Kotak
-
స్టార్టప్‌లకు అండగా కోటక్ బిజ్‌ల్యాబ్స్
వినూత్న ఆలోచనలు కలిగిన స్టార్టప్ కంపెనీలకు కోటక్ మహీంద్రా బ్యాంకు ‘కోటక్ బిజ్ ల్యాబ్స్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్’ ద్వారా సాయం అందించాలని నిర్ణయించింది. బ్యాంకు సీఎస్ఆర్ కార్యకలాపాల్లో భాగంగా స్టార్టప్ కంపెనీలు అవి ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి, వారి వ్యాపారాలను సమర్థవంతంగా విస్తరించడానికి ఈ సాయం ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది.ఎవరికి సాయం చేస్తారంటే..అగ్రిటెక్, ఫిన్‌టెక్, ఎడ్టెక్, హెల్త్‌కేర్, సస్టెయినబిలిటీ వంటి రంగాల్లో సర్వీసు అందించే స్టార్టప్ కంపెనీలకు ఈ ప్రోగ్రామ్ ద్వారా సాయం చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. అందుకోసం సమర్థమైన సంస్థలను ఎంచుకునేందుకు ఐఐఎంఏ వెంచర్స్, ఎన్‌ఎస్‌ఆర్‌సీఈఎల్, టీ-హబ్ వంటి టాప్ ఇంక్యుబేటర్ల సహకారం తీసుకోనున్నట్లు కోటక్ బిబ్ల్యాబ్స్ తెలిపింది.ఇదీ చదవండి: అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యం ప్రశ్నార్థకంఎలాంటి సాయం చేస్తారంటే..ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా అవసరమైన కంపెనీలకు మెంటార్ షిప్, మార్కెట్ యాక్సెస్, అడ్వైజరీ సపోర్ట్, వర్క్ షాప్‌లు, ఎకోసిస్టమ్ ఎక్స్ పోజర్, బిజినెస్ డెవలప్మెంట్, సీడ్ ఫండింగ్.. వంటి సహకారాలు అందిస్తుంది. ఎంపిక అయిన 30 స్టార్టప్‌లకు రూ.15 లక్షల వరకు గ్రాంట్లతో సహా సుమారు 50 హై-పొటెన్షియల్ స్టార్టప్‌లకు సపోర్ట్ లభించనుంది. పలు రాష్ట్రాల్లో హైబ్రిడ్ వర్క్‌షాప్‌ల ద్వారా 1,000 స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం ఈ కార్యక్రమం లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. -
తండ్రి బిలియనీర్.. భార్య మిస్ ఇండియా.. అతడెవరో తెలుసా?
బిలియనీర్ల పిల్లలు.. దాదాపు వారి కుటుంబ వ్యాపారాలను చూసుకుంటూ వాటిని అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉంటారు. ఈ కోవకు చెందిన వారిలో ముకేశ్ అంబానీ పిల్లలు (ఇషా, అనంత్, ఆకాష్) మాత్రమే కాకుండా.. ఉదయ్ కోటక్ కుమారుడు జై కోటక్ కూడా ఉన్నారు.జై కోటక్ డిజిటల్ బ్యాంకింగ్ విభాగం కోటక్811కి కో-హెడ్‌గా.. సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఉదయ్ కోటక్ స్థాపించిన కోటక్ మహీంద్రా బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ. 3,53,000 కోట్లు. కాగా ఉదయ్ కోటక్ నికర విలువ 13.4 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు లక్ష కోట్ల కంటే ఎక్కువ.2015లో ఫెమినా మిస్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న ప్రముఖ నటి 'అదితి ఆర్య'ను జై కోటక్ 2023 నవంబర్ 7న పెళ్లి చేసుకున్నారు. కాగా ఈ ఏడాది నవంబర్ 7న వీరిద్దరూ తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా జై తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు.జై కోటక్.. కొలంబియా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. అయితే ఇతడు తన తండ్రి బ్యాంకులో చేరడానికి ముందు, మెకిన్సేలో రెండు సంవత్సరాలు (2012-2014) బిజినెస్ అనలిస్ట్‌గా పనిచేశారు. తర్వాత, అతను 2010లో గోల్డ్‌మన్ సాచ్స్‌లో ఇంటర్న్‌షిప్ పూర్తి చేశారు. -
మిడ్‌క్యాప్‌లో మెరుగైన రాబడి
ఈక్విటీల్లో దీర్ఘకాలానికి పెట్టుబడులు పెట్టాలని భావించే వారు లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు పోర్ట్‌ఫోలియోలో చోటు కల్పించుకోవచ్చు. తమ రిస్క్, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ విభాగానికి ఎంత కేటాయింపులన్నవి తేల్చుకోవాలి. లార్జ్‌క్యాప్‌తో పోల్చిచూసినప్పుడు కొంత రిస్క్ అధికంగా ఉన్నప్పటికీ 10–20 ఏళ్ల కాలంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్ అధిక రాబడులు ఇవ్వగలవు. మిడ్‌క్యాప్ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న వాటిల్లో కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీస్ ఒకటి. దీర్ఘకాల లక్ష్యాల కోసం రిస్క్ భరించే సామర్థ్యం ఉన్నవారు ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. మిడ్క్యాప్తోపాటు లార్జ్‌క్యాప్ పెట్టుబడులకూ ఈ పథకం ప్రాధాన్యం ఇస్తుంటుంది.రాబడులు ఈ పథకం దీర్ఘకాల పనితీరును గమనించినట్టయితే రాబడులు మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 38 శాతానికి పైగా ఉన్నాయంటే పనితీరు ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గడిచిన ఐదేళ్లలో 27 శాతం, ఏడేళ్లలో 18.47 శాతం, పదేళ్లలో 18.84 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చి.. మిడ్‌క్యాప్ విభాగంలోని మెరుగైన పథకాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా ఏడాది, ఏడేళ్లు, పదేళ్ల కాలాల్లో బెంచ్‌మార్క్ సూచీ ‘బీఎస్ఈ 150 మిడ్‌క్యాప్ టీఆర్ఐ’ కంటే ఈ పథకం పనితీరే మెరుగ్గా ఉంది. 2007 మే నెలలో ఈ పథకం మొదలు కాగా, నాటి నుంచి చూస్తే వార్షిక సగటు రాబడి 15.75 శాతంగా ఉంది. ఈ పథకంలో ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసే చార్జీ (ఎక్స్పెన్స్ రేషియో) 1.43 శాతంగా ఉంది.పెట్టుబడుల విధానం కనీసం 65 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు పెట్టుబడులను మిడ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. 2018, 2020 మార్కెట్ కరెక్షన్లలో ఈ పథకం నష్టాలను పరిమితం చేసింది. ఆ తర్వాతి ర్యాలీల్లో మెరుగైన రాబడులను ఇచ్చింది. వృద్ధికి అవకాశం ఉండి, అంతగా వెలుగులోకి రాని పటిష్టమైన కంపెనీలను గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటుంది. పోర్ట్‌ఫోలియోలో వ్యాల్యూ స్టాక్స్‌కు ప్రాధాన్యం ఇస్తుంది. మంచి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే కాదు.. తగిన రాబడులు ఇచ్చే వరకు ఆ పెట్టుబడులు కొనసాగిస్తుంటుంది.ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో 50,627 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇందులో 96 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ పెట్టుబడులు 0.21 శాతంగా ఉన్నాయి. నగదు, నగదు సమానాలు 3.7 శాతంగా ఉన్నాయి. ఈక్విటీల్లో 40 శాతం మేర లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. 58 శాతం పెట్టుబడులను మిడ్‌క్యాప్‌లకు కేటాయించింది. స్మాల్‌క్యాప్ పెట్టుబడులు 1.44 శాతంగా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 66 స్టాక్స్ ఉన్నాయి. ఇందులో టాప్–10 కంపెనీల్లో పెట్టుబడులు 29 శాతంగా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియో కాన్సంట్రేషన్ తక్కువ అని అర్థమవుతోంది. పెట్టుబడుల పరంగా టెక్నాలజీ, మెటీరియల్స్, ఇండస్ట్రియల్స్, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 78 శాతం పెట్టుబడులు ఈ రంగాల కంపెనీల్లోనే ఉన్నాయి.టాప్ ఈక్విటీ హోల్డింగ్స్కంపెనీ పెట్టుబడులు శాతంపర్సిస్టెంట్ సిస్టమ్స్ 4.16 ఒరాకిల్ ఫిన్ 3.51 ఎంఫసిస్ 3.31 ఒబెరాయ్ రియల్టీ 3.11 ఫోర్టిస్ హల్త్‌కేర్ 3.05 ఇప్కా ల్యాబ్ 3.01 కోరమాండల్ 2.49 పీఐ ఇండస్ట్రీస్ 2.39 సోలార్ ఇండస్ట్రీస్ 2.23 సుప్రీమ్ ఇండస్ట్రీస్ 2.19 -
ఐదుగురు సీఈఓల అర్ధాంతర రాజీనామా.. 2023లో ఊహించని పరిణామం!
సరిగ్గా వారం రోజుల్లో ఈ ఏడాది(2023) ముగియనుంది. కొత్త సంవత్సరం సోమవారంతో ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఎన్నో అనూహ్య పరిణామాలకు సాక్షిగా నిలిచింది. ఈ సంవత్సరంలో కార్పొరేట్ ప్రపంచంలో పెను మార్పులు కనిపించాయి. 2023లో పలువురు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉదయ్ కోటక్ (కోటక్ మహీంద్రా బ్యాంక్) ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఉదయ్ కోటక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే నిర్ణీత సమయం కంటే ముందే పదవిని వదిలిపెట్టి, మార్కెట్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచారు. ఉదయ్ కోటక్ ఇంత హఠాత్తుగా ఎందుకు తన పదవిని విడిచిపెట్టారనే దానిపై ఖచ్చితమైన కారణం ఇంకా వెల్లడి కాలేదు. వ్యక్తిగత వ్యవహారాల కారణంగానే ఆయన రాజీనామా చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. 2. రాజేష్ గోపీనాథన్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్/టీసీఎస్) దేశంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్‌లో ఈ ఏడాది నాయకత్వ మార్పు చోటు చేసుకుంది. టీసీఎస్ సీఈవో రాజేష్ గోపీనాథన్ మార్చిలో హఠాత్తుగా రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐదు దశాబ్దాల కంపెనీ చరిత్రలో కేవలం నలుగురు సీఈవోలు మాత్రమే విధులు నిర్వహించారు. 3. వేణు నాయర్ (షాపర్స్ స్టాప్) రిటైల్ స్టోర్ చైన్ షాపర్స్ స్టాప్ సీఈఓ వేణు నాయర్ గత ఆగస్టులో రాజీనామా చేశారు. తన కుటుంబంతో సమయం గడిపేందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కరోనా మహమ్మారి తర్వాత వేణు షాపర్స్ స్టాప్‌లో చేరారు. కంపెనీని ఓమ్నిఛానల్ రిటైలర్‌గా మార్చడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన రాజీనామా మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. ఈ వార్త బయటకు వచ్చాక కంపెనీ షేర్లు 11 శాతం మేరకు పడిపోయాయి. 4. మురళీ రామకృష్ణన్ (సౌత్ ఇండియన్ బ్యాంక్) మురళీ రామకృష్ణన్ ఈ ఏడాది మార్చిలో ఇండియన్ బ్యాంక్ నుండి నిష్క్రమించారు. తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నానని, అందుకే రాజీనామా చేశానని తెలిపారు. 2020 జూలైలో బ్యాంక్‌లో సలహాదారుగా చేరిన రామకృష్ణన్ నాలుగు నెలల వ్యవధిలోనే ఎండీ, సీఈఓగా ఎదిగారు. 5. మాథ్యూ జాబ్ (క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్) క్రాంప్టన్ గ్రీవ్స్ కన్స్యూమర్ ఎలక్ట్రికల్స్ సీఈఓ మాథ్యూ జాబ్ ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇతర కెరీర్ ప్రయోజనాలను కారణంగా చూపుతూ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆకస్మిక రాజీనామా కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఇది కూడా చదవండి: లక్షమంది సామూహిక గీతా పఠనం..ప్రధాని అభినందనలు! -
మాజీ మిస్ ఇండియాను పెళ్లి చేసుకున్న ఉదయ్ కోటక్ కుమారుడు
ప్రసిద్ధ కోటక్ బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్‌కోటక్ కుమారుడు జైకోటక్ మాజీ మిస్ ఇండియాను పెళ్లిచేసుకున్నట్లు తెలిసింది. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం వివాహం జరిగినట్లు కథనాలు వస్తున్నాయి. ముఖేష్ అంబానీ కుటుంబానికి చెందిన ‘అంబానీ_అప్డేట్’ ఇన్‌స్టా హ్యాండిల్లో అంబానీ దంపతులు వివాహానికి హాజరైన చిత్రాలను పోస్ట్ చేసినట్లు తెలిసింది. మే 24, 2023లో జైకోటక్ తనకు కాబోయే భార్య అదితిఆర్య(మాజీ మిస్ ఇండియా) యేల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిందని తన ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేశారు. జైకోటక్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందారు. అదితిఆర్య దిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ సాధించింది. 2015లో అదితి మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఎంబీఏ చదివేందుకు యూఎస్ వెళ్లడానికి ముందు కొన్ని హిందీ, కన్నడ సినిమాలతో పాటు తెలుగులో కల్యాణ్‌రామ్‌తో కలిసి ఇజం సినిమాలో నటించారు. Aditi, my fiancée, completed her MBA from Yale University today. Immensely proud of you @AryaAditi pic.twitter.com/xAdcRUFB0C — Jay Kotak (@jay_kotakone) May 24, 2023 View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) -
కోటక్ ఇన్సూరెన్స్‌లో ‘జ్యూరిక్’కు వాటాలు
ముంబై: సాధారణ బీమా సంస్థ కోటక్ జనరల్ ఇన్సూరెన్స్‌లో (కేజీఐ) స్విట్జర్లాండ్‌కు చెందిన జ్యూరిక్ ఇన్సూరెన్స్ 51 శాతం వాటాలు దక్కించుకోనుంది. ఇందుకోసం రూ. 4,051 కోట్లు వెచి్చంచనుంది. తదుపరి అదనంగా మూడేళ్లలో అదనంగా 19 శాతం వాటాలు కూడా జ్యూరిక్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయనున్నట్లు కేజీఐ మాతృ సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. వృద్ధి అవకాశాలు పటిష్టంగా ఉన్న కీలక మార్కెట్లలో భారత్ కూడా ఒకటని, కేజీఐ తమకు పటిష్టమైన భాగస్వామి కాగలదని జ్యూరిక్ సీఈవో (ఆసియా పసిఫిక్) తులసి నాయుడు తెలిపారు. తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇరు సంస్థల వనరులు, అనుభవం తోడ్పడగలవని కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ దీపక్ గుప్తా పేర్కొన్నారు. ప్రీమియంలపరంగా నాన్–లైఫ్ మార్కెట్లో సెపె్టంబర్లో కేజీఐకి 0.52 శాతం వాటా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం రూ. 1,148 కోట్ల మేర స్థూల ప్రీమియం సాధించింది. కొత్త పెట్టుబడుల అనంతరం సంస్థ విలువ రూ. 7,943 కోట్లుగా ఉండనుంది. -
కోటక్ బ్యాంకుకు కొత్త సీఈఓ, ఎండీ నియామకం
దేశీయ దిగ్గజ బ్యాంక్ అయిన కోటక్ మహీంద్రాకు కొత్త సీఈఓ, ఎండీగా అశోక్ వాస్వానీ నియమితులయ్యారు. బ్యాంక్ ఎండీగా ఉదయ్ కోటక్ వైదొలిగిన తర్వాత తాజా నియామకం జరిగింది. వాస్వానీ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. షేర్ హోల్డర్లు ఆమోదం తెలపాల్సి ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొంది. మూడేళ్ల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు. 2024 జనవరి 1లోగా అశోక్ వాస్వానీ బాధ్యతలు చేపట్టనున్నారు. బ్యాంకింగ్ రంగంలో అశోక్ వాస్వానీకి దాదాపు ముప్పై ఏళ్ల అనుభవం ఉంది. గతంలో అంతర్జాతీయ బ్యాంక్ సిటీ గ్రూప్‌లో పనిచేశారు. బార్క్లేస్ బ్యాంక్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం యూఎస్-ఇజ్రాయెల్ ఏఐ ఫిన్‌టెక్ పగాయా టెక్నాలజీస్ లిమిటెడ్‌కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అంతేకాదు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్, ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్ (యూకే) బోర్డు సభ్యులుగానూ ఉన్నారు. ప్రథమ్, లెండ్ హ్యాండ్ వంటి దాతృత్వ సంస్థల్లో డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్నారు. కోటక్ బ్యాంక్ సీఈఓ, ఎండీగా నియమితులు కావడం పట్ల వాస్వానీ సంతోషం వ్యక్తంచేశారు. స్వదేశానికి తిరిగి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాబోయే ఐదేళ్లలో ప్రపంచంలోని అగ్రశ్రేణి 3 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్‌ను నిలిపే ప్రయాణంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రపంచస్థాయి బ్యాంకర్ అయిన అశోక్.. కోటక్ బ్యాంక్‌ను అద్భుతంగా తీర్చిదిద్దగలరని ఉదయ్ కోటక్ విశ్వాసం వ్యక్తంచేశారు. కోటక్ బ్యాంక్‌ను ఖాతాదారులకు అనుకూల సంస్థగా మార్చేందుకు అశోక్ అనుభవం అక్కరకొస్తుందని తాత్కాలిక ఎండీ, సీఈఓ దీపక్ గుప్తా పేర్కొన్నారు. -
కోటక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ - ఏ కాలంలో అయినా మెరుగైన రాబడి ఇచ్చిన చరిత్ర!
మార్కెట్లో చిన్న, మధ్య, పెద్ద స్థాయి కంపెనీలు ఎన్నో ఉంటాయి. ఇన్వెస్టర్లు కేవలం మెరుగైన రాబడుల దృష్టితోనే కంపెనీలను ఎంపిక చేసుకోకూడదు. పెట్టుబడులకు రక్షణ ఉండాలి. అదే సమయంలో దీర్ఘకాలంలో కాస్తంత మెరుగైన రాబడులు ఆశించాలి. ఈ దృష్ట్యా చూస్తే ఫ్లెక్సీక్యాప్ పథకాలు అనుకూలమైనవి. ఇవి లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కు ఎక్కువ కేటాయింపులు చేస్తూ.. అదే సమయంలో అధిక రాబడుల కోణంలో మిడ్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌కు సైతం కొంత చొప్పున కేటాయింపులు చేస్తుంటాయి. ఈ విభాగంలో కోటక్ ఫ్లెక్సీక్యాప్ ఫండ్ మెరుగైన పనితీరు చూపిస్తోంది. తమ పెట్టుబడులకు కొంత రిస్క్ ఉన్నా ఫర్వాలేదని భావించే వారికి ఈ విభాగం అనుకూలంగా ఉంటుంది. రాబడులు అన్ని కాలాల్లోనూ మెరుగైన రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. గడిచిన ఆరు నెలల్లో ఈ పథకంలో రాబడి 15 శాతంగా ఉంది. ఏడాదిలో 21 శాతం రాబడిని ఇచ్చింది. ఇక మూడేళ్ల కాలంలో చూస్తే పెట్టుబడులపై వార్షిక ప్రతిఫలం 21 శాతం చొప్పున ఉంది. ఐదేళ్ల కాలంలో ఏటా 15.52 శాతం చొప్పున, ఏడేళ్లలో 14 శాతం, పదేళ్లలో ఏటా 17.63 శాతం చొప్పున ఈ పథకం ఇన్వెస్టర్లకు రాబడిని తెచ్చి పెట్టింది. ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడి కంటే ఈ పథకం పదేళ్ల కాలంలో మెరుగ్గా పనిచేసింది. బీఎస్ఈ 500 టీఆర్ఐతో పోలిస్తే ఏడాది, పదేళ్ల కాలంలో మెరుగైన రాబడిని అందించింది. గత మూడేళ్లలో మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు గురైన పరిస్థితులు చూశాము. పైగా ఈక్విటీల్లో కనీసం ఐదేళ్లు, అంతకుమించిన కాలానికే ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది నిపుణుల సూచన. కనుక ఐదేళ్లు, అంతకుమించి కాలానికి రాబడులనే ప్రధానంగా చూడాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే ఈ పథకం మెరుగైన పనితీరును చూపించింది. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో మల్టీక్యాప్ ఫండ్స్ అన్ని రకాల మార్కెట్ విలువలతో కూడిన స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అంటే లార్జ్‌క్యాప్‌తోపాటు, మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేస్తుంది. మార్కెట్లో ఎప్పుడూ అన్ని విభాగాలు ఒకే రీతిలో పని చేస్తాయని చెప్పలేం. కొన్ని సందర్భాల్లో లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఎక్కువ ర్యాలీ ఉండొచ్చు. గడిచిన ఆరు నెలల్లో చూసినట్టు.. కొన్ని సందర్భాల్లో మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీలు లార్జ్‌క్యాప్ కంటే అధిక రాబడులు ఇస్తుంటాయి. దీర్ఘకాలంలోనూ వీటి మధ్య రాబడుల పరంగా వ్యత్యాసం ఉంటుంది. కనుక మల్టీక్యాప్ ఫండ్స్ అన్నింటి మిశ్రమంగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.40,685 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 98.71 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. మిగిలినది నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 76 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయించింది. మిడ్‌క్యాప్ కంపెనీలకు 23.49 శాతం కేటాయింపులు చేసింది. స్మాల్‌క్యాప్‌లో పెట్టుబడులు ఒక శాతంలోపే ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలో 52 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 27 శాతం మేర ఈ రంగానికి చెందిన కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేసింది. ఆటోమొబైల్ కంపెనీలకు 11.60 శాతం, క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు 8.77 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 7.48 శాతం, మెటీరియల్స్ కంపెనీలకు 6.82 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
రత్తన్‌ఇండియా పవర్లో కొటక్ మహీంద్రా బ్యాంక్ పెట్టుబడులు
ముంబై: రెండు అనుబంధ సంస్థల ద్వారా రత్తన్‌ఇండియా పవర్ లిమిటెడ్(ఆర్ఐపీఎల్)లో రూ. 732 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు కొటక్ మహీంద్రా బ్యాంక్ వెల్లడించింది. మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీఏలు) జారీ ద్వారా చేపట్టిన తాజా పెట్టుబడులతో బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ రుణ చెల్లింపు వ్యయాలు తగ్గేందుకు వీలు చిక్కనున్నట్లు పేర్కొంది. కొటక్ స్ట్రాటజిక్ సిట్యుయేషన్స్ ఇండియా ఫండ్–2 ద్వారా రూ. 582 కోట్లు, కొటక్ ప్రయివేట్ క్రెడిట్ ఫండ్(కేపీసీఎఫ్) ద్వారా రూ. 150 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు తెలియజేసింది. తగిన రిస్క్ సర్దుబాటు చేసిన రాబడుల కోసం క్యాపిటల్ స్టాక్‌లో పాల్గొన్న తమ కొత్త క్రెడిట్ ఫండ్స్ నుంచి ఇది మొదటి పెట్టుబడి అని కోటక్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీని శ్రీనివాసన్ పేర్కొన్నారు.ృ -
పేటీఎమ్ నష్టాలు.. బుల్లెట్ ట్రైన్ బడ్జెట్ అంత !
ముంబై: భారత్‌లో ఈ కామర్స్ సంస్థలకు భారీగా నష్టాలు వస్తున్నాయి. రానున్న సంవత్సరాల్లో ఈ నష్టాలు మరింతగా పెరగగలవని కోటక్ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. మొబైల్ చెల్లింపుల సంస్థ, పేటీఎమ్ రెండేళ్ల క్రితం ఆరంభించిన పేటీఎమ్ మాల్‌కు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,806 కోట్ల మేర నష్టాలు వచ్చాయని ఈ నివేదిక పేర్కొంది. ఈ నష్టాలు.... ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైయిన్ ప్రాజెక్ట్‌కు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ ఏడాది కేటాయించిన రూ.1,800 కోట్ల బడ్జెట్‌కు సమానమని వివరించింది. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.., ♦ పేటీఎమ్ కంపెనీ 2016–17 ఆర్థిక సంవత్సరంలో పేటీఎమ్ మాల్తో ప్రత్యేక ఈ కామర్స్ కంపెనీని ఏర్పాటు చేసింది. ♦ ఇప్పటివరకూ ఈ రంగంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలకు భారీ నష్టాలు వచ్చేవి. ♦ తాజాగా ఈ జాబితాలో పేటీఎమ్ కూడా చేరింది. ♦ గత ఆర్థిక సంవత్సరంలో పేటీఎమ్ మాల్‌కు రూ.744 కోట్ల ఆదాయం రాగా, రూ.1,806 కోట్ల నష్టాలు వచ్చాయి. ♦ పేటీఎమ్ మాల్‌కు 2016–18 ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం రూ.1,971 కోట్ల నష్టాలు వచ్చాయి. ఇది, ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈ కంపెనీ సమీకరించిన మొత్తం నిధుల్లో (రూ..4,508 కోట్లు) 44 శాతానికి సమానం. ♦ భారత ఈ కామర్స్ రంగంలో నష్టాలు భారీగా వస్తున్నా, వాల్‌మార్ట్, అమెజాన్ కంపెనీలు తమ భారత సంస్థల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగిస్తున్నాయి. పేటీఎమ్‌కు దన్నుగా ఉన్న ఆలీబాబా కూడా ఇదే రీతిగా ఆలోచిస్తోంది. ♦ భారత్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్లైన్ రిటైల్ సంస్థల్లో పేటీఎమ్ మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో అమెజాన్, ప్లిప్‌కార్ట్‌లు ఉన్నాయి. ♦ సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్, అలీబాబాడాట్‌కామ్‌ల నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో పేటీఎమ్ మాల్ రూ.2,900 కోట్లు సమీకరించింది. -
పతనాల్లో పెట్టుబడులకు రక్షణ! కోటక్ సెలక్ట్ ఫోకస్ ఫండ్
ఈ మ్యూచువల్ ఫండ్ పథకం ఎక్కువగా లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. మార్కెట్ల ర్యాలీ సమయాల్లో లాభాలను ఒడిసి పట్టుకోవటానికి మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువ పెట్టుబడులు పెడుతుంది. మార్కెట్లు బాగా పెరిగి కరెక్షన్కు గురయ్యే సమయంలో రిస్క్ తగ్గించేందుకు, పెట్టుబడుల విలువ గణనీయంగా పడిపోకుండా కాపాడేందుకు డెట్ సాధనాల్లో ఎక్స్పోజర్ పెంచుకోవడం, నగదు నిల్వలు పెంచుకోవడం చేస్తుంటుంది. మోస్తరు రిస్క్ భరించగలిగే వారు, కనీసం 5–7 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేయగలిగిన వారు పెట్టుబడులు పెట్టేందుకు ‘కోటక్ సెలక్ట్ ఫోకస్ ఫండ్’ను పరిశీలించొచ్చు. పనితీరు ఎలా ఉందంటే... దీర్ఘకాలంలో ఈ పథకం పనితీరు ఆశాజనకంగా ఉంది. లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లో మెరుగైన రేటింగ్ విషయంలో గత ఐదు సంవత్సరాలుగా చోటు సంపాదించుకుంది. రాబడుల విషయంలో బెంచ్‌మార్క్ కంటే మెరుగ్గా ఉంది. ఈ పథకం రాబడులకు నిఫ్టీ 200 బెంచ్‌మార్క్‌గా ఉంది. మూడు, ఐదేళ్ల కాలంలో చూస్తే బెంచ్‌మార్క్ కంటే 4–7 శాతం అధిక రాబడులు, ఈ విభాగం మొత్తం రాబడులతో పోల్చి చూసుకుంటే 4–6 శాతం రాబడులు అధికంగా ఇచ్చింది. అయితే గత ఏడాది కాలంలో రాబడులు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈ కాలంలో మిడ్‌క్యాప్ స్టాక్స్ ర్యాలీ చేయడం, ఈ పథకం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసి ఉండడం కారణం. పోర్ట్‌ఫోలియో ఇదీ..: ప్రస్తుతం ఈ పథకం 85–90 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేసి ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎల్అండ్టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులో అధిక పెట్టుబడులు ఉన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌కు కేటాయింపులు ఎక్కువగా చేసింది. బ్యాంకింగ్ రంగంలో 22 శాతం, ఫైనాన్షియల్ సెక్టార్లో 12 శాతం ఇన్వెస్ట్ చేసింది. డెట్ సాధనాల్లో 8 శాతం పెట్టుబడులు ఉన్నాయి. ఎంఆర్ఎఫ్, మారుతి సుజుకి, బ్రిటానియా, బజాజ్ ఫిన్సర్వ్ స్టాక్స్ ఈ పథకానికి మంచి లాభాలను తెచ్చిపెట్టాయి. ఇవి గడిచిన ఏడాది కాలంలో 20–50 శాతం వరకు ర్యాలీ చేశాయి. సన్‌ఫార్మా, టాటా మోటార్స్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 20– 25 శాతం వరకు తగ్గిపోవడం పథకం రాబడులపై ప్రభావం చూపింది. జుబిలెంట్ ఫుడ్ వర్క్స్, బాటా ఇండియా, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ స్టాక్స్ ఇటీవల పోర్ట్‌ఫోలియోలోకి కొత్తగా వచ్చి చేరాయి. సగటు కంటే ఎక్కువ రాబడులు ఆశించే వారికి అనువైన పథకం ఇది. - (సాక్షి, బిజినెస్ విభాగం) -
ద్రవ్యోల్బణం.. వడ్డీ రేట్లు కిందికి!
నోట్ల రద్దుపై సిటీ గ్రూప్, హెచ్ఎస్బీసీ, కొటక్ అంచనా న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం రానున్న నెలల్లో అదుపులో ఉంటుందని పలు ఆర్థిక సేవల దిగ్గజ సంస్థలు అంచనా వేస్తున్నారుు. ఈ నేపథ్యంలో రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్ప కాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.25 శాతం) తగ్గే అవకాశం ఉందని సిటీగ్రూప్, కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్, హెచ్ఎస్బీసీ సంస్థలు అభిప్రాయపడుతున్నారుు. డిసెంబర్ 7వ తేదీన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరగనున్న నేపథ్యంలో మూడు సంస్థల నివేదికలు... వాటి అంచనాలను చూస్తే... ద్రవ్యోల్బణం 4 శాతం లోపే..: సిటీ గ్రూప్ నవంబర్ - డిసెంబర్లో వినియోగ ధరల సూచీ ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం 4 శాతం దిగువనే ఉంటుంది. అరుుతే మార్చి నాటికి 4.5 శాతానికి చేరే వీలుంటుంది. ఈ నేపథ్యంలో పరపతి విధాన తదుపరి సరళీకరణ ఉండే వీలుంది. ‘‘డిసెంబర్లో రేటు కోత ఉంటుందన్న మా అంచనాలను కొనసాగిస్తున్నాం. అరుుతే ఇక్కడ ఆయా అంచనాలు అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకుల వంటి అంశాలపైనా ఆధారపడి ఉంటుంది. ద్రవ్యలభ్యత, గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ పరిణామాలు ఎలా ఉంటాయన్న అంశాన్ని పరిశీలిస్తున్నాం’’అని సిటీగ్రూప్ నివేదిక తెలిపింది. నోట్ల రద్దుతో డిమాండ్ డౌన్: కొటక్ పెద్ద నోట్ల రద్దుతో స్వల్పకాలంలో వ్యవస్థలో డిమాండ్ తగ్గుదలకు దోహదం చేసే అంశం. ఇది ద్రవ్యోల్బణం అదుపునకు, ఆర్బీఐ రేటు కోతకు దోహదపడే వీలుంది. డిసెంబర్లో 25 బేసిస్ పారుుంట్ల రెపో రేటు తగ్గే వీలుంది. డిమాండ్ భారీగా పడిపోతే రేటు కోత 50 బేసిస్ పారుుంట్ల వరకూ సైతం తగ్గవచ్చు. పెద్ద నోట్ల రద్దు ప్రతికూల ప్రభావం రియల్టీ సంబంధిత రంగాలు, రిటైల్ వ్యాపారం, ఇతర వినియోగ వస్తువుల విభాగాలపై ఉండే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 4.5 శాతం 5 శాతం శ్రేణిలో ఉండే వీలుంది. హెచ్ఎస్బీసీదీ అదే మాట పెద్దనోట్ల రద్దు కారణంగా వ్యవస్థలో డిమాండ్ తగ్గుతుందని హెచ్ఎస్బీసీ కూడా తన నివేదికలో పేర్కొంది. ఇది ద్రవ్యోల్బణం అదుపులో ఉండడానికి దోహదపడే అంశమని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రోపో రేటు పావుశాతం తగ్గే వీలుందని తెలిపింది ‘ మార్చి నాటికి ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యం 5 శాతం. పెద్ద నోట్ల రద్దు, క్రూడ్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో అదుపులో ఉండడం వంటి అంశాలు అటు టోకు ఇటు రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులో ఉండడానికి దోహదపడే అంశాలు. అరుుతే ఆయా అంశాలన్నీ అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకుల తీవ్రతపై ఆధారపడి ఉంటాయని కూడా నివేదిక పేర్కొంది.