ఐటీఐ మ్యుచువల్ ఫండ్ తాజాగా ఐటీఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఇది నవంబర్ 29తో ముగుస్తుంది. కనీసం రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్ చేయవచ్చు. ప్రదీప్ గోఖలే, ప్రతిభ్ అగర్వాల్ దీనికి ఫండ్ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ప్రధానంగా బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, రేటింగ్ ఏజెన్సీలు, కొత్త తరం ఫిన్‌టెక్ సంస్థలు మొదలైన వాటిలో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తుంది. నాణ్యమైన సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్ల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని సంస్థ సీఈవో జార్జ్ హెబర్ జోసెఫ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment