కరోనాతో హెల్త్‌కేర్‌లో ఉద్యోగాల వరద | FY22 Healthcare hires saw 100-220percent growth in specialised roles | Sakshi
Sakshi News home page

కరోనాతో హెల్త్‌కేర్‌లో ఉద్యోగాల వరద

Published Thu, Mar 24 2022 6:39 AM | Last Updated on Thu, Mar 24 2022 6:39 AM

FY22 Healthcare hires saw 100-220percent growth in specialised roles - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ ఒక రంగానికి చాలా మేలు చేసింది. ఈ మహమ్మారి కారణంగా పెరిగిన డిమాండ్‌ను తట్టుకునేందుకు హెల్త్‌కేర్‌ రంగంలోని కంపెనీలు అంతకుముందు ఎన్నడూలేని స్థాయిలో భారీ నియామకాలకు మొగ్గు చూపించాయి. దీంతో ఈ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. ముఖ్యంగా ఈ రంగంలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి కంపెనీలు పెద్ద పీట వేశాయి. నిపుణుల నియామకాలు 2021–22లో ఏకంగా 100 నుంచి 220 శాతం వరకు పెరిగినట్టు టీమ్‌లీజ్‌ సంస్థ ‘‘ప్రొఫెషనల్‌ స్టాఫింగ్‌ – డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ట్రెండ్స్‌’ పేరుతో నివేదికను విడుదల చేసింది.  

► హెల్త్‌కేర్‌ రంగంలో 2020–21 ఆర్థిక సంవత్సరం నాటికి 68 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, 2021–22లో 75 లక్షలకు పెరిగింది. ఇందులో ప్రత్యేక నైపుణ్య ఉద్యోగులు
25 శాతం మంది ఉంటారు.
► 2025–26 నాటికి హెల్త్‌ కేర్‌ రంగం మొత్తం 95 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది.  
► కరోనా తర్వాత హెల్త్‌కేర్‌ కంపెనీలకు డేటా ఆధారిత సహకారం కీలకంగా మారింది. రోగులకు సంబంధించి పెద్ద ఎత్తున డేటాను సమీకరించడం, విశ్లేషించడం తప్పనిసరిగా మారింది. ఇంత పెద్ద ఎత్తున డేటా విశ్లేషణ గతంలో ఎన్నడూ లేదు.  
► డేటాకు సంబంధించి విధులతో కూడిన నర్స్‌ ఇన్ఫర్మేటిక్స్‌ స్పెషలిస్ట్, క్లినికల్‌ రీసెర్చ్‌ ఉద్యోగాలకు హెల్త్‌కేర్‌లో డిమాండ్‌ ఏర్పడింది. ఆ తర్వాత తయారీ, విక్రయ విభాగాల్లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది.  
► హెల్త్‌కేర్‌ రంగంలో ప్రతి 5 నియామకాల్లో ఒకటి నర్స్‌ ఇన్ఫర్మేటిక్స్‌ స్పెషలిస్ట్‌ ఉండడం గమనార్హం. వీరి నియామకాలు క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 175% పెరిగాయి.  
► నాణ్యత నియంత్రణ, ల్యాబ్‌ కెమిస్ట్, క్రెడెన్షియలైజింగ్‌ స్పెషలిస్ట్‌కు డిమాండ్‌ 4%. నియామకాల్లో వృద్ధిని చూస్తే 200 శాతం పెరిగింది.  
► ఫార్మా, బయోటెక్నాలజీ విభాగాల్లో ఎక్కువ నియామకాల వృద్ధి కనిపించింది. మొత్తం నియామకాల్లో 52 శాతం వాటా ఈ రెండు విభాగాల నుంచే ఉంది.
► మెడికల్‌ డివైజెస్‌ (పరికరాలు), హాస్పిటల్స్‌ సరఫరా విభాగాలు 23 శాతం నియామకాల వాటాతో రెండో స్థానంలోఉన్నాయి.
► హెల్త్‌కేర్‌ నియామకాల్లో ముంబై, బెంగళూరు  ముందున్నాయి. పైగా మధ్య స్థాయి వ్యాపార సంస్థలే సగానికిపైగా ఉపాధి కల్పించాయి.
► రానున్న సంవత్సరంలో హెల్త్‌కేర్‌ సేవల్లో ఉద్యోగుల వలసల రేటు 16–17 శాతంగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement