Fast track courts
-
ఆంధ్రప్రదేశ్‌లో 12 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం కేసులు, చిన్నారులపై జరిగే లైంగిక అత్యాచారం (పోక్సో) కేసులను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌లో 12 ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. అత్యాచారం, పోక్సో కేసుల పరిష్కారం కోసం దేశంలో 1,023 ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేయాలని 2019 అక్టోబర్‌లో నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 728 ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టులు పని చేస్తున్నట్లు చెప్పారు. ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టుల కాలపరిమితిని ఒక ఏడాదికి పరిమితం చేయాలని ముందుగా నిర్దేశించినా తదుపరి 2023 మార్చి 31 వరకు వీటిని కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్ నాటికి దేశంలోని అన్ని ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టుల్లో కలిపి లక్షకుపైగా కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. ఏపీ హైకోర్టులో ఐదు జడ్జి పోస్టులు ఖాళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేవలం ఆరుగురు న్యాయమూర్తుల ఖాళీలు భర్తీచేయాల్సి ఉందని విజయసాయిరెడ్డి మరో ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు జవాబిచ్చారు. ఏపీ హైకోర్టులో ఆమోదించిన శాశ్వత, అదనపు న్యాయమూర్తుల సంఖ్య 37 అని తెలిపారు. ఖాళీగా ఉన్న ఐదు జడ్జి పోస్టులకు కొలీజియం నుంచి సిఫార్సులు రాలేదన్నారు. రిజర్వేషన్లు వర్తించవు ఆర్టికల్ 124, 217, 224 ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం ఉంటుందని, అయితే కులాలు, వర్గాలకు రిజర్వేషన్లు వర్తింపజేయలేదని కిరణ్ రిజిజు తెలిపారు. అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలను సిఫార్సు చేయాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కేంద్రం కోరుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నకు సమాధానమిచ్చారు. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రిన్సిపల్ సీటును అమరావతి నుంచి కర్నూలుకు తరలించాలని కోరుతూ 2020 ఫిబ్రవరిలో ఏపీ సీఎం ప్రతిపాదనలు పంపించారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నలకు మంత్రి జవాబిస్తూ.. హైకోర్టును తరలించాలంటే రాష్ట్ర హైకోర్టుతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. హైకోర్టు తరలింపు అంశం రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు పరిధిలోనే ఉంటుందని, తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాలని పేర్కొన్నారు. ఆ తర్వాత తరలింపుపై పూర్తిస్థాయి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించాలని సూచించారు. కానీ ఇప్పటి వరకు అలాంటి పూర్తి ప్రతిపాదనేదీ కేంద్రం వద్ద పెండింగ్‌లో లేదన్నారు. అయితే హైకోర్టు నిర్వహణ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని, సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోర్టు రోజువారీ కార్యకలాపాలను నిర్వర్తించేందుకు బాధ్యత వహిస్తారని చెప్పారు. -
కేంద్రం తీపికబురు.. సమగ్ర శిక్షా పథకం 2026 వరకు పొడిగింపు..
న్యూఢిల్లీ: సమగ్ర శిక్షా పథకాన్ని 2026 వరకు పొడిగించినట్టు కేంద్రం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య, నైపుణ్యం అందించడంపైనే తమ దృష్టి ఉంటుందని అన్నారు. అదే విధంగా, సమగ్ర శిక్షా పథకానికి గాను.. రూ.1,85,398 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకనుంచి ప్రభుత్వ పాఠశాలలో ప్లేస్లూల్స్ కూడా ఉండాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. డీబీటీ ద్వారా నేరుగా విద్యార్థులకు ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, 2023 వరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కేంద్ర ప్రాయోజిత పథకాన్ని పొడిగించామని పేర్కొన్నారు. అదే విధంగా.. 1023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను మరో రెండేళ్లు పొడిగిస్తున్నట్లు తెలిపారు. భారత్‌లో లైంగిక పరమైన నేరాలలో సత్వర న్యాయం అందించడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని అన్నారు. కాగా, నిర్భయ నిధి నుంచి నిధులను అందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. -
దిశచట్టంలో బాగంగా ప్రతిజిల్లాలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు
-
36 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 36 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలపై అత్యాచార కేసుల విచార ణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశా రు. పిల్లలు, మహిళలపై అత్యాచా రా లు, పోస్కో చట్టాల కింద నమోదయ్యే కేసులను సత్వరమే విచారించి నిందితులకు శిక్షలు ఖరారు చేసేందు కు వీటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆదిలాబాద్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్(కోర్టు సంగారెడ్డిలో ఉంటుంది), నల్లగొండ, నిజా మాబాద్, రంగారెడ్డి (ఎల్బీ న గర్), వరంగల్, ఆసిఫాబాద్, మంచి ర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కొత్తగూడెం, గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, మెదక్, సూర్యాపేట, భువనగిరి, కామారెడ్డి, మల్కాజిగిరి, జనగాం, భూపాల్పల్లి, మహబూబాబాద్, ములుగు, షాద్‌నగర్, మేడ్చల్, కూకట్పల్లి, రాజేంద్రనగర్‌ల్లో ఒక్కో కోర్టు చొప్పున 32 కోర్టులు ఏర్పాటు చేశారు. ఖమ్మం, కరీంనగర్ల్లో రెండేసి కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
లైంగిక దాడి కేసులపై కేంద్రం సంచలన నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : దిశ, ఉన్నావ్ ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లైంగిక దాడి, పోక్సో కేసులన్నింటిపై ఆరు నెలల్లోగా విచారణ ముగిసేలా చర్యలు చేపట్టాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులందరికీ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ గురువారం లేఖ రాశారు. ఈ తరహా కేసులన్నింటిలో విచారణను రెండు నెలల్లోగా పూర్తిచేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్ర న్యాయశాఖ మంత్రి ఆదేశించారు. లైంగిక దాడి కేసుల సత్వర విచారణకు దేశవ్యాప్తంగా 1023 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 700 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులున్నాయని, తాజా కోర్టులతో వీటి సంఖ్య 1723కు చేరుతుందని చెప్పారు. దిశ హత్యాచార ఘటనకు సంబంధించి నలుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. -
1,023 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
న్యూఢిల్లీ: మహిళలు, చిన్నారులపై అత్యాచార కేసుల్లో వేగవంతమైన విచారణకోసం దేశవ్యాప్తంగా 1,023 ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తం 1.66 లక్షలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపింది. ఈ ప్రత్యేక న్యాయస్థానాలు ఏడాదికి కనీసం 165 కేసులను పరిష్కరిస్తాయని వెల్లడించింది. వీటిలో 389 కోర్టులు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద నమోదైన కేసులను ప్రత్యేకంగా విచారిస్తాయని తెలిపింది. ఇందుకోసం మొత్తం రూ. 767.25 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించింది. -
ఎన్నికల కేసులపై పోలీస్‌శాఖ నజర్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన కేసులపై రాష్ట్ర పోలీసు శాఖ దృష్టి సారించింది. ఈసారి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద రాష్ట్ర వ్యాప్తంగా 1,527 నమోదయినట్లు పోలీసు శాఖ స్పష్టం చేసింది. కోడ్ ఉల్లంఘన కేసులతో పాటుగా ఎమ్మెల్యే, ఎంపీలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తూ ఇటీవల అన్ని రాష్ట్రాలు ఉత్తర్వులు జారీ చేసిన దృష్ట్యా ఈ కేసుల విచారణ ఇకనుంచి వేగవంతం కానుంది. ఇందులో భాగంగా ఎక్కడెక్కడ ఏయే నేతపై ఎన్ని క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్న అంశంపై త్వరలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించే యోచనలో పోలీస్ శాఖ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న 2014నాటి 99 క్రిమినల్ కేసులతో పాటుగా ఈసారి నమోదైన కేసులపై వెంటనే చార్జిషీట్ దాఖలు చేయాలని పోలీసు శాఖ సిద్ధమవుతోంది. స్థానిక కోర్టుల్లోనే విచారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటినుంచి ఫలితాలు వచ్చే వరకు కోడ్ కండక్ట్ ఉల్లంఘన కింద పలు పార్టీల అభ్యర్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులపై ఆధారాలు సేకరించడంతోపాటు దర్యాప్తు వేగవంతం చేస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ కేసుల విచారణ స్థానిక కోర్టు పరిధిలోనే జరుగుతుందని, వీటిపై చార్జిషీట్లు సైతం 90 రోజుల్లోపే వేసి ట్రయల్స్ ప్రక్రియపై పూర్తి దృష్టి పెడతామని అధికారులు స్పష్టం చేశారు. ఎక్కువ తీవ్రత ఉన్న వాటిలో క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉందని, ఆధారాలను బట్టి ఆయా కేసుల పురోగతి ఉంటుందని చెబుతున్నారు. ఈ ఎన్నికల కోడ్ ఉల్లంఘన సమయంలో కొన్ని చోట్ల సాధారణ ఘర్షణలు జరిగాయని, ఇలాంటి కేసులు రాష్ట్రమొత్తంగా 100 కేసులుంటాయని ఎన్నికల కమిషన్‌కు పోలీస్ శాఖ నోడల్ అధికారులు నివేదికిచ్చారు. వీటిపై దర్యాప్తు లోతుగా ఉంటుందని, కుట్రపూరితంగా వ్యవహరించినట్టు తేలితే వారిపై కఠిన చర్యలుంటాయని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. -
దిగువ కోర్టులకు జడ్జీల్ని నియమించండి
న్యూఢిల్లీ: దిగువ కోర్టుల న్యాయాధికారుల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని హైకోర్టులను కేంద్రం కోరింది. నియామకానికి సంబంధించి త్వరితగతిన పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించాలని 24 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లేఖ రాశారు. ఆగస్టు 14 వరకు దేశవ్యాప్తంగా 2.76 కోట్ల కేసులు జిల్లా, దిగువ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ‘జిల్లా, దిగువ కోర్టులకు సంబంధించి 2013లో మంజూరు చేసిన 19,158 పోస్టుల సంఖ్యను ఈ ఏడాది జూన్ నాటికి 22,444 వరకు పెంచాం. 2018 జూన్ 30 నాటికి 17,221 మంది జడ్జీలు విధులు నిర్వర్తిస్తుండగా, మరో 5,223 పోస్టులు ఖాళీగా ఉన్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. -
అత్యాచార కేసులకు ప్రత్యేక కోర్టులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న అత్యాచారాల కేసులు, మైనర్లపై లైంగిక వేధింపులను నియంత్రించేందుకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. అయితే ఇప్పటివరకు కేంద్ర హోంశాఖలో మహిళల భద్రతకు సంబంధించి ప్రత్యేక విభాగం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కేంద్ర మంత్రిమండలి ఆమోదంతో కేంద్ర హోంశాఖలో మహిళా భద్రత విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీని కింద అత్యాచారాల నియంత్రణ, ఎస్సీ, ఎస్టీ మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక వేధింపుల నియంత్రణ, మనుషుల అక్రమ రవాణాను అడ్డుకోవడం, నిర్భయ ఫండ్ మేనేజ్మెంట్, క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టం (సీసీటీఎన్ఎస్), నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) విభాగాలుంటాయని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. కోర్టుల్లో కేంద్ర నిధులతో నియామకాలు.. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అత్యాచారాలు, లైంగిక వేధింపుల నియంత్రణకు ఏర్పాటు చేసే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో కేంద్ర నిధులతో నియామకాలు, మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. అలాగే బాధితుల పక్షాన పోరాడేందుకు అదనపు పబ్లిక్ ప్రాస్యిక్యూటర్లను నియమించనున్నారు. రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, హైకోర్టు ఆధ్వర్యంలోనే వీటి నిర్వహణకు చర్యలు చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా అత్యాచారాల కేసుల్లో శిక్షల శాతం చాలా తక్కువగా ఉండటంతో.. దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పటిష్టవంతమైన దర్యాప్తు, త్వరితగతిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక నిధులతో దేశవ్యాప్తంగా అన్ని పోలీస్స్టేషన్లకు అత్యాధునిక ఫోరెన్సిక్ కిట్లు అందజేయాలని నిర్ణయించింది. ప్రతీ పోలీస్ అధికారికి దర్యాప్తులో పాటించాల్సిన మెళకువలపై శిక్షణ ఇవ్వనుంది. అలాగే ప్రతీ రాష్ట్రంలో ఒకటి లేదా రెండు స్పెషలైజ్డ్ ఫోరెన్సిక్ లేబొరేటరీలను ఏర్పాటు చేయనుంది. అత్యాచారాల కేసుల దర్యాప్తులో సహకరించేందుకు ప్రతీ పోలీస్‌స్టేషన్‌కు ఎన్సీఆర్బీ, సీసీటీఎన్ఎస్ డాటాబేస్‌ను అనుసంధానించేందుకు చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. చిన్నారులపై లైంగిక వేధింపుల నియంత్రణ (పోస్కో చట్టం) 2012, ఐపీసీ 1860లోని కొన్ని సెక్షన్లను సవరించినట్టు కేంద్ర హోంశాఖ తెలిపింది. -
అత్యాచార బాధితులకు న్యాయం జరిగేదెప్పుడు ?
నిర్భయ వంటి కఠిన చట్టాలు తీసుకువచ్చినా, అత్యాచార కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసినా రోజు రోజుకి ఈ పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అత్యాచార బాధితులకు న్యాయం ఎండమావిగానే మిగిలిపోతోంది. కథువా, ఉన్నావ్ అత్యాచార కేసులతో దేశవ్యాప్తంగా మహిళలు దోషులకు కఠిన శిక్షలు విధించాలని, సత్వర న్యాయం జరిగేలా చూడాలని గళమెత్తుతున్నా పట్టించుకునే వారే లేరు. 2012 నిర్భయ ఘటనతో యావత్ భారతదేశం చలించిపోయింది. యువతీ యువకులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి మరో ఆడపిల్లకి ఇంత దుర్భర స్థితి రాకూడదని, అత్యాచారం కేసుల్లో కఠిన శిక్షలు విధించాలంటూ డిమాండ్ చేయడంతో కేంద్ర ప్రభుత్వం కొన్ని కిరాతకమైన కేసుల్లో ఉరిశిక్ష కూడా విధించేలా నిర్భయ చట్టాన్ని తీసుకువచ్చింది. కేసుల విచారణను కూడా త్వరితగతిని పూర్తి చేసి బాధితులకు న్యాయం చేస్తామని హామీలు ఇచ్చింది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఈ కేసుల్లో ఎలాంటి పురోగతి లేదు. దీంతో ఎన్ని చట్టాలు వచ్చినా తమను ఏం చేయలేవన్న ధీమా రేపిస్టుల్లో పెరిగిందనే అభిప్రాయం ఏర్పడుతోంది. 2012 నిర్భయ కేసు తర్వాత దేశంలో అత్యాచార కేసులు 60 శాతం పెరిగితే, చిన్నారులపై రేప్ కేసులు 40 శాతం పెరిగాయి. అయితే 25శాతం కేసుల్లో మాత్రమే అరెస్టులు జరిగాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ నివేదిక ప్రకారం 2016 చివరి నాటికి లక్షా 33 వేల అత్యాచార కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2012 నాటికి లక్ష కేసులు పెండింగ్‌లో ఉంటే అప్పట్నుంచి పెండింగ్ కేసుల సంఖ్య ప్రతీ ఏడాది 85 శాతం పెరుగుతూ వస్తోంది. 2012, 16 మధ్య నమోదైన వాటిలో మూడో వంతు కేసులు పోలీసు స్టేషన్ పరిధిలోనే నీరు కారిపోతున్నాయి. ఉన్నావ్ వంటి కేసుల్లో ప్రజల నుంచి తీవ్ర నిరసన, ఒత్తిడి రావడం వల్లే కేసు నమోదైంది తప్పితే ఎంత ఘాతుకం జరిగినా పోలీసుల్లో కాస్త కూడా చలనం కనిపించడం లేదు. అత్యాచార కేసులపై రాజకీయ ప్రభావం ఉండడంతో వాటి అతీ గతీ ఎవరికీ పట్టడం లేదు. కేవలం అత్యాచార కేసుల పరిశీలన కోసం దేశవ్యాప్తంగా 20 లక్షల మంది పోలీసు అధికారుల నియామకానికి కేంద్రం అనుమతినిచ్చింది. అయినా ఆ పోస్టుల్లో నాలుగో వంతు ఖాళీగానే ఉండడంతో చాలా కేసులు కోర్టు వరకూ కూడా చేరడం లేదు. ఇప్పటివరకు ఉన్న పెండింగ్ కేసుల విచారణకు కనీసం 20 ఏళ్లు పడుతుందని ఒక స్వచ్ఛంద సంస్థ అధ్యయనంలో తేలిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేసుల విచారణ ఇంత నత్తనడకన సాగుతూ ఉంటే ఎన్ని రకాలు చట్టాలు తీసుకువచ్చి ప్రయోజనమేముందనే అభిప్రాయం వ్యక్తం సర్వత్రా అవుతోంది. -
'చెడ్డవారంతా ఢిల్లీలోనే ఉన్నారనుకోను'
దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచారాల నివారణకు మొబైల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అత్యాచారాలకు పాల్పడేవారికి తక్షణమే శిక్షలు అమలయ్యేలా చూడడం ద్వారా ఈ తరహా నేరాలు తగ్గే అవకాశం ఉందని ఆయన సోమవారమిక్కడ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటనపై మాట్లాడుతూ.. చెడ్డవారంతా ఢిల్లీలోనే ఉన్నారని అనుకోవడం లేదనీ... అలాగే కోల్‌కతా, న్యూయార్క్, లండన్, వారణాసీలలో నివసించే వారంతా సాధువులని తాను భావించడం లేదన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల విషయంలో ఢిల్లీ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాను తీసుకోనున్నామని తెలిపారు. వీటి ఏర్పాటుకు కావలసిన నిధులను ఢిల్లీ ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. -
మహిళల భద్రతకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో మహిళల భద్రత కోసం మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, సత్వర స్పందన బృందాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం అభిప్రాయపడింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీ మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్నేళ్లుగా మహిళలపై సాగుతున్న దౌర్జన్యాలను, దాడులను ఇకనైనా అరికట్టొచ్చని చెప్పారు. ఇలాంటి కేసులను సత్వరమే పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఫాస్ట్ ట్రాక్ కోర్టుల అవసరాన్ని గుర్తించే ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌తో పాటు వెళ్లి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిశాం. వాటిని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కోరాం. అలాగే ఇలాంటి ఘటనలు జరగకుండా సత్వర స్పందన బృందాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ బృందంలో మెజిస్ట్రేట్‌తో పాటు పౌర రక్షణ సభ్యులు, హోంగార్డులు ఉండాలి. ముఖ్యంగా రాత్రి సమయాల్లో జరిగే ఈవ్‌టీజింగ్, సంఘ వ్యతిరేక శక్తులను ఈ బృందం అదుపులోనికి తీసుకుని అక్కడికక్కడే చర్యలు తీసుకునేలా చేయాలి. అలాగే మహిళల భద్రతకు సంబంధించి ఎమ్మెల్యేలు, అధికారులు బాధ్యత తీసుకునేలా వారికి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం’ అని చెప్పారు. జస్టిస్ వర్మ కమిటీ సిఫారసులను వీలైనంత త్వరగా అమలు చేయాలని అధికారులను సిసోడియా కోరారు. ‘ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబరు 181, పోలీసుల ‘హిమ్మత్’ మొబైల్ అప్లికేషన్, అంతే కాకుండా అనేక హెల్ప్‌లైన్ నంబర్లు ఉన్నాయి. ఇలా ఉండటం వల్ల మహిళలు ఒక దానికొకటి తికమకపడే అవకాశం ఉంది. అందుకని ఒకటే నంబరును దీని కోసం కేటాయించాల్సిన అవసరం ఉంది’ అని సిసోడియా అన్నారు. అత్యాచారాలు జరగకుండా ఉండాలంటే వేలంటైన్స్ డే, కిస్ ఆఫ్ లవ్ వంటి వాటిని నిషేధించాల్సిన అవసరం ఉందన్న ఏపీ సింగ్(నిర్భయ కేసులో దోషుల తరఫు న్యాయవాది) వ్యాఖ్యలను సిసోడియా ఖండించారు. అతని ఆలోచనలు ఫ్యూడలిస్టులను తలపిస్తున్నాయని విమర్శించారు. మహిళలపై దాడులను సమర్థించే ఇలాంటి వ్యక్తుల ఆలోచనలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాగా, యాసిడ్ దాడికి గురైన మహిళ, వ్యభిచార కూపంలోకి తెలియకుండా వెళ్లి బయటపడ్డ యువతి, సెక్స్ వర్కర్లకి పాఠాలు చెప్పే ఉపాధ్యాయురాలు రీతు మణిదాస్ తదితరులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా,శిశు అభివృద్ధి(డబ్ల్యూసీడీ) శాఖ మంత్రి సందీప్ కుమార్, డీసీడబ్ల్యూ చీఫ్ బర్ఖా శుక్లా సింగ్, డబ్ల్యూసీడీ కార్యదర్శి ధరంవీర్ తదితరులు పాల్గొన్నారు. -
అత్యాచారం కేసుల్లో ‘ఫాస్ట్’గా తీర్పు
బెంగళూరులో త్వరలో రెండు ప్రత్యేక కోర్టులు రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్ బెంగళూరు : మహిళలు, బాలికలపై అత్యాచారాలు, భౌతిక దాడులు తదితర కేసుల్లో త్వరితగతిన తీర్పులు వెలువరించి బాధ్యులను శిక్షించడానికి వీలుగా రాష్ట్ర వ్యాప్తం గా ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర హోంశాఖ మంత్రి కేజే జార్జ్ స్పష్టం చేశారు. అందులో భాగంగా తక్షణమే బెంగళూరులో ఇలాంటి కోర్టులను రెండింటిని ఏర్పాటు చేస్తామన్నారు. విధానసౌధలో సోమవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల రక్షణ కోసం ప్రభుత్వ సూచనలపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించే పాఠశాలల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా ఐదో తరగతి వరకూ బోధన, బోధనేతర సిబ్బంది నియామకంలో మహిళలకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచిస్తామన్నారు. -
మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
లక్నో: యూపీలో మహిళలపై దాడులు, అత్యాచారాలకు తెగబడుతున్న దుండగులను శిక్షించేందుకు త్వరలతో పాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఉన్నతాధికారి శనివారం లక్నోలో వెల్లడించారు. జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాలలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం సీఎం అఖిలేష్ యాదవ్ అధ్యక్షత జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టిన... రాష్ట్రంలో మహిళలపై నానాటికి దాడులు, అత్యాచార ఘటనలు... పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు, నిందితులకు శిక్షలు పడేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని అఖిలేష్ ప్రభుత్వం భావించింది. అందుకు అనుమతి కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి లేఖ రాసింది. ప్రభుత్వ లేఖపై సీజేఐ సానుకూలంగా స్పందించారు. దాంతో యూపీలో త్వరలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఫాస్ట్ కోర్టుల కోసం ఏడాదికి రూ. 15.15 కోట్లు ఖర్చు అవుతుందని ఉన్నతాధికారి తెలిపారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న 5 తాత్కాలిక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను పర్మినెంట్ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని వెల్లడించారు. -
స్లోగానే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు
న్యూఢిల్లీ: గత ఏడాది వరకు ఫర్వాలేదనిపించుకున్న ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల పనితీరు ఈ ఏడాది మందగించిందనే విమర్శలు పెరుగుతున్నాయి. లైంగిక నేరాలపై సత్వర విచారణల కోసం ఢిల్లీలో ఆరు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నవంబర్ వరకు ఇవి 400 కేసుల్లో తీర్పులు వెలువరించాయి. మరో 1,090 కేసుల్లో తుది నిర్ణయాలు రావాల్సి ఉంది. అయితే సాధారణ కోర్టులు ఇదే కాలంలో 500 కేసులను పరిష్కరించడం గమనార్హం. గతేడాది అక్టోబర్ వరకు ఇలాంటి 963 కేసుల్లో తీర్పులు రాలేదు. ఈ పెండింగ్ కేసులతో ట్రయల్కోర్టులపై పనిభారం మరింత అధికమవుతోంది. గత డిసెంబర్ 16న నిర్భయ సామూహిక అత్యాచారం తరువాత సత్వరన్యాయం డిమాండ్ మరింత ఊపందుకుంది. తమకు జరుగుతున్న అన్యాయాలపై ఫిర్యాదు చేసేందుకు మరింత మంది మహిళలు ముందుకు వస్తున్నారని రేఖా అగర్వాల్ అనే న్యాయవాది పేర్కొన్నారు. క్రైంబ్రాంచ్ కథనాల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 15 వరకు ఢిల్లీలో 1,036 అత్యాచారాల కేసులు నమోదయ్యాయి. అన్ని రకాల లైంగిక నేరాలపై కేసులు నమోదు చేయాలనే ఆదేశాలు రావడంతో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులపై భారం అధికమయింది. అయి తే ఈ న్యాయస్థానాల్లో అత్యాచారాల బాధితురాళ్లకు నిష్పక్షపాతంగా, వేగంగా న్యాయం దొరుకుతోం దని రాజీవ్ ఖోస్లా అనే న్యాయవాది అన్నారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల్లో రోజువారీ విచారణలు నిర్వహిం చడం వల్ల న్యాయమూర్తులు ఒత్తిడికి గురవుతుంటారని చెప్పారు. ‘కోర్టుల్లో సిబ్బంది కొరత అధికంగా ఉంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్లూ తక్కువ. వారికీ పని ఒత్తిడి అధికమవుతోంది. మరిన్ని ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అని అభిప్రాయపడ్డారు. సాధారణ కోర్టులతో పోలిస్తే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులే వేగంగా తీర్పులు వెలువరిస్తున్నాయని న్యాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. సాధారణ కోర్టులు 2012లో 500 కేసులను పరిష్కరించగా, 2010లో 700, 2011లో 650 కేసుల్లో తీర్పులు వెలువరించాయి. సత్వర విచారణ కోసం సాధారణ కోర్టులు ప్రాసిక్యూషన్, డిఫెన్స్‌పై ఒత్తిడి తీసుకురావడంలో విఫలం కావడం వల్ల లైం గిక వేధింపుల కేసుల విచారణ ఆలస్యమవుతోందని సీనియర్ న్యాయవాది హెచ్.ఎస్.ఫూల్కా అన్నారు. ఫిర్యాదిదారులపై ఒత్తిడి పెంచడానికి కొన్నిసార్లు నిందితులు విచారణను ఆలస్యం చేయడానికి ప్రయత్నిస్తారని తెలిపారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకు కూడా నిష్పక్షపాత నిర్ణయాలు వెలువరించడానికి తగినంత సమయం అవసరమేనని రేఖ అన్నారు. ఇక నగరంలో ప్రాంతాల వారీగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల పనితీరు ఇలా ఉంది. ద్వారక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఈ ఏడాది అత్యధికంగా 120 కేసులను, కార్కర్డూమా కోర్టు 86 కేసులను పరిష్కరించాయి. తీస్‌హజారీ కోర్టుల కాంప్లెక్స్‌లోని రెండు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు 116 కేసుల్లో తీర్పులు చెప్పాయి. సాకేత్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 39 కేసులను పరిష్కరించింది. నిర్భయ కేసులోనూ ఇదే కోర్టు తీర్పు వెలువరించడం తెలిసిందే. రోహిణి కోర్టు 40 కేసులను పరిష్కరించింది. రెట్టింపైన అత్యాచారం కేసులు ‘నిర్భయ’పై గ్యాంగ్‌రేప్, హత్యతో పెల్లుబికిన నిరసనలకు స్పందనగా కేంద్రం తెచ్చిన నూతన అత్యాచార నిరోధక (నిర్భయ) చట్టం హస్తినలో అతివలపై అఘాయిత్యాలకు ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోతోంది. కేంద్రం చట్టానికితోడు ఢిల్లీ పోలీసులు అమలు చేస్తున్న భద్రతా చర్యలతో అత్యాచారాలు ఆగకపోగా రెట్టింపయ్యాయి. నిర్భయ ఘటనకు సోమవారంతో ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది నవంబర్ 30 వరకూ 1,493 రేప్ కేసులు, 3,237 లైంగిక వేధింపుల కేసులు, 852 ఈవ్ టీజింగ్ కేసులు నమోదయ్యా యి. 2012తో పోలిస్తే ఢిల్లీలో ఈ ఏడాది రేప్ కేసులు రెట్టింపవగా లైంగిక వేధింపుల కేసులు ఐదు రెట్లు పెరిగాయి. గత 13 ఏళ్లతో పోలిస్తే రేప్ కేసుల సంఖ్య ఈ ఏడాదే అత్యధికం కావడం గమనార్హం. అయితే తాము చేపట్టిన చర్యల వల్ల బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తుండటం వల్లే కేసుల సంఖ్య పెరిగిందని పోలీసులు చెబుతున్నారు. -
నిర్భయ కేసులో నేడు వాదనలు
న్యూఢిల్లీ: ‘నిర్భయ’ సామూహిక అత్యాచారం కేసులో అపరాధులకు విధించిన ఉరిశిక్షను ధ్రువీకరించాలంటూ దిగువకోర్టు చేసిన విజ్ఞప్తిపై రాష్ట్ర హైకోర్టులో సోమవారం వాదనలు ప్రారంభం కానున్నాయి. దీనిపై న్యాయమూర్తి రేవా ఖేత్రపాల్ విచారణ నిర్విహ స్తారు. ఈ కేసులో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నిందితులు ముకేశ్, అక్షయ్‌ఠాకూర్, పవన్‌గుప్తా, వినయ్‌శర్మకు ఉరిశిక్ష విధిస్తూ ఈ నెల 13న తీర్పునివ్వడం తెలిసిందే. తాము విధించిన శిక్షను ధ్రువీకరించాలని అడిషనల్ సెషన్స్‌జడ్జి యోగేశ్‌ఖన్నా హైకోర్టుకు విన్నవించారు. నిబంధనల ప్రకారం దిగువకోర్టులు ఉరిశిక్షలు విధిస్తూ తీర్పు చెబితే తుదినిర్ణయం కోసం హైకోర్టును సంప్రదించడం తప్పనిసరి. ఈ కేసులో అపరాధుల ప్రవర్తన అత్యంత క్రూరంగా, పశువుల మాదిరిగా ఉందని పేర్కొంటూ దిగువకోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో కీలక నిందితుడు రామ్‌సింగ్ తీహార్ జైలులోనే మార్చిలో ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. మైనర్ నిందితుడికి కూడా బాలల న్యాయస్థానం మూడేళ్ల శిక్ష విధించింది. నిర్భయపై గత ఏడాది డిసెంబర్ 16న సామూహిక అత్యాచారం జరగడం తెలిసిందే. చికిత్స పొందుతూ ఆమె అదే నెల 29న మరణించింది.