
హైదరాబాద్: ఇటాలియన్ సూపర్ స్పోర్ట్స్ కార్ల తయారీ దిగ్గజం లంబోర్గినీ తాజాగా భారత్‌లో ఊరూస్ పెర్ఫార్మెంటే ఎస్‌యూవీని పరిచయం చేసింది. ప్రారంభ ధర ఎక్స్‌షోరూంలో రూ.4.22 కోట్లునుంచి ప్రారంభం. స్టాండర్ట్ ఎస్యూవీ కంటే దాదాపు రూ. 1.12 కోట్లు ఎక్కువ.
గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.3 సెకన్లలోనే చేరుకోవడం దీని ప్రత్యేకత. గరిష్ట వేగం గంటకు 306 కిలోమీటర్లు. భారత్‌లో బ్రాండ్ వృద్ధిని పెంచడంలో, కొత్త మార్కెట్లను తెరవడంలో ఊరూస్ కీలకపాత్ర పోషించిందని లంబోర్గినీ ఇండియా హెడ్ అగర్వాల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment