సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం వైభవంగా అంకురార్పణ నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి ముందు రోజైన శుక్రవారం సాయంసంధ్య వేళలో విష్వక్సేనుడు ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మండపం వద్ద భూమిపూజ నిర్వహించి, ఆ మట్టిని సేకరించి ఆలయానికి చేరుకున్నారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాళికలలో నవధాన్యాలను కలిపి మొలకెత్తించే పని ప్రారంభించారు. శనివారం సాయంత్రం ధ్వజారోహణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. శనివారం సీఎం కిరణ్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
నేటినుంచే అమ్మవారికి అలంకారాలు
సాక్షి, విజయవాడ: దసరా మహోత్సవాలకు విజయవాడ ఇంద్రకీల్రాద్రి ముస్తాబైంది. వివిధ అలంకారాల్లో కొలువుదీరే అమ్మవారిని దర్శించుకునేందుకు 15 లక్షల మంది భక్తులు వస్తారని భావిస్తున్న అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఆనవాయితీ ప్రకారం 9వ తేదీ దుర్గాష్టమి రోజున టీటీడీ, 10వ తేదీ మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కె.పార్థసారథి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
వైభవంగా అంకురార్పణ
Published Sat, Oct 5 2013 6:11 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM
Advertisement