
బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: ఈఓ
గరుడసేవకు మాడవీధుల్లోని గ్యాలరీల్లో లక్షా 80వేల మంది భక్తులకు వాహన సేవలు తిలకించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. తిరుమలలో 30 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామని, 2700 మంది పోలీసులు, 2 వేలమంది టీటీడీ విజిలెన్స్ సిబ్బంది, 3 వేల మంది శ్రీవారి సేవకులు, వెయ్యిమంది స్కౌట్స్ , 5వేల మంది టీటీడీ ఉద్యోగులతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు. భద్రతలో భాగంగా ఫిన్న్ సిస్టమ్, బాడీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఈఓ తెలిపారు. ఈనెల 23న సీఎం చంద్రబాబు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు.