
బోనీ కపూర్ (ఫైల్ ఫొటో)
దుబాయ్ : నటి శ్రీదేవీ మృతి కేసు నిమిషానికో మలుపు తిరుగుతోంది. హోటల్ గదిలో శ్రీదేవీ ప్రాణాలు కోల్పోయిన సమయంలో భర్త బోనీ కపూర్ అక్కడే ఉన్నారన్న సంగతి తెలిసిందే. విచారణలో ఆయన ఇచ్చే వాగ్మూలం కీలకంగా మారింది. ఈ మేరకు బోనీని దుబాయ్ పోలీసులు సుదీర్ఘంగా విచారించారని, ఆయన చెప్పిన విషయాలకు, వైద్యులు డెత్ రిపోర్టులో పేర్కొన్న అంశాలకు ఏమాత్రం పోలికలేదని, దీంతో బోనీని అరెస్టు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సోమవారం పెద్ద ఎత్తున వార్తలు వెలువడ్డాయి. కానీ అందుకు భిన్నంగా ‘అసలు బోనీని పోలీసులు ఇంటరాగేషనే చెయ్యలేదం’టూ ప్రఖ్యాత ఖలీజ్ టైమ్స్ మంగళవారం ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. శ్రీదేవి మరణవార్తను తొలుత బ్రేక్ చేసింది కూడా ఇదే వార్తా సంస్థ కావడం గమనార్హం.
దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్ టవర్ హోటల్‌లో శ్రీదేవి చనిపోయినట్లు శనివారం రాత్రి సమాచారం అందుకున్న పోలీసులు.. నిమిషాల వ్యవధిలోనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమెను రషీద్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అటుపై మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం యూఏఈ ఆరోగ్యశాఖ భవనానికి తరలించారు. ఆదివారం నాడు కొద్ది నిమిషాలు మాత్రమే బోనీని పోలీసులు ప్రశ్నించారని, ఆ తర్వాత గంటల తరబడి విచారించారనేది పూర్తి అవాస్తమని ఖలీజ్ టైమ్స్ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment