
ముంబై: జర్మనకి చెందిన లగ్జరీ కార్ల సంస్థ బీఎమ్‌డబ్ల్యూ గురువారం 5 సిరీస్ సెడాన్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎమ్‌డబ్ల్యూ 530ఐ ఎం స్పోర్ట్స్, బీఎమ్‌డబ్ల్యూ 520డీ ఎం స్పోర్ట్స్, బీఎమ్‌డబ్ల్యూ 520డీ లగ్జరీ లైన్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. వీటి ధరలు వరుసగా రూ.62.90 లక్షలు, రూ.63.90 లక్షలు, 71.90 లక్షలుగా ఉన్నాయి.
6.1 సెకన్లలో 100 కి.మీ స్పీడ్
ఈ కార్లలో బీఎమ్‌డబ్ల్యూ 530ఐ ఎం స్పోర్ట్స్ వేరియంట్ 2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 5200 ఆర్‌పీఎం వద్ద గరిష్టంగా 252 హెచ్‌పీని, 4800 ఆర్‌పీఎం 350 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. 6.1 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం అందుకోగలదు. 5 సిరీస్‌కి చెందిన కార్లకు ఇండియాలో మంచి ఆధరణ లభిస్తుండటంతో బీఎండబ్ల్యూ వరుసగా వేరియంట్లను రిలీజ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment