద కుటుంబాలకూ... అకౌంట్ అగ్రిగేటర్ వల్ల రుణాలు తీసుకోవాలని అనుకున్న వారి వివరాలు వారి అనుమతితో ఇతరులకు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల ఇతర కంపెనీలు మెరుగైన రీతిలో రుణాలు అందించే ప్రయత్నం చేస్తాయి. సమాచార లేమి కారణంగా ఇప్పటివరకూ ఇది సాధ్యం కాలేదు. ఈ రుణ వితరణ పెంపు మొత్తం ఫిన్‌టెక్ కంపెనీల ఆధ్వర్యంలోనే జరుగు తుంది కాబట్టి, వినియోగం కూడా పెరుగుతుంది. ఇళ్ల కొనుగోళ్లు, పొదుపు మొత్తాలు ఆర్థిక వ్యవస్థల్లో పెట్టుబడులుగా చేరతాయి. ఈ దృష్టితో చూస్తే ఫిన్‌టెక్ కంపెనీలపై రానున్న ఏడాది నిత్యం ఓ కన్నేసి ఉండటం అవసరం. కృత్రిమ మేధ వినియోగం పెరుగుతుంది ఈ ఏడాది జన సామాన్యానికి కూడా కృత్రిమ మేధ తాలూకూ సామర్థ్యాన్ని పరిచయం చేసింది ‘ఓపెన్ ఏఐ’ తాలూకూ ‘ఛాట్- జీపీటీ’ వేదిక. మెషీన్ లెర్నింగ్, కృత్రిమ మేధ తాలూకూ టెక్నా లజీలను విస్తృత స్థాయిలో వాడేందుకు అవకాశం కల్పిస్తాయి ఇలాంటి వేదికలు. మానవ వనరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన రంగాల్లో ఈ ఏడాది కృత్రిమ మేధ వాడకం ఉంటుందన్నది నా అంచనా. న్యాయ, అకౌంట్ల సంబంధిత రంగాలు అన్నమాట! దీంతో పాటే... ఆర్థిక వ్యవస్థలో మోసాలను పసిగట్టేందుకు; మార్కెటింగ్ ఆటోమేషన్, ఉద్యోగుల ఎంపిక, నియామకం వంటి అంశాల్లో కృత్రిమ మేధను పెద్ద ఎత్తున వాడే అవకాశం ఉంది. ఇక్కడ ఒక స్టార్టప్ కంపెనీ గురించి చెప్పాలి. దాని పేరు ‘వాయిస్-ఓసీ’. వైద్య సహాయం అవసరమైన వారు కంప్యూటర్‌తో మాట్లాడటం ద్వారా డాక్టర్ అపాయింట్మెంట్లు బుక్ చేసుకోవచ్చు దీంతో. ఆ తరువాత వాట్సాప్ ద్వారా సంప్రదింపులు, టెస్ట్‌లు బుక్ చేసుకోవం, చెల్లింపులు జరపడం వంటి పనులు చేయవచ్చు. విద్యుత్తు వాహనాల జోరు ఈ ఏడాది విద్యుత్తుతో నడిచే ద్విచక్రవాహనాలతోపాటు నగరంలో సరుకుల రవాణాకు ఉపయోగించే ఆటోరిక్షా, చిన్నసైజు ట్రక్కులు ఎక్కువ కానున్నాయి. ‘రీసెర్చ్ అండ్ మార్కెట్స్ డాట్‌కామ్’ అంచనా ప్రకారం విద్యుత్తుతో నడిచే ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు ఏడాదికి 29 శాతం చొప్పున పెరగ నున్నాయి. అది కూడా 2027-28 వరకూ! అయితే మార్కెట్ సామర్థ్యం విషయంలో ఇది కూడా చాలా మితమైన అంచనా అని అనుకుంటున్నా. బ్యాటరీ టెక్నాలజీ మెరుగుపడుతూండటం, ఛార్జింగ్ నెట్వర్క్ విస్తృతమవుతున్న నేపథ్యంలో 2023లో విద్యుత్తుతో నడిచే కార్లకూ డిమాండ్ బాగా ఉండే అవకాశముంది. ఇప్పటివరకూ కార్ల అమ్మకాల్లో విద్యుత్తు వాహనాల వాటా 1 - 2 శాతం మాత్రమే ఉన్నప్పటికీ రానున్న సంవత్సరాల్లో ఇది గణ నీయంగా పెరగనుంది. మొత్తమ్మీద చూస్తే 2023లో విద్యుత్తు రవాణా రంగం గుర్తుంచుకోదగ్గ స్థాయి వృద్ధిని సాధించనుంది! చివరగా... టెలికమ్యూనికేషన్స్ రంగంలో 5జీ విప్లవాత్మక మార్పులు తీసుకురానుందనడం నిస్సందేహం. ఈ నెట్వర్క్ పెరుగుతున్న కొద్దీ జరిగే మార్పులు మన ఊపిరిని నిలబెట్టే స్థాయిలో ఉంటాయని అనవచ్చు. వీడియోలు, ఇతర మాధ్యమాల వినియోగం ఎంత పెరుగుతుందో ఒక్కసారి ఊహించండి! ‘నెట్‌ఫ్లిక్స్’లో ఓ టెలివిజన్ సీరియల్ పూర్తి సీజన్‌ను ఒక్క నిమిషంలోనే డౌన్లోడ్ చేసుకోవడం 5జీ ద్వారా సాధ్యమవుతుంది. గిగాబైట్ల సైజులో ఉండే వైద్యసంబంధిత నివేదికలు (ఎంఆర్ఐ వంటివి) ఎక్కడో ఉన్న స్పెషలిస్టు డాక్టరు దగ్గరికి ఇట్టే చేరగలవు. తద్వారా టెలీమెడిసిన్కు మంచి ఊపు వచ్చే అవకాశం ఉంటుంది. ఫేస్బుక్ మొదలుపెట్టిన వివాదాస్పద మెటావర్స్ మళ్లీ పట్టాలెక్కవచ్చు. ఎందుకంటే విని యోగదారుల మనో భావాలు తెలుసుకునేందుకు ఇది మెరుగైన వేదిక అని కంపెనీలు భావిస్తాయి మరి. బ్యాండ్‌విడ్త్ అనేది ఒకప్పటి మాదిరిగా అరుదైందో, అపురూపమైందో కాకుండా... కావాల్సిన వారికి కావాల్సినంత లభిస్తుంది. అది కూడా చాలా తక్కువ ధరలో, ఇంకోలా చెప్పాలంటే దాదాపు ఉచితంగా దొరకవచ్చు. వ్యాపారం, వైద్యం, పిల్లల విద్య తదితర అనేక రంగాల్లో ఇది ఎన్నెన్ని మార్పులు తీసుకురాగలదో ఊహించండి! ఏతావాతా... 2023 సంవత్సరం కొన్ని సవాళ్లు విసరనుంది. అయినప్పటికీ భారతీయుల దృష్టిలోంచి చూస్తే మాత్రం ఎన్నో అద్భు తాల కోసం ఎదురు చూడవచ్చు. డిజిటల్ ఇండియా ప్రయాణం కొనసాగుతూనే ఉంటుంది మరి! జైదీప్ మెహతా వ్యాసకర్త పెట్టుబడిదారు, టెక్నాలజీ రంగ పరిశీలకుడు (‘మింట్’ సౌజన్యంతో) -
ఆ రంగంలో మూడేళ్లకోసారి లక్ష కోట్లు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత టెలికం పరిశ్రమ మూడేళ్లకోసారి రూ.1,03,262 కోట్ల ఆదాయ వృద్ధి నమోదు చేస్తుందని డెలాయిట్ ఇండియా–సీఐఐ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలను పెంచే అవకాశం ఉన్న 5జీ రాక ఇందుకు కారణమని వివరించింది. ‘2023 చివరినాటికి భారత టెలికం పరిశ్రమ రూ.10,32,625 కోట్లకు చేరుతుంది. 5జీ ఎంట్రీతో మూడేళ్లకోసారి పరిశ్రమకు ఒక లక్ష కోట్లు తోడవుతాయి. 2022 అక్టోబరులో 5జీ సేవలు ప్రారంభం అయిన నెలరోజుల్లోనే ఒక టెలికం కంపెనీ 10 లక్షల 5జీ చందాదార్ల సంఖ్యను దాటింది. ఆర్థిక వృద్ధిని 5జీ వేగవంతం చేస్తుంది. అలాగే ఉద్యోగ అవకాశాలను పెంచుతుంది. పట్టణ, గ్రామీణ జనాభాను కలుపుతుంది. ఈ సాంకేతికత ఇంధనం, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి క్లిష్టమైన రంగాలలో సామర్థ్యాన్ని పెంచుతుంది. సరైన ఆలోచన, సాంకేతిక నైపుణ్యంతో దేశంలో ఆర్థిక వృద్ధి, స్థితిస్థాపకతను వేగవంతం చేయడానికి భారతీయ టెలికమ్యూనికేషన్ పరిశ్రమ 5జీని ఉపయోగించవచ్చు. 5జీ నెట్వర్క్కి మారడం వల్ల కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకున్న తర్వాత భారతీయ పరిశ్రమలలో ప్రైవేట్ నెట్‌వర్క్‌ల అవసరాలు పెరుగుతాయి. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
దేశంలో 5జీ సేవలు.. భారీగా ఉద్యోగాలు, కావాల్సిన నైపుణ్యాలు ఇవే!
5జీ టెక్నాలజీ..టెలికం రంగంలో సరికొత్త విప్లవం! స్మార్ట్ ఫోన్ యుగంలో.. ఆధునిక 5జీ టెక్నాలజీతో.. గేమింగ్ నుంచి గృహ అవసరాల వరకు..అన్ని రకాల సేవలు అత్యంత వేగంగా పొందే వీలుంది. ఇదే ఇప్పుడు ఆయా రంగాల విస్తరణకు, లక్షల సంఖ్యలో కొత్త కొలువులకు మార్గం వేస్తుందని అంచనా! ఆయా ఉద్యోగాలు సొంతం చేసుకునేందుకు కావలసిందల్లా.. ఈ సాంకేతికతను నడిపించే ఆధునిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవడమే! ముఖ్యంగా 4.0 స్కిల్స్గా పేర్కొంటున్న ఐఓటీ, రోబోటిక్స్, ఏఐ–ఎంఎల్ వంటి నైపుణ్యాలతో ఉజ్వల కెరీర్ అవకాశాలు అందుకోవచ్చు. ఇటీవల దేశంలో 5జీ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో.. ఈ టెక్నాలజీతో అందుబాటులోకి రానున్న కొత్త కొలువులు, కావల్సిన నైపుణ్యాల గురించి తెలుసుకుందాం.. 5జీ టెక్నాలజీతో మొబైల్ ఆధారిత సేవలు మరింత విస్తృతం కానున్నాయి. ఈ టెక్నాలజీతో స్మార్ట్‌ఫోన్స్ ద్వారా అత్యంత వేగంగా అనేక సేవలు ΄÷ందొచ్చు. అంతేకాదు.. ట్రాఫిక్ చిక్కులు దాటుకుంటూ ఇంటికెళ్లే సమయానికి హాయిగా ఏసీలో ఆహ్లాదం పొందాలంటే..ఇక చిటికెలో పని. కేవలం ఫోన్ ద్వారా నిర్దేశిత కమాండ్స్‌తో మనం ఇంటికెళ్లే సమయానికి ఏసీ ఆన్ అయ్యే విధంగా చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో సేవలు సరికొత్తగా అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ఆయా సేవలు అందించేందుకు బ్యాక్ ఎండ్‌లో నిపుణుల అవసరం ఏర్పడుతోంది. ఇదే యువతకు కొత్త కొలువులకు మార్గంగా నిలవనుంది. భారీ సంఖ్యలో కొలువులు ► 5జీ టెక్నాలజీ కారణంగా రానున్న మూడేళ్లలో 2.2 కోట్ల మేర ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఇప్పటికే టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ నివేదిక పేర్కొంది. ►ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్ ్ర΄ాసెస్ ఆటోమేషన్ విభాగాల్లో ఈ కొలువులు లభించనున్నాయి. ►ఇప్పటికే 40 లక్షల మేర ఉద్యోగాలకు వేదికగా ఉన్న టెలికం రంగంలో.. 5జీ టెక్నాలజీ కారణంగా జాబ్స్ సంఖ్య మరింత విస్తృతంగా పెరగనుంది. ∙టెలికం సెక్టార్ మాత్రమే కాకుండా.. నూతన టెక్నాలజీలతో సేవలందిస్తున్న ఇతర రంగాల్లోని సంస్థలు కూడా 5జీ టెక్నాలజీస్‌కు సరితూగే నైపుణ్యాలున్న వారికి అవకాశాలు కల్పించనున్నాయి. ► రిమోట్ సర్వీసెస్‌కు వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా తమ సేవలను అందించే ఉద్దేశంతో 5జీ టెక్నాలజీ నైపుణ్యాలకు కంపెనీలు పెద్ద పీట వేస్తున్నాయి. అన్ని రంగాల్లోనూ 5జీ వ్యవసాయం నుంచి వైద్యం వరకూ..అన్ని రంగాల్లోనూ 5జీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కార్యకలా΄ాలు నిర్వహించే అవకాశం ఉంది. హెల్త్‌కేర్ రంగంలో.. ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ ద్వారా టెలి మెడిసిన్ సేవలు అందుతున్న సంగతి తెలిసిందే. 5జీ టెక్నాలజీతో రానున్న రోజుల్లో కీలకమైన శస్త్రచికిత్సలు చేసే అవకాశం కూడా అందుబాటులోకి రానుంది. అదే విధంగా 3–డీ ఎక్స్‌రేలు, ఇతర స్కానింగ్‌లు కూడా తీసే వీలుంటుంది. ∙వ్యవసాయ రంగంలో.. 5జీ ఫోన్లో ఉండే ఐఓటీ సాంకేతికత ఆధారంగా.. వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తూ.. వాటికి సరితూగే పంటలు వేయడం లేదా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ సాగులో దిగుబడి పెంచేందుకు అవకాశం ఉంటుంది. ∙రిటైల్ రంగంలోనూ.. 5జీ ఫోన్లతో.. వర్చువల్, ఆగ్మెంటెడ్ రియాల్టీని ఆస్వాదిస్తూ ఏదైనా ఒక వస్తువు లేదా ఉత్పత్తిని కళ్లకు కట్టినట్లు చూసుకోవడానికి.. అదే విధంగా.. ఆయా ఉత్పత్తుల నాణ్యతను లోతుగా పరిశీలించడానికి వీలవుతుంది. ఐఓటీ ఆధారమే 5జీ టెక్నాలజీని వైద్యం,రిటైల్,ఫార్మా.. ఇలా అన్ని రంగాల్లోనూ విస్తృతంగా వినియోగించడానికి కారణం.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మహిమే. ఐఓటీ టూల్స్‌గా పేర్కొనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్ వంటి సాంకేతికతలను 5జీ కారణంగా సంస్థలతో΄ాటు వ్యక్తులూ వినియోగించుకునే అవకాశం ఉంది. క్లౌడ్ సర్వీసెస్ వయా 5జీ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే.. ఇంటర్నెట్ లేదా ఆన్లైన్ ద్వారా సాఫ్ట్వేర్ సర్వీస్‌లను అందించడం! ఇప్పుడు ఈ క్లౌడ్ కంప్యూటింగ్ స్మార్ట్ ఫోన్లలోనూ కనిపిస్తోంది. ఉదాహరణకు.. పలు హైఎండ్ ఫోన్లలో అందుబాటులో ఉంటున్న ఎంఎస్ ఆఫీస్ టూల్స్, పీడీఎఫ్ వ్యూయర్స్, పీడీఎఫ్ డ్రైవ్స్‌ను అప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్లోనే ΄÷ందే అవకాశం లభిస్తోంది. ఫలితంగా యూజర్లు తాము డౌన్లోడ్ చేసుకున్న విభిన్న వెర్షన్ల డాక్యుమెంట్లను ఎలాంటి ప్రీ–లోడెడ్ సాఫ్ట్వేర్ లేకుండానే వీక్షించే సదు΄ాయం కలుగుతోంది. రోబో ఆధారిత సేవలు ΄ారిశ్రామిక రంగంలో ఇటీవల కాలంలో రోబోటిక్ టెక్నాలజీ కీలకంగా మారుతోంది. రోబో ఆధారిత కార్యకలా΄ాలు, సేవలు విస్తృతంగా వినియోగంలోకి వస్తున్నాయి. ఈ సేవలను వ్యక్తుల స్థాయిలోనే ΄÷ందేందుకు 5జీ ఫోన్లు ఉపకరిస్తాయి. ఉదాహరణకు.. 5జీ స్మార్ట్‌ఫోన్స్‌లో ఉండే నిర్దిష్టమైన సెన్సార్లు, డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ సాంకేతికతల ఆధారంగా ఎక్కడో సుదూరాల్లో ఉన్న రోబోల సాయంతో సర్జరీలు చేసే అవకాశం లభించనుంది. నిపుణుల కొరత 5జీ సేవలు అందించాలనుకుంటున్న సంస్థలు నిపుణులైన మానవ వనరుల కొరత సమస్యను ఎదుర్కొంటున్నాయి. పలు కంపెనీలు రీ–స్కిల్లింగ్ పేరుతో 5జీ టెక్నాలజీస్‌పై తమ ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణనిస్తున్నాయి. టాటా సన్స్‌కు చెందిన పొనటోన్ ఫిన్వెస్ట్ లిమిటెడ్.. తేజస్ నెట్‌వర్క్‌తో ఒప్పందం చేసుకుని శిక్షణనిస్తోంది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ కూడా తమ ఇంజనీరింగ్, ఆర్ అండ్ డీ విభాగం ద్వారా 5జీ టెక్నాలజీస్‌పై ఉద్యోగులకు శిక్షణ అందిస్తోంది. నైపుణ్యం పొందే మార్గాలివే ► 5జీ టెక్నాలజీకి సంబంధించి నైపుణ్యాలు పొందేందుకు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా 5జీ టెక్నాలజీలో కీలకంగా నిలుస్తున్న రోబోటిక్స్, ఏఐ–ఎంఎల్, క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటీ స్కిల్స్‌ను సొంతం చేసుకునేందుకు పలు ఆన్లైన్/ఆఫ్‌లైన్ శిక్షణ మార్గాలు ఉన్నాయి. ► టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్, సిస్కో, ఒరాకిల్ ఇండియా, ఐబీఎం, డి΄ార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో పలు ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ► ఐఐటీ–రూర్కీ, ఢిల్లీ కూడా సర్టిఫికెట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ స్థాయిలో 5జీ టెక్నాలజీ అండ్ ఐఓటీ కోర్సులను అందిస్తున్నాయి. ► కోర్స్ఎరా, ఉడెమీ తదితర సంస్థలు సైతం మూక్స్ విధానంలో 5జీ టెక్నాలజీస్, ఐఓటీ సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి. 5జీ టెక్నాలజీస్.. ముఖ్యాంశాలు ►పలు రిక్రూటింగ్, స్టాఫింగ్ సంస్థల నివేదికల ప్రకారం–ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 5జీ కొలువుల్లో 20 నుంచి 25 శాతం మేరకు పెరుగుదల. ► అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం–వచ్చే పదేళ్లలో 20 మిలియన్లకు పైగా ఉద్యోగాలు. ► టెలికం సెక్టార్ స్కిల్ కౌన్సిల్ అంచనా ప్రకారం–2025 నాటికి 2.2 మిలియన్ల జాబ్స్. ► టెలికం రంగంలోనే ఈ ఏడాది దాదాపు లక్ష ఉద్యోగాలు. ► 2021లో సిస్కో ఇండియా నియామకాల్లో 30 శాతంపైగా 5జీ టెక్నాలజీ విభాగంలోనే ఉన్నాయి. -
టెలికం ఉద్యోగాలు పెరిగాయి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం, 5జీ విభాగంలో ఉద్యోగ ప్రకటనలు సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాదిలో 33.7 శాతం పెరిగాయని గ్లోబల్ జాబ్ సైట్ ఇండీడ్ వెల్లడించింది. ‘5జీ సేవల కోసం భారత్ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 5జీ నిర్దిష్ట సాంకేతికత, సేవలను అభివృద్ధి చేయడానికి కంపెనీలు ఇప్పటికే నియామకాలను ప్రారంభించాయి. తదుపరితరం నూతన టెలికం సాంకేతికతను వేగంగా స్వీకరించేందుకు వ్యాపార సంస్థలు ఎదురు చూస్తున్నందున రాబోయే కొద్ది త్రైమాసికాల్లో ఈ విభాగంలో నియామకాల్లో పెరుగుదలను చూడవచ్చు. కొత్త సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా భద్రతా వ్యవస్థలను రూపొందించగల, నెట్వర్క్ నిర్మాణాలను బలోపేతం చేయగల నైపుణ్యం కలిగిన ప్రతిభ అవసరమని దీనినిబట్టి అవగతమవుతోంది. అభివృద్ధి చెందిన టెలికమ్యూనికేషన్ రంగానికి అనుగుణంగా ఉద్యోగార్ధులు, పరిశ్రమ సైబర్ సెక్యూరిటీ నిపుణుల బలమైన సమూహాన్ని సృష్టించాలి’ అని నివేదిక వివరించింది. ఉద్యోగ ప్రకటనలు కస్టమర్ సర్వీస్ ప్రతినిధుల కోసం 13.91, ఆపరేషన్స్ అసోసియేట్స్ 8.22 శాతం అధికం అయ్యాయి. 2019 ఆగస్ట్ నుంచి 2022 ఆగస్ట్ మధ్య సైబర్ సెక్యూరిటీ ఉద్యోగాల కోసం ప్రకటనలు 81 శాతం దూసుకెళ్లాయి. -
ఐఫోన్ యూజర్లకు షాక్.. వామ్మో రెండు నెలలు వరకు..
దేశంలో 5జీ(5G) సేవల కోసం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎంతగానో ఎదురుచూసిన సంగతి తెలిసిందే. ఇటీవలే 5జీ సేవల ప్రారంభం కూడా జరిగిపోయింది. అయితే ఇక్కడే ఓ చిక్కు వచ్చిపడింది. 5జీ సేవలు ప్రారంభమైనా, ఇంకా కొన్ని స్మార్ట్ఫోన్లలో దానికి అనువైన సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాల్సి ఉంది. ఈ జాబితాలో ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ యాపిల్ కూడా ఉంది. తాజాగా ఈ అంశంపై ఐఫోన్ మేకింగ్ కంపెనీ స్పందించింది. డిసెంబర్ వరకు ఆగండి ప్రస్తుతం తమ కంపెనీ ఫోన్లలో 5జీ సేవలను వినియోగించేలా అప్డేట్ చేస్తున్నామని తెలిపింది. ఈ క్రమంలో 5జీ సేవల నాణ్యత, పనితీరుపై జరుగుతున్న ప్రయోగ పరీక్షలు విజయవంతం కాగానే అప్డేట్ అందిస్తామని పేర్కొంది. ఈ ప్రక్రియకు దాదాపు రెండు నెలల సమయం పడుతుందని, డిసెంబరు నాటికి ఐఫోన్ 14 సహా మిగిలిన అన్ని 5జీ మోడళ్లకు సాఫ్ట్వేర్ అప్డేషన్ పూర్తి చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఐఫోన్ 12, ఐఫోన్ 13, ఐఫోన్ 14 సిరీస్‌లతో పాటు ఐఫోన్ ఎస్ఈ (3వ తరం) ఫోన్లు 5జీ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో ఎయిర్టెల్, జియో ఎంపిక చేసిన నగరాల్లో 5G సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. యాపిల్ కూడా ఈ రెండు 5జీ నెట్‌వర్క్‌లపై పరీక్షిస్తోంది. ఇదిలా ఉండగా మరో వైపు ఇప్పటికే కోట్ల మంది 5జీ స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసుకుని, ఈ సేవలను వినియోగించాలని ఎదురుచుస్తున్నారు. దీంతో కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని టెలికమ్యూనికేషన్స్ విభాగం.. టెలికాం రంగంలోని ప్రముఖులతో పాటు ఫోన్ తయారీదారులు, చిప్ తయారీదారులు, ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీస్ ప్రొవైడర్లు, అనేక పరిశ్రమ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయనుంది. దేశీయంగా 5జీ సేవలు పొందేలా సాఫ్ట్వేర్ అప్డేట్లను వినియోగదారులకు పంపేందుకు మొబైల్ తయారీ సంస్థలు ‘ప్రాధాన్యత’ ఇవ్వాలని కోరనుంది. చదవండి: క్రెడిట్ కార్డును ఉపయోగించి ఏటీఎంలలో డబ్బులు డ్రా చేయొచ్చా? -
ప్రపంచంలోనే ఎక్కడా లేనంతగా భారత్‌లో టెలికం కంపెనీలపై పన్నుల మోత
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే ఎక్కడా లేనంతగా భారత్‌లో టెలికం కంపెనీలపై పన్నుల మోత ఉంటోందని వొడాఫోన్ ఐడియా సీఈవో అక్షయ్ ముంద్రా వ్యాఖ్యానించారు. పెట్టుబడులు భారీగా అవసరమయ్యే టెలికం పరిశ్రమపై ఇది మరింత భారం మోపుతోందని ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. వ్యాపార నిర్వహణకు అవసరమైన ఆదాయాన్ని ఆర్జించి, దాన్ని టెలికం నెట్‌వర్క్‌లపై తిరిగి ఇన్వెస్ట్ చేసే విధంగా పరిశ్రమపై ప్రభుత్వం పన్నుల భారం తగ్గించాలని పేర్కొన్నారు. టెలికం పరిశ్రమ 18 శాతం జీఎస్టీ, ఇతరత్రా లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలతో పాటు స్పెక్ట్రం కొనుగోలు కోసం వెచ్చించినదంతా పరిగణనలోకి తీసుకుంటే ఏకంగా 58 శాతం పన్నులు కట్టినట్లవుతుందని ముంద్రా చెప్పారు. -
కొత్త టెలికం బిల్లు 10 నెలల్లో అమల్లోకి..
న్యూఢిల్లీ: దాదాపు 137 ఏళ్ల పాత ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ స్థానంలో కొత్త టెలికం బిల్లు 6–10 నెలల్లో అమల్లోకి రాగలదని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అయితే, దీనిపై ప్రభుత్వమేమీ తొందరపడటం లేదని పేర్కొన్నారు. ‘చర్చల ప్రక్రియ బట్టి తుది ముసాయిదా రూపొందుతుంది. ఆ తర్వాత అది వివిధ ప్రక్రియలు పూర్తి చేసుకుని పార్లమెంటు ముందుకు వెడుతుంది. ఇందుకోసం 6–10 నెలల పట్టొచ్చు. మేము ఏమీ తొందరపడటం లేదు‘ అని వైష్ణవ్ చెప్పారు. కొత్త టెలికం బిల్లు గానీ ఆమోదం పొందితే ఇంటర్నెట్ కాలింగ్, మెసేజీ సర్వీసులు అందించే వాట్సాప్, జూమ్, గూగుల్ డ్యువో వంటి ఓవర్–ది–టాప్ (ఓటీటీ) సంస్థలు కూడా భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించాలంటే టెలికం లైసెన్సు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆయా యాప్స్ నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. సైబర్ మోసాలను అరికట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని మంత్రి చెప్పారు. ‘వివిధ ప్లాట్‌ఫాంల ద్వారా కాల్స్ చేయగలిగినప్పుడు అవన్నీ కూడా ఏదో ఒక నియంత్రణ సంస్థ పరిధిలో ఉండాలి. భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే ఆలోచన ఉంది. టెక్నాలజీ తీసుకొచ్చిన అనేకానేక మార్పుల వల్ల వాయిస్ కాల్, డేటా కాల్ మధ్య వ్యత్యాసం లేకుండా పోయింది‘ అని వైష్ణవ్ తెలిపారు. యూజర్ల రక్షణని ప్రత్యేకంగా దృష్టిలో ఉంచుకుని బిల్లు రూపొందిందని ఆయన పేర్కొన్నారు. అలాగే యూజర్లు కూడా ఆపరేటర్ల నుంచి సర్వీసులు పొందేందుకు సరైన వివరాలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. తప్పుడు వివరాలు ఇస్తే ఏడాది వరకూ జైలు శిక్ష విధించేలా ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. -
టెలికం పరిధిలోకి ఓటీటీ సంస్థలు
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ కాలింగ్, మెసేజింగ్ వంటి సర్వీసులు అందించే ఓవర్–ది–టాప్ (ఓటీటీ) సంస్థలను కూడా టెలికం లైసెన్సుల పరిధిలోకి తీసుకువచ్చేలా టెలికమ్యూనికేషన్ బిల్లు 2022 ముసాయిదాను కేంద్రం ఆవిష్కరించింది. దీంతో వాట్సాప్, జూమ్, గూగుల్ డ్యువో వంటి ఓటీటీ సంస్థలు ఇకపై దేశీయంగా కార్యకలాపాలు సాగించాలంటే లైసెన్సులు తీసుకోవాల్సి రానుంది. ముసాయిదా ప్రకారం, ఒకవేళ టెలికం లేదా ఇంటర్నెట్ ప్రొవైడింగ్ సంస్థలు తమ లైసెన్సులను వాపసు చేస్తే అవి కట్టిన ఫీజులను టెలికం శాఖ రిఫండ్ చేస్తుంది. సందర్భాన్ని బట్టి .. టెలికం నిబంధనల కింద నమోదు చేసుకున్న సంస్థ లేదా లైసెన్సుదారుకు సంబంధించి ఎంట్రీ ఫీజులు, లైసెన్సు ఫీజులు, రిజిస్ట్రేషన్ ఫీజులు లేదా ఇతరత్రా ఏవైనా ఫీజులు లేదా చార్జీలు, వడ్డీలు, అదనపు చార్జీలు, పెనాల్టీ మొదలైన వాటిని కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా లేదా పూర్తిగానైనా రద్దు చేయవచ్చు. ‘ముసాయిదా టెలికం బిల్లు 2022పై అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాం‘ అంటూ టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు అక్టోబర్ 20 ఆఖరు తేదీ. పరిశ్రమలో నవకల్పనలకు మార్గదర్శ ప్రణాళిక: అశ్విని వైష్ణవ్ టెలికం పరిశ్రమ పునర్వ్యవస్థీకరణకు, నవకల్పనలను ఆవిష్కరించేందుకు కొత్త టెలికం బిల్లు స్పష్టమైన మార్గదర్శ ప్రణాళిక కాగలదని మంత్రి వైష్ణవ్ చెప్పారు. వచ్చే ఏడాదిన్నర–రెండేళ్లలో డిజిటల్ నియంత్రణ వ్యవస్థను సమూలంగా మార్చే ప్రక్రియ పూర్తి కాగలదని పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. సామాజిక లక్ష్యాలు, వ్యక్తుల బాధ్యతలు.. హక్కుల మధ్య సమతౌల్యం పాటించడం, ఎలాంటి టెక్నాలజీలకైనా వర్తించే విధానాలను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. -
4జీ చార్జీలకే 5జీ సేవలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్తతరం సాంకేతిక పరిజ్ఞానం అయిన 5జీ సేవలను నేడో రేపో ప్రారంభించేందుకు భారత టెలికం కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. స్పెక్ట్రం అందుకున్న కంపెనీలు ఒకవైపు.. 5జీ హ్యాండ్‌సెట్స్‌తో 5 కోట్ల మంది కస్టమర్లు మరోవైపు. అయితే అందరి చూపూ చార్జీలు ఎలా ఉండబోతున్నాయనే. టెలికం కంపెనీల నుంచి అందుతున్న సమాచారం మేరకు 4జీ రేటుకే 5జీ సేవలను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్కో కస్టమర్ నుంచి సమకూరే ఆదాయాన్ని పెంచుకోవాలని కొన్నేళ్లుగా టెలికం సంస్థలు కసరత్తు చేస్తున్నాయి. కొత్త టెక్నాలజీ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించిన ఈ సంస్థలు అందుకు తగ్గ ప్రణాళికనూ రెడీ చేసుకున్నాయి. ఆరు నెలల తర్వాతే.. ముందుగా 4జీ టారిఫ్‌లోనే 5జీ సేవలను ప్రయోగాత్మకంగా అందించే అవకాశం ఉందని దిగ్గజ టెలికం కంపెనీ ప్రతినిధి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘కొత్త టెక్నాలజీపట్ల కస్టమర్ అనుభూతి చెందాలి. 5జీ ప్రయోజనాలు అందుకోవాలి. అంత వరకు రేట్ల సవరణ ఉండకపోవచ్చు. ఆరు నెలల తర్వాతే క్రమంగా కొత్త చార్జీలు అమలులోకి వచ్చే చాన్స్ ఉంది. నెట్వర్క్ స్లైసింగ్ విధానంలో ఒక్కో వినియోగదారుడు కోరుకున్న వేగాన్ని 5జీలో అందించే వీలుంది. నెట్వర్క్ అప్‌గ్రేడ్ కారణంగా అటు 4జీ సేవల నాణ్యతా పెరుగుతుంది’ అని వివరించారు. 2022 మే 31 నాటికి దేశవ్యాప్తంగా 79.47 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ వినియోగదార్లు ఉన్నారు. వీరిలో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు 76.55 కోట్లు. సగటున ఒక్కో కస్టమర్ నుంచి టెలికం కంపెనీకి సమకూరుతున్న ఆదాయం రూ.200లోపే ఉంటోంది. దీనిని రూ.300–350కి చేర్చాలన్నది కంపెనీల లక్ష్యం. 2021 నవంబర్–డిసెంబర్లో చార్జీలు 20–25 శాతం పెరిగాయి. కంపెనీలకు స్పెక్ట్రం భారం.. టెలికం కంపెనీలు 5జీ స్పెక్ట్రం కోసం భారీగానే ఖర్చు చేశాయి. రిలయన్స్ జియో ఏకంగా రూ.88,078 కోట్లు, భారతీ ఎయిర్టెల్ రూ.43,084 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.18,799 కోట్ల విలువైన స్పెక్ట్రంను కొనుగోలు చేశాయి. ఒక్క 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో 10 మెగాహెట్జ్ స్పెక్ట్రం కోసం జియో ఏకంగా రూ.40,000 కోట్లు ఖర్చు చేసిందంటే ఆశ్చర్యం వేయకమానదు. 700 మెగాహెట్జ్ బ్యాండ్‌లో కవరేజ్ మెరుగ్గా ఉంటుందని జియో అంటోంది. 5జీ సేవల్లో భాగంగా మూడు ప్రైవేట్ టెలికం సంస్థలు నెట్వర్క్ అప్‌గ్రేడ్, విస్తరణకు అయిదేళ్లలో రూ.1.43–1.59 లక్షల కోట్లు వెచ్చించే అవకాశం ఉందని ఓ కన్సల్టింగ్ కంపెనీ వెల్లడించింది. భారీగా ఖర్చులు ఉన్నందున ప్యాక్‌ల చార్జీలు పెంచక తప్పదు. అది కూడా ఆచితూచి వ్యవహరించాలన్నది కంపెనీల భావన. రెండేళ్లలో 15 కోట్లు.. ప్రస్తుతం దేశంలో 5 కోట్ల మంది వద్ద 5జీ హ్యాండ్సెట్స్ ఉన్నాయి. రెండేళ్లలో ఈ సంఖ్యను 15 కోట్లకు చేర్చాలన్నది టెలికం కంపెనీల లక్ష్యం. ఇందుకు అనుగుణంగా మొబైల్స్ తయారీ సంస్థలతో కలిసి బండిల్ ఆఫర్లను టెలికం సంస్థలు ప్రవేశపెట్టనున్నాయి. జియో రాకతో ఒక్కసారిగా దేశంలో 4జీ విప్లవం వచ్చింది. మూడు కంపెనీల గట్టి పోటీతో 5జీలోనూ అదే ఊపు ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. -
ఎయిర్టెల్ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర లాభం దాదాపు ఆరు రెట్లు ఎగసి రూ. 1,607 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 283 కోట్లు ఆర్జించింది. టారిఫ్‌ల పెంపు ప్రధానంగా ప్రభావం చూపింది. మొత్తం ఆదాయం సైతం 22 శాతం వృద్ధితో రూ. 32,085 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో రూ. 26,854 కోట్ల టర్నోవర్ ప్రకటించింది. దేశీ ఆదాయం 24 శాతం బలపడి రూ. 23,319 కోట్లకు చేరగా.. మొబైల్ సర్వీసుల నుంచి 27 శాతం అధికంగా రూ. 18,220 కోట్లు లభించింది. హోమ్ సర్వీసుల(ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్) ఆదాయం 42 శాతం పురోగమించి రూ. 927 కోట్లకు చేరగా.. బిజినెస్ విభాగం నుంచి రూ. 4,366 కోట్లు సమకూరింది. ఇది 15% అధికం. ఆఫ్రికా ఆదాయం 15% ఎగసి 127 కోట్ల డాలర్ల(రూ. 10,098 కోట్లు)కు చేరింది. 4జీ స్పీడ్: ప్రస్తుత సమీక్షా కాలంలో ఎయిర్టెల్ మొత్తం కస్టమర్ల సంఖ్య 4.7 శాతం పుంజుకుని 49.69 కోట్లను తాకింది. దేశీయంగా ఈ సంఖ్య 36.24 కోట్లు. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్పీయూ) పరిశ్రమలోనే మెరుగ్గా రూ. 183కు చేరింది. గత క్యూ1లో నమోదైన రూ. 146తో పోలిస్తే ఇది 25 శాతంపైగా వృద్ధి. ఫలితాల నేపథ్యంలో ఎయిర్టెల్ షేరు నామమాత్ర లాభంతో రూ. 705 వద్ద ముగిసింది. -
స్పెక్ట్రం కేటాయింపు ప్రక్రియ వేగవంతం
న్యూఢిల్లీ: 5జీ వేలంలో పాల్గొన్న కంపెనీలకు స్పెక్ట్రం కేటాయింపుల ప్రక్రియను సకాలంలో పూర్తి చేయడానికి కసరత్తు జరుగుతోందని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ముందుగా ప్రకటించినట్లు ఆగస్టు 12 కల్లా కేటాయించే దిశగా ప్రభుత్వం వేగంగా పని చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే కార్యదర్శుల కమిటీ అనుమతుల ప్రక్రియను పూర్తి చేసిందని మంత్రి తెలిపారు. (Zomato: జొమాటోకు మరో ఎదురు దెబ్బ) అలాగే, స్పెక్ట్రం సమన్వయ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని వివరించారు. దీని కింద ఒక్కో సంస్థకు ఒక్కో బ్యాండ్‌లో విడివిడిగా ఉన్న స్పెక్ట్రంను ఒక్క చోటికి చేరుస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియకు నెలల తరబడి సమయం పట్టేస్తుంది. కానీ దీన్ని ఈసారి ఒక్క రోజులోనే పూర్తి చేయగలిగినట్లు వైష్ణవ్ చెప్పారు. టెల్కోలు మరింత సమర్థమంతంగా సేవలు అందించేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడగలదని ఆయన తెలిపారు. జూలై 26 నుంచి ఆగస్టు 1 వరకూ కొనసాగిన 5జీ స్పెక్ట్రం వేలంలో రూ. 1.5 లక్షల కోట్ల విలువ చేసే బిడ్లు దాఖలైన సంగతి తెలిసిందే. 10 బ్యాండ్స్‌లో 72,098 మెగాహెట్జ్ స్పెక్ట్రంను వేలానికి ఉంచగా 51,236 మెగాహెట్జ్ స్పెక్ట్రం (సుమారు 71 శాతం) అమ్ముడైంది. విక్రయించిన మొత్తం స్పెక్ట్రంలో దాదాపు సగభాగాన్ని రిలయన్స్ జియో రూ. 88,078 కోట్ల బిడ్లతో దక్కించుకుంది. (చదవండి: అయిదేళ్లలో రెండింతలు: డిజిటల్ రేడియోకు అదరిపోయే వార్త) -
ఈ ప్యాకేజీలో ఇచ్చిందేమిటి? వచ్చిందేమిటి?
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 1.64 లక్షల కోట్ల ప్యాకేజీ గురించి ఒక వర్గం... ప్రభుత్వ రంగ సంస్థ బాగు కోసం ఇది అవసరం అంటుండగా, మరో వర్గం పన్నులు కట్టే ప్రజల డబ్బులు ఇలా వృథా చేస్తారా? అని విమర్శిస్తోంది. ఇందులో నిజానిజాలేమిటో పరిశీలిద్దాం. 2019 అక్టోబర్ 23న మొదటి రివైవల్ ప్యాకేజీ బీఎస్ఎన్ఎల్కి కేంద్రం ప్రకటించింది. ఇందులో బీఎస్ఎన్ఎల్కు 4జీ సర్వీసుల కోసం స్పెక్ట్రమ్ ఇస్తామనీ, 4జీ సాంకేతిక అభివృద్ధి కోసం ఖర్చు కూడా భరిస్తామనీ చెప్పారు. సంస్థ ఉద్యోగులకు వాలంటరీ పథకం కూడా ఇందులోనే ప్రకటించి దాదాపు 80,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపారు. ‘ఆత్మ నిర్భర్ భారత్’ పథకం కింద భారతీయ సాంకేతిక పరిజ్ఞానం వాడి... 4జీ సౌకర్యం బీఎస్ఎన్ఎల్కు ఇవ్వాలని నిబంధనలు పెట్టారు. ప్రయివేటు టెలికాం కంపెనీలు మాత్రం విదేశీ సాంకేతిక పరిజ్ఞా నాన్ని వాడుకునే వెసులుబాటు కల్పించారు. గత మూడేళ్ళుగా బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసులు ప్రారంభిం చడానికి అనేక సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి. కనుక 4జీ స్పెక్ట్రమ్ కోసం సర్దుబాటు చేస్తానన్న 44,993 కోట్లు కానీ, 4జీ సాంకేతిక అభివృద్ధి కోసం ఇస్తామన్న 22,471 కోట్లు కానీ గతంలో ప్రకటించిన 70,000 కోట్ల రివైవల్ ప్యాకేజీలో చెప్పినవే! వాటినే ఇప్పుడు మరో సారి కేంద్రం 1.64 లక్షల కోట్ల ప్యాకేజీలో కలిపి గొప్పగా పెద్ద అంకె కనపడేలా చేసింది. కనుక ఈ మొత్తంలో 67,464 కోట్లు మినహాయిం చాల్సి ఉంటుంది. ఏమీ ఆదాయం రాని భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్)ను బీఎస్ఎన్ఎల్లో విలీనం చేయడం అదనపు భారమే. కేంద్రం ప్రకటించిన బీఎస్ఎన్ఎల్ ప్యాకేజీలో 4జీ కోసం రూ. 44,993 కోట్లు ఈక్విటీని ఇన్ఫ్యూజన్ చేస్తామనీ, అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూపై బీఎస్ఎన్ఎల్ చెల్లించాల్సిన రూ. 33,404 కోట్లు ఈక్విటీగా మారుస్తామనీ చెప్పారు. ప్రయివేటు టెలికాం కంపెనీలకు పన్నులు చెల్లించకుండా నాలుగేళ్ళ మారటోరియం విధించి, బకాయిలు కట్టడానికి పదేళ్ల వెసులుబాటు ఇచ్చిన ప్రభుత్వం... బీఎస్ఎన్ఎల్కు అలాంటి రాయితీ కల్పించలేదు. పైగా ఈక్విటీ ఇన్ఫ్యూజన్, ఈక్విటీగా మార్పు చేయాలంటే షేర్లు అమ్మాల్సి ఉంటుంది. ఇదే బీఎస్ఎన్ఎల్లో డిజిన్వెస్ట్మెంటుకు నాంది పలుకుతుందా అన్న అనుమానాలు ఉన్నాయి. ప్యాకేజీలోని మంచి అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం రంగం అభివృద్ధి కోసం బీఎస్ఎన్ఎల్ చేస్తున్న సేవలకు ప్రతి ఫలం ఇస్తామని ప్రభుత్వం రాత పూర్వకంగా బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు సమయంలో హామీ ఇచ్చింది. అయితే ఈక్వల్ లెవల్ ప్లేయింగ్ ఫీల్డ్ పేరుతో ఈ సహా యాన్ని 2011 నుండే ఆపి వేశారు. కానీ యూనియన్లు, అసోసియేషన్లు అడగకపోయినా 2014–2019 కాలానికి గ్రామీణ ప్రాంతాల్లో సేవలకుగాను రూ. 13,789 కోట్లు ప్రకటించారు. అలాగే బీఎస్ఎన్ఎల్కు ఉన్న అప్పు రూ. 33,000 కోట్లకు సావర్న్ గ్యారెంటీ కల్పించేందుకు ప్రభుత్వం ఎవరూ అడగకుండానే ముందుకువచ్చింది. సర్వీసుల నాణ్యత పెంచు తామనీ, ఒక యూనిట్‌కు బీఎస్ఎన్ఎల్కు వచ్చే ఆదాయాన్ని 170 /180 రూపాయలకు పెంచుతామనీ ప్రకటిం చడం మంచిదే. అయితే, ఈ ప్యాకేజీ ద్వారా ఒక లక్ష మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొనడం హాస్యాస్పదం. ఇదే నిజమైతే బీఎస్‌ఎన్‌ఎల్‌లోని యాభై శాతం మందిని వాలంటరీ రిటైర్మెంట్ ద్వారా ఇప్పటికే ఇంటికి పంపడం ఎందుకు? ఒడాఫోన్ ఐడియా సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో పడగానే, ఆ సంస్థను బీఎస్ఎన్ఎల్లో కలపాలని ఊదరగొట్టిన కొంత మంది... బీఎస్ఎన్ఎల్కు లక్షల కోట్లు దోచి పెడుతున్నట్లూ... తద్వారా ప్రజాధనాన్ని దోచి పెడుతున్నట్లూ గగ్గోలు పెడుతు న్నారు. నిజానికి రూ. 1.64 కోట్ల ప్యాకేజీలో రూ. 13,789 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం సర్వీసుల పరిహారం తప్ప, ఏదీ కొత్తది కాదు. అప్పుకు హామీ ఇవ్వడం భారం కాదు. మిగతా మొత్తాలను ఈక్విటీగా మార్చడంవల్ల అదనపు భారం లేదు. ఏమైనా, బీఎస్ఎన్ఎల్ టెలికాం రంగంలో వ్యూహాత్మక భాగస్వామిగా ఉండటం వల్లనే టెలికాం రంగం సమతూకంగా ఉంటుందనీ, కనుక బీఎస్ఎన్ఎల్ మనుగడ కోసం కృషి చేస్తామనీ, దానికి 5జీ కూడా ఇస్తామనీ ప్రభుత్వం ప్రకటించడం మాత్రం ముదావహం. అయితే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందా, ఈ ప్యాకేజీని ఎంత త్వరగా అమలు చేస్తారు, దాని ఫలితాలు ఏమిటన్నది వేచి చూడాలి. తారానాథ్ మురాల వ్యాసకర్త టెలికాం రంగ విశ్లేషకులు -
టెలికంలోకి అదానీ!
న్యూఢిల్లీ: టెలికం రంగంలో దిగ్గజాలు అంబానీ, మిట్టల్‌ను ఢీకొనేందుకు అదానీ కూడా సిద్ధమవుతున్నారు. త్వరలో కేంద్రం నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో పాల్గొనడం ద్వారా టెలికంలోకి ఎంట్రీ ఇవ్వాలని పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ గ్రూప్ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా స్పెక్ట్రం వేలానికి దరఖాస్తు కూడా చేసుకున్నట్లు పేర్కొన్నాయి. స్పెక్ట్రం వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువు శుక్రవారంతో ముగిసింది. దీనికి నాలుగు దరఖాస్తులు వచ్చాయి. జియో (ముకేష్ అంబానీ), ఎయిర్టెల్ (సునీల్ మిట్టల్), వొడాఫోన్ ఐడియాతో పాటు నాలుగో సంస్థగా అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసుకున్నట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. దరఖాస్తుదారుల పేర్లను జూలై 12న ప్రకటించనున్నారు. అదానీ గ్రూప్ ఇటీవలే నేషనల్ లాంగ్ డిస్టెన్స్ (ఎన్ఎల్డీ), ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ (ఐఎల్‌డీ) లైసెన్సులు కూడా తీసుకుంది. వివిధ బ్యాండ్లలో దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే స్పెక్ట్రం వేలం జులై 26న ప్రారంభం కానుంది. గుజరాత్‌కే చెందిన అంబానీ, అదానీ .. భారీ వ్యాపార సామ్రాజ్యాలను సృష్టించినా ఇప్పటివరకూ ప్రత్యక్షంగా ఒకే రంగంలో పోటీ పడలేదు. అంబానీ ఆయిల్, పెట్రోకెమికల్స్, టెలికం, రిటైల్‌లో విస్తరించగా.. అదానీ మాత్రం పోర్టులు, బొగ్గు, ఏవియేషన్ వంటి రంగాలపై దృష్టి పెట్టారు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం పరిస్థితి మారుతోంది. పెట్రోకెమికల్స్ విభాగంలోకి ప్రవేశించే దిశగా అదానీ ఇటీవలే ఒక అనుబంధ సంస్థ ఏర్పాటు చేశారు. పునరుత్పాదక విద్యుత్ విభాగంలో అంబానీ, అదానీ పోటాపోటీగా పెట్టుబడులు ప్రకటిస్తున్నారు. -
జోరుగా హైరింగ్.. టెలికం, బీఎఫ్ఎస్ఐ రంగాల్లో భారీగా నియామకాలు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండో నెలా నియామకాలకు డిమాండ్ కొనసాగింది. ప్రధానంగా టెలికం, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా), దిగుమతి .. ఎగుమతి రంగాల్లో హైరింగ్ పెరిగింది. గతేడాది మే నెలతో పోలిస్తే ఈసారి మే లో 9 శాతం వృద్ధి నమోదైంది. రిక్రూట్మెంట్ సమాచార సంస్థ మాన్స్టర్డాట్కామ్కు చెందిన ఉద్యోగాల సూచీ (ఎంఈఐ) ప్రకారం రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ‘దేశవ్యాప్తంగా వివిధ వ్యాపార విభాగాలు కోలుకోవడం, 5జీ సేవలు ప్రారంభం కానుండటం తదితర అంశాల ఊతంతో నియామకాలకు సంబంధించి 2022–23 ఆర్థిక సంవత్సరం ఘనంగానే ప్రారంభమైంది. ఇప్పటివరకూ అయితే దేశీ జాబ్ మార్కెట్ మెరుగ్గానే ఉంది‘ అని మాన్‌స్టర్‌డాట్‌కామ్ సీఈవో శేఖర్ గరిశా తెలిపారు. ప్రతిభావంతులను నియమించుకోవాలని రిక్రూటర్లు భావిస్తున్నారని, మార్కెట్లో కచి్చతంగా వారికి డిమాండ్ నెలకొంటుందన్నారు. నివేదికలో ప్రధాన అంశాలు.. సరఫరా వ్యవస్థలు మెరుగుపడటంతో దిగుమతులు, ఎగుమతుల విభాగంలో జాబ్ పోస్టింగ్‌లు 47 శాతం పెరిగాయి. డిజిటైజేషన్, నగదురహిత చెల్లింపులు, డిజిటల్ మనీ తదితర విధానాలు బీఎఫ్‌ఎస్‌ఐకి దన్నుగా ఉన్నాయి. ఈ విభాగంలో నియామకాలు 38 శాతం పెరిగాయి. 5జీ సేవల ప్రారంభం అంచనాలపై టెలికం/ఐఎస్పీ విభాగాల్లో జాబ్ పోస్టింగ్‌ల వృద్ధి 36 శాతంగా ఉంది. ట్రావెల్, టూరిజం విభాగాలు పూర్తిగా కోలుకున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వీటిలో నియామకాల పోస్టింగ్‌లు 29 శాతం పెరిగాయి. వాస్తవానికి ఏప్రిల్‌తో పోలిస్తే (15 శాతం) ఈ విభాగం దాదాపు రెట్టింపు అయ్యింది. ఉద్యోగులు క్రమంగా ఆఫీసు బాట పడుతుండటంతో ఆఫీస్ పరికరాలు, ఆటోమేషన్ విభాగాల్లో నియామకాలు 101 శాతం, రియల్ ఎస్టేట్ రంగంలో 25 శాతం మేర పెరిగాయి. రిటైల్ విభాగంలో 11 శాతం వృద్ధి నమోదైంది. 2021 సెప్టెంబర్ నుండి మీడియా, వినోద రంగంలో క్షీణత కొనసాగుతోంది. మే నెలలో హైరింగ్ 19 శాతం తగ్గింది. ఇంజినీరింగ్, సిమెంట్, నిర్మాణ, ఐరన్..స్టీల్ విభాగాల్లో ఆన్లైన్ రిక్రూట్మెంట్ కార్యకలాపాలు 9 శాతం మేర తగ్గాయి. షిప్పింగ్, మెరైన్‌లో 4% క్షీణత నమోదైంది. కరోనా మహమ్మారి అనంతరం రికవరీలో ద్వితీయ శ్రేణి పట్టణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీనికి నిదర్శనంగా నగరాలవారీగా చూస్తే కోయంబత్తూర్‌లో అత్యధికంగా నియామకాల పోస్టింగ్‌లు నమోదయ్యాయి. 27 శాతం పెరిగాయి. ముంబైలో ఇది 26 శాతంగా ఉంది. ఇక ఢిల్లీ–రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), హైదరాబాద్‌లో జాబ్ పోస్టింగ్‌ల వృద్ధి 16 శాతంగా నమోదైంది. చెన్నై (15 శాతం), పుణె (13%), బెంగళూరు (9%), కోల్‌కతా (6%) పెరిగాయి. -
టెలికాం సంస్థలకు భారీ షాక్!
న్యూఢిల్లీ: గతేడాది డిసెంబర్ త్రైమాసికంలో టెలికం సంస్థల స్థూల ఆదాయం 2.64 శాతం క్షీణించింది. రూ. 69,695 కోట్లకు పరిమితమైంది. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన తాజా గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అంతక్రితం ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో టెల్కోల ఆదాయం రూ. 71,588 కోట్లు. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) సుమారు 16 శాతం పెరిగి రూ. 47,623 కోట్ల నుంచి రూ. 55,151 కోట్లకు పెరిగింది. ఏజీఆర్ ఆధారంగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన సుంకాలు, చార్జీలు మొదలైనవి ఆధారపడి ఉంటాయి. సమీక్షా కాలంలో ప్రభుత్వానికి లైసెన్సు ఫీజు రూపంలో రూ. 4,541 కోట్లు, స్పెక్ట్రం యూసేజి చార్జీలు (ఎస్‌యూసీ) రూ. 1,770 కోట్లు దఖలు పడ్డాయి. లైసెన్సు ఫీజు కలెక్షన్ 19.21 శాతం, ఎస్‌యూసీ వసూళ్లు 14.47 శాతం పెరిగాయి. రిలయన్స్ జియో ఏజీఆర్ అత్యధికంగా రూ. 19,064 కోట్లుగా నమోదు కాగా, భారతి ఎయిర్‌టెల్‌ది రూ. 4,484 కోట్లు, వొడాఫోన్ ఐడియాది రూ. 6.542 కోట్లుగా నమోదైంది. 2021 డిసెంబర్ ఆఖరు నాటికి మొత్తం టెలిఫోన్ యూజర్ల సంఖ్య 0.9 శాతం క్షీణించి రూ. 117.84 కోట్లకు పరిమితమైంది. -
హెక్సాకామ్‌లో టీసీఐఎల్ వాటా విక్రయం!
న్యూఢిల్లీ: రాజస్తాన్, ఈశాన్య రాష్ట్రాలలో టెలికం సర్వీసులందిస్తున్న భారతీ హెక్సాకామ్లోగల 30 శాతం వాటాను పీఎస్‌యూ సంస్థ టీసీఐఎల్ విక్రయించనుంది. ఈ వాటా విలువను ప్రభుత్వ ఆదేశాలమేరకు ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ రూ.8,900 కోట్లుగా మదింపు చేసినట్లు అధికారిక వర్గాలు తెలియజేశాయి. భారతీ హెక్సాకామ్‌లో మొబైల్ సేవల దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు 70 శాతం వాటా ఉంది. టీసీఐఎల్ ద్వారా ఈ భాగస్వామ్య సంస్థ(జేవీ)లో గల వాటాను ప్రభుత్వం విక్రయించే యోచనలో ఉంది. ఈ జేవీలోగల వాటాను విక్రయించడం ద్వారా భారతీ హెక్సాకామ్ నుంచి ప్రభుత్వం వైదొలగనుంది. ఈ అంశం 15ఏళ్లుగా పెండింగ్‌లో ఉంది. కాగా.. వాటా విక్రయాన్ని పబ్లిక్ ఇష్యూ ద్వారా చేపట్టదలిస్తే మరో రెండేళ్ల కాలం పట్టవచ్చని, అప్పటికి వాటా విలువలో మార్పులుంటాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. (చదవండి: యూని'ఫ్లాప్' కార్న్‌లు.. బేర్ మంటున్న టెక్ స్టార్టప్‌లు!) -
ఏకీకృత లైసెన్స్ పరిధిలోకి ఆడియో కాన్ఫరెన్సింగ్ సర్వీసులు
న్యూఢిల్లీ: ఇక నుంచి ఆడియో కాన్ఫరెన్సింగ్, ఆడియోటెక్స్, వాయిస్ మెయిల్ సర్వీసుల లైసెన్సింగ్ విధానం.. ’ఏకీకృత లైసెన్స్’ పరిధిలోనే ఉండనున్నట్లు టెలికం విభాగం (డాట్) వెల్లడించింది. ప్రస్తుతం ఆడియోటెక్స్, వాయిస్ మెయిల్ సర్వీసులకు స్టాండెలోన్ లైసెన్సు తీసుకోవాల్సి ఉంటోంది. తాజా మార్పుల ప్రకారం ప్రస్తుతం వీఎంఎస్ / ఆడియోటెక్స్ / యూఎంఎస్ లైసెన్సులు ఉన్న సంస్థలు ఏకీకృత లైసెన్సుకు మారడమనేది ఐచ్ఛికంగానే ఉంటుందని డాట్ తెలిపింది. కొత్త నిబంధనలు 2022 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. ‘2001 జులై 16న ఇచ్చిన వీఎంఎస్, ఆడియోటెక్స్, యూఎంఎస్ లైసెన్సులను పునరుద్ధరించడం లేదా కొత్తగా స్టాండెలోన్ లైసెన్సులను జారీ చేయబోము‘ అని డాట్ ఒక ప్రకటనలో తెలిపింది. టెలికం రంగంలో విధానపరమైన సంస్కరణల్లో భాగంగా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. -
ఇలా చేస్తే భారత్‌లో 5జీ సేవలు జోరందుకుంటాయ్
న్యూఢిల్లీ: దేశీయంగా టెల్కోలు కొత్త టెక్నాలజీలు ఆవిష్కరించాలన్నా, నాణ్యమైన 5జీ సేవలు అందించాలన్నా భారత టెలికం మార్కెట్లో టారిఫ్‌లు లాభసాటిగా ఉండాలని సాఫ్ట్‌బ్యాంక్ ఇండియా కంట్రీ హెడ్ మనోజ్ కొహ్లి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్యాకేజీ టెలికం రంగానికి ఎంతో ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా 5జీ విప్లవానికి సిద్ధమయ్యేందుకు పరిశ్రమకు ఇది సహాయపడగలదని కొహ్లి తెలిపారు. ఐవీసీఏ మ్యాగ్జిమం ఇండియా సదస్సు (ఎంఐసీ)లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. ‘టారిఫ్‌లు మరింత మెరుగ్గా ఉండాలని నేను భావిస్తున్నాను. అయితే, ఎంత స్థాయిలో ఉండాలన్నది నేను చెప్పలేను. అది టెలికం సంస్థల ఇష్టం. స్థూలంగా చెప్పాలంటే టెల్కోలు.. కొత్త టెక్నాలజీలతో పాటు 5జీ సేవలను నాణ్యంగా అందించగలిగేంత స్థాయిలో ఉండాలన్నది నా అభిప్రాయం‘ అని కొహ్లి పేర్కొన్నారు. భారత్‌లో 5జీ సేవల విస్తరణ వేగంగా జరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ‘విద్యుత్ రంగంలాగానే టెలికం కూడా కీలకమైన మౌలిక సదుపాయం. స్థూల దేశీయోత్పత్తి మరింత అధికంగా వృద్ధి చెందడానికి ఇది కూడా ఎంతో ముఖ్యం‘ అని తెలిపారు. వాయిస్ సర్వీసులపై వినియోగదారులకు ఆసక్తి తగ్గిందని.. భవిష్యత్తంతా డేటా, కంటెంట్‌దేనని కొహ్లి చెప్పారు. టెల్కోలు ఇందుకు అనుగుణంగా తమ వ్యాపార విధానాలను మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. -
జూలైలో జియో జూమ్!!
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం రిలయన్స్ జియో జోరు కొనసాగుతోంది. జూలైలో ఏకంగా 65.1 లక్షల కొత్త యూజర్లను దక్కించుకుని మార్కెట్ లీడర్‌గా స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. దీనితో జులై ఆఖరు నాటికి జియో సబ్‌్రస్కయిబర్స్ సంఖ్య 44.32 కోట్లకు చేరింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొత్త కస్టమర్లను (34.8 లక్షలు) దక్కించుకున్న ఏకైక సంస్థ జియో ఒక్కటే. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ గురువారం విడుదల చేసిన గణాంకాల్లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం జూలైలో భారతి ఎయిర్టెల్ కొత్త యూజర్ల సంఖ్య 19.42 లక్షలుగా నమోదు కాగా మొత్తం కనెక్షన్ల సంఖ్య 35.40 కోట్లకు ఎగిసింది. అటు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న వొడాఫోన్–ఐడియా యూజర్ల సంఖ్య మాత్రం 14.3 లక్షలు పడిపోయింది. దీంతో మొత్తం సబ్‌్రస్కయిబర్స్ సంఖ్య 27.19 కోట్లకు పరిమితమైంది. వైర్లెస్ కనెక్షన్ల మార్కెట్లో జూలై ఆఖరు నాటికి జియోకు 37.34 శాతం, భారతి ఎయిర్‌టెల్‌కు 29.83 శాతం, వొడా–ఐడియాకు 22.91 శాతం వాటా ఉంది. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న టెలికం రంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం ప్రత్యేకంగా ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులపై నాలుగేళ్ల మారటోరియం, 100 శాతం విదేశీ పెట్టుబడులు అనుమతించడం మొదలైనవి ఇందులో ఉన్నాయి. దీంతో వొడాఫోన్ ఐడియాకు కాస్త ఊరట లభించనుంది. 120 కోట్లకు కనెక్షన్లు..: ట్రాయ్ డేటా ప్రకారం దేశీయంగా టెలిఫోన్ కనెక్షన్లు 120.9 కోట్లకు చేరాయి. వైర్లెస్ విభాగంలో మొత్తం యూజర్ల సంఖ్య 118.6 కోట్లకు చేరింది. ఇక బ్రాడ్‌బ్యాండ్ యూజర్ల మార్కెట్లో టాప్ 5 సరీ్వస్ ప్రొవైడర్ల వాటా 98.7 శాతంగా ఉంది. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్, ఎట్రియా కన్వర్జెన్స్ సంస్థలు టాప్ 5లో ఉన్నాయి. -
హైదరాబాద్‌కి వస్తున్న మరో అంతర్జాతీయ సంస్థ
ఫార్మా, ఎయిరోస్పేస్, ఐటీ, క్లౌడ్ స్టోరేజీ రంగాలకు హబ్‌గా మారుతోన్న హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ రానుంది. ఆస్ట్రేలియా టెలికాం దిగ్గజం టెల్ స్ట్రా ఇండియాలో ఇన్నోవేషన్ సెంటర్ నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. అందుకు వేదికగా హైదరాబాద్‌ను ఎంచుకుంది. ఫ్యూచర్ టెక్నాలజీపై ఫోకస్ టెల్ స్ట్రా సంస్థ హైదరాబాద్‌లో ప్రారంభించబోయే గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), 5జీ, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అంశాలపై పని చేస్తుంది. టెలికాం, ఇంటర్నెట్ రంగంలో వస్తోన్న నూతన మార్పులను టెక్నాలజిస్టులు పూర్తిగా ఉపయోగించుకోవడంతో పాటు సరికొత్త ఆవిష్కరణలకు ఈ సెంటర్ వేదికగా మారనుంది. టెలికాం రంగానికి సంబంధించి స్థానికంగా ఉన్న సాంకేతిక నిపుణులకు మంచి అవకాశాలు రానున్నాయి. హైదరాబాద్ సెంటర్లో టెల్ స్ట్రా సంస్థ హైదరాబాద్‌లో నెలకొల్పబోయే క్యాంపస్‌ను స్పెషలైజ్డ్ హై పెర్ఫార్మెన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ (హెచ్పీఎస్ఈ)గా రూపుదిద్దనున్నారు. టెలికాం సాఫ్ట్వేర్కి సంబంధించి కన్సుమర్ బేస్డ్ డీప్ టెక్నాలజీ ఆవిష్కరణలు ఇక్కడ జరిగే విధంగా హైదరాబాద్ క్యాంపస్ ఉండబోతుంది. ‘త్వరలో తాము ప్రారంభించే ఇన్నోవేషన్ సెంటర్లు టెలికాం రంగంలో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటాయని టెల్ స్ట్రా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్టీ అరుణ్‌కుమార్ తెలిపారు. భారీగా విస్తరణ టెలికాం దిగ్గజం టెల్ స్ట్రా సంస్థ తమ వ్యాపార కార్యకలాపాల విస్తరణలో భాగంగా తొలిసారిగా ఆస్ట్రేలియాకి బయట బెంగళూరులో గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్‌ని 2019లో ప్రారంభించింది. రెండేళ కిందట రెండు వందల మందితో ప్రారంభమైన బెంగళూరు క్యాంపస్‌లో ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య వెయ్యికి చేరుకుంది. ఇప్పుడు తొలి ఇన్నెవేషన్ సెంటర్‌ను మించేలా పుణే, హైదరాబాద్‌లలో మరో రెండు క్యాపబులిటీ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బెంగళూరు, పూణే, హైదరాబాద్‌లలో కలిపి మొత్తంగా లక్ష చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్‌లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహించాలని టెల్ స్ట్రా లక్క్ష్యంగా పెట్టుకుంది. చదవండి: అమెజాన్ భారీ నియామకాలు -
శాటిలైట్ కనెక్టివిటీతో పల్లెలకు టెలికం సేవలు
న్యూఢిల్లీ: టెలికం నెట్‌వర్క్స్‌లో శాటిలైట్ కనెక్టివిటీ వినియోగించేందుకు డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆప్టికల్ ఫైబర్ వేయలేని ప్రాంతాల్లో టెలికం సేవలు అందించేందుకు, కఠిన భూభాగాల్లో మొబైల్ టవర్ల అనుసంధానానికి శాటిలైట్ కనెక్టివిటీ ఉపయోగపడుతుంది. 16 రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు అందించేందుకు ప్రతిపాదించిన భారత్‌నెట్ ప్రాజెక్ట్‌కు సైతం డీసీసీ ఆమోదం లభించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.19,041 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో ఈ ప్రాజెక్టుకు చేపట్టనున్నారు. దీని కోసం వారం రోజుల్లో టెండర్లను టెలికం శాఖ పిలవనుంది. భారతీ గ్రూప్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ వన్‌వెబ్‌లో పెట్టుబడులు పెట్టినందున తాజా నిర్ణయం భారతి ఎయిర్‌టెల్‌కు ప్రయోజనకరంగా ఉంటుంది. -
టెలికాం రంగంలోకి పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం పరికరాల తయారీకి ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన రూ.12,195 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) స్కీముకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం గురువారం విడుదల చేసింది. టెలికం శాఖ(డాట్) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పథకంలో నమోదు చేసుకునే ప్రక్రియ శుక్రవారం (జూన్ 4న) ప్రారంభమై జూలై 3 దాకా కొనసాగుతుంది. అర్హత పొందిన కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 దాకా పెట్టే పెట్టుబడులు, విక్రయాలపై ఈ స్కీము కింద ప్రోత్సాహకాలు పొందవచ్చు. ఏప్రిల్ 1 నుంచి దీన్ని వర్తింపజేస్తారు. అధునాతన టెక్నాలజీ ఊతంతో దేశీ కంపెనీలు అంతర్జాతీయ దిగ్గజాలుగా ఎదిగేందుకు తోడ్పాటు అందించడం స్కీము ప్రధాన లక్ష్యమని డాట్ వెల్లడించింది. ఈ పథకం ఊతంతో వచ్చే అయిదేళ్లలో దేశీయంగా రూ. 2.44 లక్షల కోట్ల విలువ చేసే టెలికం పరికరాల ఉత్పత్తి జరగగలదని అంచనా. టెలికం పీఎల్ఐ ద్వారా సుమారు 40,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. దీనితో దాదాపు రూ.3,000 కోట్ల మేర పెట్టుబడులు రానుండగా, రూ.17,000 కోట్ల మేర ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం సమకూరగలదని అంచనాలు ఉన్నాయి. దేశ, విదేశ కంపెనీలు.. చిన్న, మధ్య తరహా సంస్థలు దీని కింద దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస పెట్టుబడి పరిమితి.. ఎంఎస్ఎంఈలకు రూ.10 కోట్లుగాను, ఇతర సంస్థలకు రూ.100 కోట్లుగాను ఉంటుంది. స్థలం, నిర్మాణ వ్యయాలను పెట్టుబడి కింద పరిగణించరు. ఎరిక్సన్, నోకియా, హెచ్ఎఫ్సీఎల్ వంటి అంతర్జాతీయ టెలికం పరికరాల తయారీ సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు విస్తరించడంపై ఆసక్తిగా ఉన్నాయి. స్టీల్, ఆటో, జౌళి రంగాలు త్వరలో నోటిఫై ఆటో విడిభాగాలు, స్టీల్, జౌళి రంగాల్లో అమలుకుగాను ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని(పీఎల్ఐ) కేంద్రం త్వరలో నోటిఫై చేయనుంది. తద్వారా ఈ పథకం కింద ఆయా రంగాల్లో పెట్టుబడులకు సంబంధిత సంస్థలకు వీలుకలుగుతుంది. పథకం అమలుకు సంబంధించి ప్రకటించిన నోటిఫికేషన్ విధివిధానాలకు అనుగుణంగా సంస్థలు కేంద్రానికి దరఖాస్తు చేసుకోగలుగుతాయి. అనంతరం దరఖాస్తుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇప్పటికే ఫార్మా, ఐటీ హార్డ్‌వేర్ వంటి రంగాలకు పీఎల్ఐ నోటిఫై జరిగింది. ఆటో విడిభాగాలు, స్టీల్, జౌళి వంటి రంగాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు డీపీఐఐటీ(పారిశ్రామిక, అంతర్గత వాణిజాభివృద్ధి శాఖ) అదనపు కార్యదర్శి సుమితా దావ్రా గురువారం జరిగిన ఇండస్ట్రీ చాంబర్ పీహెచ్‌డీసీసీఐ వెబినార్‌లో వెల్లడించారు. భారత్ తయారీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో పటిష్టం చేయడానికి వీలుగా కేంద్రం ఐదేళ్ల కాలపరిమితికిగాను రూ.2 లక్షల కోట్ల విలువైన పీఎల్ఐ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 13 రంగాలకు ఈ పథకం కింద రాయితీలు వర్తిస్తాయి. ఏసీసీ బ్యాటరీ, సోలార్ మాడ్యూల్స్ విభాగాలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని కూడా కేంద్రం ఇటీవలే నిర్ణయించింది. సప్లై చైన్ సవాళ్ల పరిష్కారం, తయారీ రంగంలోకి భారీ విదేశీ పెట్టుబడులకు కూడా తగిన వ్యూహ రచన చేస్తున్నట్లు వెబినార్‌లో సుమితా దావ్రా పేర్కొన్నారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి పీఎల్ఐ స్కీమ్ దోహదపడుతుందన్నారు. చదవండి: భారీగా పెరుగుతున్న ఇంటర్నెట్ సగటు వినియోగం -
భయపడొద్దు.. సెల్ టవర్లు సురక్షితమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని టెలికాం టవర్లు సురక్షితమేనని టెలీ కమ్యూనికేషన్స్ విభాగం (డీఓటీ) స్పష్టం చేసింది. ఈ మేరకు మొబైల్ ఫోన్లతో పాటు వాటి బేస్ స్టేషన్ల నుంచి వెలువడే విద్యుదయస్కాంత క్షేత్రం (ఈఎంఎఫ్)తో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రజల్లో నెలకొన్న ఆందోళనపై డీఓటీ స్పందించింది. రాష్ట్రంలోని వివిధ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (టీఎస్పీలు) ఏర్పాటు చేసిన 4,245 బేస్ ట్రాన్స్‌రిసీవర్ యూనిట్లను (టవర్లు) జూన్ 2020 నుంచి ఫిబ్రవరి 2021 నడుమ పరీక్షించినట్లు డీఓటీ హైదరాబాద్ విభాగం వెల్లడించింది. వాటిలో ఒకటి మినహా మిగతా టవర్లన్నీ నిబంధనలకు లోబడే ఉన్నట్లు ప్రకటించింది. అపోహలు తొలగించేందుకు తరంగ్ సమాచార్ పేరిట ఓ వెబ్సైట్ ఏర్పాటు చేశామని, ఈఎంఎఫ్‌పై ఆన్లైన్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపింది.తెలంగాణ -
'5జీ'తో ఐటీ దిగ్గజాలకు కాసుల పంట
న్యూఢిల్లీ: టెలీ కమ్యూనికేషన్ రంగం భవిష్యత్ లో భారత ఐటీ దిగ్గజాలకు కాసుల పంట పండించనున్నది. కరోనా మహమ్మారి పుణ్యమా? అని 5జీ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. ఒకవేల కనుక ప్రపంచంలోని దేశాలన్నీ 5జీ సేవలను అందుబాటులోకి తీసుకోని వస్తే క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత కంపెనీలకు పెద్ద పెద్ద అవకాశాలు రానున్నాయి. ఈ 5జీ టెక్నాలజీ వల్ల మన దేశంలోని ఐటీ దిగ్గజాలకు 30 బిలియన్ డాలర్ల విలువైన అవకాశాలు లభిస్తాయని అంచనా. భారతదేశంలో 5జీ రంగంలో పని చేస్తున్న టెక్ మహీంద్రా వంటి ఐటీ దిగ్గజాలకు భారీగా లబ్ధి పొందనున్నాయి. తొలిదశలో టెలికాం ప్రొవైడర్ల నెట్వర్క్ ఆధునీకరణ, ఎక్విప్మెంట్ రూపకల్పన వంటి కార్యక్రమాలు చేపట్టాలి. టెక్నాలజీలో ఎటువంటి మార్పులు సంభవించిన పరికరాల తయారీదారులకు, సర్వీస్ ప్రొవైడర్లకు అవకాశాలు లభిస్తాయి. 5జీ టెక్నాలజీ వల్ల కొత్త ఉత్పత్తులను తయారు చేయడానికి, నూతన సేవలు అందుబాటులోకి తేవడానికి భారీగా వాల్యూక్రియేషన్ అవకాశాలు ఐటీ దిగ్గజాలకు లభిస్తాయని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కమ్యూనికేషన్స్, మీడియా అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇండస్ట్రీ గ్రూప్ అధ్యక్షుడు కమల్ భాడాడా వ్యాఖ్యానించారు. హై డెఫినిషన్ వీడియో కాన్ఫరెన్సింగ్ అండ్ సాఫ్ట్వేర్ కోసం టీసీఎస్ కసరత్తు చేస్తున్నట్లు కూడా పేర్కొన్నారు. చదవండి: వాహనదారులకు కేంద్రం తీపికబురు -
జియోఫోన్ యూజర్లకు బ్యాడ్ న్యూస్
ముంబయి: రిలయన్స్ జియో రూ.99, రూ.153, రూ.297, రూ.594 గల జియోఫోన్ ప్లాన్లను తొలగించింది. కేవలం ఈ ఆఫర్ జియోఫోన్ 4జీ ఫీచర్ ఫోన్లు వినియోగిస్తున్న యూజర్లకు మాత్రమే వర్తిస్తుందని గతంలో పేర్కొంది. అయితే మిగతా ప్లాన్ విషయంలో ఎటువంటి మార్పులు చేయలేదని సంస్థ పేర్కొంది . దీంతో పాటు ఐయూసీ చార్జీల నుంచి ఊరట కలిగించడానికి తమ వినియోగదారులకు 500 నాన్ జియో ఉచిత నిమిషాలను అందిస్తుంది. వీటితో పాటు ఈ ఉచిత నిమిషాలు అయిపోయాక ఐయూసీ రీచార్జ్ లు చేసుకోవడం ద్వారా ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేసుకోవచ్చు.(చదవండి: అరచేతిలో ఇమిడే ప్రొజెక్టర్) ప్రస్తుతం రూ.75, రూ.125, రూ.155, రూ.185 అనే నాలుగు జియోఫోన్ ప్లాన్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సంస్థ పేర్కొంది. ఈ నాలుగు ప్యాక్‌లు జియోఫోన్ ఆల్ ఇన్ వన్ ప్లాన్లలో భాగం. జియోఫోన్ యొక్క రూ.75 ప్లాన్ కింద ప్రతి రోజు 100ఎంబీ 4జీ డేటాతో పాటు జియో నుంచి జియోకు, ల్యాండ్ లైన్ ఫోన్లకు ఉచిత అపరిమిత కాలింగ్, జియో నుంచి ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేసుకోవడానికి 500 ఉచిత నిమిషాలు, 50 ఉచిత ఎస్ఎంఎస్ లను ఈ ప్లాన్ లో అందిస్తారు. వీటితో పాటు అదనంగా జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్ వంటి ప్రత్యేకమైన జియో యాప్స్ కు ఉచిత కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అలాగే రూ.125 ప్లాన్ కింద ప్రతి రోజు 500ఎంబి డేటా, 10 ఉచిత ఎస్ఎంఎస్ లతో పాటు ఇతర ఆఫర్స్ కూడా అందుతాయి. జియో రూ.155 ప్లాన్ కింద ప్రతి రోజు 1జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. జియో రూ.185 మొబైల్ ప్లాన్ కింద ప్రతి రోజు 2జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్ లు పొందనున్నారు. -
ఇన్ఫ్రాటెల్- అదానీ పోర్ట్స్ జూమ్
ముంబై, సాక్షి: వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు రికార్డులను బ్రేక్ చేస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 460 పాయింట్లు జంప్‌చేసి 44,537ను తాకింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. నిఫ్టీ 135 పాయింట్లు ఎగసి 13,061 వద్ద ట్రేడవుతోంది. వెరసి దేశీ స్టాక్ మార్కెట్ చరిత్రలో తొలిసారి 13,000 పాయింట్ల మార్క్‌ను నిఫ్టీ అధిగమించింది. ఈ నేపథ్యంలో సానుకూల వార్తల కారణంగా మౌలిక సదుపాయాల కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, టెలికం టవర్ల దిగ్గజం భారతీ ఇన్ఫ్రాటెల్ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ట్రాన్స్‌పోర్టేషన్, రవాణా మౌలిక సదుపాయాల విభాగంలో దేశీయంగా అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌కు 14వ ర్యాంక్ లభించినట్లు డోజోన్స్ సస్టెయినబిలిటీ ఇండైసెస్(డీజేఎస్ఐ) తాజాగా పేర్కొంది. ఎస్ఏఎం కార్పొరేట్ సస్టెయినబిలిటీ ఆధారంగా డోజోన్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లో అదానీ పోర్ట్స్‌కు మాత్రమే చోటు దక్కినట్లు తెలియజేసింది. దీంతో డీజేఎస్ఐ ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే పలు ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఇకపై అదానీ పోర్ట్స్ కౌంటర్‌పై దృష్టి పెట్టే వీలున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అదానీ పోర్ట్స్ కౌంటర్‌కు డిమాండ్ నెలకొంది. వెరసి అదానీ పోర్ట్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 7 శాతంపైగా జంప్‌చేసింది. రూ. 402ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 5.5 శాతం ఎగసి రూ. 396 వద్ద ట్రేడవుతోంది. భారతీ ఇన్ఫ్రాటెల్ ఇండస్ టవర్స్‌తో విలీనం పూర్తి చేసుకోవడం ద్వారా భారతీ ఇన్ఫ్రాటెల్ అతిపెద్ద టవర్ల కంపెనీగా ఆవిర్భవించింది. ఇండస్ టవర్స్ కంపెనీ పేరుతో ఏర్పాటైన సంయుక్త సంస్థలో భారతీ ఎయిర్‌టెల్‌కు 36.7 శాతం, వొడాఫోన్ గ్రూప్‌నకు 28.12 శాతం చొప్పున వాటా లభించింది. ఈ బాటలో పీఎస్ ఏషియా హోల్డింగ్ ఇన్వెస్ట్మెంట్స్ మారిషస్‌కు 3.25 శాతం వాటా దక్కింది. టవర్ల రంగంలో అతిపెద్ద కంపెనీగా ఆవిర్భవించిన నేపథ్యంలో భారతీ ఇన్ఫ్రాటెల్ కౌంటర్‌కు డిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఈ షేరు 5.3 శాతం జంప్‌చేసి రూ. 230 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 238 వరకూ ఎగసింది. విలీనం పూర్తయిన వార్తలతో గత మూడు రోజులుగా ఈ కౌంటర్ జోరు చూపుతోంది. వెరసి 28 శాతంపైగా లాభపడింది. -
వొడాఫోన్‌కు అమెజాన్, వెరిజాన్ దన్ను!
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంతో కిందా మీదా పడుతున్న టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాలో ఇన్వెస్ట్ చేయడంపై అంతర్జాతీయ దిగ్గజాలు అమెజాన్, వెరిజాన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో నిలిపివేసిన చర్చల ప్రక్రియను పునరుద్ధరించినట్లు సమాచారం. సవరించిన స్థూల ఆదాయ (ఏజీఆర్) బాకీలు చెల్లించడానికి టెలికం సంస్థలకు సుప్రీంకోర్టు పదేళ్ల వ్యవధి ఇవ్వడం.. వొడాఫోన్ ఐడియా (వీఐఎల్)లో పెట్టుబడులపై చర్చలను పునరుద్ధరించడానికి తోడ్పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సుమారు 4 బిలియన్ డాలర్ల మేర అమెజాన్, వెరిజాన్ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. నిధుల కొరతతో నానాతంటా లు పడుతున్న వొడా ఐడియాకు ఈ పెట్టుబడులు లభిస్తే ఇప్పటిదాకా నిల్చిపోయిన నెట్వర్క్ అప్‌గ్రేడింగ్ పనులు తిరిగి ప్రారంభించుకోవచ్చు. అలాగే ప్రభుత్వానికి కట్టాల్సిన బాకీలను కూడా కట్టేందుకు కాస్త తోడ్పాటు లభించవచ్చు. నిధుల సమీకరణ అంశంపై వొడాఫోన్ ఐడియా బోర్డు సెప్టెంబర్ 4న (శుక్రవారం) సమావేశం కానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు 50,000 కోట్ల మేర ఏజీఆర్ బాకీలు జియో చౌక ఆఫర్ల ధాటికి తట్టుకోలేక పోటీ టెల్కోలు కుదేలైన సంగతి తెలిసిందే. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం .. మే నెలలో భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా యూజర్ల సంఖ్య చెరి 47 లక్షలకు పైగా తగ్గిపోగా.. జియో యూజర్ల సంఖ్య మాత్రం 37 లక్షల మేర పెరిగింది. ప్రత్యర్థి సంస్థలతో పోటీతో పాటు ఏజీఆర్ బాకీల భారం కూడా తోడవడంతో వొడాఫోన్ ఐడియా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. టెలికం సంస్థల్లో అత్యధికంగా ఈ కంపెనీయే కేంద్రానికి బాకీలు కట్టాల్సి ఉంది. ఏజీఆర్ లెక్కల ప్రకారం వొడాఫోన్ ఐడియా ఇంకా రూ. 50,000 కోట్లకు పైగా స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజు బాకీలు కట్టాల్సి ఉందని అంచనా. కంపెనీ ఇప్పటిదాకా రూ. 7,854 కోట్లు కట్టింది. జూన్ క్వార్టర్లో బాకీల కింద ప్రొవిజనింగ్ చేయడం, వన్ టైమ్ చార్జీలను లెక్కించాల్సి రావడంతో జూన్ త్రైమాసికంలో వొడాఫోన్ ఐడియా ఏకంగా రూ. 25,460 కోట్ల మేర నష్టాలను నమోదు చేసింది. ఏజీఆర్ బాకీల కారణంగా వొడాఫోన్ ఐడియాలో పెట్టుబడులపై చర్చల విషయంలో అనిశ్చితి నెలకొంది. సుప్రీం కోర్టు తాజా ఆదేశాల కారణంగా కాస్త స్పష్టత రావడంతో అమెజాన్, వెరిజాన్ మళ్లీ చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. షేరు రయ్.. అమెజాన్, వెరిజాన్ పెట్టుబడుల వార్తలతో వొడాఫోన్ ఐడియా షేరు గురువారం ఏకంగా 30% ఎగిసింది. బీఎస్ఈలో సుమారు 27% పెరిగి రూ. 12.56 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో 29.96 శాతం పెరిగి 52 వారాల గరిష్ట స్థాయి అయిన రూ. 12.88 రేటును కూడా తాకింది. గతంలో గూగుల్ కూడా ఆసక్తి టెక్ దిగ్గజం గూగుల్.. వొడాఫోన్ ఐడియాలో 5 శాతం వాటా కొనుగోలు చేయనుందంటూ గతంలో వార్తలు వచ్చాయి. అయితే, దాని పోటీ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లో (రిలయన్స్ గ్రూప్‌లో భాగం) 4.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకుంది. జియో, ఫేస్బుక్, గూగుల్ కలవడం వల్ల ప్రత్యర్థి సంస్థలపై ఒత్తిడి మరింత పెరుగుతుందని టెక్నాలజీ, టెలికం రంగాల విశ్లేషకులు భావిస్తున్నారు. జియోతో ప్రతీ విషయంలో పోటీపడలేకపోయినప్పటికీ టెలిఫోన్ సర్వీసులకు మించి కొంగొత్త ఉత్పత్తులు, సేవలు అందించడంపై వొడాఫోన్ ఐడియా దృష్టి పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతంలో కూడా పలు ఆఫ్‌లైన్, ఆన్లైన్ కార్యక్రమాల కోసం అమెజాన్‌తో వొడాఫోన్ ఐడియా చేతులు కలిపింది. అమెరికన్ ఆన్లైన్ రిటైల్ దిగ్గజమైన అమెజాన్‌కు భారత్‌లో గణనీయ స్థాయిలో కార్యకలాపాలు ఉన్నాయి. ఇక అమెరికాకే చెందిన టెలికం దిగ్గజం వెరిజాన్ .. తన మీడియా, ఆన్లైన్ విభాగం ఓత్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తోంది. మరో దేశీ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌తో వెరిజాన్ పలు అంశాలపై చేతులు కలిపింది. ఇటీవలే వెరిజాన్ భాగస్వామ్యంతో వ్యాపార రంగ కస్టమర్ల కోసం బ్లూజీన్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ను భారత్‌లో ఆవిష్కరించింది. -
త్వరలో రిలయెన్స్ 5జీ నెట్వర్క్
ముంబై: రిలయెన్స్ జియోతో టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తు దిగ్గజ కంపెనీగా రిలయెన్స్ పేరు గాంచింది. ఈ నేపథ్యంలో రిలయెన్స్ జియో త్వరలోనే 5జీ టెక్నాలజీతో వినియోగదారులను ఆకట్టుకోనుంది. మౌళిక సదుపాయాల కల్పనకు అధిక పప్రాధాన్యత ఇవ్వనున్నట్లు జియో తెలిపింది. 5జీ టెక్నాలజీని వినియోగదారులకు అందించడానికి రిలయెన్స్ తీవ్రంగా కృషి చేస్తున్న నేపథ్యంలో టెక్నాలజీకి అయ్యే ఖర్చు తగ్గనున్నట్లు నిపుణులు తెలిపారు. టెక్నాలజీలో అగ్రస్థానంలో కొనసాగుతున్న జియో 5 జీని అతి త్వరలో తీసుకురానున్నట్లు సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఇటీవల కాలంలో రిలయెన్స్ సంస్థ జియో మార్ట్, జియో ఫైబర్, రిలయెన్స్ డిజిటల్ తదితర విభాగాలుగా వినియోగదారులకు మెరుగైన సేవలను అందిస్తుంది. కాగా రిలయోన్స్ దూకుడుతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు రిలయెన్స్‌తో జత కట్టడానికి క్యూ కట్టాయి. ముఖ్యంగా ఐటీ దిగ్గజాలు గూగుల్, ఫేస్బుక్, క్వాల్కమ్ తదితర ఐటీ సంస్థలు ఇప్పటికే రిలయెన్స్‌తో కలిసి పనిచేయనున్నాయి. చదవండి: జియో మార్ట్ దూకుడు: ఉచిత డెలివరీ -
బాకీలపై మరో మాట లేదు..
న్యూఢిల్లీ: సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్) ఆధారంగా టెల్కోలు కట్టాల్సిన బకాయిలకు సంబంధించి టెలికం శాఖ (డాట్) లెక్కలపై మరో మాట మాట్లాడటానికి లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. వీటిని మరోసారి మదింపు చేయాలన్న టెల్కోల అభ్యర్థనను పట్టించుకునే ప్రసక్తే లేదని పేర్కొంది. ఏజీఆర్ బాకీల చెల్లింపునకు వ్యవధినిచ్చే అంశంపై తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది. వివరాల్లోకి వెళితే.. ఏజీఆర్ ఫార్ములా ప్రకారం స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజు బకాయిల కింద టెలికం సంస్థలు దాదాపు రూ. 1.6 లక్షల కోట్లు చెల్లించాల్సి రానున్న సంగతి తెలిసిందే. స్వీయ మదింపు ప్రకారం కొంత కట్టిన టెల్కోలు.. తమ బాకీలు డాట్ చెబుతున్నంత స్థాయిలో లేవని, పైగా ఆర్థిక పరిస్థితులు బాగా లేనందున బకాయిలను కట్టేందుకు 20 ఏళ్ల దాకా వ్యవధినివ్వాలని సుప్రీం కోర్టును కోరుతున్నాయి. దీనిపై సోమవారం విచారణ సందర్భంగా అటు ప్రభుత్వం, ఇటు టెలికం సంస్థల వాదనలను సుప్రీం కోర్టు విన్నది. బాకీల పునఃమదింపు అంశాన్ని టెల్కోలు ప్రస్తావించగా.. ‘రీ–అసెస్మెంట్ విషయంలో మరొక్క క్షణం కూడా వాదనలు వినే ప్రసక్తే లేదు. ఏజీఆర్ నిర్వచనం ఖరారు చేశాం. దాని ఆధారంగా డాట్ బాకీల నోటీసులు కూడా పంపింది. దీన్ని మళ్లీ తెరిచే ప్రశ్నే లేదు‘ అని స్పష్టం చేసింది. ఇక, దివాలా తీసే పరిస్థితులు ఉన్నాయంటున్న కంపెనీల వాదనల్లో వాస్తవాలను కూడా పరిశీలిస్తామని పేర్కొంది. -
లాభాల మోత మోగిస్తున్న టెలికాం షేర్లు
టెలికాం రంగ షేర్లు సోమవారం లాభాల మోత మోగిస్తున్నాయి. ఈ రంగానికి చెందిన వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎంటీఎన్ఎల్, టాటా సర్వీసెస్, భారతీ ఎయిర్టెల్ షేర్లు 13శాతం వరకు లాభపడ్డాయి. అత్యధికంగా వోడాఫోన్ ఐడియా షేరు 13శాతం ర్యాలీ చేసింది. ఏజీఆర్ బకాయిల కింద టెలికాం విభాగానికి శుక్రవారం మరో రూ.1000 కోట్లు చెల్లించడంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది. మరోవైపు నేటి మధ్యాహ్నం 2గంటలకు సుప్రీం కోర్టులో ఏజీఆర్ అంశంపై విచారణ జరగనుంది. ఏజీఆర్ బకాయిలు చెల్లింపునకు టెలికాం సంస్థలు 10ఏళ్లలో గడువు కోరిన నేపథ్యంలో సుప్రీం కోర్టు స్పందన ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆస్తకి నెలకొంది. ఏజీఆర్ కేసుపై జూలై 18న సుప్రీం కోర్టు మాట్లాడుతూ ... వోడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌తో సహా ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు తప్పనిసరిగా "సహేతుకమైన చెల్లింపు ప్రణాళిక"ను కోర్టుకు సమర్పించాలని తెలిపింది. అలాగే బోన్‌ఫైడ్ కొరకు కొంత మొత్తంలో చెల్లింపు చేయాలని అలాగే గత పదేళ్లకు సంబంధించిన ఖాతా బుక్స్లను ఫైల్ చేయాల్సిందిగా టెలికాం కంపెనీలను ఆదేశించింది. రూ.1000 కోట్లు చెల్లించిన వోడాఫోన్: సవరించిన స్థూల ఆదాయం బకాయి కింద మరో రూ.1000 కోట్లు చెల్లించినట్లు టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మొత్తాన్ని టెలికాం విభాగానికి జమ చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుత చెల్లింపుతో ఇప్పటి వరకు ఏజీఆర్ బకాయి కింద మొత్తం రూ.7854 కోట్లు చెల్లించినట్లు కంపెనీ తెలిపింది. ఇది వరకు ఏజీఆర్ బకాయి కింద 3విడుతల్లో మొత్తం రూ.6584 కోట్ల చెల్లించినటన్లు వోడాఫోన్ పేర్కోంది. ఏజీఆర్ బకాయిల అంశంపై గతనెల జరిగిన విచారణ సందర్భంగా తదుపరి విచారణ నాటికి కొంతమొత్తం చెల్లించాలని సుప్రీం కోర్టు టెలికాం కంపెనీలకు సూచించింది. ఈ నేపథ్యంలో ఈ మొత్తాన్ని వొడాఫోన్ ఐడియా జమ చేసింది. ఏజీఆర్ బకాయి కింద రూ.58 వేల కోట్లు వొడాపోన్ ఐడియా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. -
చైనాకు కళ్లెం ఎలా?
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాను అన్నిరకాలుగా నిలువరించేందుకు భారత్ గట్టి చర్యలే తీసుకుంటోంది. ఇందులో భాగంగా 59 చైనా యాప్స్‌ను నిషేధించింది. తద్వారా చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న ఉద్యమం సాగుతున్న నేపథ్యంలో ఇది కీలక పరిణామమే. ఇప్పటికే చైనాపై ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకునే ప్రణాళికలను భారత్ అమలు చేస్తోంది. దేశీయంగా హ్యాండ్సెట్స్ తయారీ మొదలైన వాటిని ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇవ్వడం మొదలైంది. అయితే, చైనాకు చెక్ పెట్టేందుకు ఇవి సరిపోతాయా అంటే ఇంకా చర్యలు అవసరమనే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దేశీ కంపెనీలు ఎక్కువగా చైనాపై ఆధారపడాల్సి వస్తున్న టెలికం, ఆటోమొబైల్ పరికరాల విషయంలోనూ దేశీ పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా డ్రాగన్‌కు చెక్ చెప్పవచ్చని పరిశ్రమవర్గాలు అంటున్నాయి. టెలికం రంగం.. వార్షికంగా చూస్తే చైనా నుంచి భారత్ గతేడాది దిగుమతి చేసుకున్న సెల్ఫోన్ల సంఖ్య 33 శాతం తగ్గింది. దేశీ సంస్థలు క్రమంగా పుంజుకోవడానికి ఇది శుభసూచనే. ప్రస్తుతం భారత స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్ పరిమాణం రూ. 2 లక్షల కోట్ల పైగానే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇది మరింత వృద్ధి చెందనుంది. అయితే, ఈ మార్కెట్‌ను 70–80 శాతం శాసిస్తున్నది చైనా కంపెనీలే. భారీ అమ్మకాలతో చైనా కంపెనీలు గట్టిగా పాతుకుపోయాయి. కానీ దేశీయంగా తయారీకి ఊతం లభిస్తున్నందున భారతీయ సంస్థలు క్రమంగా ఈ మార్కెట్లో చొచ్చుకుపోయేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు తెలిపారు. ఈ విభాగంలో చైనా బ్రాండ్లను, పరికరాల దిగుమతులను నిషేధించిన పక్షంలో టెలికం రంగం రూపురేఖలే మారిపోతాయని పేర్కొన్నారు. చైనా ప్రమేయం లేకుండా చూసే దిశగా టెండర్లపై మరోసారి కసరత్తు చేయాలంటూ ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ని కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. 4జీ, 5జీ సర్వీసుల్లోకి బీఎస్ఎన్ఎల్ విస్తరిస్తున్న నేపథ్యంలో చైనా పరికరాలను ఉపయోగించవద్దంటూ బీఎస్ఎన్ఎల్కు స్పష్టమైన సూచనలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అటు భవిష్యత్ విస్తరణ ప్రణాళికల్లో చైనా టెలికం పరికరాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలంటూ ప్రైవేట్ రంగ భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలకు కూడా టెలికం శాఖ (డాట్) అధికారికంగా ఆదేశాలు కూడా ఇ చ్చే అవకాశాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆటోమోటివ్ రంగం.. ఇక దేశీ ఆటోమొబైల్ మార్కెట్లో కూడా భారత్ గట్టిగా నిలదొక్కుకునేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం భారత స్థూల దేశీయోత్పత్తిలో ఆటో పరికరాలు, డిజైన్, అభివృద్ధి, ఈ–బస్సులు, విద్యుత్ వాహనాలు మొదలైన వాటి వాటా 7.5 శాతం స్థాయిలో మాత్రమే ఉంది. ప్రత్యామ్నాయ మార్కెట్లు ఉన్నప్పటికీ దేశీ సంస్థలు ఎక్కువగా చైనా నుంచే దిగుమతులు చేసుకుంటున్నాయి. కార్మికులు అత్యధికంగా అవసరమయ్యే ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పించగలదు. ఆటోమోటివ్ విభాగంలో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు రాబోయే రోజుల్లో గణనీయంగా పెరగనున్నాయి. వచ్చే అయిదేళ్లలో వాహనాలు, పరికరాల ఎగుమతులను భారీగా ప్రోత్సహించే దిశగా ఇటీవలే భారీ పరిశ్రమల శాఖ పలు చర్యలు తీసుకుంది. ఇక ఇప్పటికే చైనా కంపెనీలకు ఇచ్చిన ఆర్డర్లను కూడా కంపెనీలు, రాష్ట్రాల ప్రభుత్వాలు పునఃసమీక్షిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితమే 2000 పైచిలుకు ఈ–బస్సుల కోసం మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి ఒక చైనా కంపెనీకి భారీ ఆర్డర్లు దక్కాయి. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో వీటిని రద్దు చేయాలంటూ అన్ని వర్గాల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ప్రకటనలు రావాల్సి ఉంది. దేశీయంగా గట్టి ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నందున ఈ ఆర్డర్లను భారతీయ కంపెనీలకే ఇచ్చి, దిగుమతులను నిషేధించడం వల్ల ఈ రంగంపై సానుకూల ప్రభావం ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. దేశీ మార్కెట్‌ను పటిష్టం చేయడంతో పాటు ఇది ఎకానమీ వృద్ధికి, స్థానికంగా ఉపాధి కల్పనకు ఊతమివ్వగలదని చెబుతున్నాయి. పోర్టుల వద్ద నిలిచిన ఫార్మా ఉత్పత్తులు హైదరాబాద్: దేశంలో పలు పోర్టుల వద్ద ఫార్మా ముడిసరుకులు నిలిచిపోయాయి. కస్టమ్స్ క్లియరెన్సు కోసం ఇవి ఎదురుచూస్తున్నాయి. ముడి సరుకు సమయానికి చేరకపోవడంతో దేశీయంగా తయారీ విషయంలో ఇక్కడి కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా తమకు సభ్య కంపెనీల నుంచి కాల్స్ వస్తున్నాయని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (ఫార్మెక్సిల్) తెలిపింది. క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్న ఉత్పత్తుల్లో అత్యధికం చైనా నుంచి దిగుమతి అయినవేనని కేంద్ర వాణిజ్య శాఖకు చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. కీలక ముడి పదార్థాలు, ఇంటర్మీడియేట్స్, యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ ఏ కారణంగా పోర్టుల వద్ద నిలిచిపోయాయో పరిశ్రమకు తెలియదంటూ ఫార్మెక్సిల్ చైర్మన్ దినేశ్ దువా కేంద్ర ఫార్మాస్యూటికల్స్ సెక్రటరీకి లేఖ రాశారు. కీలక ఉత్పత్తులు సైతం.. మెడికల్ డివైసెస్, గ్లూకోమీటర్స్, స్ట్రిప్స్ సైతం పోర్టుల వద్ద నిలిచిపోయాయి. అలాగే కోవిడ్–19 విస్తృతి నేపథ్యంలో కీలకంగా మారిన ఇన్ఫ్రారెడ్ థెర్మామీటర్స్, పల్స్ ఆక్సీమీటర్స్ వంటి డయాగ్నోస్టిక్స్ క్రిటికల్ డివైసెస్ సైతం వీటిలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వెంటనే జోక్యం చేసుకోవాల్సిందిగా లేఖలో దినేశ్ దువా కోరారు. -
ఆ డిమాండ్ వెనక్కి తీసుకుంటాం
న్యూఢిల్లీ: ఏజీఆర్ బాకీల విషయంలో టెలికంయేతర ప్రభుత్వ రంగ సంస్థలకు ఊరట లభించనుంది. దాదాపు రూ. 4 లక్షల కోట్లు కట్టాలంటూ ఇచ్చిన నోటీసులో 96% మొత్తానికి డిమాండ్‌ను ఉపసంహరించుకుంటామంటూ సుప్రీం కోర్టుకు కేంద్ర టెలికం శాఖ (డాట్) తెలియజేసింది. లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం ఫీజుల లెక్కింపునకు టెలికం కంపెనీల సవరించిన ఆదాయాలను (ఏజీఆర్) పరిగణనలోకి తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు గతేడాది అక్టోబర్‌లో ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగానే టెలికం సంస్థలతో పాటు స్పెక్ట్రం తీసుకున్న గెయిల్, పవర్‌గ్రిడ్, ఆయిల్ ఇండియా వంటి పీఎస్‌యూలకు రూ. 4 లక్షల కోట్ల మేర బాకీలు కట్టాలని డాట్ నోటీసులు పంపింది. తమ ప్రధాన వ్యాపారం టెలికం కార్యకలాపాలు కావు కాబట్టి తమకు ఇది వర్తించదంటూ నోటీసులను సవాలు చేస్తూ అవి సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు, ఏజీఆర్ బాకీల విషయంలో భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ తదితర ప్రైవేట్ టెల్కోలు దాఖలు చేసిన అఫిడవిట్లకు కౌంటరు దాఖలు చేసేందుకు మరికాస్త సమయం ఇవ్వాలంటూ సుప్రీంను డాట్ కోరింది. టెల్కోలు తమ ఆర్థిక వివరాలను సమర్పించాలని ఆదేశించిన అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను జూలై మూడో వారానికి వాయిదా వేసింది. -
దేశీ టెల్కోల్లో..టెక్‌చల్!
న్యూఢిల్లీ: దేశీ టెలికం సంస్థల్లో వాటాలు దక్కించుకోవడంపై అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలు దృష్టి పెడుతున్నాయి. పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో మైక్రోసాఫ్ట్; వొడాఫోన్ ఐడియాపై గూగుల్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే వీటి వివరాలు వెల్లడవుతాయని పరిశ్రమవర్గాల సమాచారం. మైక్రోసాఫ్ట్–జియో జోడీ.. రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్, టెలికం వ్యాపార విభాగాన్ని విడగొట్టి ఏర్పాటు చేసిన జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, అబుధాబికి చెందిన ముబాదలా ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కూడా రంగంలోకి దిగాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌లో మైక్రోసాఫ్ట్ సుమారు 2.5% వాటాల కోసం దాదాపు 2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయవచ్చని సమాచారం. దేశీయంగా అతి పెద్ద టెలికం సేవల సంస్థల్లో ఒకటైన జియో కూడా జియో ప్లాట్‌ఫామ్స్‌లో భాగమే. ఇప్పటిదాకా ఫేస్బుక్, సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్ వంటి దిగ్గజాలు దాదాపు 10 బిలియన్ డాలర్లపైగా ఇన్వెస్ట్ చేసింది. ఈ పెట్టుబడుల ఊతంతో జియోను విదేశాల్లో లిస్టింగ్ చేసే యోచనలో కూడా రిలయన్స్ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రిలయన్స్ జియో, మైక్రోసాఫ్ట్ మధ్య ఒక భాగస్వామ్యం ఉంది. క్లౌడ్ సేవల మైక్రోసాఫ్ట్ అజూర్‌కు సంబంధించి ఒప్పందం ఉంది. మరోవైపు, జియోలో పెట్టుబడులు పెట్టడంపై ముబాదలా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా వచ్చిన పెట్టుబడులను బట్టి జియో ప్లాట్‌ఫామ్స్ సంస్థ విలువ దాదాపు రూ. 5.61 లక్షల కోట్లుగా ఉంది. వొడా–గూగుల్ జట్టు.. ఆర్థిక సంక్షోభ పరిస్థితులతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియాలో ఇన్వెస్ట్ చేయాలని సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దాదాపు 5 శాతం వాటాలు కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని వివరించాయి. మరోపక్క, గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ కూడా అటు జియోలోనూ వాటాలు కొనుగోలు చేసేందుకు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ ఇవి జరుగుతూనే ఉన్నప్పటికీ, డీల్ విషయంలో మాత్రం ప్రత్యర్థి సంస్థలతో పోటీలో గూగుల్ వెనుకబడిందనేది పరిశ్రమవర్గాల మాట. వేల కోట్ల నష్టాలు, రుణాల భారంతో మనుగడ ప్రశ్నార్థకంగా మారిన వొడాఫోన్ ఐడియాలో ఒకవేళ గూగుల్ గానీ ఇన్వెస్ట్ చేసిన పక్షంలో కంపెనీకి గణనీయంగా ఊరట లభించనుంది. టెలికం శాఖ గణాంకాల ప్రకారం లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల కింద కేంద్రానికి వొడాఫోన్ ఐడియాకు దాదాపు రూ. 53,000 కోట్లు కట్టాల్సి ఉంది. వొడాఫోన్ ఐడియాలో ఇన్వెస్ట్ చేసిన పక్షంలో జియో సహా ఫేస్‌బుక్‌తో కూడా గూగుల్ పోటీ ఎదుర్కొనాల్సి రానుంది. భారత్ కోసం ప్రత్యేక ప్రణాళికలు వేస్తూనే ఉన్న గూగుల్.. తమ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, మొబైల్ పేమెంట్స్ సేవలు మొదలైన మార్గాల్లో దేశీ మార్కెట్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఎయిర్‌టెల్‌లోనూ విదేశీ పెట్టుబడులు.. టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌లో కూడా ఇటీవలే అంతర్జాతీయ దిగ్గజాలు ఇన్వెస్ట్ చేశాయి. ప్రమోటరు సంస్థ భారతి టెలికం ఇందులో 2.75 శాతం వాటాలను విక్రయించింది. అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు సొసైటీ జనరల్, బ్లాక్‌రాక్, నోర్జెస్ బ్యాంక్, ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్స్ మొదలైనవి వీటిని కొనుగోలు చేశాయి. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వంటి సంస్థలూ వాటాలను దక్కించుకున్నాయి. ఈ షేర్ల విక్రయం ద్వారా భారతి టెలికం రూ. 8,433 కోట్లు సమీకరించింది. -
లాక్‌డౌన్‌ను ఎదుర్కొనే సత్తా ఉన్న రంగమిదే..!
కోవిడ్ సంబంధిత అంతరాయాతో విశ్లేషకులు పలు కంపెనీ షేర్ల వృద్ధి అంచనాలను, టార్గెట్ ధరలను తగ్గిస్తున్నారు. దీంతో ఇటీవల వారాల్లో అనేక షేర్లు రీ-రేటింగ్‌ను చూస్తున్నాయి. కానీ ఇంత సంక్షోభంలో ఒక రంగానికి చెందిన కంపెనీలు దుమ్ముదులుపుతున్నాయి. చాలామంది ఇన్వెస్టర్లు ఈ రంగంపై మక్కువ చూపిస్తున్నారు. అదే టెలికాం రంగం.... ఇటీవల కాలం వరకు ఈ రంగం నానా ఇబ్బందులతో సతమతమైతూ వచ్చింది. కానీ ఒక్కమారుగా ఈ రంగం బంగారుబాతుగా మారిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువ వ్యవధిలో డబ్బులు డబుల్ కావడానికి టెలికాం రంగం ఉత్తమైన ఎంపికగా కొందరు మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లాక్డౌన్ సమయంలో డేటా, వాయిస్ వినియోగం పెరగడం, గతేడాది చివరి నెలలో టారీఫ్‌ల పెంపుతో పాటు భవిష్యత్తులో కంపెనీలు టారీఫ్‌లు పెంచవచ్చనే అంచనాలతో బ్రోకరేజ్ సంస్థలు టెలికాం రంగ షేర్లకు బుల్లిష్ రేటింగ్‌ను ఇస్తున్నాయి. రాబోయే కాలంలో ఈ కంపెనీల ఆదాయాలు పెరగవచ్చని అంచనా వేస్తున్నాయి. టెలికాం కంపెనీలు రానున్న పదేళ్ల వరకు వార్షిక ప్రాతిపాదికన 14శాతం చక్రీయ వార్షిక వృద్ది నమోదు చేయగలవని యాంబిట్ క్యాపిటల్ ఛైర్మన్ వివేకానంద్ అభిప్రాయపడ్డారు. ఈయన వోడాఫోన్ ఐడియా షేరుపై బాగా బుల్లిష్‌గా ఉన్నారు. త్వరలో పోస్ట్‌పెయిడ్ ధరలను పెంచడంతో పాటు ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే ప్రీమియం వినియోగదారులు అధికంగా ఉండటం వోడాఫోన్ ఐడియాకు కలిసొస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో షేరుకు ‘‘బై’’ రేటింగ్ కేటాయింపుతో పాటు, ఏడాది కాలానికి టార్గెట్ ధరను రూ.19గా నిర్ణయించారు. ఈ టార్గెట్ ధర షేరు ప్రస్తుత ట్రేడింగ్‌ను నుంచి ఏకంగా 248శాతం అధికంగా ఉంది. ఇదే షేరు మార్చి కనిష్టం నుంచి ఏకంగా 73శాతం పెరిగింది. టెలికాం రంగంలో ఆదాయాల విజిబిలిటి మెరుగుపడుతున్నందున టెలికాం షేర్లు రానున్న రోజుల్లో చెప్పుకోదగిన ర్యాలీ చేసే అవకాశం ఉందని నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ డిప్యూటీ సిఐఓ సైలేష్ రాజ్ భన్ అభిప్రాయపడ్డారు. భారతీ ఎయిర్టెల్ షేరుపై అధిక బ్రోకరేజ్ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించాయి. మోర్గాన్ స్టాన్లీతో సహా మొత్తం 7 కంపెనీలు అవుట్పర్ఫామ్ రేటింగ్, 16 కంపెనీలు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించినట్లు రాయిటర్స్ నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల కంపెనీ నిరుత్సాహకరమైన త్రైమాసికపు ఫలితాలను ప్రకటించినప్పటికీ.., మోర్గాన్ స్టాన్లీ సేరు ఓవర్‌వెయిట్ రేటింగ్‌ను కేటాయించడంతో పాటు షేరు టార్గెట్ ధరను రూ.525 నుంచి రూ.725కు పెంచింది. భారతీ ఎయిర్టెల్ షేరు ఈ క్యాలెండర్ అన్ని బ్లూచిప్ కంపెనీల్లో కెల్లా అత్యధిక ర్యాలీని చేసింది. వార్షిక ప్రాతిపదికన 31శాతం లాభపడింది. -
ఎయిర్‌టెల్‌కు భారీ నష్టాలు
న్యూఢిల్లీ : టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కంపెనీకి ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్‌కు రూ.5,237 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. వన్‌టైమ్ స్పెక్ట్రమ్ చార్జీలకు సంబంధించి తాజా తీర్పు కారణంగా రూ.7,004 కోట్లు చెల్లించడంతో ఈ నష్టాలు ఈ స్థాయిలో పెరిగాయని కంపెనీ తెలిపింది. గత ఏడాది మార్చి క్వార్టర్లో రూ.107 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఆదాయం రూ.20,602 కోట్ల నుంచి 15% వృద్ధితో రూ.23,723 కోట్లకు పెరిగింది. ఒక్కో వినియోగదారుడి నుంచి లభించే సగటు రాబడి (ఏఆర్పీయూ) రూ.123 నుంచి రూ.154కు పెరిగింది. ఈ కంపెనీ గత ఏడాది డిసెంబర్లోటెలికం సేవల ధరలను పెంచింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ షేర్ 2.6 శాతం నష్టంతో రూ.540 వద్ద ముగిసింది. -
టెల్కోలకు లాక్ డౌన్ కష్టాలు..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ భయాల కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో టెలికం సంస్థలు, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు కొత్త సమస్యలు వచ్చి పడ్డాయి. ఓవైపు కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అమలు చేస్తుండటం, మరోవైపు ఇంటి పట్టునే ఉండాల్సి రావడంతో ప్రజలు కాలక్షేపం కోసం ఎక్కువగా ఇంటర్నెట్నే వినియోగిస్తుండటంతో డేటా వినియోగం భారీగా పెరిగిపోతోంది. నెట్‌వర్క్‌లపై భారం పడి స్పీడ్ తగ్గిపోయే పరిస్థితులు ఉంటున్నాయి. గడిచిన కొద్ది వారాల్లో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల (ఐఎస్పీ) నెట్వర్క్ ద్వారా ట్రాఫిక్ ఏకంగా 30 శాతం పైగా ఎగిసినట్లు టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంటర్నెట్ స్పీడ్ తగ్గిపోకుండా చూసేందుకు టెలికం సంస్థలు, ఐఎస్పీలు నానా తంటాలు పడుతున్నాయి. వర్క్ ఫ్రం హోం చేసే వారికి, అత్యవసర సర్వీసులకు ఆటంకం కలగకుండా టెలికం సంస్థలు మరిన్ని చర్యలు తీసుకుంటున్నాయి. డేటా వినియోగం భారీగా పెరిగినా ఇంటర్నెట్ స్పీడ్ తగ్గకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నాయి. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు ఈ మేరకు తమ యూజర్లకు భరోసా కల్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. నెట్‌వర్క్‌లపై అదనపు భారం పడినా సమర్థంగా సర్వీసులు అందించగలిగేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయా సంస్థలు తెలిపాయి. పరిస్థితి మరింత దిగజారితే అత్యవసర ప్రణాళికలు అమలు చేసేలా సర్వసన్నద్ధంగా ఉండేందుకు.. టవర్ల సంస్థలు, టెలికం ఇన్ఫ్రా సంస్థలు, సర్వీస్ ప్రొవైడర్లతో ఎప్పటికప్పుడు సంప్రతింపులు జరుపుతున్నామని ఎయిర్టెల్ సీఈవో గోపాల్ విఠల్ తెలిపారు. జియో బేసిక్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు.. భౌగోళికంగా అనువైన ప్రాంతాల్లో దాదాపు 10 ఎంబీపీఎస్ దాకా స్పీడ్‌తో ప్రాథమిక బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఇస్తామంటూ రిలయన్స్ జియో ప్రకటించింది. ప్రస్తుతం వీటికి సర్వీస్ చార్జీలేమీ వసూలు చేయబోమని తెలిపింది. నామమాత్రపు రీఫండబుల్ డిపాజిట్‌తో హోమ్ గేట్‌వే రూటర్లు కూడా అందిస్తామని ఒక ప్రకటనలో వివరించింది. ఇక వాయిస్, డేటా వినియోగ ధోరణులను పరిశీలిస్తున్నామని, లాక్డౌన్ వ్యవధిలో పెరిగే డిమాండ్‌కు తగ్గట్లుగా సర్వీసులు అందించగలమని వొడాఫోన్ ఐడియా ధీమా వ్యక్తం చేసింది. ఓటీటీ ప్లాట్‌ఫాంలతో సంప్రతింపులు.. డేటా ట్రాఫిక్ సమస్యను అధిగమించే చర్యల్లో భాగంగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ వంటి ఓవర్–ది–టాప్ (ఓటీటీ) సంస్థలతోనూ టెల్కోలు చర్చలు జరిపాయి. సర్వీసులను క్రమబద్ధీకరించుకోవాలని, వీడియో క్వాలిటీని తగ్గించాలని కోరాయి. ‘హై డెఫినిషన్ (హెచ్డీ) నుంచి స్టాండర్డ్ డెఫినిషన్ (ఎస్డీ) స్థాయికి వీడియో నాణ్యతను తగ్గించిన పక్షంలో డేటా ట్రాఫిక్ కనీసం 15–20 శాతం తగ్గుతుంది. తద్వారా నెట్‌వర్క్‌పై ఆ మేరకు భారం కూడా తగ్గుతుంది‘ అని టెలికం పరిశ్రమ వర్గాలు వివరించాయి. ‘డిజిటల్ వినియోగం ఒక్కసారిగా ఎగియడంతో టెలికం సర్వీస్ ప్రొవైడర్స్ (టీఎస్పీ) నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఇప్పటికే భారీగా ఒత్తిడి పెరిగిపోయింది. ప్రస్తుత కీలక సమయంలో భారాన్ని తగ్గించుకునేందుకు, నెట్‌వర్క్‌లు సజావుగా పనిచేసేలా చూసేందుకు టీఎస్పీలు పలు చర్యలు తీసుకుంటున్నాయి‘ అని వీడియో స్ట్రీమింగ్ సంస్థలకు టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ఒక లేఖ రాసింది. వీడియో నాణ్యత స్థాయిని హెచ్డీ నుంచి ఎస్డీకి తగ్గించడం ద్వారా నెట్‌వర్క్‌లపై డేటా ట్రాఫిక్‌పరమైన ఒత్తిళ్లు తగ్గేందుకు సహకరించాలని కోరింది. దీనికి వీడియో స్ట్రీమింగ్ సంస్థలు కూడా సుముఖత వ్యక్తం చేశాయి. సర్వీస్ నాణ్యత దెబ్బతినకుండానే భారత్‌లో టెలికం నెట్‌వర్క్‌పై భారం 25 శాతం దాకా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. అటు సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ తమ వెబ్సైట్లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వీడియోల బిట్ రేటును తాత్కాలికంగా తగ్గిస్తామని పేర్కొంది. అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి సంస్థలు కూడా టెలికం నెట్‌వర్క్‌పై భారం పడకుండా బిట్ రేటును తగ్గిస్తున్నాయి. ప్రజలకు కూడా సీవోఏఐ విజ్ఞప్తి.. ప్రజలు కూడా అత్యవసర సర్వీసులకు విఘాతం కలగనివ్వకుండా.. నెట్‌వర్క్‌ను బాధ్యతాయుతంగా వాడాలని సీవోఏఐ విజ్ఞప్తి చేసింది. ‘రిమోట్ వర్కింగ్, ఆన్లైన్ విద్యాసేవలు, డిజిటల్ వైద్య సేవలు, చెల్లింపులు తదితర ఇతరత్రా కీలకమైన సర్వీసులకు విఘాతం లేకుండా ఇంటర్నెట్, నెట్‌వర్క్‌ను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం‘ అని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ పేర్కొన్నారు. -
ఫోన్ చేయగానే దగ్గుతున్న శబ్దం..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్... ఇప్పుడు సెల్ ఫోన్లకు తాకిందా?. అదేంటి సెల్ ఫోన్లకు కరోనా వైరస్ అనుకుంటున్నారా?. ఈ వైరస్ గురించి, నివారణ చర్యలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ అడుగు ముందుకు వేసింది. మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే ముందుగా ...దగ్గుతున్న శబ్దం.. ఆ తర్వాత దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చేతులు శుభ్రం చేసుకోవడం, జన సమ్మర్థం ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లకుండా ఉండటం వంటి సూచనలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం 30 సెకన్ల నిడివి గల ఓ ఆడియో క్లిప్‌ను రూపొందించింది. (కరోనా భయం వీడి.. మానవత్వం చాటారు) మీరు ఎవరికి ఫోన్ చేసినా ముందుగా దగ్గు, ఆ తర్వాత జాగ్రత్తలు పాటించడనే సందేశాన్ని వినిపిస్తోంది. ఏ మొబైల్ వినియోగదారుడైనా ఈ సందేశం వినకుండా తప్పించుకునే వీలు లేకుండా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలిచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలా అన్ని ఫోన్లకూ ఒకే కాలర్ ట్యూన్ వచ్చిన దాఖలాలు లేవు. దీంతో పలువురు వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొందరికి ఫోన్ చేస్తే మాత్రం మాములుగానే రింగ్ సౌండ్ వినిపిస్తోందని పలువురు వినియోగదారులు చెబుతున్నారు. (కరోనా జయించాడు.. రికార్డు సాధించాడు!) రోజుకు ఓ 20 ఫోన్ కాల్స్ చేస్తే... ప్రతిసారి ఈ కాలర్ ట్యూన్‌ను వినాల్సిందేనా అని పలువురు వాపోతున్నారు. మరోవైపు కరోనా ట్యూన్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అంతేకాకుండా కరోనా సందేశం వినిపించకుండా ...ఏం చేయాలనే దానిపై సుచనలు, సలహాలు కూడా ఇస్తున్నారు కొందరు. అయితే కరోనా ట్యూన్ తమ ప్రాణానికి వచ్చిందిరా బాబు అంటూ కొంతమంది విసుక్కుంటున్నారు కూడా. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 45 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. (వాటి కారణంగానే కోవిడ్ వ్యాప్తి!) -
బాకీలు వెంటనే కట్టేయండి
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏజీఆర్ సంబంధ మిగతా బాకీలను కూడా వెంటనే కట్టేయాలంటూ టెల్కోలను కేంద్రం ఆదేశించింది. భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు ఇతర ఆపరేటర్లకు టెలికం శాఖ (డాట్) ఈ మేరకు లేఖ రాసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ’మరింత జాప్యం లేకుండా’ మిగతా బకాయిలు చెల్లించడంతో పాటు స్వీయ మదింపు గణాంకాలు తదితర వివరాలు కూడా సమర్పించాలని డాట్ సూచించినట్లు వివరించాయి. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) ఫార్ములాకు అనుగుణంగా డాట్ లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీల కింద టెల్కోలు దాదాపు రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి ఉంది. అయితే, తమ స్వీయ మదింపు ప్రకారం డాట్ చెబుతున్న దానికంటే తాము కట్టాల్సినది చాలా తక్కువే ఉంటుందని టెల్కోలు చెబుతున్నాయి. ఇప్పటిదాకా రూ. 26,000 కోట్లు మాత్రమే చెల్లించాయి. పీఎస్‌యూలకు మినహాయింపు.. ఏజీఆర్ బాకీల కేసు నుంచి టెలికంయేతర ప్రభుత్వ రంగ సంస్థలను సుప్రీం కోర్టు తప్పించినట్లు సమాచార శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే పార్లమెంటుకు తెలియజేశారు. తగు వేదికల ద్వారా దీన్ని పరిష్కరించుకోవాలని అత్యున్నత న్యాయస్థానం సూచించినట్లు రాతపూర్వక సమాధానంలో ఆయన పేర్కొన్నారు. సొంత అవసరాల కోసం తీసుకున్న స్పెక్ట్రంలో కొంత భాగాన్ని థర్డ్ పార్టీలకు ఇవ్వడం ద్వారా ఆదాయం ఆర్జించాయన్న ఉద్దేశంతో గెయిల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు ఏజీఆర్‌పరంగా రూ. 2.7 లక్షల కోట్లు కట్టాలంటూ డాట్ ఆదేశించిన సంగతి తెలిసిందే. -
టెలికంలో అసాధారణ సంక్షోభం..
న్యూఢిల్లీ: సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్) ప్రాతిపదికన టెల్కోలు భారీ బకాయిలు కట్టాల్సి రావడం .. టెలికం పరిశ్రమలో గతంలో ఎన్నడూ చూడని విధంగా, అసాధారణ సంక్షోభం తలెత్తిందని భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం బాకీలను కట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని, సాధ్యమైనంత త్వరగా మిగతా చెల్లింపులు జరుపుతామని ఆయన చెప్పారు. తమకు మార్చి 17 దాకా సమయం ఉన్నప్పటికీ.. ఈలోగానే కట్టేస్తామని వివరించారు. గురువారం కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ అయిన తర్వాత మిట్టల్ ఈ విషయాలు తెలిపారు. భేటీ సందర్భం గా పరిశ్రమపై భారీ పన్నుల భారం ఉంటోందని, వీటిని తగ్గించాలని ఆయన కోరారు. మరో రూ. 1,000 కోట్లు కట్టిన వొడాఫోన్ ఏజీఆర్ బకాయిల కింద టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా గురువారం మరో రూ. 1,000 కోట్లు.. టెలికం శాఖకు (డాట్) చెల్లించింది. సోమవారమే కంపెనీ 2,500 కోట్లు కట్టిన సంగతి తెలిసిందే. వొడాఫోన్ ఐడియా మొత్తం రూ. 53,000 కోట్ల బాకీలు కట్టాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, టాటా టెలీసర్వీసెస్ నుంచి మిగతా బాకీల వసూలుకు ఒకటి.. రెండు రోజుల్లో నోటీసులు పంపించనున్నట్లు వివరించాయి. డాట్ లెక్కల ప్రకారం టాటా టెలీ సర్వీసెస్ దాదాపు రూ. 14,000 కోట్లు కట్టాల్సి ఉండగా..ఆ సంస్థ సోమవారం నాడు రూ. 2,197 కోట్లు మాత్రమే కట్టింది. ఏజీఆర్ లెక్కల మదింపులో కేంద్రం.. ఇక ఏజీఆర్ బాకీలు డాట్ చెబుతున్న దానికంటే చాలా తక్కువగా ఉంటాయని టెల్కోలు చెబుతున్న నేపథ్యంలో టెలికం శాఖ ఈ అంశంపై దృష్టి సారించింది. మార్చి 17లోగా టెల్కోల లెక్కలను టెలికం శాఖ మదింపు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్ని టెల్కోల గణాంకాలను టెస్ట్ చెక్ చేయనున్నప్పటికీ.. మొత్తం బాకీలు కట్టేశామంటున్న సంస్థలతో ముందుగా ఈ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు వివరించాయి. డాట్ సొంత లెక్కలు, టెల్కోల లెక్కలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను కనిపెట్టేందుకు ఇది ఉపయోగపడనుంది. టెలికం సంస్థలు కట్టాల్సిన లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను లెక్కించేందుకు టెలికంయేతర కార్యకలాపాల ద్వారా కూడా వచ్చిన ఆదాయాలను పరిగణనలోకి తీసుకోవచ్చంటూ డాట్‌కు అనుకూలంగా సుప్రీం కోర్టు గతేడాది ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం టెలికం సంస్థలు ఏకంగా రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి రానుంది. గతంలో విధించిన జనవరి 23 డెడ్‌లైన్‌ను టెల్కోలు ఉల్లంఘించడంపై ఆగ్రహించిన సుప్రీం కోర్టు తాజాగా దీనిపై విచారణను మార్చి 17కి వాయిదా వేసింది. అందరికీ ప్రయోజనంపై కేంద్రం దృష్టి.. ఏజీఆర్ బాకీల విషయంలో అటు సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేస్తూనే.. ఇటు టెలికం రంగం.. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టెలికం సంస్థలు ఇప్పటిదాకా రూ. 16,000 కోట్ల ఏజీఆర్ బాకీలు చెల్లించినట్లు వివరించాయి. మరో 7–8 రోజుల్లో మరిన్ని చెల్లింపులు జరుపుతామని టెల్కోలు చెప్పాయని ఓ అధికారి పేర్కొన్నారు. టెల్కోల బాకీల్లో వడ్డీ, పెనాల్టీలే అధికం.. టెలికం సంస్థలు లైసెన్సు ఫీజు బాకీల కింద కట్టాల్సినది రూ. 22,589 కోట్లని.. అయితే వడ్డీ, పెనాల్టీలు కలిపితే ఇది రూ. 92,641 కోట్లకు పెరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు కట్టాల్సినది రూ. 16,746 కోట్లు ఉంటుందని పేర్కొన్నాయి. భారతి ఎయిర్టెల్ బాకీలు రూ. 5,529 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 6,871 కోట్లు, టాటా గ్రూప్ రూ. 2,321 కోట్లు, టెలినార్ (ప్రస్తుతం ఎయిర్‌టెల్‌లో విలీనమైంది) రూ. 529 కోట్లు, బీఎస్ఎన్ఎల్ రూ. 614 కోట్లు, ఎంటీఎన్ఎల్ బకాయిలు రూ. 876 కోట్లు ఉంటాయని వివరించాయి. ఈ లెక్కలను జూలైలో తయారు చేశారని, తాజాగా మరోసారి లెక్కింపు ప్రక్రియ జరుగుతోందని ఓ అధికారి తెలిపారు. డాట్ లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజుతో పాటు టెలికం సంస్థలు దాదాపు రూ. 55,054 కోట్ల మేర స్పెక్ట్రం యూసేజి చార్జీలు కూడా కట్టాల్సి ఉంది. -
తీవ్ర ఒత్తిడిలో టెలికాం రంగం : సునీల్ మిట్టల్
న్యూఢిల్లీ: గత ఐదేళ్లుగా దేశీయ టెలికాం రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుందని ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతి ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ బుధవారం తెలిపారు. దేశ అభివృద్ధిలో టెలికాం రంగం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. టెలికం రంగాన్ని వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం నిర్మాత్మకమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద టెల్కోలు బకాయిలను చెల్లించాలని టెలికాం శాఖ ఆదేశించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు, ప్రభుత్వ డెడ్లైన్ల నేపథ్యంలో మొబైల్ దిగ్గజం భారతి ఎయిర్టెల్ ప్రభుత్వానికి బకాయిపడిన రూ 10,000 కోట్లను టెలికాం శాఖకు చెల్లించింది. స్వయం మదింపు కసరత్తు పూర్తయిన తర్వాత మిగిలిన బకాయిల చెల్లింపు పూర్తి చేస్తామని కంపెనీ వెల్లడించింది. -
బడ్జెట్లో మాకు ఉపశమనం లేదు: కాయ్
సాక్షి, న్యూఢిల్లీ : సంక్షోభంలో ఉన్న టెలికాం పరిశ్రమకు బడ్జెట్లో ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(కాయ్) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ విమర్శించారు. మౌలిక సదుపాయాల కల్పనలో కూడా టెలికాం రంగాన్ని చేర్చకపోవడం మరింత అసంతృప్తి కలిగించిందని మాథ్యూస్ అన్నారు. రూ.1.47 లక్షల కోట్ల ఏజీఆర్ బకాయి భారంతో ఇబ్బందులు పడుతున్న టెలికాం రంగానికి ఉపశమనం లభిస్తుందని ఆశించిన తమకు నిరాశే మిగిలిందన్నారు. దీనిపై మరింత వివరాలను పరిశీలించాల్సి వుందని పేర్కొన్నారు.స్మార్ట్ మీటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారనీ అది తమ రంగానికి ఎలా ఉపయోగపడుతుందో చూడాలన్నారు. మరోవైపు 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తన ఆదాయ అంచనాను రెట్టింపు చేసి రూ .1.33 లక్షల కోట్లకు చేర్చింది. అప్పుల బారిన పడిన టెలికం రంగం నుంచి వచ్చే ఆదాయ అంచనాను ప్రభుత్వం రెండు రెట్లు పెంచింది. ప్రధానంగా సర్దుబాటు చేసిన స్థూల ఆదాయ బకాయిల (ఏజీఆర్) ద్వారా ఈ ఆదాయాన్ని అందుకోవాలని ప్లాన్ . కాగా ఏజీఆర్ చెల్లింపులు, లైసెన్స్ ఫీజు, అధిక స్పెక్ట్రం ఛార్జీలు (అంతర్జాతీయ ధరలతో పోల్చితే 30-40 శాతం అధికమని) టెల్కోలు వాదిస్తున్నాయి. లైసెన్స్ ఫీజు,ఎస్యూపీ లెవీలపై కొంత ఊరట లభిస్తుందని టెలికాం పరిశ్రమ కేంద్ర బడ్జెట్‌పై ఆశలు పెట్టుకుంది. (బడ్జెట్ 2020 : కేంద్ర బడ్జెట్ హైలైట్స్) -
ద్రవ్యోల్బణానికి, టెలికాం షాక్
సాక్షి,ముంబై: భారత కేంద్ర బ్యాంకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అనూహ్యంగా వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం పలువురి ఆర్థికవేత్తలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ గురువారం ముంబైలో మాట్లాడుతూ టెలికాం చార్జీలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణ రేటు మరింత పెరిగే అవకాశముందని అన్నారు. ద్రవ్యల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్బీఐ రెపోరేటును(5.15) మార్చలేదని, కానీ భవిష్యత్తులో అధిక ద్రవ్యోల్బణ రేటు, ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రధానంగా ద్రవ్యోల్బణం పెరగడానికి కారణం ఆహార ద్రవ్యోల్బణం అని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా నాలుగో క్వార్టర్లో(జనవరి-మార్చి) ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ ఏడాది క్యూ2లో 4 శాతానికి పడిపోయిన ద్రవ్యోల్బణం మరింత క్షీణిస్తుందని అంచనావేశారు. వచ్చే ఏడాది క్యూ2 నాటికి 3.8 శాతంగా ఉండవచ్చని పేర్కొన్నారు. మరోవైపు మూడు ప్రయివేటు టెలికాం కంపెనీలు వోడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్టెల్, జియోలు తమ టారీఫ్ ప్లాన్లు, ప్రీ-పెయిడ్ టారిఫ్ ప్లాన్లను 40-50 శాతం పెంచాయని అన్నారు. మూడేళ్ల తర్వాత ఇంత భారీ స్థాయిలో చార్జీలు పెరిగాయని అన్నారు. ప్రస్తుతం టెలికాం రంగం ఆర్థిక ఒత్తిడి ఎదుర్కొంటోందని అన్నారు. ప్రస్తుతం ఏడీఆర్‌కు (సవరించిన స్థూల ఆదాయం) సంబంధించిన కేసు సుప్రీం కోర్టులో ఉందని అన్నారు. కాగా వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ సవరించిన రేట్లు ఇప్పటికే అమల్లోకి రాగా జియో రేట్లు మాత్రం శుక్రవారం నుండి అమలులోకి రానున్న సంగతి తెలిసిందే. -
మూడు టెల్కోలకు ప్రభుత్వ ప్రోత్సాహకం
ముంబై: దేశంలోని టెలికం రంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని వొడాఫోన్ ఐడియా సీఈఓ రవీందర్ తక్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం తక్కర్ మీడియాతో మాట్లాడుతూ మూడు టెల్కోలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని అన్నారు. ఏజీఆర్‌పై(సవరించిన స్థూల ఆదాయం) సుప్రీంకోర్టు తీర్పు టెలికం కంపెనీలకు పెనుభారంగా మారిందని అన్నారు. టెలికం పరిశ్రమ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ప్రభుత్వం ఏజీఆర్ పై సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. ఏజీఆర్ విషయమై కోర్టులో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయాలని వొడాఫోన్ ఐడియా సన్నాహాలు చేస్తోందని అన్నారు. కాగా టెలికం రంగానికి సెల్యులార్ ఆపరేషన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సిఫార్సులు చేసిందని ఆయన గుర్తు చేశారు. అయితే తాము ఏ బ్యాంక్‌లకు బకాయిలు లేమని తక్కర్ స్పష్టం చేశారు. ఫోర్ ప్రైసింగ్‌కు సంబంధించి ప్రభుత్వం సమీక్షించి, టెలికం రంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఏజీఆర్ ప్రభావంతో వొడాఫోన్ ఐడియా ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో 50,921 కోట్ల నికర నష్టాలు వచ్చాయని వొడాఫోన్ ఐడియా పేర్కొంది. కాగా ఇంత వరకు ఏ భారత కంపెనీ కూడా ఈ స్థాయిలో నష్టాలను ప్రకటించకపోవడం గమనార్హం. నిబంధనల ప్రకారం ఏజీఆర్‌లో నిర్దిష్ట మొత్తాన్ని లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీల కింద ప్రభుత్వానికి టెల్కోలు చెల్లించాల్సిన విషయం తెలిసిందే. -
5జీ టెక్నాలజీ భావితరాలకు వరం
సాక్షి, హైదరాబాద్: టెలికమ్యూనికేషన్ రంగంలో 5జీ ప్రవేశంతో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతుందని అమెరికన్ సైబర్ నిపుణుడు హెరాల్డ్ ఫర్ష్‌టాగ్ అన్నారు. 5జీ, సైబర్ భద్రత అంశాలపై రకరకాల పరిశోధనలు చేసిన హెరాల్డ్ ఈ అంశాలపై పలు పుస్తకాలు రాశారు. బుధవారం బేగంపేటలోని అమెరికన్ కాన్సులేట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాబోవు తరాలకు 5జీ వరంలా మారుతుందని అన్నారు. మనం గతంలో ఊహించనంత స్పీడ్, డేటా ట్రాన్స్ఫర్, అత్యాధునిక అప్లికేషన్లు, వైర్లెస్ టెక్నాలజీతో కమ్యూనికేషన్ల రంగంలో 5జీ సరికొత్త విప్లవానికి నాంది పలుకుతుందని తెలిపారు. 5జీ రాకతో వ్యాపార, వ్యవసాయ, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని పేర్కొన్నారు. ముఖ్యంగా వాతావరణం, వర్షపాతం, ఉష్ణోగ్రత నదుల సమాచారం, జంతువుల కదలికలు, పంటలకు చీడలు తదితర వివరాలను ఇప్పటికంటే వేగంగా తెలుసుకునే వీలు కలుగుతుందన్నారు. మంచితోపాటు దుష్ప్రభావాలు.. 5జీ రాకతో మంచితోపాటు, దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని హెరాల్డ్ ఆందోళన వ్యక్తం చేశారు. పలు దేశాల్లో గూఢచర్యానికి పాల్పడేవారు వీలైనంత ఎక్కువ సమాచారాన్ని ఇతరులకు చేరేవేసే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా విద్రోహ, ఉగ్ర చర్యలకూ ఆస్కారం ఉంటుందని అన్నారు. కమ్యూనికేషన్, రక్షణ, రవాణా రంగాలకు సంబంధించిన వ్యవస్థలను హ్యాక్ చేసే ప్రమాదాలు లేకపోలేదన్నారు. గతంలో ఉక్రెయిన్‌లో పోలీసు కమ్యూనికేషన్ వ్యవస్థను కొందరు రష్యన్ హ్యాకర్లు స్తంభింపజేసారని గుర్తుచేశారు. ప్రస్తుతం చైనా 5జీ సాంకేతికత అభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. ఆదేశానికి చెందిన పలు హువాయ్, జెడ్‌టీఈ తదితర కంపెనీలు ఇప్పటికే చైనాలో 5జీ సేవలు అందించడం మొదలుపెట్టాయని తెలిపారు. దీంతోపాటు ఇతర దేశాలకు కూడా ఆ సాంకేతికతను ఎగుమతి చేస్తోందన్నారు. అయితే, చైనాకు చెందిన కంపెనీల వల్ల భారతదేశానికి ఎలాంటి సైబర్ ముప్పు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ, ఆ దేశానికి చెందిన పలు స్మార్ట్ఫోన్లలో భద్రతకు సంబంధించిన లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయని తెలిపారు. ఈ కారణంగా ఆ తరహా ఫోన్లు త్వరగా హ్యాకయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో సైబర్ భద్రత ప్రపంచ దేశాలన్నింటికీ సవాల్‌గా మారనుందని, అందుకే అనుమానాస్పద మాల్వేర్ సాఫ్ట్వేర్ల దిగుమతిని అమెరికా 2010 నుంచే నిలిపివేసిందని పేర్కొన్నారు. -
ఫిబ్రవరిలో జియో, బీఎస్ఎన్ఎల్దే హవా
న్యూఢిల్లీ: దేశీ టెలికం సబ్స్క్రైబర్ల సంఖ్య ఫిబ్రవరి చివరినాటికి 120.50 కోట్లకు చేరింది. జనవరిలో ఈ సంఖ్య 120.37 కోట్లుగా ఉన్నట్లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) వెల్లడించింది. రిలయన్స్ జియో, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ జోరు కారణంగానే వినియోగదారుల సంఖ్య ఈమేరకు పెరిగినట్లు ట్రాయ్ పేర్కొంది. ఈ రెండు దిగ్గజ సంస్థలు కలిపి ఫిబ్రవరిలో 86.39 లక్షల కస్టమర్లను జోడించగా.. మిగిలిన టెలికం కంపెనీలు 69.93 లక్షల వైర్లెస్ కస్టమర్లను కోల్పోయాయి. అత్యధికంగా వినియోగదారులను కోల్పోయిన కంపె నీల జాబితాలో.. వొడాఫోన్ ఐడియా తొలి స్థానంలో ఉన్నట్లు తేలింది. ఒక్క జియోనే ఫిబ్రవరిలో 77.93 లక్షల వినియోగదారులను జోడించి.. అనతికాలంలోనే ఏకంగా 30 కోట్ల సబ్స్క్రైబర్ల రికార్డును సొంతం చేసుకుంది. ఇదే సమయంలో బీఎస్ఎన్ఎల్ 9 లక్షల మందిని జోడించి కస్టమర్ల బేస్‌ను 11.62 కోట్లకు చేర్చింది. ఈ అంశంపై బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘మా సేవల పట్ల కస్టమర్లకు ఉన్న విశ్వాసం వల్లనే బేస్ పెరిగింది. సంస్థ 3జీ నెట్వర్క్ మరింత మెరుగుపడింది’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు వొడాఫోన్ ఐడియా 57.87 లక్షల సబ్స్క్రైబర్లను కోల్పోయింది. ఫిబ్రవరి చివరినాటికి ఈ సంస్థ వినియోగదారుల సంఖ్య 40.93 కోట్లకు తగ్గినట్లు ట్రాయ్ తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. -
బ్యాలెన్స్ ఉన్నా సేవలు ఎలా ఆపేస్తారు..
న్యూఢిల్లీ: టెలికం సర్వీసులను యథాప్రకారం పొందాలంటే ప్రతి నెలా తప్పనిసరిగా కనీస రీచార్జ్ చేసుకోవాలంటూ యూజర్లకు టెల్కోలు మెసేజీలు పంపిస్తుండటంపై టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ స్పందించింది. తమ ప్రీ–పెయిడ్ అకౌంట్స్‌లో తగినంత బ్యాలెన్స్ ఉన్నా టెల్కోలు ఈ తరహా మెసేజీలు పంపిస్తున్నాయంటూ సబ్‌స్క్రయిబర్స్ నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో ఆపరేటర్లకు ట్రాయ్ అక్షింతలు వేసింది. అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్నా సర్వీసులు డిస్కనెక్ట్ ఎలా చేస్తారంటూ ప్రశ్నించింది. తగినంత ప్రీ–పెయిడ్ బ్యాలెన్స్ ఉన్న కస్టమర్లకు సర్వీసులను తక్షణమే డిస్కనెక్ట్ చేయొద్దంటూ టెల్కోలను ఆదేశించింది. ‘టారిఫ్‌లు, ప్లాన్ల విషయంలో సాధారణంగా మేం జోక్యం చేసుకోము. కానీ అకౌంట్లో తగినంత బ్యాలెన్స్ ఉన్నా కూడా సర్వీసులు నిలిపివేస్తామంటూ యూజర్లను టెల్కోలు హెచ్చరిస్తుండటం.. మాత్రం సరికాదు’ అని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి టెలికం సంస్థలకు మంగళవారమే ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఆపరేటర్లతో గతవారమే భేటీ అయిన ట్రాయ్.. ఈ వివాదాన్ని సమగ్రంగా పరిశీలిస్తోంది. ఈలోగా ‘ప్రస్తుత ప్లాన్ వేలిడిటీ ఏ రోజుతో ముగిసిపోతుందన్నది, మినిమం రీచార్జ్ ప్లాన్ సహా అందుబాటులో ఉన్న ప్లాన్స్ అన్నింటి గురించీ సబ్స్క్రయిబర్స్కు స్పష్టంగా, పారదర్శకంగా తెలియజేయాలి. ప్రీ–పెయిడ్ అకౌంట్లో బ్యాలెన్స్ ఉంటే దానితో సదరు ప్లాన్స్ ఎలా కొనుగోలు చేయొచ్చ న్నదీ వివరంగా తెలపాలి‘ అని టెల్కోలను ట్రాయ్ ఆదేశించింది. 72 గంటల్లోగా ఈ విషయాలను ఎస్ఎంఎస్ ద్వారా యూజర్లకు తెలియజేయాలని సూచించింది. అప్పటిదాకా కనీస రీచార్జ్ మొత్తానికి సరిసమానంగా అకౌంట్లో బ్యాలెన్స్ ఉన్న పక్షంలో సర్వీసులు డిస్కనెక్ట్ చేయరాదంటూ ఆదేశించింది. -
కొత్త టెలికాం పాలసీ : 40 లక్షల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుడుతూ కొత్త టెలికాం విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. జాతీయ టెలి కమ్యూనికేషన్ పాలసీ 2018ని బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ(ఎన్డీసీపీ) 2018 త్వరలోనే అమల్లోకి తీసుకురానుంది. 40 లక్షల ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ఈ కొత్త విధానాన్ని రూపొందించామని కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. సెకనుకు 50 మెగా బిట్స్(ఎంబీపీఎస్) వేగం, అందరికీ సె బ్రాడ్ బాండ్ సేవలను అందించేలా ఈ కొత్త విధానాన్ని డిజైన్ చేసినట్టు చెప్పారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వవ్యాప్తి, స్థితిస్థాపకంగా, సురక్షితమైన, సరసమైన డిజిటల్ కమ్యూనికేషన్ సేవలను అందించాలనేది తమ లక్ష్యమని కేంద్ర సమాచార మంత్రి తెలిపారు. అంతేకాదు టెలికాంరంగంలో పెట్టుబడులను పెంచడంతో పాటు 5జీ టెక్నాలజీ సాయంతో హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను మెరుగుపర్చడం, అందుబాటు ధరల్లో సేవలను తీసుకురావడమే లక్ష్యమన్నారు. 2020నాటికి అన్ని గ్రామ పంచాయతీల్లో ఒక మెగా బిట్స్(ఎంబీపీఎస్)వేగంతో, 2022నాటికి 10మెగా బిట్స్ వేగంతో బ్రాడ్‌బాండ్ సేవలను విస్తరించనున్నామన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్స్ రంగంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించనున్నట్టు సిన్హా వెల్లడించారు. తద్వారా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇండెక్స్‌లో భారత్‌ను టాప్ 50దేశాల్లో ఒకటిగా నిలపాలని యోచిస్తున్నట్లు సిన్హా పేర్కొన్నారు. 2017లో 134 దేశాలతో అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ ఆవిర్భవించింది. -
ట్రెండ్ సృష్టించిన జియో : హ్యాపీ బర్త్‌డే
ముంబై : సరిగ్గా రెండేళ్ల క్రితం.. టెలికాం మార్కెట్‌ను హడలెత్తిస్తూ ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియోను ఎవరూ మర్చిపోయి ఉండరు. ముఖ్యంగా యువత. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గారాలపట్టి ఇషా అంబానీ, పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ ఆలోచన... జియో రూపంలో ఓ సంచలనానికి తెరలేపింది. ఆ క్షణాన మొదలైన జియో ట్రెండ్... ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దేశీయ మార్కెట్లోనే కాకుండా... ప్రపంచవ్యాప్తంగా జియో తానేంటో నిరూపించుకుంటూ.. అంతకంతకు పెరిగిపోతూనే ఉంది. నేడు(సెప్టెంబర్ 5) రిలయన్స్ జియో తన రెండో వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో ఇప్పటి వరకు దేశీయ టెలికాం సర్వీసులపై చూపిన ప్రభావమెంతో ఓ సారి తెలుసుకుందాం... జియో ఎంట్రీ తర్వాత మొబైల్ డేటా వినియోగం భారత్‌లో నెలకు 20 కోట్ల జీబీ నుంచి 370 కోట్ల జీబీకి పెరిగింది. కేవలం జియో కస్టమర్లే 240 కోట్ల జీబీ డేటాను వినియోగిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. జియో లాంచ్ అయిన నెలల్లోనే, ప్రపంచంలోనే నెంబర్ కంపెనీగా ఎదిగింది. కేవలం 170 రోజుల్లో 10 కోట్ల మంది కస్టమర్లను తన సొంతం చేసుకుంది. ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లను జియో తన ఖాతాలో వేసుకుంది. ఇలా తన నెట్‌వర్క్‌ను పెంచుకుంటూ పోతూ.. 2018 జూన్ 30 నాటికి 21.5 కోట్ల మందికి పైగా కస్టమర్లను చేరుకుంది. భారత్‌లో ఎల్టీఈ కవరేజ్ ఎక్కువగా జియోకే ఉంది. 99 శాతం భారత జనాభాను త్వరలో జియోనే కవర్ చేయబోతుంది. అన్ని టారిఫ్ ప్లాన్లపై ఉచిత అపరిమిత కాలింగ్ ఆఫర్ చేసిన కంపెనీ జియోనే. అప్పటి వరకు ఏ కంపెనీ కూడా అలా ఆఫర్ చేయలేదు. జియో తీసిన ఈ అపరిమిత సంచలనంతో, మిగతా అన్ని కంపెనీలు కూడా ఉచితాల బాట పట్టాయి. డేటాను ధరలను కూడా తగ్గించాయి. జియో లాంచ్ తర్వాత, 250 రూపాయల నుంచి 10వేల రూపాయల మధ్యలో ఉన్న ఒక్క జీబీ డేటా ధర, ప్రస్తుతం 15 రూపాయలకు తగ్గింది. అంటే అంతకముందు డేటా ఛార్జీల బాదుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జియో లాంచింగ్ తర్వాత డేటా ధరలు భారీగా కుప్పకూలి, సామాన్యుడికి చేరువలో ఇంటర్నెట్ వచ్చేసింది. ఇప్పటికీ కూడా జియో తీసుకొస్తున్న కొత్త కొత్త టారిఫ్ ప్లాన్లతో ఇతర టెల్కోల గుండెల్లో పరుగులు పెడుతున్నాయి. ఆయా కంపెనీలు కూడా జియో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టిన వెంటనే, దానికి కౌంటర్‌గా టారిఫ్ ధరలను తగ్గిస్తూ పోతున్నాయి. ఇలా టెలికాం మార్కెట్లో అసాధారణమైన పోటీ నెలకొంది. జియో దెబ్బకు చాలా కంపెనీలు మూత పడటం, మరికొన్ని కంపెనీలు విలీనమవడం జరిగింది. 4జీ నెట్వర్క్ కవరేజ్‌లో జియోనే ఆధిపత్య స్థానంలో ఉన్నట్టు ట్రాయ్ స్పీడ్‌టెస్ట్ పోర్టల్ వెల్లడించింది. జియో ఎంట్రీ అనంతరం, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు యూజర్ బేస్ పెరిగింది. అంటే పరోక్షంగా ఈ కంపెనీలకు కూడా జియో బాగా సహకరించింది. జియో కార్యకలాపాలు లాంచ్ అయినప్పటి నుంచి గూగుల్, ఫేస్‌బుక్‌లకు భారత్ మోస్ట్ యాక్టివ్ మార్కెట్‌గా మారింది. ఎల్వైఎఫ్ బ్రాండ్ కింద వాయిస్ఓవర్ ఎల్టీఈ డివైజ్‌లను కూడా రిలయన్స్ రిటైల్ లాంచ్ చేసింది. జియో అరంగేట్రం తర్వాత ఈ డివైజ్‌ల సరుకు రవాణా పెరిగింది. ఫీచర్ ఫోన్ మార్కెట్లోనూ జియో సంచలనానికి తెరలేపింది. జియోఫోన్ పేరుతో కొత్త ఫీచర్ ఫోన్‌ను ప్రవేశపెట్టి, మరింత మంది కస్టమర్లను ఆకట్టుకుంది. ఇటీవలే ఫీచర్ ఫోన్లో హైఎండ్ మోడల్ జియోఫోన్ 2ను కూడా ఆవిష్కరించింది. దీంతో పాటు బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లోకి జియో అడుగుపెట్టింది. జియో గిగాఫైబర్ పేరుతో ఫైబర్ ఆధారిత వైర్‌లైన్ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2018 ఆగస్టు 15 నుంచి దీని రిజిస్ట్రేషన్లను కూడా ప్రారంభించింది. భారత్‌ను గ్లోబల్‌గా ఆధిపత్య స్థానంలో నిల్చోబెట్టడమే లక్ష్యంగా జియో ముందుకు సాగుతుందని ఆ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ పలుమార్లు పునరుద్ఘాటించారు. -
ఆ ఉద్యోగులకు నిరాశే..
సాక్షి, ముంబయి : సంక్షోభాలతో సతమతమవుతున్న టెలికాం పరిశ్రమ ఉద్యోగులకు చేదు కబురు అందిస్తోంది. గత ఏడాది అత్యంత క్లిష్ట పరిస్థితులను అధిగమించిన క్రమంలో ఈసారి ఈ రంగంలోని 30 నుంచి 40 శాతం ఉద్యోగులకు వేతన పెంపు ఉండదని, బోనస్ సైతం సగానికి సగం తగ్గుతుందని భావిస్తున్నారు. టెలికాం ఆపరేటర్లు, టవర్లను నిర్వహించే సంస్ధలు రాబడి తగ్గి మార్జిన్లు పడిపోవడంతో ఖర్చులకు కోత పెట్టే పనిలో పడ్డారు. ఈ ఏడాది కనీసం 30 శాతం మంది ఉద్యోగులకు ఎలాంటి ఇంక్రిమెంట్ ఉండకపోవచ్చని, బోనస్‌లు సైతం సగానికి తగ్గే అవకాశం ఉందని రిక్రూట్మెంట్ సంస్థ కోర్న్ ఫెర్రీ ఛైర్మన్ నవ్‌నీత్ సిన్హా చెప్పారు. రిలయన్స్ జియో 2016 సెప్టెంబర్‌లో చేపట్టిన టారిఫ్ వార్తో టెలికాం సంస్థలు కుదేలయ్యాయి. వినియోగదారులను నిలబెట్టుకునేందుకు పలు సంస్థలు పోటాపోటీగా టారిఫ్‌లు తగ్గించడంతో కంపెనీల మార్జిన్లు భారీగా పడిపోయాయి. గత ఏడాదిగా పరిస్థితి దారుణంగా ఉందని, 40 శాతం సిబ్బందికి వేతన పెంపు దక్కలేదని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) డైరెక్టర్ జనరల్ రాజన్ మ్యాథ్యూస్ పరిస్థితి తీవ్రతను వివరించారు. ఈ రంగంలో చోటుచేసుకుంటున్న నూతన సాంకేతిక మార్పులకు అనుగుణంగా ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడంపై కంపెనీలు దృష్టిసారించాలని చెప్పారు.టెలికాం కంపెనీలు నిర్వహణ ఖర్చులను తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తున్న క్రమంలో ఉద్యోగుల వేతనాల పెంపును విస్మరించకతప్పదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. -
మూడేళ్లలో ఎక్కువ ఫిర్యాదులు ఎవరిపైనో తెలుసా?
సాక్షి, న్యూఢిల్లీ : గడిచిన మూడేళ్లలో ప్రజల ఆర్థిక లావాదేవీలకు కీలకమైన బ్యాంకులపైన, సమాచార భట్వాడాకు సంబంధించిన టెలికం డిపార్ట్‌మెంట్‌పైనే అధిక ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం నాటి ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో వెల్లడించింది. గత ఏడాదిలో బ్యాంకు రంగానికి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసు(డీఎఫ్ఎస్)కు మొత్తం లక్షా 6వేల 299 ఫిర్యాదులు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యునికేషన్స్(డీఓటీ)కు లక్షా 21వేల 75 ఫిర్యాదులు అందినట్లు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. అదేవిధంగా 2016, 2015లో డీఎఫ్‌ఎస్‌కు వరుసగా 88,850 ఫిర్యాదులు, 53,776 ఫిర్యాదులు అందాయని, డీఓటీకి 2016, 2015లో వరుసగా 67,551, 63,929 ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు. అయితే, వీటిలో చాలా సమస్యలు పరిష్కరించినట్లు కూడా మంత్రి వెల్లడించారు. -
ప్రమాదంలో లక్ష టెలికాం ఉద్యోగాలు
టెలికాం రంగంలో ఉద్యోగులు సంఖ్య భారీగా తగ్గిపోతుంది. దిగ్గజ కంపెనీగా పేరున్న భారతీ ఎయిర్‌టెల్‌లో గతేడాది కంటే ఈ ఏడాదికి ఉద్యోగులు 1,805 మంది తగ్గిపోయారు. గతేడాది సెప్టెంబర్‌లో 19,462గా ఉన్న ఎయిర్టెల్ ఉద్యోగుల సంఖ్య, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 17,657గా ఉంది. ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగికి ఉన్న కస్టమర్లు 16,960కి పెరిగారు. గతేడాది ఈ సంఖ్య 14,189గా ఉంది. ఒక్కో నెలలో ఒక్కో ఉద్యోగి రెవెన్యూ 4.1 శాతం తగ్గిపోయి, రూ.31.5 లక్షలుగా నమోదైంది. టెలికాం ఆపరేటర్ల మధ్య తీవ్ర పోటీ వాతావరణం నెలకొనడంతో, లాభాలు భారీగా తగ్గిపోతున్నాయని విశ్లేషకులు చెప్పారు. దీంతో టెలికాం కంపెనీలు చాలామంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇస్తున్నాయి. పరోక్ష ఉద్యోగాలతో పోలిస్తే మొత్తం లక్ష టెలికాం ఉద్యోగాలు వచ్చే ఏళ్లలో ప్రమాదంలో పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భారత్‌లోనే కాక, ఆఫ్రికాలో కూడా ఎయిర్టెల్ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించేసింది. ఆఫ్రికాలో కంపెనీ ఉద్యోగులు 321 మంది తగ్గిపోయారు. ఏడాది క్రితం ఆఫ్రికాలో 4,058 మంది ఉద్యోగులుండగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌కి 3,737 గా ఉన్నారు. -
'జియో ఉచిత ఆఫర్లతో వచ్చే నష్టమేమి లేదు'
న్యూఢిల్లీ : ఉచిత వాయిస్ కాల్స్, ఉచిత డేటా కల్పిస్తూ జియో అందిస్తున్న ప్రమోషనల్ ఆఫర్‌పై టెలికాం పరిశ్రమ సంపదంతా తుడిచిపెట్టుకు పోనుందని ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే రిలయన్స్ జియో లాంటి టెలికాం సంస్థలు అందించే ప్రమోషనల్ ఆఫర్ వల్ల ఇండస్ట్రి ఆర్థిక సంపద ఏమీ తగ్గిపోదని టెలికాం రెగ్యులేటరీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) స్పష్టీకరిస్తోంది. గత నెల టెలికాం కమిషన్ ఆదేశాలకు స్పందించిన ట్రాయ్ ఈ మేరకు ఓ డ్రాఫ్ నోట్‌ను రూపొందించింది. టెలికాం కంపెనీల ప్రమోషనల్ ఆఫర్ల వల్ల పరిశ్రమ ఆర్థికసంపదకు నష్టం వాటిల్లుతుందని, ప్రభుత్వానికి చెల్లించే లైసెన్సు ఫీజులు తగ్గుతాయని టెలికాం కమిషన్ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ ప్రమోషనల్ ఆఫర్లపై పునఃసమీక్షించాలని ఆదేశించింది. అయితే టెలికాం పరిశ్రమ సంపదకు ఎలాంటి హాని ఉండదని ట్రాయ్ పేర్కొంది. టారిఫ్, టారిఫ్ ఆర్డర్ల బాధ్యతలన్నీ టెలికాం రెగ్యులేటరీ కిందకు వస్తాయి. సెక్టార్ ను ప్రమోట్ చేస్తూ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటం ట్రాయ్ బాధ్యతని సీనియర్ అధికారులు పేర్కొన్నారు. కన్జ్యూమర్ల ప్రయోజనాలను రక్షిస్తూ.. మార్కెట్‌ను డెవలప్ చేయాలనేది ట్రాయ్ యాక్ట్ లో స్పష్టంగా చెప్పి ఉంటుందని ఓ సీనియర్ అధికారి చెప్పారు. దీని కింద రిలయన్స్ జియోకు ఇచ్చిన అనుమతిని రెగ్యులేటరీ పూర్తిగా సమర్థించుకుంటోంది. దీనిపై అటార్ని జనరల్ అభిప్రాయాన్ని కూడా ట్రాయ్ కోరుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ప్రమోషనల్ ఆఫర్లు ఫైనాన్సియల్ సెక్టార్ కు తీవ్రంగా దెబ్బకొడతాయని ఆందోళన వ్యక్తంచేస్తూ టెలికాం సెక్రటరీ జే ఎస్ దీపక్ అధినేతగా ఉన్న టెలికాం కమిషన్ ట్రాయ్‌కి ఓ లేఖ రాసింది. రెండు ప్రమోషనల్ ఆఫర్లు వెల్కమ్ ఆఫర్, హ్యాపీ న్యూయర్ ఆఫర్ కింద రిలయన్స్ జియో ఉచిత వాయిస్, డేటా కస్టమర్లకు ఆఫర్ చేస్తోంది.