Genome biology
-
‘వన్ డే వన్ జినోమ్’ లక్ష్యం ఏంటంటే..
న్యూఢిల్లీ: మానవ ఆరోగ్యంతోపాటు వ్యవసాయం, పర్యావరణ రంగాల్లోనూ ఎన్నోవిధాలుగా ఉపయోగపడే సూక్ష్మజీవి ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు ఇంకో గొప్ప ప్రయత్నం మొదలైంది. కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం, బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నొవేషన్ కౌన్సిల్ (బ్రిక్)లు సంయుక్తంగా ఈ పనిని చేపట్టాయి. ‘వన్ డే వన్ జినోమ్’ పేరుతో న్యూఢిల్లీలో మొదలైన ఈ కార్యక్రమంలో భాగంగా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ తదితర సూక్ష్మజీవులపై విసృ్తతస్థాయిలో పరిశోధనలు చేపట్టనున్నారు. వాటి జన్యుక్రమాలను నమోదు చేయడమే కాకుండా.. విశ్లేషించనున్నారు. తద్వారా దేశంలోని వైవిధ్యభరితమైన సూక్ష్మజీవులను మన ప్రయోజనాలకు ఉపయోగించుకోనున్నారు. ఈ నెల తొమ్మిదిన న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో ఈ ‘వన్ డే వన్ జినోమ్’ కార్యక్రమం మొదలైంది. నీతీఆయోగ్ మాజీ సీఈవో జీ20 షేర్పా అమితాబ్ కాంత్ తదితరులు పాల్గొన్నారు. జీవావరణ వ్యవస్థలో మైక్రోఆర్గానిజమ్స్ లేదా సూక్ష్మజీవులు చాలా కీలకం. మట్టి ఏర్పాటు మొదలుకొని ఖనిజాల శుద్ధీకరణ వరకూ బోలెడన్ని పనులు చేస్తూంటాయి ఇవి. వ్యవసాయం విషయానికి వస్తే నేలలో పోషకాలను రీసైకిల్ చేయడం, నైట్రోజన్‌ను మట్టిలోకి చేర్చడం, చీడపీడల నియంత్రణ, వంటి పనులన్నింటికీ బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులే కారణం. అంతేకాదు.. ఈ సూక్ష్మజీవులు మొక్కలతో కలసిమెలిసి ఉంటూ నీరు పోషకాలు సక్రమంగా అందేలా చేస్తాయి. మానవ శరీరంలో కొన్ని లక్షల కోట్ల బ్యాక్టీరియా ఉన్నాయంటేనే వాటి ప్రాధాన్యత ఏమిటన్నది అర్థమవుతుంది. తిన్న ఆహారం జీర్ణం చేయడంలో, శరీరానికి పోషకాలు అందించడంలో కీలకపాత్ర పోషిస్తూంటాయి. అలాగే మనకొచ్చే ఇన్ఫెక్షన్లకూ ఈ సూక్ష్మజీవుల్లోని కొన్ని కారణమవుతుంటాన్నది మనకు తెలుసు. ఇంతటి ప్రాముఖ్యం ఉన్నది కాబట్టే వీటి గురించి మరింత విసృ్తత స్థాయిలో అధ్యయనం చేయాల్సిన అవసరమం ఉందంటోంది ‘వన్ డే వన్ జినోమ్’!అయితే ఇప్పటివరకూ సూక్ష్మజీవి ప్రపంచాన్ని అర్థం చేసుకున్నది చాలా తక్కువే. అందుకే వేర్వేరు బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ల జన్యుక్రమాన్ని విశ్లేషించే లక్ష్యంతో వన్ డే వన్ జినోమ్ కార్యక్రమం మొదలైంది. తద్వారా ఏ సూక్ష్మజీవుల ద్వారా ముఖ్యమైన ఎంజైమ్‌లు లభిస్తున్నాయి? రోగాలకు చెక్‌పెట్టేందుకు ఉపయోగపడే రసాయనాలు ఉన్నాయన్న విషయం తెలుస్తుంది. వ్యవసాయంలోనూ మొక్కకు మేలు చేయగల, దిగుబడి పెంచగల సూక్ష్మజీవులను గుర్తించే వీలేర్పడుతుంది. బ్రిక్తోపాటు బయోమెడికల్ జినోమిక్స్ కూడా చురుకుగా పాల్గొంటున్న ఈ కార్యక్రమం ద్వారా ఏ ప్రాంతంలో ఏ రకమైన బ్యాక్టీరియా అందుబాటులో ఉందో? వాటి లక్షణాలేమిటో తెలుసుకోవచ్చు. ఇది కూడా చదవండి: అణ్వాయుధ దాడికి పుతిన్ ఆదేశం.. ప్రపంచదేశాల ఆందోళన -
భారత్‌లోకి సూపర్ వేరియెంట్
న్యూఢిల్లీ: చైనాలో కరోనా కేసులతో దడ పుట్టిస్తున్న బీఎఫ్.7 కంటే ప్రమాదకరమైన వేరియెంట్ భారత్‌లోకి ప్రవేశించింది. అమెరికాలో కొత్తగా పుట్టుకొచ్చి అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఎక్స్‌బీబీ.1.5 సబ్ వేరియెంట్ తొలికేసు గుజరాత్లో బయటపడింది! దీన్ని కేంద్ర ఆరోగ్య శాఖలోని జెనోమ్ సీక్వెన్సింగ్ సంస్థ ఇన్సోకాగ్ ధ్రువీకరించింది. అమెరికాలో 40 శాతానికి పైగా కేసులివే అమెరికాలో గత అక్టోబర్‌లో న్యూయార్క్‌లో ఈ వేరియెంట్ బయటపడింది. అప్పట్నుంచి కరోనాతో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అమెరికాలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 40% పైగా ఈ వేరియెంట్‌వే. అత్యంత తీవ్రంగా వ్యాప్తి చెందే లక్షణాలున్న ఎక్స్‌బీబీ.1.5ని సూపర్ వేరియెంట్ అని పిలుస్తున్నారు. ‘‘ప్రపంచంలో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన కరోనా వేరియెంట్లలో ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఇప్పుడు పలు దేశాలకు విస్తరిస్తోంది’’ అని మిన్నెసోటా వర్సిటీ అంటువ్యాధి నిపుణుడు మైఖేల్ హెచ్చరించా రు. సింగపూర్‌లోనూ ఈ కేసులు బాగా ఉన్నాయి. ఏమిటీ ఎక్స్‌బీబీ.1.5? ఒమిక్రాన్‌లో బీఏ.2 నుంచి ఈ ఎక్స్‌బీబీ.1.5 సబ్ వేరియెంట్ పుట్టుకొచ్చింది. బీక్యూ, ఎక్స్‌బీబీ వేరియెంట్ల కాంబినేషన్ జన్యు మార్పులకు లోనై ఎక్స్‌బీబీ.1.5 వచ్చింది. ఎక్స్‌బీబీ కంటే 96% వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన కరోనా వేరియెంట్లలో దీని విస్తరణ అత్యధికంగా ఉంది. డెల్టా తరహాలో ఇది ప్రాణాంతకం కాకపోయినా ఆస్పత్రిలో చేరాల్సిన కేసులు బాగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ వేరియెంట్‌తో అమెరికాలో వారంలో కేసులు రెట్టింపయ్యాయని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. అమెరికా అంటు వ్యాధి నిపుణుడు ఎరిక్ ఫీగెల్ డింగ్ తన ట్విటర్లో ఈ వేరియెంట్ గురించి వెల్లడిస్తూ ఆర్ వాల్యూ అత్యధికంగా ఉన్న వేరియెంట్ ఇదేనని తెలిపారు. ఎక్స్ఎక్స్బీ కంటే 120% అధికంగా ఈ వేరియెంట్ సోకుతోందని తెలిపారు. కరోనా సోకి సహజ ఇమ్యూనిటీ, టీకాల ద్వారా వచ్చే ఇమ్యూనిటీని కూడా ఎదుర్కొని మనుషుల శరీరంలో ఈ వైరస్ స్థిరంగా ఉంటోందని వివరించారు. మనకు ముప్పు ఎంత? ఎక్స్‌బీబీ.1.5తో మనం అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైరాలజిస్ట్ గగన్‌దీప్ కాంగ్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో ఒమిక్రాన్ వేరియెంట్ ప్రబలినప్పుడు దేశ జనాభాలో దాదాపుగా 90శాతం మందికి కరోనా సోకి హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చిందని దాని వల్ల రక్షణ ఉంటుందని ఆమె అంచనా వేస్తున్నారు. అయితే దేశ జనాభాలో బూస్టర్ డోసు 27% మంది మాత్రమే తీసుకున్నారని, ప్రజలందరూ మరింత ఇమ్యూనిటీ కోసం టీకా తీసుకుంటే మంచిదని సూచించారు. కోవిడ్ కేసులు పెరిగే విధానాన్ని లెక్కించే ఐఐటీ సూత్ర కోవిడ్ మోడల్లో భాగస్వామిగా ఉన్న ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ అమెరికాలో మాదిరిగా మన దేశంలో కేసులు నమోదయ్యే అవకాశాల్లేవని వివరించారు. మరోవైపు దేశంలో 24 గంటల్లో 226 కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 3,653కి చేరుకుంది. లక్షణాలివే..! ఎస్బీబీ.1.5 సోకితే సాధారణంగా కరోనాకుండే లక్షణాలే ఉంటాయి. జలుబు, ముక్కు కారడం, గొంతు నొప్పి, జ్వరం, తలనొప్పి, పొడిదగ్గు, తుమ్ములు, గొంతు బొంగురుపోవడం, ఒళ్లు నొప్పులు, వాసన కోల్పోవడం వంటివి బయటపడతాయి. -
అన్ని జీవుల జన్యుగుట్టు తేల్చే ప్రాజెక్ట్!
మెల్బోర్న్: ప్రపంచంలోని ప్రతి సంక్లిష్ట జాతి జన్యువుల లోగుట్టును విశదీకరించే భారీ ప్రాజెక్టు పూర్తైతే జీవశాస్త్రంలో సంచలనాలు చూడవచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పదేళ్లలో దాదాపు 18 లక్షల స్పీసిస్ (ప్రజాతులు) జీనోమ్ సీక్వెన్సింగ్ చేసే ద ఎర్త్ బయోజీనోమ్ ప్రాజెక్ట్ (ఈబీపీ)కు 2018లో శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు లక్ష్యాలు, పురోగతి తదితర వివరాలను మంగళవారం సైన్స్ జర్నల్స్‌లో ప్రచురించారు. ఈ ప్రాజెక్టు పూరై్తతే ఇంతవరకు జరిగిన బయోలాజికల్ రీసెర్చ్ రూపురేఖలు మారతాయి. విశేషాలు.. ► ఈ ప్రాజెక్టులో 22 దేశాలకు చెందిన 44 సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. సుమారు 5వేల మంది శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్నారు. ► ప్రాజెక్టుకు దాదాపు 470 కోట్ల డాలర్ల వ్యయమవుతుందని అంచనా. ► సంక్లిష్ట జీవులు ఎలా ఉద్భవించాయి? జీవ వైవిధ్యత ఎలా మనుగడ సాగిస్తోంది? తదితర ప్రశ్నలకు సమాధానాలు ఈ ప్రాజెక్టుతో లభిస్తాయని అంచనా. ► హ్యూమన్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ ప్రేరణతో 2016లో ఈబీపీని ప్రతిపాదించారు, 2018 నవంబర్‌లో అధికారికంగా ప్రారంభించారు. ► ప్రతి కుటుంబం (టాక్జానమీలో ఫ్యామిలీ) నుంచి కనీస ఒక్క జీనోమ్ సీక్వెన్సింగ్‌ను తొలిదశలో పూర్తి చేయాలని సంకల్పించారు. ► రెండోదశలో సుమారు 1.8లక్షల జాతుల సీక్వెన్సింగ్ చేస్తారు, మూడోదశలో అన్ని జీవుల సీక్వెన్సింగ్ పూర్తవుతుంది. ► ఏకకణ జీవుల నుంచి మానవుల వరకు భూమిపై ఉన్న అన్ని జీవుల జీనోమ్ సీక్వెన్సింగ్ ఈ ప్రాజెక్టులో పూర్తి చేస్తారు. అంటే దాదాపు ప్రతి ప్రాణి జన్యు గుట్టును ఈ ప్రాజెక్టు బహిర్గతం చేస్తుంది. ► దీనివల్ల భవిష్యత్‌లో వైద్య, ఫార్మా రంగాల్లో ఊహించని పురోగతి సాధించవచ్చని పరిశోధకుల అంచనా. -
Covid-19: ‘‘అరే, యార్! ఎక్కడ నుంచి వచ్చిందిరా ఇది?’’
యోగుల పుట్టుక.. వాగుల పుట్టుక ఎవరికీ తెలీదనేది పాత నానుడి! ఈ వరుసలో వైరస్ల పుట్టుక కూడా చేర్చాలని తాజా అనుభవాలు చెబుతున్నాయి. ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా నిజంగా ప్రకృతి ద్వారా సంక్రమించిందా? లేక జీవాయుధంగా ల్యాబ్ నుంచి విడుదలైందా? అనేది అందరినీ కుదిపేస్తున్న ప్రశ్న. దీనికి వైరాలజిస్టులు ఏమి చెబుతున్నారో చూద్దాం... ప్రపంచంలో ఎప్పుడు అతిపెద్ద వ్యాధి సంక్రమణం గుర్తించినా, అందరూ అడిగే తొలి ప్రశ్న ఒక్కటే! ‘‘అరే, యార్! ఎక్కడ నుంచి వచ్చిందిరా ఇది?’’ అనేది అందరి మెదళ్లను తొలిచే తొలి ప్రశ్న. దీనికి పరిశోధకులు తమ ప్రాణాలు పణంగా పెట్టి సమాధానం కనుగొనే యత్నం చేస్తారు. తాజాగా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా విలయం పుట్టుపూర్వోత్తరాలపై కూడా ఇదే ప్రశ్న ఉద్భవించింది. దీనికి సమాధానం కోసం పలువురు పరిశోధకులు పలు పరిశోధనలు చేశారు. కానీ, ప్రపంచ గతిని మార్చే ఇలాంటి మహమ్మారుల పుట్టుక గురించి తెలుసుకోవడం అంత ఈజీ కాదు! ఉదాహరణకు ప్రపంచాన్ని గడగడలాడించిన హెచ్ఐవీ జన్మ గురించి తెలుసుకోవడానికి అది వ్యాపించిన తర్వాత 20 ఏళ్లు పట్టింది. ఇక ఎబోలా లాంటి కొన్ని వ్యాధుల పుట్టుక గురించి ఇంకా సమాధానం లేదు. కరోనా వైరస్ చైనా నుంచి వచ్చిందన్న ఆధారాలున్నా, ఇది ఎప్పుడు, ఎలా మొదలైందనేదానిపై ఇంకా పూర్తిస్థాయి సంతృప్తికర సమాధానాలు లేవు. అసలు వైరాలజిస్టులు ఇలాంటి సూక్ష్మజీవుల జన్మాన్ని ఎలా గుర్తిస్తారనేది ఆసక్తికరమైన విషయం. నిజానికి చాలా వైరస్లు, ఇతర సూక్ష్మ జీవులు అడవుల్లో చెట్లను ఆశ్రయించుకొని బతికేస్తుంటాయి. కానీ ఆ చెట్లపై వాటి ప్రభావం పెద్దగా ఉండదు. కానీ ఒక్కసారి అవి తమ హోస్ట్‌ను మార్చిన అనంతరం పరిణామాలు సీరియస్‌గా మారతాయి. వైరస్ల పుట్టుపూర్వోత్తరాలు గుర్తించేందుకు అటు ల్యాబ్‌ల్లో ఎంత కష్టపడాలో, ఇటు ఫీల్డులో సైతం అంతే కష్టపడాల్సిఉంటుందని ప్రఖ్యాత వైరాలజిస్టులు వివరిస్తుంటారు. వీటితో పాటు కొంత అదృష్టం కూడా కలిసిరావాలంటారనుకోండి! మనిషిని రుచి మరుగుతాయి! సాధారణంగా తీవ్రవ్యాధులు కలిగించే వైరస్లు జంతువుల నుంచి తమ అతిధేయి(హోస్ట్)ని మని షికి మార్చుకున్న తర్వాత విజృంభిస్తాయి. ఒక్క సారి మనిషిలోకి వచ్చాక ఇవి విపరీతంగా వ్యాప్తి చెంది పాండమిక్స్(ప్రబల వ్యాధులు)గా రూపాం తరం చెందుతాయి. వీటి జన్మాన్ని గుర్తించే ందుకు వైరాలజిస్టులు తొలుత సదరు వ్యాధి మనుషుల్లో ఉనికిలోకి వచ్చిన ప్రాంతాల్లోని అనారోగ్యకరంగా కనిపించే జంతువులపై పరీక్షలు మొదలుపెడతారు. నిజానికి పైన చెప్పుకున్నట్లు చాలా జంతువు ల్లో ఈ వైరస్లు పెద్దగా ప్రభావకరమైన లక్షణాలు చూపించవు. అయినా సరే ముందుగా ఆ ప్రాంతా ల్లో వ్యాధిగ్రస్తమైన జంతువులను పరీక్షించడం జరుగుతుంది. అయితే మనిషి కానీ, జంతువులు కానీ చెట్లలాగా స్థిర జీవులు కావు. కనుక ఒక్కోసారి తొలుత వ్యాధి సోకిన మనిషి లేదా జంతువు తప్పనిసరిగా వ్యాధి బయటపడిన ప్రాంతానికి దగ్గరలోనే ఉండిఉండకపోవచ్చు. –సాక్షి, నేషనల్ డెస్క్ బ్యాడ్ బ్యాట్స్ కరోనా విషయంలో గబ్బిలాలపై అందరి దృష్టి పడటానికి ఒక కారణం ఉంది. పలు కరోనా వైరస్‌లతో పాటు, సార్స్, మెర్స్ తదితర వైరస్‌లకు కూడా ఇవి అతిధేయులు కావడం గమనార్హం. నిజానికి ప్రస్తుత కరోనా వైరస్‌కు దగ్గరా ఉండే వైరస్‌ను 2011–12లో వూహాన్ వైరాలజీ సంస్థ బ్యాట్ కరోనా వైరస్‌ల్లో గుర్తించింది. 2003లో సార్స్ విజృంభణ అనంతరం ఈ సంస్థ గబ్బిలాల్లో కరోనా కారక, సంబంధిత వైరస్‌లను గుర్తించే పనిలో ఉంది. యున్నాన్ ప్రావిన్సులో గబ్బిలాల నుంచి సంస్థ శాంపిళ్లను సేకరించి అధ్యయనాలు నిర్వహించింది. గబ్బిలాల్లోని కరోనా వైరస్లు మనిషికి సంక్రమించే అవకాశాలను గుర్తించేందుకు వీటిని కోతి కిడ్నీ కణాలపై, మానవ ట్యూమర్ కణాలపై సంక్రమింపజేశారు. ఈ పరిశోధనలో సదరు వైరస్లు మనిషి కణాల్లో వేగంగా వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. దీంతో ఇవి మనిషికి నేరుగా గబ్బిలాల నుంచి సంక్రమించినట్లు తెలిసింది. అనంతరం సదరు వైరస్ల జెనిటిక్ సీక్వెన్స్‌ను అధ్యయనం చేయడం ద్వారా వీటికి దగ్గరగా ఉండే మరో వైరస్ కరోనాకు కారణమని తెలుసుకోగలిగారు. వూహాన్ మాంస మార్కెట్లో తొలిసారి ఈ వ్యాధిని గుర్తించినందున, గబ్బిలాలకు, మనిషికి మధ్య ఇంకో అతిధేయి ఉండే అవకాశాలను కూడా వైరాలజిస్టులు పరిశీలించారు. చివరకు నేరుగానే ఇవి గబ్బిలాల నుంచి సంక్రమించినట్లు నిర్ధారణకు వచ్చారు. వీటి తర్వాత చాలా కష్టపడి వైరస్ ఫ్యామిలీ ట్రీని కంప్యూటర్ ప్రోగ్రామ్‌లు ఉపయోగించి సృష్టించగలిగారు. ల్యాబ్ రిలీజ్? కరోనా గబ్బిలాల నుంచి మనిషికి సోకినట్లు కనుగొన్నా, ఇది ప్రకృతి సహజంగా జరిగిందా? లేక ల్యాబ్ నుంచి రిలీజయిందా? అన్న అంశంపై పలు సందేహాలున్నాయి. తాజాగా 18 మంది ప్రముఖ వైరాలజిస్టులు ఈ ప్రశ్నపై లోతైన విచారణ జరగాలని కోరడం సంచలనం సృష్టించింది. ఇప్పటివరకు ఉన్న అధ్యయనాల ప్రకారమైతే ల్యాబ్ నుంచి ఈ వైరస్ విడుదలైందనేందుకు అవకాశాలు స్వల్పంగా ఉన్నట్లు కొందరు వైరాలజిస్టులు భావిస్తున్నారు. జెనిటిక్ ఇంజనీరింగ్ ద్వారా సృష్టించిన వైరస్ ఐతే, దాని జెనిటిక్ కోడ్‌లో మానవ నిర్మిత మార్పులు కనిపించేవని చెబుతున్నారు. కరోనా జీనోమ్‌లోని స్పైక్ ప్రోటీన్ కోడ్ మెర్స్వైరస్లోని స్పైక్ ప్రోటీన్ కోడ్‌కు దగ్గరగా ఉన్నట్లు గుర్తించారు. ఇది ప్రకృతిలో సహజంగా జరిగే వైరల్ ఉత్పరివర్తనాల వల్ల సంభవించి ఉందనేది వీరి వాదన. అయితే ఈ విషయమై మరింత పరిశోధన జరగాల్సిఉంది.కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలను కనుగొనేందుకు జరిగే పరిశోధనలు భవిష్యత్‌లో రాబోయే విపత్తులను ముందుగా గుర్తించేందుకు, అర్ధం చేసుకునేందుకు తగిన ఆధారాలనిచ్చాయని వైరాలజిస్టులు భావిస్తున్నారు. కానీ ఒక వైరస్ పుట్టుకను కచ్ఛితంగా గుర్తించడమనేది ఇంకా సంపూర్ణంగా సాధ్యంకాదనేది ప్రస్తుతం అర్థమవుతున్న అంశం. కానీ దాని వ్యాప్తిని నివారించడం, వ్యాధిని అదుపు చేయడం మాత్రం పూర్తిగా మనిషి చేతుల్లోనే ఉంది. చదవండి: కోవిడ్ తీవ్రతకు ఆ డీఎన్ఏకు లంకె -
జన్యువు మొనపైనే మన ఆరోగ్యం..
మొట్టమొదటి మానవ జన్యురాశి 20 సంవత్సరాల అత్యద్భుతమైన శాస్త్రీయ పురోగతి ఫలితంగా సంభవించింది. ఇప్పుడు లభిస్తున్న అత్యంత భారీ స్థాయి జన్యు పరివర్తనల డేటా అనేది మానవుల్లోని అత్యంత సంక్లిష్టమైన వ్యాధులకు మూలాలను ఛేదించగలదని నేను కచ్చితంగా చెప్పగలను. ఆల్ ఆఫ్ అజ్ వంటి భారీ స్థాయి జనాభా అధ్యయనాలు, అతి పెద్ద డేటా ప్రాజెక్టులకు నిజంగానే ధన్యవాదాలు చెప్పాలి. వీటి ఫలితంగానే మన ఆరోగ్యాన్ని మన వ్యక్తిగత జన్యు క్రమం ఎలా తీర్చిదిద్దుతోందన్న చిరకాల చిక్కు ప్రశ్నకు పరిశోధకులకు సమాధానం లభిస్తుందని నా ప్రగాఢ విశ్వాసం. మానవ జన్యురాశికి సంబంధించిన మొట్టమొదటి ముసాయిదా 20 ఏళ్ల క్రితం అంటే 2001లో ప్రచురితమైంది. దాదాపుగా మూడేళ్ల సమయం తీసుకున్న మానవ జన్యురాశి క్రోడీకరణకు 500 మిలియన్ డాలర్ల ఖర్చయింది. చరిత్రలో తొలిసారిగా చేపట్టిన ఈ హ్యూమన్ జెనోమ్ ప్రాజెక్టు మానవ ప్రాణిని జీవపరంగా నిర్వచించే 300 కోట్ల డీఎన్ఏ బేస్‌ల జతలను లేదా డీఎన్ఏ కోడ్ అక్షరాలను ఒక్కటొక్కటిగా అధ్యయన చేయడానికి శాస్త్రజ్ఞులను అనుమతించింది. ప్రస్తుతం నేషనల్ కేన్సర్ ఇనిస్టిట్యూట్‌లో పోస్ట్ డాక్టొరల్ ఫెలోగా పనిచేస్తున్న నాలాంటి కొత్త తరం పరిశోధకులకు.. కేన్సర్ చికిత్సల కోసం కొత్త లక్ష్యాలను గుర్తించడానికి, మానవుల రోగనిరోధక వ్యవస్థలకు చెందిన విస్తృత ప్రయోజనాలను నిర్దేశించడానికి, ఈ హ్యూమన్ జెనోమ్ ప్రాజెక్టు అనుమతిస్తోంది. అంతేకాకుండా గూగుల్ మ్యాప్స్‌ని మీరు ఉపయోగిస్తున్న విధంగా మానవ జన్యురాశిని మొత్తంగా ఎవరైనా నిర్దేశించగలిగేలా ఒక వెబ్ పేజిని కూడా ఈ బృహత్ ప్రాజెక్టు రూపొందిస్తుంది. ఒక ఏక వ్యక్తికి సంబంధించినది కాకుండా, కొంతమంది వ్యక్తులకు ప్రాతినిధ్యం వహించే జన్యురాశి ప్రస్తావనను రూపొందించడానికి ప్రయత్నించేందుకోసం పేరు తెలీని కొద్దిమంది దాతల నుంచి మొట్టమొదటి సంపూర్ణ జన్యురాశిని ఉత్పాదించడం జరిగింది. అయితే ప్రపంచంలోని మానవ జనాభా వైవిధ్యతను ఒడిసిపట్టే ప్రక్రియలో ఇది చాలా పరిమితమైనది. ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకలా ఉండరు. రెండు జన్యురాశిలు కూడా ఒకేలా ఉండవు. మానవజాతి సకల వైవిధ్యతలను అర్థం చేసుకోవాలని పరిశోధకులు కోరుకుంటే, దానికి కోటానుకోట్ల సంపూర్ణ జన్యురాశుల క్రమ పరంపర అవసరమవుతుంది. ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్టు ఒకటి నడుస్తోంది. ప్రజలలోని జీవ పరివర్తన సంపదే ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ విశిష్టమైనవారిగా మలుస్తోంది. అయితే జన్యుపరమైన మార్పులు అనేక అవ్యవస్థలకు లేదా వ్యాధులకు కారణమవుతుంటాయి. ఇతరుల కంటే కొంతమంది వ్యక్తుల బృందాలు నిర్దిష్ట వ్యాధులకు గురయ్యేందుకు ఇవి కారణమవుతాయి. మానవ జన్యురాశి క్రోడీకరణ ప్రాజెక్టు మొదలైన సమయంలో, పరిశోధకులు.. ఎలుకలు, తేనెటీగలు, మధుశిలీంద్రాలు, కొన్ని మొక్కల అంగనిర్మాణానికి సంబంధించిన సంపూర్ణ క్రమ జన్యురాశిని కూడా పరిశోధకులు అనుక్రమణం చేయగలిగారు. ఈ తొలి జన్యురాశిని ఉత్పత్తి చేయడానికి చేసిన భారీ ప్రయత్నం జన్యురాశి అధ్యయనానికి అవసరమైన టెక్నాలజీలో విప్లవానికి దారితీసింది. సంపూర్ణ మానవ జన్యురాశి వరుసక్రమాన్ని పేర్చేందుకు అనేక సంవత్సరాల సమయం తీసుకుని, వందలాది కోట్ల డాలర్ల ఖర్చు అయినప్పటికీ, ఈ సాంకేతిక ముందంజను మాత్రం అభినంచాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఈ పనికి కొన్ని రోజుల సమయం మాత్రమే సరిపోతుంది. పైగా దీనికి కొన్ని వేల డాలర్ల ఖర్చు మాత్రమే అవుతోంది. జన్యురాశి క్రమాన్ని పేర్చడం అనేది ‘నేను’ లేక ‘వారసత్వం’ వంటి జన్యు రూపాల సర్వీసులకు చాలా భిన్నమైంది. ఈ జన్యురూపాలనేవి ఒక వ్యక్తి జన్యురాశిలో అతి చిన్న స్థానాల్లోనే కనిపిస్తుంటాయి. సాంకేతికరంగంలో ముందంజలనేవి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వ్యక్తుల సంపూర్ణ జన్యురాశుల క్రమాన్ని పేర్చడానికి శాస్త్రజ్ఞులను అనుమతించాయి. జెనోమ్ అగ్రిగేషన్ కన్సోర్టియా వంటి సంస్థలు చెల్లాచెదరుగా ఉన్న డేటాను సేకరించి, ఆర్గనైజ్ చేయడానికి ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇంతవరకూ, ఈ గ్రూప్ సంస్థ మానవ జన్యురాసి వైవిధ్యతకు చెందిన అపారమైన సమాచారాన్ని ప్రదర్శించేటటువంటి దాదాపు 1,50,000 జన్యురాశులను సేకరించగలిగింది. ఈ సమూహంలోనే వ్యక్తుల జన్యురాశులలోని 24.1 కోట్ల వ్యత్యాసాలను పరిశోధకులు కనుగొన్నారు. ఈ జన్యురూపాలలో చాలావరకు అరుదైనవి, ఒక వ్యక్తిపై ఇవి ఏ ప్రభావాన్నీ చూపబోవు. అయితే, ఈ జన్యురూపాలలో దాగి ఉన్నవి అతి ముఖ్యమైన భౌతిక, వైద్యపరమైన పర్యవసానాలను కలిగి ఉంటున్నాయి. ఉదాహరణకు యాష్కెనాజి యూదులు వంటి కొన్ని బృందాలకు చెందిన మహిళలల్లోని బిఆర్సీఏ1 జన్యువు.. అండాశయ, బ్రెస్ట్ కేన్సర్‌కు కారణమవుతోంది. ఈ జీన్స్ లోని ఇతర జన్యురూపాలు కొంతమంది నైజీరియన్ మహిళల్లో బ్రెస్ట్ కేన్సర్ వల్ల సాధారణం కంటే మించి అధిక మరణాలకు దారి తీస్తున్నాయి. ఒక నియంత్రిత గ్రూప్‌తో, విస్తృత ప్రజా బృందాల జన్యురాశిలను పోల్చి చూసే జన్యుపరమైన అసోసియేషన్ ద్వారా జనాభాపరమైన జన్యురూపాల రకాలను పరిశోధకులు ఉత్తమంగా గుర్తించగలరు. అయితే వ్యాధులు చాలా సంక్లిష్టమైనవి. ఒక వ్యక్తి జీవన శైలి, లక్షణాలు, జీవన ప్రారంభం అనేవి చాలా వ్యత్యాసంతో ఉంటాయి. పైగా అనేక వ్యాధులపై జన్యుప్రభావాన్ని ప్రత్యేకంగా గుర్తించి వర్గీకరించడం చాలా కష్టమైన పని. ఈ ప్రభావాలలో చాలావాటిని వెలికితీయాలంటే ప్రస్తుత జన్యు పరిశోధనల ఉత్పాదక శక్తి చాలా తక్కువగా ఉంటోంది. ఎందుకంటే ఇప్పటికీ జన్యురాశికి చెందిన డేటా తగినంతగా లేకపోవడమే కారణం. సంక్లిష్ట వ్యాధుల జన్యుక్రమాన్ని, ప్రత్యేకించి వేరువేరు జాతుల, తెగలకు సంబంధించిన జన్యువ్యత్యాసాలను అర్థం చేసుకోవడానికి కావలసిన విస్తారమైన డేటా సమస్య ఎదురవుతోంది. పరిశోధకులకు ఇప్పుడు మరింత డేటా అవసరం. పది లక్షల జన్యురాశులు మరింత డేటా అవసరాన్ని అధిగమించడానికి, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్.. మనందరమూ (ఆల్ ఆఫ్ అజ్) అనే ప్రోగ్రాంని ప్రారంభించింది. పదేళ్ల కాలంలో అమెరికాలోని పదిలక్షలమంది ప్రజలకంటే ఎక్కువమందిపై సర్వేలు, వారు ధరించిన దుస్తుల నుంచి సేకరించిన జన్యు సమాచారం, వైద్య రికార్డులు, ఆరోగ్య అలవాట్లు వంటి సమాచారాన్ని సేకరించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. అలాగే ఆరోగ్యపరమైన వ్యత్యాసాలను అధ్యయనం చేయడానికి వెలుగులోకి రాని మైనారిటీ గ్రూప్‌లనుంచి మరింత సమాచారాన్ని సేకరించాలని కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆల్ ఆఫ్ అజ్ ప్రాజెక్టును ప్రజా నమోదుకోసం 2018లో బహిరంగపర్చారు. నేటివరకు 2,70,000 మంది ప్రజలు తమ శాంపిల్స్ ఇచ్చి తోడ్పడ్డారు. అమెరికాలోని 50 రాష్ట్రాల నుంచి భాగస్వాములను నియమించుకోవడాన్ని ఈ ప్రాజెక్టు కొనసాగిస్తోంది. అనేక అకడెమిక్ ప్రయోగశాలలు, ప్రైవేట్ కంపెనీలు ఈ ప్రయత్నంలో పాల్గొంటున్నాయి. ఈ మహా ప్రయత్నం వివిధ రంగాల శాస్త్రజ్ఞులకు లబ్ధి చేకూరుస్తుంది. ఉదాహరణకు, ఒక న్యూరో సైంటిస్టు మానసిక కుంగుబాటుతో ముడిపడి ఉన్న జన్యు రూపాలకోసం ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించవచ్చు. కేన్సర్ నిపుణుడు జాతి నేపథ్యం ప్రభావాన్ని అన్వేషిస్తూనే చర్మ కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించగల జన్యురూపాల కోసం ఈ ప్రాజెక్టులో శోధించవచ్చు. పది లక్షల జన్యురాశులు, వాటితో ముడిపడి ఉన్న వ్యక్తుల ఆరోగ్యం, జీవనశైలికి చెందిన సమాచారం అసాధారణమైన డేటా సంపదను అందిస్తుంది. ఇది వ్యక్తులలోనే కాకుండా, విభిన్న ప్రజా బృందాలలో ఉన్న వ్యాధులపై జన్యు రూపాల ప్రభావాన్ని కనుగొనడానికి పరిశోధకులకు చక్కగా అనుమతిస్తుంది. మానవ జన్యురాశిపై అగోచర విషయం ప్రస్తుతం అధ్యయనం చేయడానికి చాలా కష్టంగా ఉన్న మానవ జన్యురాసిలోని వివిధ భాగాలను తెలుసుకోవడానికి ఈ ప్రాజెక్టు శాస్త్రజ్ఞులను అనుమతిస్తుంది. ఇంతవరకు జరిగిన జన్యు పరిశోధనలలో చాలావరకు ప్రొటీన్ల సంకేత నిర్మాణాన్ని వెలికితీసే జెనోమ్ భాగాలపైనే జరుగుతూ వచ్చాయి. కానీ ఇది మొత్తం మానవ జన్యురాశిలో 1.5 శాతానికి మాత్రమే వర్తిస్తుంది. నా పరిశోధన ప్రధానంగా ఆర్‌ఎన్‌ఎ పై దృష్టి సారించింది. ఇది వ్యక్తి డీఎన్ఏలో ఎన్కోడ్ చేసిన సందేశాలను ప్రొటీన్లుగా మారుస్తుంది. అయితే 98.5 శాతం మానవ జన్యురాశి నుంచి వస్తూ కూడా ప్రొటీన్లను రూపొందించలేని ఆర్ఎన్ఏలు తమకు తాముగా వేల సంఖ్యలో విధులను కలిగి ఉంటాయి. కోడ్ చేయని ఈ ఆర్ఎన్ఏలలో కొన్ని.. మహిళల్లో కేన్సర్‌ను వ్యాప్తి చేయడం, అండదశలో అభివృద్ధి చేయడం లేదా ఎక్స్ క్రోమోజోమ్ని నియంత్రించడం వంటి వాటిని ప్రాసెస్ చేయడంలో పాలుపంచుకుంటాయి. కోడ్ చేయని ఆర్ఎన్ఏలు తమ పనులు చేసుకునేలా అనుమతించే సంకటమైన మడతను జన్యు పరివర్తనను ఎలా ప్రభావితం చేస్తుందనే అంశంపై నా అధ్యయనం ప్రత్యేకించి కొనసాగుతుంది. ఆల్ ఆఫ్ అజ్ ప్రాజెక్టు మానవ జన్యురాశికి చెందిన కోడింగ్, నాన్ కోడింగ్ భాగాలన్నింటిని కలిగి ఉంటున్నందున, నా పనికి సంబంధించి అది ఒక అతిపెద్ద సముచితమైన డేటా బేస్‌గా ఉపయోగపడనుంది. పైగా ఇది ఈ మార్మికమైన ఆర్ఎన్ఏలపై సరికొత్త వెలుగును ప్రసరిస్తుందని నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటి మానవ జన్యురాశి 20 సంవత్సరాల అత్యద్భుతమైన శాస్త్రీయ పురోగతి ఫలితంగా సంభవించింది. ఇప్పుడు లభిస్తున్న అత్యంత భారీ స్థాయి జన్యు పరివర్తనల డేటా అనేది మానవుల్లోని అత్యంత సంక్లిష్టమైన వ్యాధులకు మూలాలను ఛేదించగలదని నేను కచ్చితంగా చెప్పగలను. ఆల్ ఆఫ్ అజ్ వంటి భారీ స్థాయి జనాభా అధ్యయనాలు, అతి పెద్ద డేటా ప్రాజెక్టులకు నిజంగానే ధన్యవాదాలు చెప్పాలి. వీటి ఫలితంగానే మన ఆరోగ్యాన్ని మన వ్యక్తిగత జన్యుక్రమం ఎలా తీర్చిదిద్దుతోందన్న చిరకాల చిక్కు ప్రశ్నకు పరిశోధకులకు సమాధానం లభిస్తుందని నా విశ్వాసం. వ్యాసకర్త: జేవియర్ బోఫిల్ డి రాస్ రీసెర్చ్ ఫెలో, ఆర్ఎన్ఏ బయాలజీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్, అమెరికా -
మరింత చేరువగా జన్యువైద్యం
- కొత్త టెక్నాలజీతో తగ్గుతున్న ఖర్చులు - సీసీఎంబీ డెరైక్టర్ మోహన్‌రావు - జన్యుశాస్త్ర పోకడలపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: జన్యుశాస్త్రంలో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో శరవేగంగా వస్తున్న మార్పులు సమీప భవిష్యత్తులో వైద్యంతోపాటు అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయని, వ్యక్తుల జన్యుక్రమం ఆధారంగా వారికే ప్రత్యేకమైన మందులు ఇవ్వడమూ అందుబాటులోకి వస్తుందని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డెరైక్టర్ డాక్టర్ సి.హెచ్.మోహన్‌రావు తెలిపారు. సైజినోమ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో ‘నెక్స్ట్ జెన్ జినోమిక్స్, బయాలజీ, బయో ఇన్ఫర్మేటిక్స్ అండ్ టెక్నాలజీస్’ పేరుతో అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. సీసీఎంబీ సహకారంతో చేపట్టిన ఈ సదస్సు ప్రారంభోత్సవానికి హాజరైన డాక్టర్ మోహన్‌రావు జన్యుశాస్త్రంలో వస్తున్న మార్పులు, తద్వారా మానవాళికి ఒనగూరనున్న ప్రయోజనాలను విలేకరులకు వివరించారు. మానవ జన్యుపటాన్ని తెలుసుకోవాలంటే కొన్నేళ్ల క్రితం వరకూ కోట్ల రూపాయలు ఖర్చయ్యేవని, ఇమేజ్ ప్రాసెసింగ్, ప్యారెలల్ కంప్యూటింగ్ల పుణ్యమా అని ఇప్పుడు రూ.1.5 లక్షలతోనే తెలుసుకోవచ్చని ఆయన చెప్పారు. అమెరికా, యునెటైడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో ప్రజలందరి జన్యుపట ఆవిష్కరణకు, తద్వారా వ్యక్తిగత వైద్యం అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వివరించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రొమ్ముకేన్సర్కు వ్యక్తి జన్యుక్రమం ఆధారంగా మందులు ఎంపిక చేసే పద్ధతి అవలంబిస్తున్నారు. సదస్సు చైర్మన్ డాక్టర్ శేఖర్ శేషగిరి మాట్లాడుతూ జినోమిక్స్ కేవలం వైద్యరంగానికి మాత్రమే పరిమితం కాలేదని, వ్యవసాయంలోనూ మార్పులు తీసుకురాగలదని అన్నారు. జన్యు పరిశోధనల్లో సామాజిక న్యాయం ఇప్పటివరకూ జరిగిన జన్యుపరిశోధనల్లో అధికశాతం యూరోపియన్ ప్రజలను దృష్టిలో ఉంచుకుని జరిగాయని అమెరికా అధ్యక్షుడు ఒబామా సలహాదారు, డాక్టర్ ఎస్తవాన్ తెలిపారు. అమెరికా జరిపిన అధ్యయనం ద్వారా ఈ విషయం తెలిసిందని, ఫలితంగా జన్యుశాస్త్ర ఫలాలు ప్రజలందరికీ చేరువ కాలేకపోయాయన్నారు. అమెరికా ప్రజలకు జన్యుక్రమ ఆధారిత వ్యక్తిగత వైద్యం అందించే ప్రయత్నాలు వేగంగా ముందుకెళుతున్నాయని చెప్పారు. భారత్ ప్రజల్లో వైవిధ్యం ఎక్కువ: డాక్టర్ తంగరాజ్ జన్యుపరంగా భారత్‌లో వైవిధ్యం ఎక్కువని, కనుక అన్ని జాతుల ప్రజల జన్యుక్రమాలపై పరిశోధనలు విసృ్తతంగా చేపట్టాల్సిన అవసరం ఉందని సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ తంగరాజ్ తెలిపారు. జన్యుక్రమం ఆధారంగా చూస్తే దేశంలో దాదాపు 4,000 వర్గాలున్నాయని చెప్పారు.