ఎలాంటి అంచనాల్లేకుండా ఓటీటీల్లో రిలీజయ్యే కొన్ని సిరీస్‌లు.. ఊహించని విధంగా బ్లాక్‌బస్టర్ అవుతుంటాయి. అలా 2020లో 'పాతాళ్ లోక్' పేరుతో వచ్చిన ఓ సిరీస్ అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. అప్పట్లో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన ఈ సిరీస్‌కి ఇన్నాళ్లకు రెండో సీజన్ తీసుకొస్తున్నారు. అధికారికంగా ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీని కూడా ప్రకటించారు. ఇంతకీ ఈ సిరీస్ సంగతేంటి?
స్టార్ జోడీ కోహ్లీ-అనుష్క శర్మ నిర్మించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ 'పాతాళ్ లోక్'. 2020లో అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదలైన ఈ సిరీస్‌లో తొమ్మిది ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 40 నిమిషాల వరకు ఉన్నప్పటికీ.. ప్రతి నిమిషం థ్రిల్లింగ్ ఉండటంతో ఈ సిరీస్‌ని ఎగబడి చూశారు. మర్డర్స్, ధనిక-పేద మధ్య అంతరం లాంటివి చాలా రియలస్టిక్‌గా చూపించడంపై కొన్ని కంప్లైంట్స్ ఉన్నప్పటికీ ఓవరాల్‌గా అదరగొట్టేసింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్)
'పాతాళ్ లోక్' రెండో సీజన్.. జనవరి 17 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. పోస్టర్‌లో ప్రధాన పాత్రధారి జైదీప్ అహ్లావత్ ముఖం ఓవైపు నార్మల్‌గా ఉండగా.. ఎద్దు పుర్రెతో కప్పినట్లు ఉంది. చూస్తుంటేనే రెండో సీజన్ కూడా రచ్చలేపడం గ్యారంటీ అనిపిస్తుంది.
'పాతాళ్ లోక్' విషయానికొస్తే.. 20 ఏళ్లుగా ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న హాతీరామ్ చౌదరి (జైదీప్ అహ్లావత్) దగ్గర పాపులర్ జర్నలిస్ట్ సంజీవ్ మెహ్రా (నీరజ్ కాబి) హత్యాయత్నం కేసు వస్తుంది. నలుగురు క్రిమినల్స్‌ని అరెస్ట్ కూడా చేస్తారు. దర్యాప్తు చేసే క్రమంలో హంతకుల బృంద నాయకుడైన హతోడా త్యాగి (అభిషేక్ బెనర్జీ) గురించి భయంకరమైన నిజాలు తెలుస్తాయి. అయితే ఈ కేసుని కొందరు ప్రభుత్వ పెద్దలు.. సీబీఐకి అప్పగిస్తారు. సస్పెండ్ అయినా కానీ హాతీరామ్ తన ఇన్వెస్టిగేషన్ ఆపడు. ఆ ఇన్వెస్టిగేషన్‌లో ఆ హంతకుల గురించిన చేదు నిజాలతో పాటు పెద్ద రాజకీయ కుంభకోణమే బయట పడుతుంది. అసలు సంజీవ్ మెహ్రాని చంపడానికి పథకం ఎందుకు వేసినట్టు? కంటికి కనిపిస్తున్నవన్నీ నిజాలేనా లేక అసలు నిజాన్ని కప్పి పెట్టడానికి పెట్టిన డైవర్షన్లా? అనేదే అసలు కథ.
(ఇదీ చదవండి: చిరంజీవి ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదు: నాగవంశీ)
Comments
Please login to add a commentAdd a comment