ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉదయం 4 గంటలకే..!
గరియబండ్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులంటే సాధారణంగా వారి డ్యూటీ వారు నిర్వర్తించడం చూస్తుంటాం. పాఠశాల సమయం ముగిసిన తరువాత కూడా విద్యార్థుల కోసం సమయం కేటాయించే వారు కొంచెం అరుదనే చెప్పాలి. అయితే చత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబండ్లోని ఓ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
విద్యార్థులలో మార్పు తీసుకురావాలని భావించిన స్కూల్ ప్రిన్సిపల్ జీపీ వర్మ.. తన సహఉద్యోగులతో కలిసి కొంచెం వినూత్నంగా ఆలోచించాడు. ఉదయాన్నే విద్యార్థులను చదువుకు ఉపక్రమించేలా చేస్తే మంచి ఫలితాలు రాబట్టొచ్చని భావించి.. తెల్లవారుజామున నాలుగు గంటలకే గ్రామంతో తిరుగుతూ విద్యార్థులను నిద్రలేపే కార్యక్రమం స్టార్ట్ చేశారు. విద్యార్థులను చదువుకునేలా ప్రోత్సహిస్తూ మంచి ఫలితాలను రాబడుతున్నారు. 'తెల్లవారుజామునే టీచర్లు వచ్చి నిద్రలేపుతారు. అనంతరం గ్రామంలోని విద్యార్థులమంతా గ్రూపులుగా చదువుకుంటాం' అని విద్యార్థిని మణిప్రభ వెల్లడించింది.