న్యూఢిల్లీ: సూపర్ లగ్జరీ కార్ల తయారీలో ఉన్న బ్రిటిష్ కంపెనీ ఆస్టన్ మార్టిన్ భారత్‌లో కొత్త వాంటేజ్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూం ధర రూ.3.99 కోట్లు. 4.0 లీటర్ ట్విన్ టర్బో వీ8 ఇంజన్, 8 స్పీడ్ జడ్‌ఎఫ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఎల్రక్టానిక్ పవర్ అసిస్టెడ్ స్టీరింగ్, బావర్స్ అండ్ విలి్కన్స్ 15 స్పీకర్స్ సౌండ్ సిస్టమ్, 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ పొందుపరిచారు.
ఈ 2 డోర్ల కూపే 665 పీఎస్ పవర్, 800 ఎన్‌ఎం టార్క్ అందిస్తుంది. గరిష్ట వేగం గంటకు 325 కి.మీ. 3.5 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. కీలకమైన, ఆశాజనక మార్కె ట్ కాబట్టే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అన్ని మోడళ్లను భారత్‌లోనూ విడుదల చేస్తున్నట్లు ఆస్టన్ మార్టిన్ న్యూఢిల్లీ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆనంద్ తెలిపా రు. సెప్టెంబర్ 2న అంతర్జాతీయంగా వీ12 మోడల్‌ను కంపెనీ విడుదల చేస్తోంద న్నారు. ఈ మోడల్ భారత్‌లో తొలిసారిగా వెంటనే అందుబాటులోకి వస్తోందన్నారు.
ఉత్తరాది కంటే వేగంగా దక్షిణాది..
సూపర్ లగ్జరీ కార్ల మార్కెట్ దేశంలో రెండేళ్లుగా ఏటా 35–40% వృద్ధి చెందుతోందని ఆనంద్ చెప్పారు. గతేడాదితో పోలిస్తే కంపెనీ అమ్మకాల్లో 90% వృద్ధి నమోదైందని వివరించారు. ఆస్టన్ మార్టిన్ కార్ల అధికారిక దిగుమతిదారుగా ఆస్టన్ మార్టిన్ న్యూఢిల్లీ వ్యవహరిస్తోంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను అధిగమించడానికి కంపెనీ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. ప్రస్తుతం కంపెనీకి న్యూఢిల్లీలో షోరూం ఉంది. ఏడాది చివరికల్లా బెంగళూరులో ఔట్‌లెట్ రానుంది. సూపర్ లగ్జరీ స్పోర్ట్స్ కార్స్ మార్కెట్ ఉత్తరాది కంటే దక్షిణాది వేగంగా వృద్ధి చెందుతోందని ఆనంద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment