Dubai Police
-
ఆ వాహన శ్రేణిలో టెస్లా సైబర్‌ట్రక్..
లండన్ : టెస్లా ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా లాంఛ్ చేసిన సైబర్‌ట్రక్ త్వరలోనే దుబాయ్ పోలీసుల వాహన శ్రేణిలో చేరనుంది. ఈ ఎలక్ర్టిక్ పికప్ ట్రక్ 2020లో తమ అధికారిక వాహన శ్రేణిలో చేరుతుందని చెబుతూ దానిపై తమ లోగోలను ముద్రించిన ఫోటోను ట్విటర్లో పోస్ట్ చేశారు. దుబాయ్ పోలీసుల వాహన శ్రేణిలో సైబర్‌ట్రక్ చేరనుండటంతో ఈ ఘనతను సాధించిన తొలి టెస్లా కారు ఇదే కావడం గమనార్హం. దుబాయ్ పోలీసులు ఇప్పటికే బుగాట్టి వెర్యాన్, ఆస్టన్ మార్టిన్ వన్-77, బీఎండబ్ల్యూ ఐ8, ఫెరారి లాఫెరారి, లాంబోర్గిని అవెంటడార్, లైకాన్ హైపర్‌స్పోర్ట్ వంటి కార్లను తమ వాహన శ్రేణిలో ఉపయోగిస్తున్నాయి. కాగా, ఈనెల 22న టెస్లా సైబర్‌ట్రక్‌ను లాంఛ్ చేయగా కేవలం నాలుగు రోజుల్లోనే 1.87 లక్షల ఆర్డర్లు వచ్చాయి. 2020లో టెస్లా ఉత్పత్తి ప్రారంభమవుతున్న ఈ ఎలక్ర్టిక్ పికప్ ట్రక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. లాంఛ్ సందర్భంగా వాహన పనితీరును పరీక్షిస్తున్న సమయంలో రాయి విసరడంతో వెహికల్ గ్లాస్ అద్దాలు బద్దలైనా రికార్డుస్ధాయిలో ఆర్డర్లు వెల్లువెత్తడం గమనార్హం. -
గల్ఫ్‌లో బందీ.. ఆగిన పెళ్లి
సాక్షి, కోనరావుపేట(కరీంనగర్) : కొద్దిరోజుల్లోనే కుమారుడి వివాహం.. ఇందుకోసం ఇంటికి రంగులు వేయించి ముస్తాబు చేశారు. ఇంటిముందర పచ్చని పందిరి ఏర్పాటు చేశారు. బంధుమిత్రులకు వివాహ ఆహ్వాన పత్రికలు పంచారు. ఈ నెల 26న జరిగే వివాహానికి తప్పక హాజరుకావాలని కోరారు. అక్కడ అమ్మాయి తరఫు వారు కూడా వివాహం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి ఎంతో సంబురంతో దుబాయి నుంచి బయలు దేరాడు వరుడు. అనూహ్య రీతిలో అక్కడి జైలుకు తరలించారు పోలీసులు. దీంతో వధువు, వరుడి కుటుంబాలే కాదు.. రెండు గ్రామాల్లోనూ ఆందోళన నెలకొంది. వివరాలు ఇవీ.. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేటకు చెందిన కదిరె మల్లేశం, లత దంపతుల కుమారుడు వంశీకృష్ణ(25) ఉపాధి కోసం 2018 జనవరి 11న నిమ్మపల్లికి చెందిన ఏజెంట్ ఆనందం ద్వారా దుబాయికి వెళ్లాడు. నెలకు రూ.20 వేల వేతనమని ఏజెంట్ చెప్పినా.. అక్కడకు వెళ్లాక రూ.8 వేలే ఇచ్చారు. వివాహం నిశ్చయం కావడంతో.. వంశీకృష్ణకు చందుర్తి మండలం నర్సింగపూర్ గ్రామానికి చెందినగో యువతితో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. మేనరికం కావడం, ఇదివరకే వధూవరులు పెళ్లిచూపులు చూసుకోవడంతో వంశీకృష్ణ వివాహానికి ఒప్పుకున్నాడు. తాను జూన్‌లో స్వగ్రామం వస్తానని, అప్పుడే ముహూర్తం ఖరారు చేయాలని తల్లిదండ్రులను కోరాడు. దీంతో ఈ నెల 26న పెళ్లి ఉండడంతో అన్ని ఏర్పాటు చేశారు కుటుంబసభ్యులు. బంధువులు కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇంటికి వస్తూ జైల్లోకి... వంశీకృష్ణ జూన్ 3న అక్కడి నుంచి బయలు దేరాడు. అతడి వద్ద కంపెనీ వీసా లేకపోవడంతో పోలీసులు పట్టుకుని జైలుకు తరలించారు. అంతే.. కుమారుడు వస్తున్నాడనే ఆనందంలో ఉన్న తల్లిదండ్రులు హతాశయులయ్యారు. పెళ్లి వేడుకలతో కళకళలాడాల్సిన వారి ఇల్లు కళ తప్పింది. కుటుంబసభ్యులు, బంధువులు వంశీకృష్ణ రాకకోసం ఎదురుచూస్తున్నారు. తమ కుమారుడిని త్వరగా జైలు నుంచి విడిపించాలని తల్లిదండ్రులు కదిరె మల్లేశం, లత, సోదరుడు అరుణ్ వేడుకుంటున్నారు. -
శ్రీదేవి కేసు; దుబాయ్ అధికారుల తప్పిదాలు!
సాక్షి, వెబ్‌డెస్క్ : యావత్ భారతావని అతిలోక సుందరిగా ఆరాధించే శ్రీదేవి అకాల మరణంపై దుబాయ్ అధికారుల వరుస తప్పిదాలు చర్చనీయాంశమవుతున్నాయి. తాను బసచేసిన జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్లో ఫిబ్రవరి 24 రాత్రి ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో పడి శ్రీదేవి చనిపోయారని అక్కడి పోలీసులు, ఆరోగ్య శాఖ, ప్రాసిక్యూటర్లు నిర్ధారించారు. అయితే ఈ మేరకు జారీ అయిన డెత్, ఎంబామింగ్ సర్టిఫికేట్లలో మృతురాలి వివరాలను ఒక్కోచోట ఒక్కోలా పేర్కొనడం గమనార్హం. గల్ఫ్ చట్టాల ప్రకారం విచారణలో ఉన్న కేసులకు సంబంధించి ఎలాంటి అంశాలనైనా అధికారులుగానీ, మీడియాగానీ బయటకు వెల్లడించడానికి వీలేలేదు. ఆఖరికి దుబాయ్ రాజు కూడా విచారణలో జోక్యం చేసుకునేవీలులేదన్న విషయం తెలిసిందే. మరి అంత పకడ్బందీగా సాగే వ్యవహారాల్లో తప్పులు చోటుచేసుకోవడం, అదికూడా శ్రీదేవి లాంటి అంతర్జాతీయ సెలబ్రిటీ విషయంలో జరుగడం అధికారుల నిర్లక్ష్యమనే చెప్పాలి. శ్రీదేవి వయసెంత? శ్రీ అమ్మయ్యంగార్ అయ్యప్పన్ అలియాస్ శ్రీదేవి 1963, ఆగస్టు 13న తమిళనాడులోని శివకాశీలో జన్మించారన్నది నిర్వివాదాంశం. ఆ ప్రకారం చనిపోయేనాటికి ఆమె వయసు 54 ఏళ్లపైమాటే. కానీ యూఏఈ ఆరోగ్య శాఖ జారీచేసిన డెత్ సర్టిఫికేట్లో శ్రీదేవి వయసు 53 ఏళ్లుగా పేర్కొన్నారు. అదే ఎంబామింగ్ ప్రక్రియకు సంబంధించి అదే శాఖ జారీ చేసిన మరో ఆదేశాల్లో మృతురాలి వయసును 52 ఏళ్లని రాశారు. అందరికీ తెలిసినట్లు ఆమె వయసు 54 ఏళ్లు కాకుండా పాస్‌పోర్టులో మరోలా ఉందనుకున్నా, రెండు సర్టిఫికేట్లలోనూ దానినే పేర్కొనాలి. కానీ అలా జరగలేదు. ఒక్కోచోట ఒక్కోలా వయసును పేర్కొనడం ఖచ్చితంగా పొరపాటే. ఇప్పటికే నటి మరణంపై కొన్ని అనుమానాలు తలెత్తిన దరిమిలా దీనిపై దుబాయ్ అధికారులు వివరణ ఇస్తారా లేదా అన్నది తేలాల్సిఉంది. ఫిబ్రవరి 27న యూఏఈ ఆరోగ్య శాఖ జారీ చేసిన ఎంబామింగ్ సర్టిఫికేట్ ఇది(వయసు52గా పేర్కొన్నారు) ఆ మూడురోజులూ శ్రీదేవి మృతదేహం అక్కడే.. యూఏఈ ఆరోగ్య శాఖ భవనంలో పోస్ట్‌మార్టం అనంతరం భారత కార్మికుల మృతదేహాలను ఎక్కడైతే భద్రపరుస్తారో అదే చోట శ్రీదేవి మృతదేహాన్ని కూడా మూడు రోజులపాటు ఉంచారు. మంగళవారం సాయంత్రానికి దర్యాప్తు పూర్తయినట్లు అధికారులు వెల్లడించడంతో శ్రీదేవి భౌతికకాయాన్ని ఎంబామింగ్ చేసి విమానాశ్రయానికి తరలించారు. నిజానికి దుబాయ్ అధికార వర్గాలు ఇలాంటి అధికారిక ప్రకటనలు చేయడం అరుదు. అయితే శ్రీదేవి మరణం, ఆమె భౌతికాయాన్ని ఎప్పుడు తీసుకొస్తారనేదానిపై స్వదేశంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యాన్ని వివరిస్తూ భారత్‌లోని యూఏఈ దౌత్యవర్గాలు తమ ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు సమాచారం. ఫిబ్రవరి 26న జారీ అయిన శ్రీదేవి డెత్ సర్టిఫికేట్ (వయసు 53గా రాశారు) నేడు అంత్యక్రియలు : శ్రీదేవి భౌతికకాయాన్ని అభిమానులు, శ్రేయోభిలాషుల చివరి చూపుకోసం ముంబై లోఖండ్‌వాలాలోని సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్లో బుధవారం ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.30 వరకు ఉంచునున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. విల్లే పార్లేలోని సేవా జమాజ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయి. -
స్వదేశానికి శ్రీదేవి మృతదేహం?
-
శ్రీదేవి భర్త ఇంటరాగేషన్.. ట్విస్టింగ్ న్యూస్
దుబాయ్ : నటి శ్రీదేవీ మృతి కేసు నిమిషానికో మలుపు తిరుగుతోంది. హోటల్ గదిలో శ్రీదేవీ ప్రాణాలు కోల్పోయిన సమయంలో భర్త బోనీ కపూర్ అక్కడే ఉన్నారన్న సంగతి తెలిసిందే. విచారణలో ఆయన ఇచ్చే వాగ్మూలం కీలకంగా మారింది. ఈ మేరకు బోనీని దుబాయ్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారని, ఆయన చెప్పిన విషయాలకు, వైద్యులు డెత్ రిపోర్టులో పేర్కొన్న అంశాలకు ఏమాత్రం పోలికలేదని, దీంతో బోనీని అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సోమవారం పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి. కానీ అందుకు భిన్నంగా ‘అసలు బోనీని పోలీసులు ఇంటరాగేషనే చెయ్యలేదం’టూ ప్రఖ్యాత ఖలీజ్ టైమ్స్ మంగళవారం ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. శ్రీదేవి మరణవార్తను తొలుత బ్రేక్ చేసింది కూడా ఇదే వార్తా సంస్థ కావడం గమనార్హం. దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్లో శ్రీదేవి చనిపోయినట్లు శనివారం రాత్రి సమాచారం అందుకున్న పోలీసులు.. నిమిషాల వ్యవధిలోనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమెను రషీద్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అటుపై మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం యూఏఈ ఆరోగ్యశాఖ భవనానికి తరలించారు. ఆదివారం నాడు కొద్ది నిమిషాలు మాత్రమే బోనీని పోలీసులు ప్రశ్నించారని, ఆ తర్వాత గంటల తరబడి విచారించారనేది పూర్తి అవాస్తమని ఖలీజ్ టైమ్స్ పేర్కొంది. -
బోనీకపూర్‌ను అరెస్ట్ చేసే అవకాశం?