recruitments posts
-
హైదరాబాద్‌లో నియామకాల జోరు
ముంబై: జూలైలో కార్యాలయ ఉద్యోగుల నియామకాల పరంగా హైదరాబాద్‌లో మంచి వృద్ధి నమోదైంది. ఒకటికి మించిన రంగాల్లో నియామకాలు జూలైలో గణనీయంగా పెరిగినట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా జూలైలో నియామకాలు 12 శాతం పెరిగినట్టు ప్రకటించింది. మొత్తం 2,877 జాబ్ పోస్టింగ్ నోటిఫికేషన్లు (ఉద్యోగులు కావాలంటూ జారీ చేసే ప్రకటనలు) వచ్చినట్టు పేర్కొంది. క్రితం ఏడాది జూలై నెలలో 2,573 జాబ్ పోస్టింగ్‌లతో పోల్చి చూస్తే 12 శాతం పెరిగినట్టు తెలిపింది. జూలై నెలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నియామకాల ధోరణిని ఈ నివేదిక ప్రతిఫలిస్తుంటుంది. నౌకరీ డాట్ కామ్ పోర్టల్‌పై జాబ్ పోస్టింగ్‌లు, ఉద్యోగ శోధన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందిస్తుంది. ముఖ్యంగా ఫార్మా రంగంలో 26 శాతం మేర నియామకాలు పెరిగాయి. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో 23 శాతం అధికంగా ఉద్యోగాల భర్తీ నెలకొంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చతే జూలైలో ఐటీ నియామకాలు 17 శాతం పుంజుకున్నాయి. ముఖ్యంగా ఏఐ–ఎంఎల్ విభాగంలో 47 శాతం మేర నియామకాలు పెరిగాయి. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అత్యధికంగా 39 శాతం వృద్ధి నమోదైంది. ఆ తర్వాత జామ్‌నగర్‌లో 38 శాతం, బరోడాలో 25 శాతం మేర నియామకాలు పెరిగాయి. హైదరాబాద్‌లో జోరు హైదరాబాద్‌లో హాస్పిటాలిటీ (ఆతిథ్య పరిశ్రమ) రంగంలో నియామకాలు 76 శాతం పెరిగాయి. ఆ తర్వాత బీమా రంగంలో 71 శాతం, బీపీవో రంగంలో 52 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో 44 శాతం చొప్పున జూలైలో నియామకాలు పెరిగినట్టు నౌకరీ నివేదిక తెలిపింది. విజయవాడలో 13 శాతం, విశాఖపట్నంలో 14 శాతం చొప్పున నియామకాల్లో వృద్ధి కనిపించినట్టు పేర్కొంది. ‘‘12 శాతం వృద్ధి ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఆశాజనకం. ఈ ఆర్థిక సంవత్సరంలో నియామకాల పరంగా సానుకూల వృద్ధి మొదటిసారి నమోదైంది. దేశ కార్యాలయ ఉద్యోగ మార్కెట్లో పురోగమనాన్ని సూచిస్తోంది’’అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ తెలిపారు. -
పెరిగిన నియామకాలు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు నియామకాలు 23 శాతం పెరిగినట్టు క్వెస్‌కార్ప్ సంస్థ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు ఈ మేరకు వృద్ధి నమోదైనట్టు నియామక సేవలు అందించే ఈ సంస్థ తెలిపింది. రిటైల్, టెలికం రంగాలు నియామకాల్లో ముందున్నాయి. ఏప్రిల్–ఆగస్ట్ మధ్య మొత్తం 32,000 జాబ్లకు పోస్టింగ్‌లు పడినట్టు పేర్కొంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ (బీఎఫ్ఎస్ఐ), రిటైల్, టెలికం రంగాలు జోరును చూపించాయి. ప్రొడక్షన్ ట్రైనీ, బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, కలెక్షన్ ఆఫీసర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, బ్రాడ్‌బ్యాండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, వేర్‌హౌస్ అసోసియేట్, కస్టమర్ రిలేషన్ షిప్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎక్కువ నోటిఫికేషన్లు నమోదయ్యాయి. ‘‘పండుగల సీజన్‌కు వ్యాపార సంస్థలు సిద్ధమవుతున్నాయి. దీంతో హైరింగ్‌కు సానుకూల ధోరణి నెలకొంది. ద్రవ్యోల్బణం, లాభదాయకతపై ఒత్తిళ్లు నెలకొన్నప్పటికీ.. తయారీ, బీఎఫ్ఎస్ఐ, రిటైల్‌లో చెప్పుకోతగ్గ మేర నియామకాల్లో వృద్ధి నమోదైంది’’అని క్వెస్‌కార్ప్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు. రిటైల్ పరిశ్రమలో తాత్కాలిక కారి్మకులకు డిమాండ్ 9 శాతం పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. తన ప్లాట్‌ఫామ్‌పై నమోదైన జాబ్ పోస్టింగ్‌ల ఆధారంగా క్వెస్ కార్ప్ ఈ వివరాలు వెల్లడించింది. -
కరోనాతో హెల్త్‌కేర్‌లో ఉద్యోగాల వరద
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఒక రంగానికి చాలా మేలు చేసింది. ఈ మహమ్మారి కారణంగా పెరిగిన డిమాండ్‌ను తట్టుకునేందుకు హెల్త్‌కేర్ రంగంలోని కంపెనీలు అంతకుముందు ఎన్నడూలేని స్థాయిలో భారీ నియామకాలకు మొగ్గు చూపించాయి. దీంతో ఈ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. ముఖ్యంగా ఈ రంగంలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి కంపెనీలు పెద్ద పీట వేశాయి. నిపుణుల నియామకాలు 2021–22లో ఏకంగా 100 నుంచి 220 శాతం వరకు పెరిగినట్టు టీమ్‌లీజ్ సంస్థ ‘‘ప్రొఫెషనల్ స్టాఫింగ్ – డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్’ పేరుతో నివేదికను విడుదల చేసింది. ► హెల్త్‌కేర్ రంగంలో 2020–21 ఆర్థిక సంవత్సరం నాటికి 68 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, 2021–22లో 75 లక్షలకు పెరిగింది. ఇందులో ప్రత్యేక నైపుణ్య ఉద్యోగులు 25 శాతం మంది ఉంటారు. ► 2025–26 నాటికి హెల్త్ కేర్ రంగం మొత్తం 95 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. ► కరోనా తర్వాత హెల్త్‌కేర్ కంపెనీలకు డేటా ఆధారిత సహకారం కీలకంగా మారింది. రోగులకు సంబంధించి పెద్ద ఎత్తున డేటాను సమీకరించడం, విశ్లేషించడం తప్పనిసరిగా మారింది. ఇంత పెద్ద ఎత్తున డేటా విశ్లేషణ గతంలో ఎన్నడూ లేదు. ► డేటాకు సంబంధించి విధులతో కూడిన నర్స్ ఇన్ఫర్మేటిక్స్ స్పెషలిస్ట్, క్లినికల్ రీసెర్చ్ ఉద్యోగాలకు హెల్త్‌కేర్‌లో డిమాండ్ ఏర్పడింది. ఆ తర్వాత తయారీ, విక్రయ విభాగాల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. ► హెల్త్‌కేర్ రంగంలో ప్రతి 5 నియామకాల్లో ఒకటి నర్స్ ఇన్ఫర్మేటిక్స్ స్పెషలిస్ట్ ఉండడం గమనార్హం. వీరి నియామకాలు క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 175% పెరిగాయి. ► నాణ్యత నియంత్రణ, ల్యాబ్ కెమిస్ట్, క్రెడెన్షియలైజింగ్ స్పెషలిస్ట్‌కు డిమాండ్ 4%. నియామకాల్లో వృద్ధిని చూస్తే 200 శాతం పెరిగింది. ► ఫార్మా, బయోటెక్నాలజీ విభాగాల్లో ఎక్కువ నియామకాల వృద్ధి కనిపించింది. మొత్తం నియామకాల్లో 52 శాతం వాటా ఈ రెండు విభాగాల నుంచే ఉంది. ► మెడికల్ డివైజెస్ (పరికరాలు), హాస్పిటల్స్ సరఫరా విభాగాలు 23 శాతం నియామకాల వాటాతో రెండో స్థానంలోఉన్నాయి. ► హెల్త్‌కేర్ నియామకాల్లో ముంబై, బెంగళూరు ముందున్నాయి. పైగా మధ్య స్థాయి వ్యాపార సంస్థలే సగానికిపైగా ఉపాధి కల్పించాయి. ► రానున్న సంవత్సరంలో హెల్త్‌కేర్ సేవల్లో ఉద్యోగుల వలసల రేటు 16–17 శాతంగా ఉంటుంది. -
IBPS Exam: 13 ప్రాంతీయ భాషల్లో బ్యాంక్ క్లర్క్ పరీక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌లలో నిర్వహిస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకుల క్లరికల్ రిక్రూట్మెంట్లను, ఆ రెండు భాషలతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. దేశంలోని పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇప్పటికే ప్రకటించిన ఖాళీల కోసం చేపట్టే క్లరికల్ రిక్రూట్మెంట్లలో ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలు రెండింటినీ ఇంగ్లీష్, హిందీతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని సూచించింది. క్లరికల్ కేడర్ కోసం పరీక్షలు ప్రాంతీయ భాషలలో నిర్వహించే విషయాన్ని పరిశీలించేందుకు ఆర్థిక శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు ఆధారంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో కమిటీ సిఫార్సులు అందుబాటులోకి వచ్చే వరకు ఐబీపీఎస్ ప్రారంభించిన పరీక్ష ప్రక్రియను నిలివేయాలని నిర్ణయించారు. -
దిగువ కోర్టులకు జడ్జీల్ని నియమించండి
న్యూఢిల్లీ: దిగువ కోర్టుల న్యాయాధికారుల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని హైకోర్టులను కేంద్రం కోరింది. నియామకానికి సంబంధించి త్వరితగతిన పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించాలని 24 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లేఖ రాశారు. ఆగస్టు 14 వరకు దేశవ్యాప్తంగా 2.76 కోట్ల కేసులు జిల్లా, దిగువ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ‘జిల్లా, దిగువ కోర్టులకు సంబంధించి 2013లో మంజూరు చేసిన 19,158 పోస్టుల సంఖ్యను ఈ ఏడాది జూన్ నాటికి 22,444 వరకు పెంచాం. 2018 జూన్ 30 నాటికి 17,221 మంది జడ్జీలు విధులు నిర్వర్తిస్తుండగా, మరో 5,223 పోస్టులు ఖాళీగా ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. -
ఖాళీల భర్తీకి హైకోర్టు శ్రీకారం
- పలువురి పేర్లు సిఫార్సు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తుల ఖాళీలు రోజు రోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ పోస్టుల భర్తీకి హైకోర్టు చర్యలు చేపట్టింది. తొలి దశలో పలువురి పేర్లను న్యాయమూర్తుల పోస్టుల భర్తీకి సిఫార్సు చేసింది. ఇందుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తులు జస్టిస్ గుండా చంద్రయ్య, జస్టిస్ రమేష్ రంగనాథన్‌లతో కూడిన కొలీజియం ఇటీవల సమావేశమై నిర్ణయం తీసుకుంది. న్యాయవాదుల నుంచి ఆరుగురి పేర్లను, జిల్లా జడ్జీల నుంచి ఐదుగురి పేర్లను హైకోర్టు న్యాయమూర్తుల పదవులకు సుప్రీంకోర్టుకు హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. న్యాయవాదుల నుంచి సిఫార్సు చేసిన వారిలో టి.అమర్నాథ్గౌడ్, పి.కేశవరావు, అభినంద్ కుమార్ షావలి, ఎం.గంగారావు, డి.వి.ఎస్.సోమయాజులు, కె.విజయలక్ష్మి ఉన్నారు. వీరిలో డి.వి.ఎస్.సోమయాజులు మినహా మిగిలిన వారందరూ ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. డీవీఎస్ సోమయాజులు విశాఖలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఓ జిల్లా న్యాయవాదిని హైకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేయడం హైకోర్టు చరిత్రలో ఇదే మొదటిసారి. ఇక జిల్లా జడ్జీల నుంచి జె.ఉమాదేవి, జి.శ్యాంప్రసాద్, ఎన్.బాలయోగి, టి.రజనీ, షమీమ్ అక్తర్‌ల పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు కొలీజియం సిఫార్సు చేసింది. ఉమాదేవి ప్రస్తుతం హైదరాబాద్, స్మాల్ కాజెస్కోర్టు చీఫ్ జడ్జిగా ఉన్నారు. శ్యాంప్రసాద్ ఏపీ న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా, బాలయోగి హైదరాబాద్, సిటీ సివిల్‌కోర్టు చీఫ్ జడ్జిగా, రజనీ హైదరాబాద్, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జిగా, షమీమ్ అక్తర్ హైకోర్టు రిజిష్ట్రార్ (జుడీషియల్)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తితో సహా 26 మంది జడ్జీలున్నాయి. ఈనెల 10 తరువాత జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ రెడ్డి కాంతారావు పదవీ విరమణ చేయనుండటంతో ఖాళీల సంఖ్య 38కి పెరగనుంది.