లండన్ : టెస్లా ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా లాంఛ్ చేసిన సైబర్‌ట్రక్ త్వరలోనే దుబాయ్ పోలీసుల వాహన శ్రేణిలో చేరనుంది. ఈ ఎలక్ర్టిక్ పికప్ ట్రక్ 2020లో తమ అధికారిక వాహన శ్రేణిలో చేరుతుందని చెబుతూ దానిపై తమ లోగోలను ముద్రించిన ఫోటోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దుబాయ్ పోలీసుల వాహన శ్రేణిలో సైబర్‌ట్రక్ చేరనుండటంతో ఈ ఘనతను సాధించిన తొలి టెస్లా కారు ఇదే కావడం గమనార్హం. దుబాయ్ పోలీసులు ఇప్పటికే బుగాట్టి వెర్యాన్, ఆస్టన్ మార్టిన్ వన్-77, బీఎండబ్ల్యూ ఐ8, ఫెరారి లాఫెరారి, లాంబోర్గిని అవెంటడార్, లైకాన్ హైపర్‌స్పోర్ట్ వంటి కార్లను తమ వాహన శ్రేణిలో ఉపయోగిస్తున్నాయి. కాగా, ఈనెల 22న టెస్లా సైబర్‌ట్రక్‌ను లాంఛ్ చేయగా కేవలం నాలుగు రోజుల్లోనే 1.87 లక్షల ఆర్డర్లు వచ్చాయి. 2020లో టెస్లా ఉత్పత్తి ప్రారంభమవుతున్న ఈ ఎలక్ర్టిక్ పికప్ ట్రక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. లాంఛ్ సందర్భంగా వాహన పనితీరును పరీక్షిస్తున్న సమయంలో రాయి విసరడంతో వెహికల్ గ్లాస్ అద్దాలు బద్దలైనా రికార్డుస్ధాయిలో ఆర్డర్లు వెల్లువెత్తడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment