'చెడ్డవారంతా ఢిల్లీలోనే ఉన్నారనుకోను'
దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచారాల నివారణకు మొబైల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అత్యాచారాలకు పాల్పడేవారికి తక్షణమే శిక్షలు అమలయ్యేలా చూడడం ద్వారా ఈ తరహా నేరాలు తగ్గే అవకాశం ఉందని ఆయన సోమవారమిక్కడ అభిప్రాయపడ్డారు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన అత్యాచార ఘటనపై మాట్లాడుతూ.. చెడ్డవారంతా ఢిల్లీలోనే ఉన్నారని అనుకోవడం లేదనీ... అలాగే కోల్కతా, న్యూయార్క్, లండన్, వారణాసీలలో నివసించే వారంతా సాధువులని తాను భావించడం లేదన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల విషయంలో ఢిల్లీ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాను తీసుకోనున్నామని తెలిపారు. వీటి ఏర్పాటుకు కావలసిన నిధులను ఢిల్లీ ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు.