విశాఖపట్నం: విశాఖపట్నంలో 11 అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష కార్యక్రమం అబ్బుర పరుస్తోంది. నేవీ సేనలు అద్భుతమైన విన్యాసాలతో, కళ్లు చెదిరే సాహసాలతో అదరగొడుతున్నారు. యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు గగన తలంలో మువ్వన్నెల జెండాను వినువీధిన రెపరెపలాడిస్తుండగా, చిన్నచిన్న బోట్లు, లాంచీలు, యుద్ధ నౌకలు విశాఖ తీరంలో దూసుకెళుతున్నాయి. తీరం వెంబడి నేవీ సైన్యం సాహసాలు కూడా ఆకట్టుకుంటున్నాయి.
ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, గవర్నర్ నరసింహన్, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. కాగా, ఇండియన్ నేవీలో ముఖ్యంగా విక్రమాధిత్య ఆకట్టుకుంటోంది. జూన్ 14, 2014లో విక్రమాధిత్య భారత నౌకాదళంలో చేరింది. ఇందులో 22 డెక్ లు ఉన్నాయి. విక్రమాధిత్య పొడవు 283.5 మీటర్లు. దీని స్పీడ్ గంటకు 56 కిలో మీటర్లు. ఈ సందర్బంగా ఈ సాహసాలను అటు విశాఖ నగర పౌరులు దేశ విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులు కన్నార్పకుండా వీక్షిస్తున్నారు.
విశాఖ తీరంలో కళ్లు చెదిరే సాహసాలు
Published Sun, Feb 7 2016 6:04 PM | Last Updated on Sun, Sep 3 2017 5:08 PM
Advertisement