ఇప్పటికీ నా భార్య నాతోనే ఉన్నట్లుంది అంటున్నాడు నిర్మాత బోనీ కపూర్. బరువు తగ్గడమే పనిగా పెట్టుకున్న ఆయన దాదాపు 14 కిలోలు తగ్గిపోయాడట! తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మొదట్లో నాకు తెలియకుండానే కొంత బరువు తగ్గాను. దాదాపు 13-14 కిలోల మేర తగ్గానని తెలుసుకున్నప్పుడు మరింత బరువు తగ్గాలనిపించింది. పైగా కాస్త సన్నబడ్డాక నా శరీరాకృతి కూడా మారింది. అలా అధిక బరువు ఉన్న నేను 95 కిలోలకు వచ్చాను.
నాకు నేనే నచ్చలేదు
నా ఎత్తూపొడుగుకు 87-88 ఉండాలట! అంటే ఇంకా కనీసం ఎనిమిది కిలోలైనా తగ్గాల్సి ఉంది. తు ఝూటి మే మక్కర్ సినిమా సమయంలో అయితే బొద్దుగా ఎప్పటిలాగే ఉన్నాను. ఎప్పుడైతే నన్ను నేను స్క్రీన్‌పై చూసుకున్నానో నాకు నేనే నచ్చలేదు. అందుకే ఆ సినిమా తర్వాత నేను సన్నబడాలని ప్రయత్నాలు మొదలుపెట్టాను. నా భార్య శ్రీదేవి ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపించేది. తనతో కలిసి వాకింగ్‌కు వెళ్లేవాడిని, జిమ్‌కు వెళ్లేవాడిని.
నా వల్ల కాలేదు
ఎప్పుడు, ఏం తినాలనే విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించేది. నేనూ ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు. కానీ గత రెండేళ్లుగా నన్ను నేను చూసుకున్నప్పుడు మార్పు అవసరం అనిపించింది. ఈ ప్రయాణంలో శ్రీదేవి నావెంటే ఉన్నట్లుగా ఉంది. బరువు తగ్గడానికి తను నన్ను ప్రేరేపిస్తున్నట్లనిపిస్తోంది. ఇప్పుడు నా లుక్ చూసి పై లోకంలో ఉన్న నా భార్య కచ్చితంగా గర్వపడుతుంది అంటున్నాడు. కాగా శ్రీదేవి- బోనీకపూర్ 1997లో పెళ్లి చేసుకున్నారు. వీరికి జాన్వీ, ఖుషి కపూర్ సంతానం. 2018లో శ్రీదేవి మరణించింది.
Comments
Please login to add a commentAdd a comment