న్యూఢిల్లీ: దిగువ కోర్టుల న్యాయాధికారుల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని హైకోర్టులను కేంద్రం కోరింది. నియామకానికి సంబంధించి త్వరితగతిన పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించాలని 24 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లేఖ రాశారు. ఆగస్టు 14 వరకు దేశవ్యాప్తంగా 2.76 కోట్ల కేసులు జిల్లా, దిగువ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ‘జిల్లా, దిగువ కోర్టులకు సంబంధించి 2013లో మంజూరు చేసిన 19,158 పోస్టుల సంఖ్యను ఈ ఏడాది జూన్ నాటికి 22,444 వరకు పెంచాం. 2018 జూన్ 30 నాటికి 17,221 మంది జడ్జీలు విధులు నిర్వర్తిస్తుండగా, మరో 5,223 పోస్టులు ఖాళీగా ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment