సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని టెలికాం టవర్లు సురక్షితమేనని టెలీ కమ్యూనికేషన్స్ విభాగం (డీఓటీ) స్పష్టం చేసింది. ఈ మేరకు మొబైల్ ఫోన్లతో పాటు వాటి బేస్ స్టేషన్ల నుంచి వెలువడే విద్యుదయస్కాంత క్షేత్రం (ఈఎంఎఫ్)తో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రజల్లో నెలకొన్న ఆందోళనపై డీఓటీ స్పందించింది. రాష్ట్రంలోని వివిధ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు (టీఎస్‌పీలు) ఏర్పాటు చేసిన 4,245 బేస్ ట్రాన్స్‌రిసీవర్ యూనిట్లను (టవర్లు) జూన్ 2020 నుంచి ఫిబ్రవరి 2021 నడుమ పరీక్షించినట్లు డీఓటీ హైదరాబాద్ విభాగం వెల్లడించింది. వాటిలో ఒకటి మినహా మిగతా టవర్లన్నీ నిబంధనలకు లోబడే ఉన్నట్లు ప్రకటించింది. అపోహలు తొలగించేందుకు తరంగ్ సమాచార్ పేరిట ఓ వెబ్‌సైట్ ఏర్పాటు చేశామని, ఈఎంఎఫ్‌పై ఆన్‌లైన్‌లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపింది.తెలంగాణ
Comments
Please login to add a commentAdd a comment