ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు నియామకాలు 23 శాతం పెరిగినట్టు క్వెస్‌కార్ప్ సంస్థ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు ఈ మేరకు వృద్ధి నమోదైనట్టు నియామక సేవలు అందించే ఈ సంస్థ తెలిపింది. రిటైల్, టెలికం రంగాలు నియామకాల్లో ముందున్నాయి. ఏప్రిల్–ఆగస్ట్ మధ్య మొత్తం 32,000 జాబ్‌లకు పోస్టింగ్‌లు పడినట్టు పేర్కొంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ (బీఎఫ్‌ఎస్‌ఐ), రిటైల్, టెలికం రంగాలు జోరును చూపించాయి.
ప్రొడక్షన్ ట్రైనీ, బ్రాంచ్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్, కలెక్షన్ ఆఫీసర్, బిజినెస్ డెవలప్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, బ్రాడ్‌బ్యాండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, వేర్‌హౌస్ అసోసియేట్, కస్టమర్ రిలేషన్ షిప్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎక్కువ నోటిఫికేషన్‌లు నమోదయ్యాయి. ‘‘పండుగల సీజన్‌కు వ్యాపార సంస్థలు సిద్ధమవుతున్నాయి. దీంతో హైరింగ్‌కు సానుకూల ధోరణి నెలకొంది. ద్రవ్యోల్బణం, లాభదాయకతపై ఒత్తిళ్లు నెలకొన్నప్పటికీ.. తయారీ, బీఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్‌లో చెప్పుకోతగ్గ మేర నియామకాల్లో వృద్ధి నమోదైంది’’అని క్వెస్‌కార్ప్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు. రిటైల్ పరిశ్రమలో తాత్కాలిక కారి్మకులకు డిమాండ్ 9 శాతం పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. తన ప్లాట్‌ఫామ్‌పై నమోదైన జాబ్ పోస్టింగ్‌ల ఆధారంగా క్వెస్ కార్ప్ ఈ వివరాలు వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment