రేపు శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ | Tomorrow srivari brahmotsavalaku Initiative | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 14 2015 6:15 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

ముమ్మరంగా ఏర్పాట్లు సాక్షి, తిరుమల: తిరుమలేశుని వార్షిక బ్రహ్మోత్సవాలకు మంగళవారం అంకురార్పణ చేయనున్నారు. స్వామివారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించే కార్యక్రమమే అంకురార్పణ. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం విష్వక్సేనుడు ఛత్రచామర మంగళవాద్యాలతో ఊరేగింపుగా ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మండపానికి చేరుకుని వైదిక పూజలనంతరం బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుడతారు. బ్రహ్మోత్సవాలకు రెండు రోజులే సమయం ఉండడంతో అవసరమైన ఏర్పాట్లను టీటీడీ ముమ్మరం చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement