Aston Martin car
-
ఆస్టన్ మార్టిన్ ఫస్ట్ హైబ్రిడ్ కారు 'వల్హల్లా' ఇదే (ఫోటోలు)
-
ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ @ 4 కోట్లు
న్యూఢిల్లీ: సూపర్ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బ్రిటిష్ కంపెనీ ఆస్టన్ మార్టిన్ భారత్‌లో కొత్త వాంటేజ్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూం ధర రూ.3.99 కోట్లు. 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజన్, 8 స్పీడ్ జడ్ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఎల్రక్టానిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్, బావర్స్ అండ్ విలి్కన్స్ 15 స్పీకర్స్ సౌండ్ సిస్టమ్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ పొందుపరిచారు. ఈ 2 డోర్ల కూపే 665 పీఎస్ పవర్, 800 ఎన్ఎం టార్క్ అందిస్తుంది. గరిష్ట వేగం గంటకు 325 కి.మీ. 3.5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కీలకమైన, ఆశాజనక మార్కె ట్ కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అన్ని మోడళ్లను భారత్‌లోనూ విడుదల చేస్తున్నట్లు ఆస్టన్ మార్టిన్ న్యూఢిల్లీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ తెలిపా రు. సెప్టెంబర్ 2న అంతర్జాతీయంగా వీ12 మోడల్‌ను కంపెనీ విడుదల చేస్తోంద న్నారు. ఈ మోడల్ భారత్‌లో తొలిసారిగా వెంటనే అందుబాటులోకి వస్తోందన్నారు.ఉత్తరాది కంటే వేగంగా దక్షిణాది.. సూపర్ లగ్జరీ కార్ల మార్కెట్ దేశంలో రెండేళ్లుగా ఏటా 35–40% వృద్ధి చెందుతోందని ఆనంద్ చెప్పారు. గతేడాదితో పోలిస్తే కంపెనీ అమ్మకాల్లో 90% వృద్ధి నమోదైందని వివరించారు. ఆస్టన్ మార్టిన్ కార్ల అధికారిక దిగుమతిదారుగా ఆస్టన్ మార్టిన్ న్యూఢిల్లీ వ్యవహరిస్తోంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను అధిగమించడానికి కంపెనీ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. ప్రస్తుతం కంపెనీకి న్యూఢిల్లీలో షోరూం ఉంది. ఏడాది చివరికల్లా బెంగళూరులో ఔట్లెట్ రానుంది. సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కార్స్ మార్కెట్ ఉత్తరాది కంటే దక్షిణాది వేగంగా వృద్ధి చెందుతోందని ఆనంద్ తెలిపారు. -
ఇండియాలోనే మొట్టమొదటి ఆ కారు కొన్న జొమాటో సీఈఓ
-
జీపీఎస్ పెట్టినా వదల్లేదు.. ఫార్ములావన్ స్టార్‌కు చేదు అనుభవం
నాలుగుసార్లు ఫార్ములావన్ చాంపియన్ విజేత.. ఆస్టన్ మార్టిన్ ఎఫ్1 డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్‌కు చేదు అనుభవం ఎదురైంది. వెటెల్ బ్యాగును దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగలు ఎత్తుకెళ్లిన బ్యాగును వెటెల్ జీపీఎస్ ట్రాకర్ ద్వారా కనుక్కోవాలనుకున్నప్పటికి ఫలితం లేకుండా పోయింది. విషయంలోకి వెళితే.. స్పానిష్ గ్రాండ్ప్రిక్స్ ముగించుకొని బార్సిలోనాకు చేరుకున్న సెబాస్టియన్ వెటెల్ ఒకరోజు అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాడు. తన కారును హోటల్ ముందు పార్క్ చేసి లోనికి వెళ్లాడు. పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన వెటెల్‌కు కారులో బ్యాగు కనిపించలేదు. దీంతో దొంగలు ఎత్తుకెళ్లారని భావించిన వెటెల్.. బ్యాగులో తన ఐ ఫోన్ ఎయిర్ పాడ్స్‌కు జీపీఎస్ ట్రాకర్ ఉన్నట్లు గుర్తొచ్చింది. వెంటనే తన ఐ-ఫోన్లో జీపీఎస్ ఆన్ చేశాడు. జీపీఎస్ లొకేషన్ ఆధారంగా తన కారులోనే బయల్దేరిన వెటెల్ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశాడు. దారి మధ్యలోనే సదరు దొంగలు తన ఐ ఫోన్ ఎయిర్ పాడ్స్ పడేయడంతో జీపీఎస్ అక్కడే ఆగిపోయింది. దీంతో వెటెల్ తన బ్యాగు జాడను తెలుసులేకపోయాడు. కాగా ఈ ఏడాది వెటెల్ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. తాజాగా ముగిసిన స్పానిష్ గ్రాండ్ప్రిక్స్ను వెటెల్ 11వ పొజిషన్‌తో ముగించాడు. ఆదివారం జరిగిన స్పానిష్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 66 ల్యాప్‌ల రేసును వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 37 నిమిషాల 20.475 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో 27వ ల్యాప్‌లో వైదొలిగాడు. చదవండి: ICC: అంపైరింగ్ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం Spanish Grand Prix: వెర్స్టాపెన్ ఖాతాలో నాలుగో విజయం -
గన్నులున్న జేమ్స్‌బాండ్ కారు.. అమ్మకానికి రెడీ !
సీక్రెట్ ఏజెంట్ జేమ్స్‌బాండ్ స్టైలే వేరు. నడిచే తీరు నుంచి నడిపే కారు వరకు ప్రతీది ప్రత్యేకమే. బాండ్ సినిమాల్లో ఎంఐ6 ఏజెంట్ ఉపయోగించే కార్లలను సైతం ప్రత్యేకంగా తయారు చేస్తుంటారు. అలాంటి స్పెషల్ కారుని సొంతం చేసుకునే అవకాశం ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఇప్పటి వరకు బాండ్ వాడే కార్లంటీని ఆస్టోన్ మార్టిన్ సంస్థనే తయారు చేసింది. త్వరలో విడుదల కాబోతున్న నో టైం టూ డై సినిమా కోసం స్పెషల్ ఎడిషన్ కార్లను సిద్ధం చేసింది. డీబీ 5 జూనియర్ పేరుతో ఈ కార్లను తయారు చేస్తోంది. రెగ్యులర్ కార్లతో పోల్చితే జేమ్స్‌బాండ్ కార్లు జమీన్ ఆస్మాన్ ఫరక్ అన్నట్టుగా ఉంటాయి. శత్రువులపై పోరాడేందుకు వారి దాడుల నుంచి తప్పించుకునేందుకు వీలుగా బాండ్ కార్లలో అధునాతమైన ఆయుధాలు, గ్యాడ్జెట్లు ఉంటాయి. డీబీ 5 జూనియర్లో కూడా ఇలాంటి గ్యాడ్జెట్లు వెపన్స్ పొందు పరిచారు. జేమ్స్‌బాండ్ స్పెషల్ ఎడిషన్ డీబీ 5 జూనియర్లో డిజిటల్ నంబర్ ప్లేట్‌ను అమర్చారు. ఇందులో నంబర్లు ఆటోమేటిక్‌గా మారిపోతుంటాయి, అంతేకాదు స్విచ్చ్ నొక్కితే చాలు హెడ్లైట్ల స్థానంలో గన్స్ స్రత్యక్షం అవుతాయి. స్మోక్ స్క్రీన్, హిడ్డెన్ ఇన్ఫోటైన్మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Introducing the DB5 Junior NO TIME TO DIE Edition.#AstonMartin #LicenceToThrill #NoTimeToDie — Aston Martin (@astonmartin) September 21, 2021 ఆస్టోన్ మార్టిన్ సంస్థ ఎలక్ట్రిక్ కారుగా డీబీ 5 జూనియర్ని రూపొందించింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 మైళ్ల దూరం ప్రయాణిస్తుంది. ఈ కారు ధరని 90,000 డాలర్లుగా నిర్ణయించింది. ఈ కారు కావాల్సిన వారు ఆస్టోన్ మార్టిన్ సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఆస్టోన్ మార్టిన్ సంస్థ కేవలం 125 కార్లను మాత్రమే తయారు చేసింది. వీటిని ఆస్టోన్ మార్టిన్ మెంబర్షిప్ ఉన్న వారికే కేటాయించనుంది. అయితే ఈ కార్లను సొంతం చేసుకున్నా ... రోడ్లపై ప్రయాణించేందుకు అనుమతి లేదు. బాండ్ తరహాలో వెపన్స్, లేటెస్ట్ గాడ్జెట్స్ ఉన్నందున వీటికి అనుమతి నిరాకరించారు. స్పెషల్ ఈవెంట్స్, రేస్ట్రాక్లపై నడుపుకోవచ్చు. సెలబ్రిటీలు, బిజినెస్ బ్యాగ్నెట్లు తమ గ్యారేజీలో అదనపు ఆకర్షణగా ఈ కార్లను ఉంచుకునేందుకు ఇష్టపడతారు. Raw and instinctive – Vantage deserves to be driven. Watch @007 put his Aston Martin to the test in NO TIME TO DIE from 30th September.#NoTimeToDie #AstonMartin #LicenceToThrill pic.twitter.com/TIvZ7ArdX1 — Aston Martin (@astonmartin) August 31, 2021 చదవండి : సూపర్ కార్ లవర్స్‌కు గుడ్‌న్యూస్ -
ఆస్టిన్ మార్టిన్ కొత్త కారు.. ధర ఎంతంటే..
అతి విలాసవంతమైన కార్లకు పెట్టిందిపేరైన ఆస్టిన్ మార్టిన్ లగ్జరీ కారును విడుదల చేసింది. బ్రిటీష్ కార్ల తయారీ కంపెనీ 2019 ఆస్టన్-మార్టిన్ వాన్టేజ్ అధికారికంగా ఇండియాలో విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ. .2.95 కోట్ల (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించింది. దేశంలో ఈ కొత్తకార్లను 15-20 యూనిట్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. బుకింగ్స్ ప్రారంభం. 4.0 లీటర్ ట్విన్ టర్బో వి8 ఇంజన్, 6000 ఆర్పీఎం, వద్ద 503బీహెచ్పీ, 2000-5000 ఆర్పీఎం వద్ద 685 ఎన్ఎం పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు ఇంజీన్లను కూడా ఒక కొత్త 8- స్పీడ్ స్పోర్ట్ షిఫ్ట్- 2 ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేసింది. కేవలం 3.5 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. గంటకు 315 కీ.మి టాప్ వేగంతో దూసుకుపోతుంది. -
బాండ్.. జేమ్స్ బ్రాండ్
జేమ్స్ బాండ్ సినిమాల్లో బ్రాండ్స్ హవా * కార్ల నుంచి వాచీల దాకా అన్నీ బ్రాండెడ్ * ప్రొడ్యూసర్లకు, కంపెనీలకూ ప్రయోజనకరంగా డీల్స్ జేమ్స్‌బాండ్.. ఈ పేరే ఒక బ్రాండ్. సుమారు అయిదు దశాబ్దాల క్రితం నాటి సినిమా నుంచి ఇప్పటి స్పెక్టర్ దాకా బాండ్ ... తన స్టయిల్‌తో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు (కొన్ని సినిమాలు మినహాయిస్తే). మిగతా సినిమాలతో పోలిస్తే బాండ్ సినిమాల్లో బ్రాండ్ల హడావుడి కూడా ఎక్కువగానే ఉంటుంది. చేతికి పెట్టుకునే వాచీల దగ్గర్నుంచీ రయ్యిన దూసుకెళ్లే కార్ల దాకా అన్నీ బ్రాండెడే. జేమ్స్ బాండ్ సినిమాల తయారీ నుంచి వాటి మార్కెటింగ్ దాకా ఈ ఉత్పత్తుల సంస్థల ప్రమేయమూ బాగానే ఉంటుంది. ఇది ఆర్థికంగా అటు నిర్మాతలకూ, ప్రచారపరంగా ఇటు ఆయా సంస్థలకూ ప్రయోజనకరంగా ఉంటున్నాయి. ఉదాహరణకు.. బాండ్ సిరీస్‌లోనే అత్యంత ఖరీదైనదిగా చెబుతున్న స్పెక్టర్ (నిర్మాణ వ్యయం సుమారు 194 మిలియన్ పౌండ్లని అంచనా) పోస్టర్లో బాండ్ ధరించిన ఎన్ పీల్ సంస్థ దుస్తులు హాట్ కేకులుగా అమ్ముడైపోయాయి. ఇలాంటి ప్రయోజనాలు ఉన్నందుకే.. డై అనదర్ డే లాంటి సినిమాకి ప్రొడ్యూసర్లతో.. ఏకంగా 21 బ్రాండ్ పార్ట్నర్స్ చేతులు కలిపారు. స్పెక్టర్ సినిమాలో కనీసం 17 బ్రాండ్ల ఉత్పత్తులు కనిపిస్తాయి. అందుకే.. హైనెకెన్ వంటి బ్రాండ్లు బాండ్ సినిమాతో అనుబంధం పెంచుకునేందుకు మొగ్గు చూపుతున్నాయి. స్కైఫాల్ సినిమా వ్యయంలో సుమారు మూడో వంతు (దాదాపు 28 మిలియన్ పౌండ్లు) ఇన్వెస్ట్ చేసిన హైనెకెన్ సంస్థ.. డేనియల్ క్రెగ్ తో కలిసి దాదాపు 100 మిలియన్ డాలర్ల ఖర్చుతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జేమ్స్బాండ్లైఫ్స్టయిల్ పేరిట వెబ్సైటు కూడా ఉంది. జేమ్స్‌బాండ్ బ్రాండ్ విలువ దాదాపు 13 బిలియన్ పౌండ్లు ఉంటుందనేది లండన్ స్కూల్ ఆఫ్ మార్కెటింగ్ నిపుణుల అంచనా. తాజాగా స్పెక్టర్ మూవీ రిలీజైన నేపథ్యంలో.. అందరి దృష్టినీ ఆకర్షించిన బ్రాండ్స్‌లో ఇవి.. ఆస్టన్ మార్టిన్ కారు.. మొట్టమొదటిసారిగా 1964లో జేమ్స్ బాండ్ గోల్డ్‌ఫింగర్ సినిమాలో ఇది కనిపించింది. ఇది అప్పట్లో అఫీషియల్ బాండ్ కారుగా చెలామణీలోకి వచ్చింది. అప్పట్నుంచి 11 బాండ్ సినిమాల్లో ఈ కార్లు దర్శనమిచ్చాయి. తాజాగా బాండ్ సినిమాలో ఆస్టన్ మార్టిన్ డీబీ10, జాగ్వార్ సీ-ఎక్స్75 ఉన్నాయి. ఇవి సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండవు. డీబీ 10 ధర దాదాపు 5,00,000 డాలర్ల పైగానే ఉంటుంది. ఇక జాగ్వార్ కారు 12 లక్షల డాలర్లు ఖరీదు చేస్తుంది. ఒమేగా వాచ్.. బాండ్ చేతికి ప్రారంభంలో రోలెక్స్ వాచీలు కనిపించేవి. అయితే, 1995 తర్వాత నుంచి ఆ స్థానాన్ని ఒమేగా బ్రాండ్ ఆక్రమించింది. కెసినో రాయల్ సినిమాలో ఇందుకు సంబంధించి సంభాషణ కూడా ఉంటుంది. లేటెస్ట్గా స్పెక్టర్ సినిమాలో బాండ్ వాడిన ఒమేగా వాచ్ ఖరీదు 6,000 డాలర్ల పైమాటే! టామ్ ఫోర్డ్ సూటు.. క్వాంటమ్ ఆఫ్ సొలేస్ సినిమా నుంచి జేమ్స్ బాండ్ అధికారిక టైలర్‌గా బ్రియోనీ స్థానాన్ని టామ్ ఫోర్డ్ దక్కించుకుంది. అప్పట్నుంచీ టామ్ ఫోర్డ్ సూట్లకు బాండ్.. బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. మార్టిని వోడ్కా.. వోడ్కా మార్టిని.. బాండ్ ఫేవరెట్ డ్రింక్. డైమండ్స్ ఆర్ ఫరెవర్ (1971) సినిమా నుంచి వోడ్కా మార్టినితో బాండ్‌కు అనుబంధం ఉంది. ఈ వోడ్కాను తయారు చేసే బెల్వెదర్ సంస్థ .. స్పెక్టర్ సినిమా కోసం ప్రొడ్యూసర్లతో భారీ డీల్ కుదుర్చుకుంది. అటు బీర్ తయారీ సంస్థ హైనెకెన్ కూడా సినిమాలో తమ బ్రాండ్ కనిపించేలా చూసుకునేందుకు గణనీయంగానే చెల్లించింది.