సెప్టెంబర్‌ 23 నుంచి బ్రహ్మోత్సవాలు | tirumala brahmotsavam from september 23 | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్‌ 23 నుంచి బ్రహ్మోత్సవాలు

Published Wed, Jul 5 2017 2:41 AM | Last Updated on Tue, Sep 5 2017 3:12 PM

సెప్టెంబర్‌ 23 నుంచి బ్రహ్మోత్సవాలు

సెప్టెంబర్‌ 23 నుంచి బ్రహ్మోత్సవాలు

27న రాత్రి 7.30కి గరుడసేవ
 
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు ఒకటో తేదీ వరకు జరగనున్నాయి. ఇందుకోసం టీటీడీ సమాయత్తమవుతోంది. బ్రహ్మోత్సవ ఏర్పాట్ల కల్పనపై మంగళవారం జేఈవో శ్రీనివాసరాజు టీటీడీ, విజిలెన్స్, పోలీసు విభాగాలతో సమావేశమై సమీక్షించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబరు 27వ తేది రాత్రి 7.30 గంటలకే శ్రీవారి గరుడవాహన సేవ ప్రారంభిస్తామని తెలిపారు.

ఈసారి ఉత్సవాల్లో నాలుగో రోజు రాత్రి కొత్త సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామివారు ఊరేగనున్నారన్నారు. సెప్టెంబరు 6వ తేదీ పౌర్ణమి గరుడ వాహన సేవను మాదిరి బ్రహ్మోత్సవ గరుడవాహన సేవగా నిర్వహించి లోటుపాట్లు గుర్తించి, సవరిస్తామన్నారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement