fleet
-
దేశ భద్రతకు‘పంచ’ కవచాలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటి వరకు షిప్ రిపేర్ హబ్‌గా మాత్రమే కొనసాగుతున్న విశాఖపట్నం హిందూస్థాన్ షిప్‌యార్డ్.. త్వరలోనే షిప్ బిల్డింగ్ హబ్‌గా అత్యుత్తమ సేవలందించేందుకు అడుగులు ముందుకు వేస్తున్నది. దేశీయ నౌకల తయారీపై దృష్టి సారించిన షిప్‌యార్డ్ అందుకోసం భారత నౌకాదళంతో కీలక ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ క్రమంలో రూ.19,048 కోట్లతో 5 భారీ యుద్ధ నౌకల నిర్మాణ పనుల్ని దక్కించుకుంది. దేశ చరిత్రలో ఏ షిప్‌యార్డ్ నిర్మించని విధంగా ఏకంగా 44 వేల టన్నుల షిప్స్‌ని నిర్మించనున్న హెచ్ఎస్ఎల్... 2027 ఆగస్ట్‌లో తొలి యుద్ధనౌకని ఇండియన్ నేవీకి అప్పగించనుంది. యుద్ధ విన్యాసాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించేలా షిప్ డిజైన్లతో పాటు.. రక్షణ వ్యవస్థలోనే కాకుండా.. విపత్తు నిర్వహణకు వినియోగించేలా షిప్‌లను తయారు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. సింధుకీర్తి సబ్‌మెరైన్ మరమ్మతుల విషయంలో హిందుస్థాన్ షిప్‌యార్డ్ అపవాదు మూటకట్టుకుని.. తొమ్మిదేళ్లకు పూర్తి చేయడంతో షిప్యార్డ్డ్ పనైపోయిందని అంతా అనుకున్నారు. అయితే, ఐఎన్ఎస్ సింధువీర్ మరమ్మతుల్ని అతి తక్కువ సమయంలోనే పూర్తి చేసి ఆ మరకని తుడిచేసుకున్న షిప్‌యార్డ్.. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఎలాంటి నౌకలు, సబ్మెరైన్ల మరమ్మతులైనా రికార్డు సమయంలో పూర్తి చేస్తూ.. ఆయా సంస్థలకు అప్పగిస్తున్న హెచ్ఎస్ఎల్.. ఇప్పుడు ప్రధాన నౌకా నిర్మాణ కేంద్రంగా దూసుకుపోతోంది. ఐదేళ్ల కాలంలో ఏకంగా 14 ప్రాజెక్టుల్ని పూర్తి చేసి ఆర్డర్ల పెండెన్సీ గణనీయంగా తగ్గించుకుంది. 40 నౌకల రీఫిట్ పనుల్ని ఐదేళ్ల కాలంలో పూర్తి చేసి ఔరా అనిపించుకుంది. మొత్తంగా హిందుస్థాన్ షిప్‌యార్డ్ పనితీరుతో విశాఖ.. షిప్ బిల్డింగ్ కేంద్రంగా మారుతోంది. రూ.19 వేల కోట్లు.. 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్స్.. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.1,038 కోట్ల టర్నోవర్ సాధించిన షిప్‌యార్డ్ .. ఈ ఏడాది ఏకంగా రూ.19,048 కోట్ల పనులకు సంబంధించిన కాంట్రాక్టుపై సంతకం చేసింది. ఆత్మ నిర్భర్ భారత్‌లో భాగంగా పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో నౌకల తయారీకి సన్నద్ధమవుతోంది. ఐదు ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ (ఎఫ్ఎస్ఎస్)ను భారత నౌకాదళం, కోస్ట్‌గార్డు కోసం తయారు చేసేందుకు శుక్రవారం భారత రక్షణ మంత్రిత్వ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది.హైవాల్యూస్‌తో ఈ నౌకల నిర్మాణాలు చేపట్టనుంది. దేశంలోని ఏ షిప్‌యార్డ్‌లోనూ లేనివిధంగా ఏకంగా 44 మిలియన్ టన్నుల డిస్ప్లేస్మెంట్ సామర్థ్యమున్న నౌకల్ని తయారు చేయనుంది. ఈ నౌకల నిర్మాణాలతో 2023–24 నుంచి హెచ్ఎస్ఎల్ వార్షిక టర్నోవర్ గణనీయంగా పెరగనుంది. ప్రస్తుతం రూ.1,038 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న íషిప్‌యార్డ్ .. వచ్చే ఐదేళ్లలో రూ.1,500 నుంచి 2 వేల కోట్ల రూపాయలకు చేరుకోనుంది. 8 సంవత్సరాల కాల పరిమితితో ఈ షిప్స్‌ని తయారు చేయనుంది. తొలి షిప్‌ని 2027 ఆగస్ట్ 24న భారత నౌకాదళానికి అప్పగించేలా ఒప్పందం కుదుర్చుకుంది. మూడేళ్లలో మరింత అభివృద్ధి.. పెరుగుతున్న ఒప్పందాలకు అనుగుణంగా.. షిప్‌యార్డ్‌ను ఆధునికీకరించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రూ.1,000 కోట్లతో యార్డుని రానున్న మూడేళ్లలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం స్లిప్‌వేలు 190 మీటర్లుండగా వీటిని 230 మీటర్లకు పెంచనున్నారు. ఆర్డర్లు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల సంఖ్య కూడా పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అదేవిధంగా మరమ్మతులు, నౌకా నిర్మాణాలకు అనుగుణంగా రూ.5 వేల కోట్లతో మెటీరియల్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అవసరమైన 364 వెండార్ బేస్డ్ ఎంఎస్ఎంఈల సహకారం తీసుకుంటున్నారు. లక్షల మందికి ఉపాధి టెండర్లు దక్కించుకోవడంలో దూకుడు పెంచాం. తాజాగా 50 టన్స్ బొలార్డ్ పుల్ టగ్ బాల్‌రాజ్ మరమ్మతులు పూర్తి చేసి నేవల్ డాక్‌యార్డు (విశాఖపట్నం)కు అందించాం. అందుకే.. ఆర్డర్లు కూడా పెద్ద ఎత్తున సొంతం చేసుకుంటున్నాం. రక్షణ మంత్రిత్వ శాఖతో కుదుర్చుకున్న ఒప్పందం.. షిప్‌యార్డ్ భవిష్యత్తుని మార్చబోతోంది. ఈ ఎంవోయూ ద్వారా లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. విశాఖ భవిష్యత్తు కూడా మారబోతుంది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా.. మేక్ ఇన్ ఇండియాని చాటిచెప్పేలా షిప్స్ తయారు చేస్తాం. దేశీయ నౌకల నిర్మాణంతో పాటు అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాలపైనా దృష్టి సారించాం. సబ్మెరైన్ల నిర్మాణం, రీఫిట్‌కు సంబంధించిన సామర్థ్యం, మౌలిక సదుపాయాల కల్పనతో మరింత ఆధునికీకరించుకునేందుకు రష్యాతోనూ సమగ్ర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. – కమోడోర్ హేమంత్ ఖత్రి, హిందుస్థాన్ షిప్‌యార్డు సీఎండీ -
భారత్‌లో ట్విట్టర్ ‘ఫ్లీట్స్’ ఫీచర్
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ తాజాగా భారత్ మార్కెట్లో తమ ఫ్లీట్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షించనున్నట్లు ట్విట్టర్ మంగళవారం వెల్లడించింది. యూజర్ పోస్ట్ చేసిన కంటెంట్ 24 గంటల తర్వాత ఇక కనిపించకుండా మాయమయ్యేలా ఈ ఫీచర్ ఉంటుంది. ‘అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనలను యూజర్లు పంచుకునేందుకు ఫ్లీట్స్ ఉపయోగపడుతుంది. ఇవి 24 గంటల తర్వాత ఇక కనిపించవు. వీటికి రీట్వీట్స్ గానీ లైక్స్ గానీ పబ్లిక్ కామెంట్స్ గానీ ఉండవు‘ అని ట్విట్టర్ తెలిపింది. ఒకవేళ ఆ అంశంపై సదరు యూజరుతో గానీ ఫాలోవర్లు సంభాషించదల్చుకుంటే ప్రైవేట్‌గా డైరెక్ట్ మెసేజీలు పంపవచ్చని పేర్కొంది. కొత్తగా అప్డేటెడ్ యాప్ వెర్షన్స్‌లో ఫ్లీట్స్ లభిస్తుందని వివరించింది. యూజర్లు ప్రొఫైల్ పిక్చర్‌పై ట్యాప్ చేయడం ద్వారా ఈ తరహా ట్వీట్స్ చేయొచ్చు. ప్రస్తుతం బ్రెజిల్, ఇటలీలో ఫ్లీట్స్ ఫీచర్ అందుబాటులో ఉంది. -
ఆ వాహన శ్రేణిలో టెస్లా సైబర్‌ట్రక్..
లండన్ : టెస్లా ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా లాంఛ్ చేసిన సైబర్‌ట్రక్ త్వరలోనే దుబాయ్ పోలీసుల వాహన శ్రేణిలో చేరనుంది. ఈ ఎలక్ర్టిక్ పికప్ ట్రక్ 2020లో తమ అధికారిక వాహన శ్రేణిలో చేరుతుందని చెబుతూ దానిపై తమ లోగోలను ముద్రించిన ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. దుబాయ్ పోలీసుల వాహన శ్రేణిలో సైబర్‌ట్రక్ చేరనుండటంతో ఈ ఘనతను సాధించిన తొలి టెస్లా కారు ఇదే కావడం గమనార్హం. దుబాయ్ పోలీసులు ఇప్పటికే బుగాట్టి వెర్యాన్, ఆస్టన్ మార్టిన్ వన్-77, బీఎండబ్ల్యూ ఐ8, ఫెరారి లాఫెరారి, లాంబోర్గిని అవెంటడార్, లైకాన్ హైపర్‌స్పోర్ట్ వంటి కార్లను తమ వాహన శ్రేణిలో ఉపయోగిస్తున్నాయి. కాగా, ఈనెల 22న టెస్లా సైబర్‌ట్రక్‌ను లాంఛ్ చేయగా కేవలం నాలుగు రోజుల్లోనే 1.87 లక్షల ఆర్డర్లు వచ్చాయి. 2020లో టెస్లా ఉత్పత్తి ప్రారంభమవుతున్న ఈ ఎలక్ర్టిక్ పికప్ ట్రక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. లాంఛ్ సందర్భంగా వాహన పనితీరును పరీక్షిస్తున్న సమయంలో రాయి విసరడంతో వెహికల్ గ్లాస్ అద్దాలు బద్దలైనా రికార్డుస్ధాయిలో ఆర్డర్లు వెల్లువెత్తడం గమనార్హం. -
విశాఖ తీరంలో కళ్లు చెదిరే సాహసాలు
విశాఖపట్నం: విశాఖపట్నంలో 11 అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష కార్యక్రమం అబ్బుర పరుస్తోంది. నేవీ సేనలు అద్భుతమైన విన్యాసాలతో, కళ్లు చెదిరే సాహసాలతో అదరగొడుతున్నారు. యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు గగన తలంలో మువ్వన్నెల జెండాను వినువీధిన రెపరెపలాడిస్తుండగా, చిన్నచిన్న బోట్లు, లాంచీలు, యుద్ధ నౌకలు విశాఖ తీరంలో దూసుకెళుతున్నాయి. తీరం వెంబడి నేవీ సైన్యం సాహసాలు కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, గవర్నర్ నరసింహన్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. కాగా, ఇండియన్ నేవీలో ముఖ్యంగా విక్రమాధిత్య ఆకట్టుకుంటోంది. జూన్ 14, 2014లో విక్రమాధిత్య భారత నౌకాదళంలో చేరింది. ఇందులో 22 డెక్ లు ఉన్నాయి. విక్రమాధిత్య పొడవు 283.5 మీటర్లు. దీని స్పీడ్ గంటకు 56 కిలో మీటర్లు. ఈ సందర్బంగా ఈ సాహసాలను అటు విశాఖ నగర పౌరులు దేశ విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు కన్నార్పకుండా వీక్షిస్తున్నారు. -
ఫ్లీట్ రివ్యూకు ఏర్పాట్లు
-
ముస్తాబవుతున్న విశాఖ ఫిషింగ్ హార్బర్
-
తస్మాత్ జాగ్రత్త
సాక్షి, కర్నూలు: అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా కన్ను కర్నూలు జిల్లాపై పడిందా..? దీనికి నిఘా వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. సినిమాను తలపించేలా వీరి వ్యూహం ఉంటోందని అనుమానిస్తున్నారు. వీరు ప్రాంతాలను పంచుకుని మరీ దొంగతనాలకు పాల్పడుతుండడం.. పని పూర్తిచేసుకుని ఎంచక్కా తిరిగి విమానాల్లో తమ ప్రాంతాలకు వెళ్లిపోతున్న వైనం జిల్లా పోలీసులను దిగ్భాంతికి గురిచేస్తోంది. దొంగల కదలికలు పోలీసు యంత్రాంగాన్ని కలవరపెడుతోంది. మాఫియా గ్యాంగ్‌లాగా దోపిడీ దొంగలు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకోవడంపై ఉన్నతాధికారులు నిఘా పెట్టడంతో కళ్లు తిరిగే వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. కర్నూలు, అనంతపురం జిల్లాలను లక్ష్యంగా చేసుకుని అంతర్ రాష్ట్ర ముఠాలు భారీ దోపిడీలకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో గత కొంతకాలం నుంచి దొంగతనాలు ఎక్కువయ్యాయి. ప్రాంతాలు, పరిసరాలతో సంబంధం లేకుండా ఎక్కడికక్కడ తమ వంతు చేతివాటాన్ని ప్రదర్శిస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. అయితే వీటిపై జరుపుతున్న దర్యాప్తులో కర్నూలు పోలీసు యంత్రాంగానికి విస్తుపోయే విషయాలు తెలుస్తున్నాయి. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రాయలసీమ నాలుగు జిల్లాల్లోనూ తమ చేతివాటం చూపేందుకు సిద్ధమైన దొంగల ముఠాలు.. క్షేత్ర స్థాయిలో ఇప్పటికే తమ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు వినిపిస్తుండగా.. దీనికి వెనుక భారీ నెట్వర్క్ ఉందన్న విషయం పోలీసుల విచారణలో వెల్లడైంది. ఉత్తర భారతదేశానికి చెందిన పలువురు నేరగాళ్లు ఈ తంతు వెనక కీలకపాత్ర పోషిస్తున్నట్లు స్పష్టమవుతుండగా.. అందులోనూ మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన వ్యక్తులు సూత్రధారులుగా ఉన్నట్లు సమాచారం. వీరంతా గతంలో పలు కేసుల్లో నిందితులు కాగా, ఇప్పుడు బృందాలుగా ఏర్పడి దోపిడీలకు తెగబడుతున్నట్లు అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బెంగళూరు నుంచి అపరేషన్! దోపీడీ దొంగల ముఠా సభ్యులు బెంగళూరు నుంచి ఈ మొత్తం వ్యవహారాన్ని నడుపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. నేరాల్లో ఆరితేరిన గ్యాంగ్‌లోని సభ్యులంతా దొంగల ముఠాలుగా ఏర్పడి ఇలా వరుస చోరీలకు దిగుతున్నట్లు సమాచారం. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను కొల్లగొట్టాలనే క్రమంలో దొంగలు విమానాలను సైతం ఆశ్రయిస్తున్నారన్న విషయం పోలీసుల దర్యాప్తులో స్పష్టమైంది. ఢిల్లీ నుంచి బెంగళూరు విమానాశ్రాయానికి చేరుకుంటున్నవారు, సమీప ప్రాంతాల్లో తిష్ట వేస్తున్నారు. అక్కడి నుంచి పక్కాగా వ్యూహాన్ని రూపొందించుకున్న అనంతరం రాయలసీమ జిల్లాలోకి ప్రవేశిస్తున్నారు. ఇందుకు బెంగళూరు, దేవనహళ్లి విమానాశ్రయాలను వీరు తమ రాకపోకలకు అనువుగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధాన సూత్రధారులు బెంగళూరు కేంద్రంగానే రాకెట్ నడుపుతుండగా.. ముఠాలు మాత్రమే సీమ జిల్లాల్లో తిరుగుతున్నాయి. తాజాగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జరిగిన కొన్ని గొలుసుకట్టు దొంగతనాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అక్కడి దొంగతనాల తీరుతెన్నులు, నేరగాళ్ల చేతివాటం ఆధారంగా పరిశీలిస్తే ఉత్తర భారత ముఠాల కార్యకలాపాలుగా స్పష్టమైనట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు స్పష్టం చేశారు. సదరు ముఠాల సభ్యులు చాలా తెలివిగా నిఘా కెమెరాలకు సైతం దొరకకుండా, వేలిముద్రలు దొరక్కుండా దోపిడీలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ బృందాలు తిరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. వీఐపీల ఇళ్లు, భారీ షాపింగ్ మాల్స్, ప్రధాన వాణిజ్య కేంద్రాలను లూటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిఘా పెంచాం: కర్నూలు జిల్లాలో ఉత్తర భారత నేరగాళ్ల కదలికలు ఉన్న మాట వాస్తవమే. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి, నిఘా పెంచాం. ఇప్పటికే ప్రత్యేక బృందాలతో జల్లెడ పడుతున్నాం. ముఖ్యంగా బ్యాంకులు, పెట్రోల్ బంకులు, మాల్స్ వద్ద తనిఖీలు ముమ్మరం చేస్తున్నాం. అనుమానితుల వివరాలను సేకరిస్తున్నాం. - ఆకె రవికృష్ణ, జిల్లా ఎస్పీ