భారత్‌లో ట్విట్టర్‌ ‘ఫ్లీట్స్‌’ ఫీచర్‌  | Twitter Launched Fleets Feature in India | Sakshi
Sakshi News home page

భారత్‌లో ట్విట్టర్‌ ‘ఫ్లీట్స్‌’ ఫీచర్‌ 

Published Wed, Jun 10 2020 5:17 AM | Last Updated on Wed, Jun 10 2020 5:17 AM

Twitter Launched Fleets Feature in India - Sakshi

న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విట్టర్‌ తాజాగా భారత్‌ మార్కెట్లో తమ ఫ్లీట్స్‌ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు ట్విట్టర్‌ మంగళవారం వెల్లడించింది. యూజర్‌ పోస్ట్‌ చేసిన కంటెంట్‌ 24 గంటల తర్వాత ఇక కనిపించకుండా మాయమయ్యేలా ఈ ఫీచర్‌ ఉంటుంది. ‘అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనలను యూజర్లు పంచుకునేందుకు ఫ్లీట్స్‌ ఉపయోగపడుతుంది. ఇవి 24 గంటల తర్వాత ఇక కనిపించవు. వీటికి రీట్వీట్స్‌ గానీ లైక్స్‌ గానీ పబ్లిక్‌ కామెంట్స్‌ గానీ ఉండవు‘ అని ట్విట్టర్‌ తెలిపింది. ఒకవేళ ఆ అంశంపై సదరు యూజరుతో గానీ ఫాలోవర్లు సంభాషించదల్చుకుంటే ప్రైవేట్‌గా డైరెక్ట్‌ మెసేజీలు పంపవచ్చని పేర్కొంది. కొత్తగా అప్‌డేటెడ్‌ యాప్‌ వెర్షన్స్‌లో ఫ్లీట్స్‌ లభిస్తుందని వివరించింది. యూజర్లు  ప్రొఫైల్‌ పిక్చర్‌పై ట్యాప్‌ చేయడం ద్వారా ఈ తరహా ట్వీట్స్‌ చేయొచ్చు. ప్రస్తుతం బ్రెజిల్, ఇటలీలో ఫ్లీట్స్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement