పవిత్రోత్సవాలకు అంకురార్పణ | Initiative to Tirumala Srivari pavitrotsavam | Sakshi
Sakshi News home page

పవిత్రోత్సవాలకు అంకురార్పణ

Published Sat, Aug 17 2013 3:57 AM | Last Updated on Tue, Aug 28 2018 5:55 PM

Initiative to Tirumala Srivari pavitrotsavam

సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలకు శుక్రవారం అంకురార్పణ జరిగింది. శనివారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు కనులపండువగా నిర్వహించనున్నారు. వైదిక సంప్రదాయం ప్రకారం జాతా శౌచం(పురిటిమైలు), మృతాశౌచం (మృతితో అంటు), స్త్రీల బహిష్టు కారణాలతో ఆలయంలో తెలిసీ తెలియక జరిగే దోషాల పరిహరణార్థం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. తిరుమల ఆలయంలో క్రీ.శ.1464కు పూర్వం నుంచే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం స్వామి సేనాపతి విష్వక్సేనుడు పల్లకిపై తిరువీధుల్లో ఊరేగుతూ వసంత మంటపానికి చేరుకున్నారు. ఇక్కడే భూమిపూజ చేసి మృత్సంగ్రహణం(పుట్టమన్ను) చేసి ప్రదక్షిణగా ఆలయ ప్రవేశం చేసిన తర్వాత అంకురార్పణ మంటపంలో నవధాన్యాల బీజావాపం(అంకురార్పణం) చేశారు.  ఉత్సవాలు నిర్వహించే మూడు రోజులూ ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఉత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని పుష్పాలతో అలంకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement