వినూత్న ఆలోచనలు కలిగిన స్టార్టప్ కంపెనీలకు కోటక్ మహీంద్రా బ్యాంకు ‘కోటక్ బిజ్ ల్యాబ్స్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్’ ద్వారా సాయం అందించాలని నిర్ణయించింది. బ్యాంకు సీఎస్‌ఆర్ కార్యకలాపాల్లో భాగంగా స్టార్టప్ కంపెనీలు అవి ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి, వారి వ్యాపారాలను సమర్థవంతంగా విస్తరించడానికి ఈ సాయం ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది.
ఎవరికి సాయం చేస్తారంటే..
అగ్రిటెక్, ఫిన్‌టెక్, ఎడ్‌టెక్, హెల్త్‌కేర్, సస్టెయినబిలిటీ వంటి రంగాల్లో సర్వీసు అందించే స్టార్టప్ కంపెనీలకు ఈ ప్రోగ్రామ్ ద్వారా సాయం చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. అందుకోసం సమర్థమైన సంస్థలను ఎంచుకునేందుకు ఐఐఎంఏ వెంచర్స్, ఎన్‌ఎస్‌ఆర్‌సీఈఎల్, టీ-హబ్ వంటి టాప్ ఇంక్యుబేటర్ల సహకారం తీసుకోనున్నట్లు కోటక్ బిబ్‌ల్యాబ్స్ తెలిపింది.
ఇదీ చదవండి: అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యం ప్రశ్నార్థకం
ఎలాంటి సాయం చేస్తారంటే..
ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా అవసరమైన కంపెనీలకు మెంటార్ షిప్, మార్కెట్ యాక్సెస్, అడ్వైజరీ సపోర్ట్, వర్క్ షాప్‌లు, ఎకోసిస్టమ్ ఎక్స్ పోజర్, బిజినెస్ డెవలప్‌మెంట్, సీడ్ ఫండింగ్.. వంటి సహకారాలు అందిస్తుంది. ఎంపిక అయిన 30 స్టార్టప్‌లకు రూ.15 లక్షల వరకు గ్రాంట్లతో సహా సుమారు 50 హై-పొటెన్షియల్ స్టార్టప్‌లకు సపోర్ట్ లభించనుంది. పలు రాష్ట్రాల్లో హైబ్రిడ్ వర్క్‌షాప్‌ల ద్వారా 1,000 స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం ఈ కార్యక్రమం లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment