Banking and financial services company
-
పెరిగిన నియామకాలు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు నియామకాలు 23 శాతం పెరిగినట్టు క్వెస్‌కార్ప్ సంస్థ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చనప్పుడు ఈ మేరకు వృద్ధి నమోదైనట్టు నియామక సేవలు అందించే ఈ సంస్థ తెలిపింది. రిటైల్, టెలికం రంగాలు నియామకాల్లో ముందున్నాయి. ఏప్రిల్–ఆగస్ట్ మధ్య మొత్తం 32,000 జాబ్లకు పోస్టింగ్‌లు పడినట్టు పేర్కొంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ (బీఎఫ్ఎస్ఐ), రిటైల్, టెలికం రంగాలు జోరును చూపించాయి. ప్రొడక్షన్ ట్రైనీ, బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, కలెక్షన్ ఆఫీసర్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, బ్రాడ్‌బ్యాండ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, వేర్‌హౌస్ అసోసియేట్, కస్టమర్ రిలేషన్ షిప్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎక్కువ నోటిఫికేషన్లు నమోదయ్యాయి. ‘‘పండుగల సీజన్‌కు వ్యాపార సంస్థలు సిద్ధమవుతున్నాయి. దీంతో హైరింగ్‌కు సానుకూల ధోరణి నెలకొంది. ద్రవ్యోల్బణం, లాభదాయకతపై ఒత్తిళ్లు నెలకొన్నప్పటికీ.. తయారీ, బీఎఫ్ఎస్ఐ, రిటైల్‌లో చెప్పుకోతగ్గ మేర నియామకాల్లో వృద్ధి నమోదైంది’’అని క్వెస్‌కార్ప్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు. రిటైల్ పరిశ్రమలో తాత్కాలిక కారి్మకులకు డిమాండ్ 9 శాతం పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. తన ప్లాట్‌ఫామ్‌పై నమోదైన జాబ్ పోస్టింగ్‌ల ఆధారంగా క్వెస్ కార్ప్ ఈ వివరాలు వెల్లడించింది. -
కర్ణాటక బ్యాంక్ : రూ.1.75 లక్షల కోట్లు !
మంగళూరు: కర్ణాటక బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24)లో 17.69 శాతం వృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఉంది. శతాబ్ది సంవత్సరం కావడంతో రూ.1,75,000 కోట్ల టర్నోవర్‌పై అంచనాతో ఉన్నట్టు బ్యాంక్ సీఈవో, ఎండీ ఎంఎస్ మహాబలేశ్వర తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న కర్ణాటక బ్యాంక్ శాఖల సిబ్బందితో మంగళూరులోని ప్రధాన కార్యాలయం నుంచి వర్చవల్‌గా ఆయన మాట్లాడారు. 2023–24 సంవత్సరానికి బ్యాంక్ ప్రణాళికలను వారితో పంచుకున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరానికి టర్నోవర్ 7.63 శాతం వృద్ధితో రూ.1,48,694 కోట్లు (ప్రాథమిక వివరాల ప్రకారం) ఉందని, డిపాజిట్లు రూ.87,362 కోట్లుగా, అడ్వాన్స్‌లు (రుణాలు) రూ.61,326 కోట్లుగా ఉన్నట్టు వివరించారు. బ్యాంక్ కాసా రేషియో 32.97 శాతానికి చేరినట్టు తెలిపారు. రుణాలు, ఆస్తుల పరంగా స్థిరమైన వృద్ధిని గడిచిన ఆర్థిక సంవత్సరంలో నమోదు చేసినట్టు మహాబలేశ్వర చెప్పారు. ఆస్తుల, అప్పుల మెరుగైన నిర్వహణతోపాటు, పెరుగుతున్న వడ్డీ రేట్లు, అంతర్జాతీయ అనిశ్చితుల ప్రభావాన్ని సమర్థంగా అధిగమించినట్టు వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 18తో కర్ణాటక బ్యాంక్ నూరవ సంవత్సరాలోకి అడుగు పెట్టడం గమనార్హం. గడిచిన సంవత్సరానికి కర్ణాటక బ్యాంక్ పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్టు బ్యాంక్ ఈడీ శేఖర్ రావు తెలిపారు. రానున్న త్రైమాసికాల్లో నిర్వహణ రేషియోలను పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు వివరించారు. -
ఐటీఐ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్..
ఐటీఐ మ్యుచువల్ ఫండ్ తాజాగా ఐటీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది నవంబర్ 29తో ముగుస్తుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రదీప్ గోఖలే, ప్రతిభ్ అగర్వాల్ దీనికి ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ప్రధానంగా బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, రేటింగ్ ఏజెన్సీలు, కొత్త తరం ఫిన్‌టెక్ సంస్థలు మొదలైన వాటిలో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. నాణ్యమైన సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని సంస్థ సీఈవో జార్జ్ హెబర్ జోసెఫ్ తెలిపారు. -
ఎల్‌నినో... ఏమి చేయునో
ఎరువుల పరిశ్రమపై రుతుపవనాల ప్రభావం రాబోబ్యాంక్ నివేదిక ముంబై: బలహీనంగా ఉన్న రూపాయి, ఎల్ నినో కారణంగా వర్షాలు ముఖం చాటేసేలా ఉండడం, సబ్సిడీ వ్యవస్థ... వెరసి ఎరువుల రంగంపై మరింత ప్రభావంపడే అవకాశాలున్నాయని బ్యాంకింగ్, ద్రవ్య సేవల సంస్థ రాబోబ్యాంక్ తాజా నివేదికలో పేర్కొన్నారు. ‘ఎరువులకు డిమాండు ఒత్తిడి ఉంది. సబ్సిడీల భారం భరించలేక ఎరువులు, రసాయనాల శాఖ సతమతం అవుతోంది. బలహీనమైన రూపాయి, రుతుపవనాలు ఎరువుల డిమాండుపై ప్రభావం చూపే అవకాశం ఉంది’ అని ఎరువుల పరిస్థితిపై రూపొందించిన తాజా త్రైమాసిక నివేదికలో తెలిపారు. ఈ రిపోర్టులోని ఇతర ముఖ్యాంశాలు: యూరియా సబ్సిడీల చెల్లింపులకు ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ అష్టకష్టాలు పడుతోంది. మునుపటి యూపీఏ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్లో ఎరువుల సబ్సిడీలకు 1,100 కోట్ల డాలర్లు కేటాయించింది. గతేడాది కూడా సబ్సిడీలు చెల్లించలేక సదరు మంత్రిత్వ శాఖ ఇక్కట్లను ఎదుర్కొంటున్నపుడు బ్యాంకులు రంగప్రవేశం చేసి రుణాలు సమకూర్చాల్సి వచ్చింది. యూరియాకు డిమాండు జూలై వరకు మందకొడిగానే ఉండవచ్చు. చైనా నుంచి ఎగుమతుల ప్రారంభం కోసం ఇండియా ఎదురుచూస్తోంది. ఏప్రిల్‌లో దేశంలో 6.75 లక్షల టన్నుల యూరియా నిల్వలున్నాయి. మార్చితో పోలిస్తే ఇది 2 రెట్లు అధికం.ఎరువుల ధరల్లో క్షీణత కన్పిస్తోంది. వచ్చే త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి కొనసాగవచ్చు. భారత్‌లో ఫాస్ఫేట్ ఎరువుల పరిస్థితి ఏమంత బాగాలేదు. రూపాయి మారకం విలువ బలహీనపడితే ఫాస్ఫేట్ దిగుమతుల భారం పెరుగుతుంది. అన్ని రకాల ఎరువులదీ ఇదే పరిస్థితి.