Initiative
-
స్టార్టప్‌లకు అండగా కోటక్ బిజ్‌ల్యాబ్స్
వినూత్న ఆలోచనలు కలిగిన స్టార్టప్ కంపెనీలకు కోటక్ మహీంద్రా బ్యాంకు ‘కోటక్ బిజ్ ల్యాబ్స్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్’ ద్వారా సాయం అందించాలని నిర్ణయించింది. బ్యాంకు సీఎస్ఆర్ కార్యకలాపాల్లో భాగంగా స్టార్టప్ కంపెనీలు అవి ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి, వారి వ్యాపారాలను సమర్థవంతంగా విస్తరించడానికి ఈ సాయం ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది.ఎవరికి సాయం చేస్తారంటే..అగ్రిటెక్, ఫిన్‌టెక్, ఎడ్టెక్, హెల్త్‌కేర్, సస్టెయినబిలిటీ వంటి రంగాల్లో సర్వీసు అందించే స్టార్టప్ కంపెనీలకు ఈ ప్రోగ్రామ్ ద్వారా సాయం చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. అందుకోసం సమర్థమైన సంస్థలను ఎంచుకునేందుకు ఐఐఎంఏ వెంచర్స్, ఎన్‌ఎస్‌ఆర్‌సీఈఎల్, టీ-హబ్ వంటి టాప్ ఇంక్యుబేటర్ల సహకారం తీసుకోనున్నట్లు కోటక్ బిబ్ల్యాబ్స్ తెలిపింది.ఇదీ చదవండి: అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యం ప్రశ్నార్థకంఎలాంటి సాయం చేస్తారంటే..ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా అవసరమైన కంపెనీలకు మెంటార్ షిప్, మార్కెట్ యాక్సెస్, అడ్వైజరీ సపోర్ట్, వర్క్ షాప్‌లు, ఎకోసిస్టమ్ ఎక్స్ పోజర్, బిజినెస్ డెవలప్మెంట్, సీడ్ ఫండింగ్.. వంటి సహకారాలు అందిస్తుంది. ఎంపిక అయిన 30 స్టార్టప్‌లకు రూ.15 లక్షల వరకు గ్రాంట్లతో సహా సుమారు 50 హై-పొటెన్షియల్ స్టార్టప్‌లకు సపోర్ట్ లభించనుంది. పలు రాష్ట్రాల్లో హైబ్రిడ్ వర్క్‌షాప్‌ల ద్వారా 1,000 స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం ఈ కార్యక్రమం లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. -
‘వన్ డే వన్ జినోమ్’ లక్ష్యం ఏంటంటే..
న్యూఢిల్లీ: మానవ ఆరోగ్యంతోపాటు వ్యవసాయం, పర్యావరణ రంగాల్లోనూ ఎన్నోవిధాలుగా ఉపయోగపడే సూక్ష్మజీవి ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు ఇంకో గొప్ప ప్రయత్నం మొదలైంది. కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం, బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నొవేషన్ కౌన్సిల్ (బ్రిక్)లు సంయుక్తంగా ఈ పనిని చేపట్టాయి. ‘వన్ డే వన్ జినోమ్’ పేరుతో న్యూఢిల్లీలో మొదలైన ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ తదితర సూక్ష్మజీవులపై విసృ్తతస్థాయిలో పరిశోధనలు చేపట్టనున్నారు. వాటి జన్యుక్రమాలను నమోదు చేయడమే కాకుండా.. విశ్లేషించనున్నారు. తద్వారా దేశంలోని వైవిధ్యభరితమైన సూక్ష్మజీవులను మన ప్రయోజనాలకు ఉపయోగించుకోనున్నారు. ఈ నెల తొమ్మిదిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో ఈ ‘వన్ డే వన్ జినోమ్’ కార్యక్రమం మొదలైంది. నీతీఆయోగ్ మాజీ సీఈవో జీ20 షేర్పా అమితాబ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు. జీవావరణ వ్యవస్థలో మైక్రోఆర్గానిజమ్స్ లేదా సూక్ష్మజీవులు చాలా కీలకం. మట్టి ఏర్పాటు మొదలుకొని ఖనిజాల శుద్ధీకరణ వరకూ బోలెడన్ని పనులు చేస్తూంటాయి ఇవి. వ్యవసాయం విషయానికి వస్తే నేలలో పోషకాలను రీసైకిల్ చేయడం, నైట్రోజన్‌ను మట్టిలోకి చేర్చడం, చీడపీడల నియంత్రణ, వంటి పనులన్నింటికీ బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులే కారణం. అంతేకాదు.. ఈ సూక్ష్మజీవులు మొక్కలతో కలసిమెలిసి ఉంటూ నీరు పోషకాలు సక్రమంగా అందేలా చేస్తాయి. మానవ శరీరంలో కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉన్నాయంటేనే వాటి ప్రాధాన్యత ఏమిటన్నది అర్థమవుతుంది. తిన్న ఆహారం జీర్ణం చేయడంలో, శరీరానికి పోషకాలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తూంటాయి. అలాగే మనకొచ్చే ఇన్ఫెక్షన్లకూ ఈ సూక్ష్మజీవుల్లోని కొన్ని కారణమవుతుంటాన్నది మనకు తెలుసు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్నది కాబట్టే వీటి గురించి మరింత విసృ్తత స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరమం ఉందంటోంది ‘వన్ డే వన్ జినోమ్’!అయితే ఇప్పటివరకూ సూక్ష్మజీవి ప్రపంచాన్ని అర్థం చేసుకున్నది చాలా తక్కువే. అందుకే వేర్వేరు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ల జన్యుక్రమాన్ని విశ్లేషించే లక్ష్యంతో వన్ డే వన్ జినోమ్ కార్యక్రమం మొదలైంది. తద్వారా ఏ సూక్ష్మజీవుల ద్వారా ముఖ్యమైన ఎంజైమ్‌లు లభిస్తున్నాయి? రోగాలకు చెక్‌పెట్టేందుకు ఉపయోగపడే రసాయనాలు ఉన్నాయన్న విషయం తెలుస్తుంది. వ్యవసాయంలోనూ మొక్కకు మేలు చేయగల, దిగుబడి పెంచగల సూక్ష్మజీవులను గుర్తించే వీలేర్పడుతుంది. బ్రిక్తోపాటు బయోమెడికల్ జినోమిక్స్ కూడా చురుకుగా పాల్గొంటున్న ఈ కార్యక్రమం ద్వారా ఏ ప్రాంతంలో ఏ రకమైన బ్యాక్టీరియా అందుబాటులో ఉందో? వాటి లక్షణాలేమిటో తెలుసుకోవచ్చు. ఇది కూడా చదవండి: అణ్వాయుధ దాడికి పుతిన్ ఆదేశం.. ప్రపంచదేశాల ఆందోళన -
ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్! ఇంటి వద్దకే ప్రభుత్వ బ్యాంక్ సేవలు
ప్రముఖ పబ్లిక్ సెక్టార్ ఇండియన్ బ్యాంక్ (Indian Bank) కస్టమర్ల కోసం సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు ‘ఐబీ సాథీ’ (IB SAATHI - సస్టైనబుల్ యాక్సెస్ అండ్ అలైనింగ్ టెక్నాలజీ ఫర్ హోలిస్టిక్ ఇన్‌క్లూజన్)ను రూపొందించింది. ‘ఐబీ సాథీ’ కస్టమర్లకు అవసరమైన ప్రాథమిక బ్యాంకింగ్ సేవలతో పాటు అదనపు సర్వీసులు అందించడాన్ని సులభతరం చేస్తుంది. ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎస్ఎల్ జైన్ చెన్నైలోని తమ కార్పొరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాథమిక బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యం ‘ఐబీ సాథీ’ కార్యక్రమం ద్వారా ఇండియన్ బ్యాంక్ తన అన్ని శాఖలలో రోజుకు కనీసం నాలుగు గంటల పాటు కస్టమర్లకు ప్రాథమిక బ్యాంకింగ్ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు అదనంగా బ్యాంక్ కరస్పాండెంట్లు నేరుగా కస్టమర్ల ఇంటి వద్దకే వెళ్లి సేవలు అందిస్తారు. (కస్టమర్లకు షాకిచ్చిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్! సెప్టెంబర్ 21 నుంచే..) ఇందు కోసం 2024 మార్చి నాటికి సుమారు 5,000 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకోవాలని ఇండియన్ బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. దీని వల్ల కస్టమర్లకు మరింత చేరువ కావచ్చని భావిస్తోంది. 36 రకాల సేవలు ఇండియన్ బ్యాంక్‌కు ప్రస్తుతం 10,750 మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్లు, 10 మంది కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్లు ఉన్నారు. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా బ్యాంకింగ్ కరస్పాండెంట్ల సంఖ్యను 15,000లకు, కార్పొరేట్ బిజినెస్ కరస్పాండెంట్ల సంఖ్య 15కు పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్ తన బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఛానెల్ ద్వారా కస్టమర్లకు 36 రకాల సేవలు అందిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 60కి పైగా సేవలు పెరగనున్నాయి. -
మహిళా స్టార్టప్‌లకు నిధుల సాయం, ఎవరు? ఎలా?
హైదరాబాద్: మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎలైట్ ఫుడ్స్ అండ్ ఇన్నోవేషన్స్ గ్రూప్ ‘స్కేల్ యువర్ స్టార్టప్’ పేరుతో క్తొత కార్యక్రమాన్ని ప్రారంభించింది. రూ.10 లక్షలకు మించిన ఆదాయం గడించే మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వనుంది. స్టార్టప్‌లకు ఆర్థిక సాయం, మార్గదర్శకం అందించాలన్నది ఎలైట్ గ్రూప్ చైర్మన్, ఎండీ టీఆర్ రఘులాల్ కలల ప్రాజెక్టు అని తెలిపింది. మహిళల ఆధ్వ ర్యంలో నడుస్తూ, వారి వాటా కనీసం 51 శాతం ఉంటే, ఏప్రిల్ 10 వరకు ఎలైట్కనెక్ట్ డాట్ ఇన్ఫో వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. (చదవండి: ట్విటర్ మాజీ సీఈవోపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టు) స్టార్టప్‌ల ఎంపిక ప్రమాణాలు టీం, మార్కెట్, వ్యాపార నమూనా ,సామాజిక ప్రభావం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.. వివిధ పరిశ్రమల రంగాలకు చెందిన నిపుణుల బృందం ఎంపిక ప్రక్రియను చేపట్టనుంది. "మహిళా పారిశ్రామికవేత్తలు వారి కలలను సాధించడానికి , వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి తోడ్పాటు అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించడమే తమ లక్ష్యమన్నారు ఎలైట్ ఫుడ్స్ అండ్ ఇన్నోవేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దానేసా రఘులాల్ . (యాక్సెంచర్ సంచలనం: ఏకంగా 19వేల మందికి ఉద్వాసన) ఇదీ చదవండి: ‘నాటు నాటు’ ఫీవర్: నా వల్ల కావడం లేదు..ఇదే లాస్ట్! ఆనంద్ మహీంద్ర -
సీఎం జగన్ చొరవతో అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి చికిత్స
-
పామాయిల్ సాగుకన్నా ముఖ్యం ఇదీ...
ప్రపంచ వాణిజ్య సంస్థ విధివిధానాలను నెరవేర్చడం కోసం దిగుమతి పన్నులను క్రమానుగతంగా తగ్గించడాన్ని భారత్ మొదలెట్టినప్పుడు ‘ఎల్లో రివల్యూషన్’ (నూనెగింజల ఉత్పత్తి) ద్వారా దేశం సాధించిన ఫలితాలు హరించుకుపోయాయి. వంటనూనెల దిగుమతిపై దేశం 300 శాతం వరకు పన్ను విధించే అవకాశం ఉన్నప్పటికీ ఒకవైపు దిగుమతి లాబీలు, మరోవైపు దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తల ఒత్తిడితో దిగుమతి పన్ను రేట్లను ఒక దశలో జీరోకి తగ్గించేశారు. దీంతో స్వల్ప కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద వంటనూనెల దిగుమతిదారుగా భారత్ మారిపోయింది. పామాయిల్ సాగుకోసం భూమిని అధికంగా కేటాయించడానికి బదులుగా, మనం మర్చిపోయిన ‘నూనెగింజల విప్లవా’న్ని పునరుద్ధరించడం తక్షణావసరంగా ఉంది. కొన్ని రోజుల క్రితం పామాయిల్ని దేశీ యంగా ఉత్పత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వంటనూనెలు– ఆయిల్ పామ్‌పై జాతీయ మిషన్ (ఎన్ఎమ్ఈఓ–ఓపీ) కోసం రూ. 11,040 కోట్లకు ఆమోదముద్ర వేసింది. వంట నూనెల దిగుమతిపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించుకోవడమే దీని లక్ష్యం. కాయధాన్యాలు, నూనెగింజలకు సంబంధించిన ఉత్పత్తి పరి స్థితులపై చర్చించడానికి ఒక టీవీ ప్యానెల్లో కూర్చున్నాను. ఆ ప్యానెల్లో నీతి ఆయోగ్ సభ్యుడొకరు ముఖ్యమైన సమాచారం తెలిపారు. రాబోయే కొన్నేళ్లలో దేశీయ వంటనూనెల అవసరాల్లో 40 శాతం పైగా పామాయిల్ సాగు ద్వారా పూరించాలన్నదే ఈ పథకం లక్ష్యమట. పర్యావరణ, వాతావరణ కారణాల వల్ల పామాయిల్ ఇప్పటికే ఆరోగ్యపరమైన వివాదంలో చిక్కుకుని ఉన్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వ తాజా పథకం దిగ్భ్రాంతిని కలిగించింది. ఇతర వంటనూనెలతో పోలిస్తే పామాయిల్ ధర తక్కువ కాబట్టి నీతినియమాలు లేని వర్తకులు తరచుగా పామాయిల్ని ఇతర వంటనూనెలతో కల్తీ చేసి ప్రయోజనం పొందుతున్నారు. పైగా స్థానిక ఉత్పత్తి, స్థానిక అవసరాలపై ఆధారపడి దేశంలో అనేకరకాల ఆరోగ్యకరమైన వంటనూనెలు అంటే– ఆవ, పొద్దుతిరుగుడు, వేరుశనగ, నువ్వులు, కుసుమలు, వెర్రి నువ్వులు (ఒడిసలు) వంటి నూనె గింజలపై భారతీయులు సాంప్రదాయకంగా ఆధారపడి ఉన్నారు. అందుకే భారతీయులు పామాయిల్ పట్ల ఏ ఆసక్తీ చూపలేదు. పైగా పామాయిల్ని జంక్ ఫుడ్, ప్రాసెసింగ్ పరిశ్రమ, సౌందర్య ఉత్పత్తులు, షాంపూ, డిటర్జెంట్స్, క్యాండిల్స్, టూత్ పేస్టులు వంటి వేగంగా అమ్ముడయ్యే వినియోగదారీ ఉత్పత్తులలో ఉపయోగించడానికే పరిమితం చేస్తున్నారు. పామాయిల్ దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రతిపాదిం చిన కేంద్ర పథకం గురించి మనం మొదటగా తెలుసుకుందాం. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సమాచారం ప్రకారం 2025–26 నాటికి దేశంలో పది లక్షల హెక్టార్లలో పామాయిల్ తోటల సాగును పెంచాలనీ, 2029–30 నాటికి దీన్ని 16.7 లక్షల హెక్టార్లకు విస్తరించాలని కేంద్ర పథకం లక్ష్యం. ఈ కొత్త పంటలో చాలా భాగాన్ని పర్యావరణపరంగా దుర్బలంగా ఉండే ఈశాన్య భారత్‌లో, అండమాన్, నికోబార్ దీవుల్లో సాగు చేయనున్నారు. పామాయిల్ సాగుకోసం అవసరమైన ఉత్పాదకాలకు రాయితీ కల్పించడతోపాటు, ప్రారంభ సంవత్సరాల్లో ఎరువులపై ఖర్చును నూరుశాతం రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వనున్నారు కాబట్టి రైతులు పామాయిల్ సాగుపట్ల తప్పక ఆకర్షితులవుతారు. పైగా ధరల హెచ్చుతగ్గులను అధిగమించడానికి పామాయిల్ సాగుకు గ్యారంటీ ధర చెల్లిస్తామనే హామీని కూడా కేంద్ర పథకం ప్రతిపాదిం చింది. టోకు ధరల సూచీకి అనుగుణంగా గత అయిదేళ్లలో సగటు ముడి పామాయిల్ ధరపై ఆధారపడి పామాయిల్ ధరను నిర్ణయించనున్నారని సమాచారం. ఒకవేళ ప్రాసెసింగ్ పరిశ్రమ పామాయిల్ సాగు రైతులకు ఇచ్చిన హామీమేరకు ధర చెల్లించకపోతే, రెండు శాతం ప్రోత్సాహకాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. భారతదేశం తన వంట నూనెల అవసరాల్లో దాదాపు 55 నుంచి 60 శాతం దిగుమతుల ద్వారా తీర్చుకుంటోంది కానీ, దిగుమతుల చెల్లింపుల అంతరం మొత్తంమీద రూ. 75 వేల కోట్లకు చేరుకుంది. పర్యావరణ వైపరీత్యాలకు ప్రధాన కారణం పెరుగుతున్న అడవుల నిర్మూలన, జీవవైవిధ్య విధ్వంసమేనని వాతావరణ మార్పుపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ (ఐపీసీసీ) పదేపదే హెచ్చరిస్తూ వచ్చింది. సహజ వర్షాటవుల స్థానంలో వైవిధ్య రహితమైన తోటలను సాగుచేసే ప్రయత్నాలు అత్యంత విలువైన జీవజాతులు నశించిపోయేలా చేస్తున్నాయని, కర్బన ఉద్గారాలు పెరిగిపోవడానికి కారణమవుతున్నాయని పలు అధ్యయనాలు చూపించాయి. 2020 జనవరిలో సమర్పించిన ఒక నివేదిక ప్రకారం భారతీయ అటవీ పరిశోధనా, విద్యా మండలి కూడా జీవవైవిధ్య పరంగా మెరుగ్గా ఉన్న ప్రాంతాలను పామాయిల్ తోటల సాగుకు అప్పగించడంపై తీవ్రంగా హెచ్చరించింది. భారీస్థాయిలో పెరిగిపోతున్న దిగుమతుల బిల్లును తగ్గించడానికి దేశీయంగా వంటనూనెల ఉత్పత్తిని పెంచాలనుకోవడంలో ఆర్థికపరంగా ఔచిత్యం ఉన్నప్పటికీ, 1993–94 నాటికే దేశీయ వంటనూనెల అవసరాల్లో 97 శాతాన్ని ఉత్పత్తి చేసి దాదాపుగా స్వయంసమృద్ధిని సాధించిన భారతదేశం... ఇంత తక్కువ కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద వంటనూనెల దిగుమతిదారుగా ఎలా మారిపోయిందన్నది పెద్ద ప్రశ్న. 1985–86లో భారత్ ప్రారంభించిన చమురుగింజల టెక్నాలజీ మిషన్ లక్ష్యం ఏమిటంటే, దేశీయ ప్రాసెసింగ్ ఉత్పత్తిని బలోపేతం చేస్తూనే నూనెగింజల ఉత్పత్తి పెంపుదలపై దృష్టిపెట్టడమే. దీన్నే తదనంతరం ‘ఎల్లో రివల్యూషన్’ అని ప్రశంసించారు. వ్యవసాయంపై డబ్ల్యూటీఓ ఒడంబడిక ప్రకారం భారతదేశం సోయాబీన్ మినహా ఇతర వంటనూనెలపై 300 శాతం వరకు దిగుమతి పన్నులు విధించవచ్చు. వంటనూనెల దిగుమతిపై దేశం ఇంత అత్యధిక శాతం పన్ను విధించే అవకాశం ఉన్నప్పటికీ ఒకవైపు దిగుమతి లాబీలు, మరోవైపు దేశంలోని ప్రముఖ ఆర్థికవేత్తల ఒత్తిడి కారణంగా ఎగుమతి పన్ను రేట్లను తగ్గించేశారు. ఇది ఏ స్థాయికి చేరుకుం దంటే ఒక దశలో దిగుమతి పన్నులు దాదాపుగా జీరోకి చేరుకున్నాయి. దీంతో చౌక నూనె దిగుమతుల వెల్లువ మొదలై దేశీయ నూనెగింజల సాగుదారులు రంగం నుంచే తప్పుకోవలసివచ్చింది. దేశీయ వంటనూనె ఉత్పత్తిని ప్రోత్సహించే ఉత్తమ మార్గం ఏదంటే, ఎల్లో రివల్యూషన్ ఎక్కడ తన ప్రభను కోల్పోయిందో గ్రహించి, నూనె గింజల ఉత్పత్తిని తిరిగి పెంచడంపై దృష్టి పెట్టడమే. ప్రభుత్వం దేశంలోని పామాయిల్ సాగుదారులకు గ్యారంటీ ధర కల్పించాలని భావిస్తున్నట్లయితే, నూనె గింజల సాగుదారుల్లో చాలామంది చిన్న రైతులే కాబట్టి, వీరికి గ్యారంటీ ధరకు హామీని కల్పించకపోవడంలో ఎలాంటి హేతువును నేను చూడటం లేదు. ఆర్థిక నిచ్చెనలో రైతులు అత్యంత దిగువన ఉంటున్నారన్న వాస్తవాన్ని గుర్తించి గ్యారంటీ ధర, మార్కెటింగ్ వ్యవస్థ కల్పనతో నూనె గింజల సాగుకు తిరిగి ప్రాణం పోయాలి. ఇది ఆర్థికంగా చెల్లుబాటు కాగల ప్రత్యామ్నాయంగా మారితే అధిక నీటిని ఉపయోగించి వరి సాగు చేసే పంజాబ్ రైతులు కూడా తమ ప్రాధాన్యతను మార్పు చేసుకుంటారు. పైగా ఆబ్సెంటీ భూస్వాములకు, కొద్దిమంది పారిశ్రామిక దిగ్గజాలకు మాత్రమే ప్రయోజనం కలిగించే పామాయిల్ సాగుకి కాకుండా, నూనెగింజల సాగును ప్రోత్సహిస్తే అది దేశంలోని కోట్లాది సన్నకారు రైతులకు వ్యవసాయాన్ని లాభదాయకంగా మారుస్తుంది. ఎల్లో రివల్యూషన్ కుప్పగూలిపోయాక దేశంలో నూనె గింజల సాగుదారుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పైగా నూనెగింజల సాగుకు భూముల విస్తరణ కోసం పెద్ద ఎత్తున సహజ అడవులపై వేటు వేయాల్సిన అవసరం లేదు. దేశంలో భూగర్భజలాలు అడుగంటిపోవడానికి విస్తృతంగా గోధుమ, వరి పంటలను పండించడమే కారణమని నిపుణులు మొత్తుకుంటున్న సమయంలో, నీటిని అధికంగా ఉపయోగించుకునే పామాయిల్ సాగువైపు దేశాన్ని నెట్టడంలో అర్థం లేదు. సగటున ఒక పామ్ చెట్టు రోజుకు 300 లీటర్ల నీటిని పీల్చుకుంటుంది. ఒక హెక్టార్‌లోని పామ్ చెట్ల సంఖ్యను లెక్కించి చూస్తే పామాయిల్ తోటలు నీటిని తోడేస్తాయని చెప్పాలి. కాబట్టే మరో పర్యావరణ సంక్షోభంలో మనం కూరుకుపోవడానికి ముందుగా ఖర్చులు తగ్గించుకునే నిష్పత్తిని సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉంది. పామాయిల్ సాగుకోసం సాగుభూమి విస్తరణను ప్రతిపాదించడానికి బదులుగా, మనం మర్చిపోయిన నూనెగింజల విప్లవాన్ని పునరుద్ధరించడం తక్షణావసరంగా ఉంది. నూనె గింజల్లో స్వయం సమృద్ధిని సాధించే మార్గం ఇదే. వ్యాసకర్త: దేవీందర్ శర్మ ఆహారం, వ్యవసాయరంగ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
PM WANI: ‘ఊరూరా పబ్లిక్ వైఫై.. గేమ్ ఛేంజర్’
ఊరూరా పబ్లిక్ వైపై అందించడం కోసం గత సంవత్సరం డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం పీఎం వాణి స్కీమ్‌ను తెచ్చిన విషయం తెలిసిందే. దేశంలో లక్షలాది వైఫై హాట్స్పాట్లను సృష్టించేందుకు పీఎం వాణి ఎంతగానో ఉపయోగపడనుంది. చౌకగా కోట్లాది మందికి బ్రాడ్సేవలు అందుబాటులోకి వస్తుంది. ఈ పథకంతో ఉద్యోగాల కల్పనతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థల ఆదాయాన్ని పెంచడం అలాగే స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధికి కూడా దోహదపడుతుందని కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం. తాజాగా ట్రాయ్ చైర్మన్ పి.డి. వాఘేలా బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం శుక్రవారం నిర్వహించిన వర్చ్యువల్ సమావేశంలో పీఎం వాణీ పథకంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పీఎం వాణి స్కీమ్‌తో అందరికి ఇంటర్నెట్ రావడమే కాకుండా భారత్ వృద్ధిలో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ పథకంతో భవిష్యత్తులో గ్రామాల్లో సమూలమార్పులు రానున్నాయని తెలిపారు. గ్రామాల్లో ఇంటర్నెట్ వాడకం గణనీయంగా అభివృద్ధి చెందుతుందన్నారు. డిజిటల్ ఇండియావైపు పరుగులు తీస్తోన్న మన దేశానికి అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానం అవసరమని తెలిపారు. ప్రస్తుతం భారత్ 750 మిలియన్లకు పైగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లను కలిగి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 500 మిలియన్ల వరకు కనెక్షన్లు ఉండవచ్చు. ఇంటర్నెట్తో సామాజిక ఆర్థిక రంగాల్లో దేశ ముఖచిత్రం మారిపోవడం కాయమని తెలిపారు. పీఎం వాణీ వేగవంతం సూచనలు చేసిన బీఐఎఫ్ బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం ఈ సమావేశంలో రోల్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ నెక్ట్స్ జనరేషన్ వైఫై టెక్నాలజీ పేరుతో ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. పీఎం వాణీ పథకం కాస్త వేగంగా ముందడుగు వేయడానికి ప్రస్తుతం ఉన్న అంతరాలను తొలగించాలని ఈ పత్రంలో తెలిపారు. అంతేకాకుండా పథకంపై విసృత స్థాయిలో అవగాహన కల్పించాలని పేర్కొంది. పథకం కోసం చిన్న పారిశ్రామికవేత్తలకు పిడిఓ / పిడిఒఎ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వం సులభంగా బ్యాంకు రుణాలు, యుఎస్ఓఎఫ్ (యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్) నుంచి నిధులు సమకూర్చాలని సూచించింది. రోమింగ్‌ను మరింత సులభతరం చేయడం కోసం తగిన మార్పులు చేయాలని పేర్కొంది చదవండి: Joker Virus: బీ అలర్ట్..! ఈ యాప్‌లు డిలీట్ చేసి ‘జోకర్’ని తరిమేయండి -
జియో యూజర్లకు గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: ప్రపంచమంతా డిజిటల్ యుగంగా మారిపోతున్న తరుణంలో ప్రముఖ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో కొత్త ప్రోగ్రామ్‌ను ఆరంభించింది. డిజిటల్ లిటరసీ ఇనీషియేటివ్‌లో భాగంగా ‘డిజిటల్ ఉడాన్’ పేరుతో డిజిటల్ అవగాన కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. డిజిటలైజేషన్ అవసరాలకనుగుణంగా డిజిటల్ టెక్నాలజీ, ఇంటర్నెట్ వాడకంపై వినియోగదారులకు అవగాహన కల్పించనుంది. దేశ యువతకు మార్గనిర్దేశం చేసే క్రమంలో గతంలో డిజిటల్ ఛాంపియన్స్ అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిన జియో ఇంటర్నెట్ తొలి వినియోగదారులకోసం మొట్టమొదటిసారి ఇలాంటి చొరవ తీసుకోవడం విశేషం. ప్రధానంగా గ్రామీణ ప్రాంత యూజర్లపై కన్నేసిన జియో అక్కడ మరింత పాగా వేసేందుకు డిజిటల్ ఉడాన్‌ను తీసకొచ్చింది. జియో ఫోన్లో ఫేస్బుక్ వాడకం, ఇతర ఆప్‌ల వినియోగంతోపాటు ఇంటర్నెట్ భద్రతపై అవగాహనకు ఈ డిజిటల్ ఉడాన్ కార్యక్రమం ఉపయోగపడనుంది. అలాగే స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉండేందుకు జియోఫోన్‌లో ఫేస్బుక్ ఉపయోగించడం లాంటివి నేర్పించనుంది. జియో యూజర్లకు ప్రతి శనివారం 10 ప్రాంతీయ భాషలలో ఆడియో-విజువల్ శిక్షణనిస్తుంది ఇందుకుగాను ఫేస్‌బుక్‌తో కలిసి డిజిటల్ ఉడాన్ కోసం ప్రత్యేక మాడ్యూల్స్‌ను రూపొందించింది రిలయన్స్ జియో 13 రాష్ట్రాలలో దాదాపు 200 ప్రదేశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. కోట్లాదిమంది జియోఫోన్ వినియోగదారులనున ఇంటర్నెట్ వినియోగంలో మరింత పటిష్టం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని త్వరలో 7,000 స్థానాలకు చేరుకుంటుందని రిలయన్స్ జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ తెలిపారు. భారతీయుల్లో ఇంటర్నెట్ వాడకాన్ని విస్తృతం చేయడంతో పాటు డిజిటల్ విప్లవం ముందుకు సాగడంలో జియో కీలక పాత్ర పోషిస్తోందని ఫేస్బుక్ ఇండియా ఎండి అజిత్ మోహన్ వ్యాఖ్యానించారు. కాగా రిలయన్స్ జియో తన 4 జి నెట్‌వర్క్‌లో 280 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉండగా గ్రామీణ చందాదారుల సంఖ్య 2018 లో 100.47 మిలియన్లుగా ఉంది. -
జూన్‌లో ఏఐఎం నుంచి కొత్త స్కీమ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్రామీణ, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏఐఎం) వచ్చే జూన్ నుంచి మరొక సరికొత్త పథకంతో రానుంది. దేశంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎస్ఎంఈ), స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు లఘు వ్యాపార ఆవిష్కరణలు (స్మాల్ బిజినెస్ ఇన్నోవేషన్) పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు నీతి ఆయోగ్ అడిషనల్ సెక్రటరీ, అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్ ఆర్ రామనన్ రామనాథన్ తెలిపారు. ‘ది థింగ్స్ కాన్ఫరెన్స్ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సదస్సు అనంతరం ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ∙లఘు వ్యాపార పరిశ్రమల పథకం కింద స్థానిక సమస్యలను పరిష్కరించే నూతన ఆవిష్కరణలు చేసే ఎంఎస్ఎంఈ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సాంకేతికత, మౌలిక సదుపాయాలతో పాటూ నిధుల సహాయం కూడా అందిస్తాం. ∙ప్రస్తుతం ఏఎంఐలో థింకరింగ్ ల్యాబ్స్, ఇంక్యుబేషన్ సెంటర్స్ పేరిట ఇన్నోవేషన్ ప్రోగ్సామ్ ఉన్నాయి. పాఠశాల విద్యార్థుల్లో సాంకేతిక సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు థింకరింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ∙ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్‌లను ప్రోత్సహించేందుకు విశ్వ విద్యాలయాల్లో ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 101 ఇంక్యుబేషన్ సెంటర్లు మంజూరు కాగా.. 30 సెంటర్లు నిర్వహణలో ఉన్నాయి. వచ్చే ఏడాది నాటికి 100 ఇంక్యుబేషన్ సెంటర్లలో 5 వేల స్టార్టప్స్ ఉండాలన్నది ఏఐఎం లక్ష్యం. ∙తెలుగు రాష్ట్రాల్లో 13 ఇంక్యుబేషన్ సెంటర్లున్నాయి. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ఐఎస్బీ, టీ–హబ్. విశాఖపట్నంలల్లో ఉన్నాయి. వ్యవసాయ రంగ వృద్ధి, తీర ప్రాంతాల ఆదాయ వనరుల వృద్ధికి ఆయా స్టార్టప్స్ పనిచేస్తున్నాయి. ఇంక్యుబేషన్ ఏర్పాటుకు యూనివర్సిటీ విస్తీర్ణం కనీసం 10 వేల చ.అ. ఉండాలి. ది థింగ్స్ కాన్ఫరెన్స్ ప్రారంభం.. సైబర్ ఐ, ఐబీ హబ్స్ ఆధ్వర్యంలో లోరావన్, ఐఓటీ టెక్నాలజీ అవకాశాలు, స్మార్ట్ సిటీల అభివృద్ధి, నిర్వహణ వ్యయాల తగ్గింపు తదితర అంశాలపై చర్చించే ‘ది థింగ్స్ కాన్ఫరెన్స్’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. యూరప్ వెలువల ఆసియాలోనే తొలిసారిగా జరుగుతున్న ఈ సదస్సుకు హైదరాబాద్ వేదిక అయ్యింది. రెండు రోజలు ఈ సదస్సులో టెక్నాలజీ నిపుణులు, కంపెనీ సీఈవోలు, స్పీకర్లు తదితరులు పాల్గొన్నారు. ‘‘చైనా, యూరప్ దేశాలు లోరావాన్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయని.. దీంతో నిర్వహణ వ్యయం గణనీయంగా తగ్గుతుందని సైబర్ ఐ సీఈఓ రామ్ గణేష్ తెలిపారు. తెలంగాణలోనూ లోరావాన్ టెక్నాలజీ అభివృద్ధి, నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామని.. ప్రస్తుతం టెక్నాలజీ టెస్టింగ్ పైలెట్ ప్రాజెక్ట్ జరుగుతుందని.. త్వరలోనే అధికారికంగా ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ది థింగ్స్ ఇండస్ట్రీస్ సీఈఓ అండ్ కో–ఫౌండర్ వింకీ గిజీమాన్ తదితరులు పాల్గొన్నారు. -
అక్షత్.. మరో అద్భుతం...!
న్యూఢిల్లీః ఆడ్ ఈవెన్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు అక్షత్ మిట్టల్ గుర్తున్నాడా? దేశ రాజధాని నగరంలో కాలుష్య నివారణకోసం కేజ్రీవాల్ సర్కారు ప్రవేశ పెట్టిన సరి బేసి వాహన విధానంతో 13 ఏళ్ళ వయసులోనే తన ప్రతిభతో వెలుగులోకి వచ్చిన అక్షత్.. అందర్నీ ఆకట్టుకున్నాడు. ఢిల్లీ నగరంలో సరి బేసితో ఇబ్బందులు పడుతున్న పౌరులను కష్టాలనుంచీ గట్టెక్కించేందుకు 'ఆడ్ ఈవెన్ డాట్ కామ్' పేరుతో ఓ వైబ్ సైట్ ను రూపొందించి అనూహ్యంగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు కార్ పూలింగ్ యాప్ ఓరాహీతో కలసి... ఆ బాల మేధావి.. మరో కొత్త యాప్ ను సృష్టించాడు. అక్షత్.. 13 ఏళ్ళ వయసులోనే తన సృజనాత్మకతతో అందరికీ చేరువయ్యాడు. వాహనదారులు తన వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకుంటే.. సరి బేసి సమయాల్లో దగ్గరలోని వాహనదారులతో మాట్లాడి, వారి కార్లలో కార్యాలయాలకు సులభంగా చేరుకునే మార్గాన్ని ఆడ్ ఈవెన్ డాట్ కామ్ ద్వారా అందుబాటులోకి తెచ్చాడు. అయితే ఢిల్లీ ప్రభుత్వం కార్ పూలింగ్ విధానానికి బ్రేక్ వేయడం, అనంతరం తన వెబ్ సైట్ ను ఇతర సంస్థకు అమ్మేసిన అక్షత్.. ఇప్పుడు మరో యాప్ తో ప్రజల ముందుకొచ్చాడు. 15 ఏళ్ళ వయసున్న అక్షత్ మిట్టల్.. ప్రజల రోజువారీ సమస్యలను పరిష్కరించేందకు 'ఛేంజ్ మై ఇండియా డాట్ ఆర్గ్' పేరున కొత్త వెంచర్ ను బుధవారం ఆవిష్కరించాడు. ఆడ్ ఈవెన్ డాట్ కామ్ ను స్వాధీన పరచుకున్న గుర్గావ్ ఆధారిత సాంకేతిక, డొమైన్ నిపుణులు.. కార్ పూలింగ్ యాప్ 'ఓరాహీ' సలహా బోర్డు తో కలసి కొత్త యాప్ ను ప్రవేశ పెట్టాడు. దైనందిన జీవితంలో భారత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించేందుకు అక్షత్ కొత్త యాప్.. ఛేంజ్ మై ఇండియా డాట్ ఆర్గ్.. పని చేయనుంది. భారత్ లో సామాజిక మార్పుకోసం, ప్రజలకు సహాయం అందించే దిశగా తాను ఆలోచిస్తున్న సమయంలోనే తనను... ఆడ్ ఈవెన్ డాట్ కామ్... అశోకా యూత్ ఛేంజ్ మేకర్ గా ఎంపిక చేసిందని అక్షత్ తెలిపాడు. సమాజంలో మార్పును కోరుకునేవారు, అందుకు సహాయం అందించే ఆసక్తి ఉన్నవారితో కలసి, దాదాపు పదిలక్షలమంది సమస్యలను పరిష్కరించే దిశగా ఈ ప్రస్తుత మిషన్ పనిచేస్తుందని అక్షత్ పేర్కొన్నాడు. ఇందులో భాగంగానే ప్రజలకు సహాయం అందించేందుకు ఛేంజ్ మై ఇండియా ప్రారంభించినట్లు అక్షత్ మిట్టల్ తెలిపాడు. -
ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉదయం 4 గంటలకే..!
గరియబండ్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులంటే సాధారణంగా వారి డ్యూటీ వారు నిర్వర్తించడం చూస్తుంటాం. పాఠశాల సమయం ముగిసిన తరువాత కూడా విద్యార్థుల కోసం సమయం కేటాయించే వారు కొంచెం అరుదనే చెప్పాలి. అయితే చత్తీస్‌గఢ్ రాష్ట్రం గరియాబండ్లోని ఓ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులలో మార్పు తీసుకురావాలని భావించిన స్కూల్ ప్రిన్సిపల్ జీపీ వర్మ.. తన సహఉద్యోగులతో కలిసి కొంచెం వినూత్నంగా ఆలోచించాడు. ఉదయాన్నే విద్యార్థులను చదువుకు ఉపక్రమించేలా చేస్తే మంచి ఫలితాలు రాబట్టొచ్చని భావించి.. తెల్లవారుజామున నాలుగు గంటలకే గ్రామంతో తిరుగుతూ విద్యార్థులను నిద్రలేపే కార్యక్రమం స్టార్ట్ చేశారు. విద్యార్థులను చదువుకునేలా ప్రోత్సహిస్తూ మంచి ఫలితాలను రాబడుతున్నారు. 'తెల్లవారుజామునే టీచర్లు వచ్చి నిద్రలేపుతారు. అనంతరం గ్రామంలోని విద్యార్థులమంతా గ్రూపులుగా చదువుకుంటాం' అని విద్యార్థిని మణిప్రభ వెల్లడించింది. -
శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి సూచికగా ఆలయంలో బుధవారం ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించి.. ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. సాయంత్రం 5 నుంచి 5.30 గంటల మధ్య మీన లగ్నంలో వైఖానస ఆగమోక్తంగా పవిత్ర గరుడ పతాకాన్ని (ధ్వజపటం) బంగారు ధ్వజస్తంభ శిఖరాగ్రానికి ఆవిష్కరించి అర్చకులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ధ్వజారోహణానికి ముందు తిరుచ్చివాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప పరివార దేవతలైన అనంతుడు (ఆదిశేషుడు), గరుత్మంతుడు, విశ్వక్సేనుడు, గరుడధ్వజం, సుదర్శన చక్రతాళ్వార్‌తో కలసి ఆలయ పురవీధుల్లో ఊరేగారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాత్రి 8 గంటలకు సీఎం ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయానికి ఆయన చేరుకున్నారు. ప్రధాన అర్చకుడు ఏవీ రమణదీక్షితులు సీఎంకు తలపాగా చుట్టారు. తర్వాత వెండిపళ్లెంలో పట్టువస్త్రాలు ప్రదర్శనగా మహద్వారం నుంచి ఆలయంలోకి తీసుకెళ్లి స్వామివారికి సీఎం సమర్పించారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరిగ్గా 12 ఏళ్ల క్రితం అలిపిరి వద్ద మావోయిస్టులు తనపై 24 క్లెమోర్మైన్లతో దాడికి తెగబడ్డారని, ఆ సంఘటన నుంచి సాక్షాత్తు శ్రీనివాసుడే తనను రక్షించారని చంద్రబాబు అన్నారు. -
బ్రహ్మోత్సవ సంరంభం.. ఆరంభం
శాస్త్రోక్తంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నేడు ధ్వజారోహణం, పట్టువస్త్రాలు సమర్పించనున్న ఏపీ సీఎం సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం వైదికంగా అంకురార్పణ నిర్వహించారు. స్వామి సర్వ సేనాధిపతి విష్వక్సేనుడు.. బ్రహ్మోత్సవ ఏర్పాట్లను స్వామి తరపున పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక నిర్విహంచటం అనాదిగా వస్తున్న ఆచారం. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజైన మంగళవారం సాయంసంధ్యా సమయంలో విష్వక్సేనుడు ఛత్రచామర, మేళతాళాల నడుమ ఆలయ పురవీధుల్లో ఊరేగింపుగా ఉత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించి తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ యాగశాలలో లలాట, బహు, స్తన పునీత ప్రదేశంలో భూమిపూజ (మృత్సంగ్రహణం) నిర్వహించారు. తొమ్మిది పాళికలలో (కుండలు) నవధాన్యాలను మట్టిలో కలిపి మొలకెత్తించే పని ప్రారంభించారు. అంకురాలను ఆరోపించే కార్యక్రమాన్ని అంకురార్పణం (బీజావాపం) అంటారు. శుక్ల పక్ష చంద్రునిలా పాళికల్లోని నవ ధాన్యాలు దినదినాభివృద్ధి చెందేలా అర్చకులు ప్రార్థించారు. నిత్యం నీరుపోసి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. నేడు ధ్వజారోహణం, పెద్ద శేషవాహనం బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం 5 నుంచి 5.30 గంటల్లోపు గోధూళి వేళ మీన లగ్నంలో ధ్వజారోహణంతో ఉత్సవాలు కన్నుల పండువగా ఆరంభం కానున్నాయి. రాత్రి 9 గంటలకు శేష వాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఇలా వరుసగా ఈనెల 24 వరకు ఉదయం 9 నుంచి 11 గంటలు, రాత్రి 9 నుంచి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప.. వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులకు సాక్షాత్కరించనున్నారు. ఐదోరోజు గరుడ వాహనంపై, ఎనిమిదో రోజు రథోత్సవంలో, చివరి తొమ్మిదో రోజు చక్రస్నానంలో స్వామివారు సేదదీరుతారు. నేడు ఏపీ సీఎం పట్టువస్త్రాల సమర్పణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారికి బుధవారం పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రాత్రి 8 గంటల తర్వాత ఇక్కడి బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి సీఎం పట్టువస్త్రాలు ఆలయంలో సమర్పిస్తారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని, వెలుపల పెద్ద శేష వాహన సేవలో పాల్గొంటారు. -
రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
-
రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ముమ్మరంగా ఏర్పాట్లు సాక్షి, తిరుమల: తిరుమలేశుని వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం అంకురార్పణ చేయనున్నారు. స్వామివారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం విష్వక్సేనుడు ఛత్రచామర మంగళవాద్యాలతో ఊరేగింపుగా ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మండపానికి చేరుకుని వైదిక పూజలనంతరం బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. బ్రహ్మోత్సవాలకు రెండు రోజులే సమయం ఉండడంతో అవసరమైన ఏర్పాట్లను టీటీడీ ముమ్మరం చేసింది. ఎల్లుండి ధ్వజారోహణం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు బుధవారం ధ్వజారోహణం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 నుంచి 5.30 గంటల్లోపు మీన లగ్నంలో ఈ పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహించి, బ్రహ్మోత్సవాల వాహన సేవలకు నాంది పలుకుతారు. అదేరోజు రాత్రి 7.30 గంటలకు సీఎం చంద్రబాబు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలకు భద్రతావలయం అడుగడుగునా ఇనుప కంచెల నిర్మాణం గోదావరి పుష్కరాలు మిగిల్చిన చేదు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తొలిసారిగా ఇనుప కంచెల దిగ్బంధనంలో ఈ నెల 16 నుంచి తిరుమలేశుని బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. వాహన సేవలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులను ఎక్కడికక్కడ కట్టడిచేసే ప్రయత్నం చేస్తున్నారు. పన్నెండడుగుల ఎత్తులో భారీ ఇనుప కంచె.. భద్రతా కారణాల రీత్యా ఇప్పటికే తిరుమల నాలుగు మాడ వీధుల చుట్టూ ఇన్నర్ సెక్యూరిటీ కార్డన్ పేరుతో పన్నెండడుగుల ఎత్తులో భారీ ఇనుప కంచె నిర్మించారు. దీనికి సుమారు రూ. 5 కోట్లు దాకా ఖర్చు చేశారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులను క ట్టడి చేసేందుకు ఈ కంచె బాగా ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో 30మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దాని ప్రభావం తిరుమల బ్రహ్మోత్సవాలపై పడింది. బ్రహ్మోత్సవాల్లో చిన్నపాటి ఘటన జరిగినా ఫలితాలు వేరుగా ఉంటాయని ప్రభుత్వ పెద్దల నుంచి టీటీడీకి ఆదేశాలందాయి. పనిలో పనిగా గ్యాలరీల్లోనూ చైన్‌లింక్ కంచెల సంఖ్య, వాటి ఎత్తు, నిడివిని కూడా ఎక్కడికక్కడ పెంచేశారు. ఇనుప కంచెలనుంచి భక్తులు లోనికి వెళ్లడానికి 10, రావడానికి వాటి పక్కనే మరో 10 ద్వారాలు ఉన్నాయి. దీనివల్ల భక్తులు సులభంగా లోనికి వెళ్లలేరు. వెళ్లిన వారు పక్కకు కదిలే పరిస్థితి ఉండదు. దీనివల్ల ఏదైనా ప్రమాదం జరిగితే భక్తులు వెలుపలికి రావడానికి కష్టపడాల్సి వస్తుందనేది సీనియర్ అధికారులు భావన. 1.70 లక్షల మందికే గరుడ వాహన దర్శనం బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహనసేవకు జనం తండోపతండాలుగా వచ్చి దర్శించుకుంటారు. గతంలో ఇనుప కంచె నిర్మాణం లేకపోవడం వల్ల సుమారు 3 నుంచి 4 లక్షల మంది వరకు స్వామిని దర్శించుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం రెండు ఇనుప కంచెలు దాటుకుని లోనికి వెళ్లే పరిస్థితులు కనిపించటం లేదు. సాయంత్రం 4 గంటల్లోపు మాడ వీధుల్లోకి చేరిన భక్తులకు మాత్రమే దర్శనం లభిస్తుంది. అది కూడా 1.70 లక్షల మందికి మాత్రమే దర్శనం లభిస్తుంది. ఆ తర్వాత లోనికి వెళ్లే అవకాశం లేదు. -
అహమహం
హ్యూమర్ ఫ్లస్ ఒక స్వాములవారు ఉపదేశ భాషణం మొదలుపెట్టారు. ‘‘ఈ ప్రపంచంలో అన్ని సమస్యలు అహం వల్లే వస్తాయి. దీన్ని ఇంగ్లిష్‌లో ఇగో అంటారు. ఇగో అనే పదంలోనే ‘గో’ ఉంది. గో అంటే వెళ్లడం. ఇగో ఉండటమంటే మనలోని మనిషిని వెళ్లగొట్టడం. అహం అంటే నాకు తెలుసు అనుకోవడం. నాకు మాత్రమే తెలుసు అనుకోవడం. జ్ఞానం నా బ్యాంకు లాకర్లో ఉంది అనుకోవడమే అహం. ప్రపంచ యుద్ధాలన్నీ ఇగో వల్లే జరిగాయి. నేను గొప్పవాడిని అని హిట్లర్ ఇగో ఫీల్ కావడం వల్ల ప్రపంచం నాశనం అయిపోయింది. పాండవులని పూచిక పుల్లల్లా చూడ్డం వల్ల దుర్యోధనుడు గుల్లయిపోయాడు. ఒక సభలో యాభై మంది ప్రముఖులుంటే అందరిని వరుసబెట్టి పొగడాలి. ఎవణ్ణి మరిచిపోయినా వాడు ఇగో ఫీలై లేచి వెళ్లిపోతాడు. అందుకే సభలన్నీ బాజా భజంత్రీలుగా మారిపోతున్నాయి. ఈ మధ్య ఒక పుస్తకావిష్కరణ సభకు వెళితే ఎవడు ఎవణ్ణి పొగుడుతున్నాడో ఎవడికీ అర్థం కాలేదు. రచయితని మరిచిపోయి ఎవడికి అవసరమైనవాడిని వాడు పొగిడాడు. లేకపోతే ఇగో హర్ట్. ఈ మధ్య ఒకాయనకి ఇగో హర్టయ్యి హార్ట్ ఎటాక్ వచ్చింది. ఒక పోలీస్ అధికారి పదవిలో ఉన్నంతకాలం నమస్కారాలకీ, పొగడ్తలకీ అలవాటుపడ్డాడు. ఆయన ఎక్కడికెళ్లినా తబలా వాయించేవాళ్లు, డోలు కొట్టేవాళ్లు, సన్నాయి మోగించేవాళ్లు క్యూలో నిలబడి తమ పని కానిచ్చేవాళ్లు. రిటైరయ్యేసరికి అంతా నిశ్శబ్దం. బతికుండగానే జనం ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. చొరవ తీసుకుని తానే రెండు మూడు సభలకి వెళ్లడానికి ప్రయత్నించాడు. జనం తెలివైనవాళ్లు. వర్తమానాన్నే ప్రేమిస్తారు. గతం వ్యక్తిగతం. దాంతో సమాజానికి పనిలేదు. అధికారికి గుండె చిల్లులుపడి ఆస్పత్రిలో చేరి స్వంత డబ్బు వదిలించుకున్నాడు. మన నాయకులు ఇగో కోసం కోట్లు ఖర్చుపెడతారు. దండలు, దండాలు లేకపోతే స్పృహ తప్పి పడిపోతారు. దీన్ని రాజకీయ స్పృహ అంటారు. సామాన్య జనానికి కూడా ఇగో తక్కువేం కాదు. నానా చెత్తని గెలిపించేది ఇగో ఎక్కువ కావడం వల్లే. అందువల్ల ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలు, సౌకర్యాలు పెరిగినట్టు ఇగో పెరిగితే ముప్పు. పోలీసులు సామాన్యుల్ని చితక్కొట్టినట్టు, నాయకులు అమాయకుల్ని పీడించినట్టు మనం కూడా ఇగో చితక్కొట్టి, దాన్ని పీడించి వదిలించుకోవాలి. ఈ అంశంపై సందేహాలుంటే అడగండి’’ అని భక్తుల్ని అడిగాడు. ‘‘స్వామీ! మొన్న టీవీలో చెవులానందస్వామి మాట్లాడుతూ, ‘అహం అంటే పరబ్రహ్మం. దాన్ని మనం కాపాడుకోవాలి’ అన్నారు’’ మైకు తీసుకుని ఒక భక్తుడు చెప్పాడు.స్వాములవారి కళ్లు కొలిమి నిప్పులయ్యాయి. చలిజ్వరం వచ్చినవాడిలా వణికాడు. గడ్డాన్ని బరబరా బరికి, ‘‘చెవులానందస్వామి అంటే ఎవడ్రా? టీవీలో ఆంజనేయస్వామి తాయెత్తులు అమ్ముకునేవాడూ నేనూ ఒకటేనా! నేను నాలుగు వేదాలు చదివాను. వేదంలో ఒక్క పాదమైనా వాడికి తెలుసా? వాడి పేరు ఎత్తితే డొక్క చించుతా’’ అని కర్ర తీసుకుని ప్రశ్న అడిగిన భక్తుని వెంటపడ్డాడు. భక్తుడు ఎటు పారిపోయాడో ఇంకా ఆచూకీ తెలియదు. - జి.ఆర్.మహర్షి -
వైభవంగా అంకురార్పణ
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం వైభవంగా అంకురార్పణ నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి ముందు రోజైన శుక్రవారం సాయంసంధ్య వేళలో విష్వక్సేనుడు ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మండపం వద్ద భూమిపూజ నిర్వహించి, ఆ మట్టిని సేకరించి ఆలయానికి చేరుకున్నారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో నవధాన్యాలను కలిపి మొలకెత్తించే పని ప్రారంభించారు. శనివారం సాయంత్రం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శనివారం సీఎం కిరణ్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. నేటినుంచే అమ్మవారికి అలంకారాలు సాక్షి, విజయవాడ: దసరా మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీల్రాద్రి ముస్తాబైంది. వివిధ అలంకారాల్లో కొలువుదీరే అమ్మవారిని దర్శించుకునేందుకు 15 లక్షల మంది భక్తులు వస్తారని భావిస్తున్న అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఆనవాయితీ ప్రకారం 9వ తేదీ దుర్గాష్టమి రోజున టీటీడీ, 10వ తేదీ మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కె.పార్థసారథి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. -
పవిత్రోత్సవాలకు అంకురార్పణ
సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరిగింది. శనివారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు కనులపండువగా నిర్వహించనున్నారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతా శౌచం(పురిటిమైలు), మృతాశౌచం (మృతితో అంటు), స్త్రీల బహిష్టు కారణాలతో ఆలయంలో తెలిసీ తెలియక జరిగే దోషాల పరిహరణార్థం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమల ఆలయంలో క్రీ.శ.1464కు పూర్వం నుంచే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం స్వామి సేనాపతి విష్వక్సేనుడు పల్లకిపై తిరువీధుల్లో ఊరేగుతూ వసంత మంటపానికి చేరుకున్నారు. ఇక్కడే భూమిపూజ చేసి మృత్సంగ్రహణం(పుట్టమన్ను) చేసి ప్రదక్షిణగా ఆలయ ప్రవేశం చేసిన తర్వాత అంకురార్పణ మంటపంలో నవధాన్యాల బీజావాపం(అంకురార్పణం) చేశారు. ఉత్సవాలు నిర్వహించే మూడు రోజులూ ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఉత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని పుష్పాలతో అలంకరించారు.