ఒక్కో ఉద్యోగికి రూ.11,000 బహుమానం
సాక్షి, హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగులు శ్రీవారి బ్రహ్మోత్సవాల కానుకగా రూ. 11,000 బహుమానం అందుకోనున్నారు. ఈ మేరకు టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ పంపిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 26వ తేదీ నాటికి టీటీడీలో పనిచేసే ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుంది. టీటీడీ ఉద్యోగులతోపాటు డిప్యుటేషన్‌పైనా, ఫారిన్ సర్వీసు నిబంధనల కింద సంస్థలో పనిచేసే వారికి, ఎన్‌ఎంఆర్‌లకు, టైమ్ స్కేల్ ఉద్యోగులకు, కన్సాలిడేటెడ్ కింద టీటీడీ వేతన జాబితాలో ఉన్న వారికి రూ.11,000..కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రూ.5,500 చొప్పున ఇస్తారు. ఈ మేరకు రెవెన్యూ (దేవాదాయ) శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ ఉత్తర్వులిచ్చారు.
టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవాల కానుక
Published Fri, Dec 12 2014 12:41 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement