
తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్న వారి కోసం కోటక్ మహీంద్రా అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (కేఎంఏఎంసీ) ‘ఛోటీ సిప్’ను ప్రవేశపెట్టింది. నెలవారీగా అత్యంత తక్కువగా రూ. 250తో కూడా సిప్ రూపంలో పెట్టుబడులు పెట్టొచ్చు. దీని కింద కనీసం 60 నెలల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాలంలో పెట్టుబడి వృద్ధికి దోహదపడేలా ఇది గ్రోత్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. కొత్త ఇన్వెస్టర్లలో క్రమశిక్షణతో కూడుకున్న పొదుపు అలవాటును పెంపొందించేందుకు ఇది తోడ్పడుతుందని సంస్థ ఎండీ నీలేష్ షా తెలిపారు.
ఆదిత్య బిర్లా సన్ లైఫ్‌లోనూ..
ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ కూడా తాజాగా ఛోటీ సిప్‌ను (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ప్రారంభించింది. డెట్, సెక్టోరల్, థీమ్యాటిక్‌లాంటి కొన్ని ఫండ్స్‌కి తప్ప మిగతా అన్ని రకాల స్కీములకు ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. నెలవారీగా రూ. 250 నుంచి ఈ సిప్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు.
కనీసం 60 వాయిదాలు కట్టాల్సి ఉంటుందని సంస్థ ఎండీ ఎ. బాలసుబ్రమణియన్ తెలిపారు. క్రమశిక్షణతో పెట్టుబడులు పెట్టే ధోరణిని అలవర్చుకునేందుకు ఈ విధానం తోడ్పడగలదని పేర్కొన్నారు. ఇందులో, ముందస్తుగా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment