న్యూఢిల్లీ: మానవ ఆరోగ్యంతోపాటు వ్యవసాయం, పర్యావరణ రంగాల్లోనూ ఎన్నోవిధాలుగా ఉపయోగపడే సూక్ష్మజీవి ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు ఇంకో గొప్ప ప్రయత్నం మొదలైంది. కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం, బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నొవేషన్ కౌన్సిల్ (బ్రిక్)లు సంయుక్తంగా ఈ పనిని చేపట్టాయి. ‘వన్ డే వన్ జినోమ్’ పేరుతో న్యూఢిల్లీలో మొదలైన ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ తదితర సూక్ష్మజీవులపై విసృ‍్తతస్థాయిలో పరిశోధనలు చేపట్టనున్నారు. వాటి జన్యుక్రమాలను నమోదు చేయడమే కాకుండా.. విశ్లేషించనున్నారు. తద్వారా దేశంలోని వైవిధ్యభరితమైన సూక్ష్మజీవులను మన ప్రయోజనాలకు ఉపయోగించుకోనున్నారు.
ఈ నెల తొమ్మిదిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో ఈ ‘వన్ డే వన్ జినోమ్’ కార్యక్రమం మొదలైంది. నీతీఆయోగ్ మాజీ సీఈవో జీ20 షేర్పా అమితాబ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు. జీవావరణ వ్యవస్థలో మైక్రోఆర్గానిజమ్స్ లేదా సూక్ష్మజీవులు చాలా కీలకం. మట్టి ఏర్పాటు మొదలుకొని ఖనిజాల శుద్ధీకరణ వరకూ బోలెడన్ని పనులు చేస్తూంటాయి ఇవి. వ్యవసాయం విషయానికి వస్తే నేలలో పోషకాలను రీసైకిల్ చేయడం, నైట్రోజన్‌ను మట్టిలోకి చేర్చడం, చీడపీడల నియంత్రణ, వంటి పనులన్నింటికీ బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులే కారణం. అంతేకాదు..
ఈ సూక్ష్మజీవులు మొక్కలతో కలసిమెలిసి ఉంటూ నీరు పోషకాలు సక్రమంగా అందేలా చేస్తాయి. మానవ శరీరంలో కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉన్నాయంటేనే వాటి ప్రాధాన్యత ఏమిటన్నది అర్థమవుతుంది. తిన్న ఆహారం జీర్ణం చేయడంలో, శరీరానికి పోషకాలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తూంటాయి. అలాగే మనకొచ్చే ఇన్ఫెక‌్షన్లకూ ఈ సూక్ష్మజీవుల్లోని కొన్ని కారణమవుతుంటాన్నది మనకు తెలుసు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్నది కాబట్టే వీటి గురించి మరింత విసృ‍్తత స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరమం ఉందంటోంది ‘వన్ డే వన్ జినోమ్’!
అయితే ఇప్పటివరకూ సూక్ష్మజీవి ప్రపంచాన్ని అర్థం చేసుకున్నది చాలా తక్కువే. అందుకే వేర్వేరు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్‌ల జన్యుక్రమాన్ని విశ్లేషించే లక్ష్యంతో వన్ డే వన్ జినోమ్ కార్యక్రమం మొదలైంది. తద్వారా ఏ సూక్ష్మజీవుల ద్వారా ముఖ్యమైన ఎంజైమ్‌లు లభిస్తున్నాయి? రోగాలకు చెక్‌పెట్టేందుకు ఉపయోగపడే రసాయనాలు ఉన్నాయన్న విషయం తెలుస్తుంది. వ్యవసాయంలోనూ మొక్కకు మేలు చేయగల, దిగుబడి పెంచగల సూక్ష్మజీవులను గుర్తించే వీలేర్పడుతుంది. బ్రిక్‌తోపాటు బయోమెడికల్ జినోమిక్స్ కూడా చురుకుగా పాల్గొంటున్న ఈ కార్యక్రమం ద్వారా ఏ ప్రాంతంలో ఏ రకమైన బ్యాక్టీరియా అందుబాటులో ఉందో? వాటి లక్షణాలేమిటో తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: అణ్వాయుధ దాడికి పుతిన్ ఆదేశం.. ప్రపంచదేశాల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment