
అతి విలాసవంతమైన కార్లకు పెట్టిందిపేరైన ఆస్టిన్ మార్టిన్ లగ్జరీ కారును విడుదల చేసింది. బ్రిటీష్ కార్ల తయారీ కంపెనీ 2019 ఆస్టన్-మార్టిన్ వాన్టేజ్ అధికారికంగా ఇండియాలో విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ. .2.95 కోట్ల (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది. దేశంలో ఈ కొత్తకార్లను 15-20 యూనిట్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. బుకింగ్స్ ప్రారంభం.
4.0 లీటర్ ట్విన్ టర్బో వి8 ఇంజన్, 6000 ఆర్పీఎం, వద్ద 503బీహెచ్‌పీ, 2000-5000 ఆర్‌పీఎం వద్ద 685 ఎన్‌ఎం పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు ఇంజీన్లను కూడా ఒక కొత్త 8- స్పీడ్ స్పోర్ట్ షిఫ్ట్- 2 ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేసింది. కేవలం 3.5 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. గంటకు 315 కీ.మి టాప్ వేగంతో దూసుకుపోతుంది.




Comments
Please login to add a commentAdd a comment