Startups
-
స్టార్టప్‌లకు అండగా కోటక్ బిజ్‌ల్యాబ్స్
వినూత్న ఆలోచనలు కలిగిన స్టార్టప్ కంపెనీలకు కోటక్ మహీంద్రా బ్యాంకు ‘కోటక్ బిజ్ ల్యాబ్స్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్’ ద్వారా సాయం అందించాలని నిర్ణయించింది. బ్యాంకు సీఎస్ఆర్ కార్యకలాపాల్లో భాగంగా స్టార్టప్ కంపెనీలు అవి ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి, వారి వ్యాపారాలను సమర్థవంతంగా విస్తరించడానికి ఈ సాయం ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది.ఎవరికి సాయం చేస్తారంటే..అగ్రిటెక్, ఫిన్‌టెక్, ఎడ్టెక్, హెల్త్‌కేర్, సస్టెయినబిలిటీ వంటి రంగాల్లో సర్వీసు అందించే స్టార్టప్ కంపెనీలకు ఈ ప్రోగ్రామ్ ద్వారా సాయం చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. అందుకోసం సమర్థమైన సంస్థలను ఎంచుకునేందుకు ఐఐఎంఏ వెంచర్స్, ఎన్‌ఎస్‌ఆర్‌సీఈఎల్, టీ-హబ్ వంటి టాప్ ఇంక్యుబేటర్ల సహకారం తీసుకోనున్నట్లు కోటక్ బిబ్ల్యాబ్స్ తెలిపింది.ఇదీ చదవండి: అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యం ప్రశ్నార్థకంఎలాంటి సాయం చేస్తారంటే..ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా అవసరమైన కంపెనీలకు మెంటార్ షిప్, మార్కెట్ యాక్సెస్, అడ్వైజరీ సపోర్ట్, వర్క్ షాప్‌లు, ఎకోసిస్టమ్ ఎక్స్ పోజర్, బిజినెస్ డెవలప్మెంట్, సీడ్ ఫండింగ్.. వంటి సహకారాలు అందిస్తుంది. ఎంపిక అయిన 30 స్టార్టప్‌లకు రూ.15 లక్షల వరకు గ్రాంట్లతో సహా సుమారు 50 హై-పొటెన్షియల్ స్టార్టప్‌లకు సపోర్ట్ లభించనుంది. పలు రాష్ట్రాల్లో హైబ్రిడ్ వర్క్‌షాప్‌ల ద్వారా 1,000 స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం ఈ కార్యక్రమం లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. -
మహిళా స్టార్టప్‌లలో భారీ వృద్ధి
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో మహిళా స్టార్టప్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఐదేళ్లలో ఏపీలో కనీసం ఒక మహిళ డైరెక్టర్‌గా ఉన్న స్టార్టప్‌లు కొత్తగా 795 ఏర్పాటయ్యాయని లోక్‌సభలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించారు. 2019లో ఏపీలో కొత్త స్టార్టప్‌లు 92 ఏర్పాటైతే.. ఏటా ఆ సంఖ్య పెరుగుతూ 2023లో 294 ఏర్పాటయ్యాయని తెలిపారు. స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీం(ఎస్ఐఎస్ఎఫ్ఎస్) పథకం కింద 2024 అక్టోబర్ 31 నాటికి రాష్ట్రంలో 20 స్టార్టప్‌లకు రూ.4.53 కోట్ల నిధులను సమకూర్చారు. దేశవ్యాప్తంగా మొత్తం 1,278 మహిళా స్టార్టప్‌లకు ఎస్ఐఎస్ఎఫ్ఎస్ పథకం కింద రూ.227.12 కోట్లు సమకూర్చారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన స్టార్టప్‌లు 1,52,139 ఉండగా.. అందులో కనీసం ఒక మహిళ డైరెక్టర్‌గా ఉన్న స్టార్టప్‌లు 73,151 ఉన్నాయని మంత్రి తెలిపారు. 2023లో 2,916 స్టార్టప్‌ల ఏర్పాటుతో మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. -
సాంకేతికతను అందిపుచ్చుకోవాలి: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఆధునిక సాంకేతికను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలని, పౌర కేంద్రీకృత విధానాలను అనుసరించాలని ప్రధాని మోదీ అధికారులను కోరారు. ఇందుకు మిషన్ కర్మయోగి ఎంతో సహాయకారిగా ఉంటుందని చెప్పారు. కొత్తకొత్త ఆలోచనల కోసం స్టార్టప్‌లు, పరిశోధన విభాగాలు, యువత నుంచి సలహాలను స్వీకరించాలని సూచించారు. శనివారం ప్రధాని మోదీ డాక్టర్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నేషనల్ లెర్నింగ్ వీక్(కర్మయోగి సప్తాహ్)ను ప్రారంభించి, అధికారులనుద్దేశించి మాట్లాడారు. కృత్రిమ మేధ(ఏఐ)తో ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ మరింత సులువుగా మారుతుందంటూ ఆయన..పౌరులకు సమాచారం అందించడంతోపాటు ప్రభుత్వ కార్యకలాపాలన్నింటిపై నిఘాకు ఏఐతో వీలు కలుగుతుందన్నారు. అధికారులు వినూత్న ఆలోచనలు కలిగి ఉండాలన్నారు. పథకాలు, కార్యక్రమాల అమలుపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునే యంత్రాంగం అన్ని స్థాయిల్లోనూ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఉద్యోగుల సామర్థ్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా 2020లో మిషన్ కర్మయోగి కార్యక్రమాన్ని కేంద్రం ప్రారంభించింది. నారీ శక్తి ఆశీర్వాదమే స్ఫూర్తిమహిళల ఆశీర్వచనాలే తనకు దేశాన్ని అభివృద్ధి దిశలో నడిపేందుకు ప్రేరణను అందిస్తాయని మోదీ పేర్కొన్నారు. ‘మోదీకి కృతజ్ఞతగా అందజేయా’లంటూ ఓ గిరిజన మహిళ పట్టుబట్టి మరీ తనకు రూ.100 ఇచ్చారంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా శనివారం ‘ఎక్స్’లో షేర్ చేసిన ఫొటోలపై ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు సందర్భంగా చోటుచేసుకున్న ఘటనపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఇది నా హృదయాన్ని కదిలించింది. నన్ను సదా ఆశీర్వదించే నారీ శక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వారి ఆశీస్సులే నాకు నిత్యం ప్రేరణగా నిలుస్తాయి’’ అని ఆయన పేర్కొన్నారు.నేడు వారణాసికి ప్రధాని మోదీ ప్రధాని ఆదివారం వారణాసిలో పర్యటించనున్నారు. శంకర నేత్రాలయం సహా రూ.6,600 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను ఈ సందర్భంగా ప్రారంభిస్తారు. -
మెదడు నుంచి మార్కెట్లోకి..
చెన్నై: విజయవంతమైన ప్రతి స్టార్టప్ మొదట విద్యార్థుల మెదడులో మొదలైన ఆలోచనే. అలాంటి ఆలోచనలు ఆవిష్కరణలై అభివృద్ధి చెంది మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. ఐఐటీ మద్రాస్‌లో ఏర్పాటైన ప్రీ-ఇంక్యుబేటర్ ‘నిర్మాణ్’.. యువ ఆవిష్కర్తలను ప్రోత్సహిస్తూ, వారికి మార్గనిర్దేశం చేస్తోంది. దీని ద్వారా పురుడు పోసుకున్న స్టార్టప్‌లను ప్రదర్శించేందుకు ఐఐటీ మద్రాస్ మొట్టమొదటిసారిగా 'నిర్మాణ్ డెమో డే 2024' కార్యక్రమాన్ని నిర్వహించింది.నిర్మాణ్ డెమో డే కార్యక్రమాన్ని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి.. అథితులు, ఫ్యాకల్టీ, విద్యార్థుల సమక్షంలో ప్రారంభించారు. ఏఐ, హెల్త్‌టెక్, డీప్‌టెక్, సస్టైనబిలిటీ వంటి వివిధ రంగాలలో ఆలోచన దశలో ఉన్న మొత్తం 30 స్టార్ట్-అప్‌లను ఈ సందర్భంగా ప్రదర్శించారు. ఈ 'నిర్మాణ్ డెమో డే'ను వార్షిక కార్యక్రమంగా ఏటా నిర్వహించాలని ఐఐటీ మద్రాస్ భావిస్తోంది.క్రియాశీల విద్యార్థుల నేతృత్వంలోని క్షేత్ర స్థాయిలో ఉన్న 85 స్టార్టప్‌లకు నిర్మాణ్ మద్దతు ఇస్తోంది. వీటిలో దాదాపు 26 స్టార్టప్‌లు ఇప్పటికే విజయవంతంగా మార్కెట్లోకి వచ్చి వెంచర్ ఫండింగ్‌లో రూ.108 కోట్లకు పైగా నిధులు సాధించాయి. వీటన్నింటి విలువ రూ.1,000 కోట్లకు పైగా చేరుకోవడం గమనార్హం. ఇలా నిర్మాణ్‌లో విజయవంతమైన స్టార్టప్‌లలో అర్బన్ మ్యాట్రిక్స్, మాడ్యులస్ హౌసింగ్, టాన్90, టోకల్, ఇన్ఫ్యూ ల్యాబ్స్, ఇన్వాల్వ్, మెల్‌వానో, సస్స్టెయిన్స్, జిమ్స్, ప్లీనోమ్ టెక్నాలజీస్, ప్రిస్క్రైబ్, గెలాక్సీ స్పేస్ ఉన్నాయి. గెలాక్సీ స్పేస్ ఇటీవల ఇన్ఫోసిస్ నుండి రూ. 17 కోట్ల నిధులు పొందగలిగింది. -
స్టార్టప్స్‌కు జోష్.. ఏంజెల్ ట్యాక్స్ తొలగింపు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంకుర సంస్థలకు ఊరటనిచ్చే దిశగా అన్ని తరగతుల ఇన్వెస్టర్లకు ఏంజెల్ ట్యాక్స్‌ను తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశీయంగా స్టార్టప్ వ్యవస్థకు, ఎంట్రప్రెన్యూర్షిప్నకు, నవకల్పనలకు ఊతమివ్వడానికి ఇది తోడ్పడగలదని ఆమె తెలిపారు.సముచిత మార్కెట్ విలువకు మించిన వేల్యుయేషన్లతో అన్‌లిస్టెడ్ కంపెనీలు లేదా స్టార్టప్‌లు సమీకరించే నిధులపై విధించే ఆదాయ పన్నును ఏంజెల్ ట్యాక్స్‌గా వ్యవహరిస్తారు. ఇది స్టార్టప్‌లతో పాటు ఇన్వెస్ట్ చేసే మదుపర్లకు సమస్యగా మారింది. గతంలో ఏంజెల్ ట్యాక్స్ స్థానిక ఇన్వెస్టర్లకే పరిమితం కాగా 2023–24లో కేంద్రం దీన్ని విదేశీ పెట్టుబడులకు కూడా వర్తింపచేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజా బడ్జెట్లో దీన్ని తొలగించాలంటూ పరిశ్రమలు, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహ విభాగం (డీపీఐఐటీ) సిఫార్సు చేసింది.నూతన ఆవిష్కరణలకు, భారత్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా మారడానికి మార్గం సుగమం చేసే దిశగా ఇది కీలక అడుగని టీ హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస్ రావు తెలిపారు. ఇది అంకుర సంస్థలతో పాటు వాటికి మద్దతుగా నిల్చే ఇన్వెస్టర్లు, ప్రైవేట్ ఈక్విటీలు, వెంచర్ ఫండ్స్‌కూ సానుకూలమని న్యాయ సేవల సంస్థ ఇండస్‌లా పార్ట్నర్ లోకేష్ షా చెప్పారు. -
2030కల్లా లక్ష కోట్ల డాలర్ల జమ
న్యూఢిల్లీ: కొత్తగా యూనికార్న్‌లుగా ఆవిర్భవించే స్టార్టప్‌ల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు లక్ష కోట్ల డాలర్లు జమయ్యే వీలున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ అంచనా వేసింది. 2030కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ 7 ట్రిలియన్ డాలర్లకు చేరనున్నట్లు పేర్కొంది. ఈ కాలంలో కొత్తగా 5 కోట్ల ఉద్యోగాలకు తెరలేవనున్నట్లు తెలియజేసింది. బిలియన్ డాలర్ల విలువను అందుకున్న స్టార్టప్‌లను యూనికార్న్‌గా గుర్తించే సంగతి తెలిసిందే. మెకిన్సీ అండ్ కంపెనీతో రూపొందించిన ‘యూనికార్న్ 2.0: తదుపరి ట్రిలియన్ జమ’ పేరుతో సీఐఐ నివేదికను విడుదల చేసింది. రానున్న కాలంలో రిటైల్, ఈకామర్స్, ఆధునిక తరం ఫైనాన్షియల్ సర్వీసులు, తయారీ, ఎస్ఏఏఎస్(శాస్), డిజిటల్ తదితర రంగాలు భారీ వృద్ధికి దన్నుగా నిలవనున్నట్లు నివేదిక పేర్కొంది. శతకాన్ని దాటాయ్ నివేదిక ప్రకారం దేశీయంగా 2011లో తొలి యూనికార్న్ నమోదుకాగా.. దశాబ్దం తదుపరి 100 మార్క్‌ను యూనికార్న్‌లు చేరుకున్నాయి. 2024 జనవరికల్లా 113 యూనికార్న్‌ల ఉమ్మడి విలువ 350 బిలియన్ డాలర్లను తాకడం గమనార్హం! యూనికార్న్‌ల సంఖ్య 100ను అధిగమించడం చెప్పుకోదగ్గ విజయంకాగా.. ఇందుకు పలు కీలక అంశాలు సహకరించాయి. ఇందుకు యువత డిజిటల్ సేవలను అందిపుచ్చుకోవడం, విస్తారిత మొబైల్ ఇంటర్నెట్ వినియోగం, మధ్యతరగతి పుంజుకోవడం, దన్నుగా నిలిచిన మార్గదర్శకాలు కారణమయ్యాయి. -
రిచ్ సపోర్ట్ సిరీస్.. నిపుణులతో కనెక్ట్ అవ్వడానికి మంచి ఛాన్స్!
రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (RICH), తెలంగాణ గవర్నమెంట్ చొరవతో.. అక్టోబర్ 2023లో SAMARTHan@RICH పేరుతో 'నెలవారీ సపోర్ట్ సిరీస్' (Monthly Support Series) ప్రారంభించింది. ఇది ప్రత్యేకంగా మెడికల్ టెక్నాలజీ (మెడ్‌టెక్) ఇన్నోవేటర్లు, స్టార్టప్‌లు తమ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి పుట్టుకొచ్చింది. SAMARTHan@RICH నెలవారీ సపోర్ట్ సిరీస్ ద్వారా.. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (IP) అవగాహన & అప్లికేషన్ ప్రాసెస్, వైద్యుల నుంచి ఐడియా వ్యాలిడేషన్, ఉత్పత్తి అభివృద్ధి & వాణిజ్యీకరణ కోసం రెగ్యులేటరీ రోడ్‌మ్యాప్, క్లినికల్ ధ్రువీకరణ అధ్యయనాలను నిర్వహించడం వంటివి తెలుసుకోవచ్చు. అంతే కాకుండా ఆవిష్కర్తలు, వ్యవస్థాపకులు IP ఏజెన్సీల నిపుణులు వంటి అనుభవజ్ఞులైన వైద్యులతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో స్టార్టప్‌ల ప్రశ్నలకు సమాధానాలు పొందవచ్చు. విజ్ఞానం, నైపుణ్యాన్ని పంచుకోవడం ద్వారా.. రెగ్యులేటరీ ల్యాండ్‌స్కేప్‌ను నావిగేట్ చేసుకోవచ్చు. వారి టెక్నాలజీలను మెరుగుపరచుకోవచ్చు. అంతే కాకుండా రోగుల జీవితాన్ని మార్చే పరిష్కారాలను వేగంగా అందించడానికి స్టార్టప్‌లకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని RICH సీఈఓ 'రష్మీ పింపాలే' అన్నారు. ఐడియా వ్యాలిడేషన్, క్లినికల్ వ్యాలిడేషన్, రెగ్యులేటరీ గైడెన్స్‌పై సెషన్లతో ఈ ప్రోగ్రామ్ ఫిబ్రవరి 2024లో ప్రారంభమైంది. దీని ద్వారా ఆవిష్కర్తలకు మద్దతు ఇవ్వడం మాత్రమే కాకుండా.. సంచలనాత్మక పరిష్కారాల అభివృద్ధిని వేగవంతం చేయవచ్చని నిపుణులు పేర్కొన్నారు. SAMARTHan@RICH నెలవారీ ప్రాతిపదికలో పాల్గొనటానికి ఆసక్తి కలిగిన ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు. -
రూ.100 కోట్ల కంపెనీ స్థాపించిన యంగ్ లేడీ.. ఎలాగంటే..
ఇంటికో వ్యాపారవేత్త... వీధికో స్టార్టప్ అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. ఐఐటీల్లో చదవాలని పిల్లలు ఎంతగా కలలు కంటున్నారో ఆ చదువవగానే సొంతంగా ఓ పరిశ్రమ పెట్టాలనీ అంతగానే కలలు కంటున్నారు. ఆ కలలకు దన్నుగా నిలుస్తోంది పారిశ్రామిక రంగం. దీంతో చాలా మంది యువత తమకు నచ్చిన పని చేసుకునేందుకు ఉద్యోగాలను మానేస్తున్నారు. అలా సొంత వ్యాపారాలను ప్రారంభించి విజయం సాధిస్తున్నారు. ఐఐటీలో చదివి స్టార్టప్‌ను స్థాపించి ఏకంగా రూ.100 కోట్ల కంపెనీగా అభివృద్ధి చేసిన ఆ యువ వ్యాపారవేత్త ఎవరు.. తను చేస్తున్న బిజినెస్ ఏమిటి.. తనను ఆ దిశగా ప్రేరేపించిన సంఘటనలు ఏవైనా ఉన్నాయా అనే అంశాలను ఈ కథనంలో తెలుసుకుందాం. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన అహానా ఐఐటీ బాంబే నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 2014-16 మధ్య కాలంలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ పట్టా తీసుకున్నారు. అక్కడ చదువుతున్న రోజుల్లో యూఎస్‌లో ఒక హోటల్‌కు వెళ్లినప్పుడు అధిక కొవ్వు, క్రీముతో కూడిన ఆహార పదార్థాలను తయారుచేయడం చూశారు. అప్పుడే ఆరోగ్యకరమైన ఆహారాలను ప్రజలకు అందించాలనే ఆలోచన తనకు తోచింది. సొంతంగా తానే పౌష్టిక ఆహార ఉత్పత్తులను తయారు చేసి తనలాంటి ఆరోగ్య ప్రియులకు అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఆలోచనతో ‘ఓపెన్ సీక్రెట్’ పేరుతో రుచికరమైన పోషకాలతో కూడిన చిరుతిళ్లను ఉత్పత్తి చేసే కంపెనీని 2019లో స్థాపించారు. బయట మార్కెట్లో లభిస్తున్న ఫ్యాటీ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తూ పోషకాహార ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నారు. దాంతో అహానా ఉత్పత్తులు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. దీనికి తోడు అవి గొప్ప రుచి, పోషకాహారాన్ని కలిగి ఉన్నందున వ్యాపారం ఊపందుకుంది. ముప్పై ఏళ్ల వయస్సులో సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించిన అహానా ప్రస్తుతం ‘ఓపెన్ సీక్రెట్’ కంపెనీకి సీఈవోగా కొనసాగుతున్నారు. అమెరికాలో భారీగా సంపాదిస్తున్నప్పటికీ ఆ ఉద్యోగాన్ని వదిలేసి ప్రస్తుతం రూ.100 కోట్ల విలువైన ఆహార ఉత్పత్తుల సంస్థను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అహానా గోద్రెజ్ టైసన్ ఫుడ్స్ లిమిటెడ్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కూడా ఆమె వ్యవహరిస్తున్నారు. ఇదీ చదవండి: యాప్‌లు అవసరంలేని మొబైల్ ఫోన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా.. గతంలో చదువు అయిపోయాక నాలుగు ఏళ్లు ప్రోక్టర్ అండ్ గాంబుల్లోనూ పనిచేశారు. కృత్రిమ రంగులు, రుచులు, జంక్ ఫుడ్ నుంచి భారతీయులకు పూర్తిగా పౌష్టికాహారాన్ని అందించే దిశగా కృషిచేస్తున్నట్లు అహానా లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. -
పెట్టుబడులు తిరిగివ్వాలని స్టార్టప్‌లు భావించడం లేదు
న్యూఢిల్లీ: మదుపుదారుల నుంచి తీసుకున్న పెట్టుబడులను తిరిగి ఇచ్చేయడం తమ బాధ్యతని అంకుర సంస్థల వ్యవస్థాపకులు భావించడం లేదని ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు. స్టార్టప్‌లలో గవర్నెన్స్ లోపాలు, వేల్యుయేషన్లు పడిపోతుండటం మొదలైన వాటన్నింటికీ ఇదే కారణమని వారు చెబుతున్నారు. బైజూస్, భారత్‌పే వంటి టాప్ స్టార్టప్స్ వ్యవస్థాపకులకు, ఇన్వెస్టర్లకు మధ్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో పలువురు మదుపుదారులు ఈ మేరకు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ‘వ్యవస్థాపకులు తాము తీసుకున్న పెట్టుబడులను బాధ్యతగా తిరిగి ఇచ్చేయాలని భావించకపోతుండటమే కార్పొరేట్ గవర్నెన్స్ లోపాలు, వేల్యుయేషన్ల పతనానికి దారి తీస్తోంది‘ అని 100ఎక్స్డాట్వీసీ వ్యవస్థాపకుడు యజ్ఞేష్ సంఘ్రాజ్కా తెలిపారు. కార్పొరేట్ గవర్నెన్స్ లోపాల సమస్యలు చాలా కాలంగా ఉన్నవేనని, ఇవి స్టార్టప్‌లకే పరిమితం కాకుండా సాధారణంగా లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీల్లోనూ కనిపిస్తుంటాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, లాభాలు, వృద్ధిపై అత్యుత్సాహం చూపించే క్రమంలో స్టార్టప్‌లు కీలకమైన గవర్నెన్స్, నిబంధనల పాటింపు వంటి ప్రక్రియలను ఒకోసారి విస్మరిస్తుంటాయని సోరిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చైర్మన్ సంజయ్ నాయర్ చెప్పారు. వ్యవస్థాపకులు లాభాలపై దృష్టి పెట్టాలి కానీ గవర్నెన్స్‌ను పట్టించుకోవడం మానేయకూడదు అని ఆయన సూచించారు. ప్రతి స్టార్టప్ .. కస్టమర్ల కోసం టెక్నాలజీని తయారు చేయడంపైనే పూర్తిగా దృష్టి పెడుతుందే తప్ప తమ సంస్థలో అంతర్గతంగా పాటించాల్సిన వాటికోసం టెక్నాలజీని రూపొందించుకోవడంపై అంతగా శ్రద్ధ చూపించదని యూనికస్ కన్సల్టెక్ సహ వ్యవస్థాపకుడు సందీప్ ఖేతాన్ తెలిపారు. అయితే, దేశీయంగా 95 శాతం స్టార్టప్‌లు నిజాయితీగా, నిబంధనలను పాటించే విధంగానే ఉంటున్నాయని ఇన్ఫోఎడ్జ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిక్చందానీ అభిప్రాయపడ్డారు. -
నవభారతానికి స్టార్టప్‌లే వెన్నెముక.. ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకోవద్దు
న్యూఢిల్లీ: నవభారత నిర్మాణానికి అంకుర సంస్థలే వెన్నెముకలాంటివని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. 2047 నాటికి 35 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదిగే క్రమంలో దేశం అందించే అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని, ఏ ఒక్కదాన్ని చేజార్చుకోవద్దని స్టార్టప్‌లకు సూచించారు. స్టార్టప్ మహాకుంభ్ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. దేశాభివృద్ధిలో కీలకమైన స్టార్టప్ విప్లవానికి వచ్చే నెల 18 నుంచి మూడు రోజులు జరిగే మహాకుంభ్ దర్పణంగా నిలుస్తుందని గోయల్ చెప్పారు. దేశీయంగా మనకు అతి పెద్ద మార్కెట్ ఉంది కదా అని నింపాదిగా ఉండకూడదని, అంతర్జాతీయ మార్కెట్లలోనూ కార్యకలాపాలను విస్తరించడంపై అంకుర సంస్థలు మరింతగా దృష్టి పెట్టాలని మంత్రి చెప్పారు. ఎంట్రప్రెన్యూర్ షిప్, ఆవిష్కరణలపై ఆసక్తి గల విద్యార్థులు ఈ సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొంటారని ఈ సందర్భంగా తెలిపారు. -
దేశీయ స్టార్టప్‌లపై జెరోధా బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు
జెరోధా ఫౌండర్ నితిన్ కామత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశీయ స్టార్టప్‌ల విజయం విదేశీ పెట్టుబడి దారులకు సొంతం అవుతుందని అన్నారు. కాబట్టే భారత్ సమిష్టి కృషితో అభివృద్ధి చెందుతూ దేశీయంగా సంపదను సృష్టించాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘నేను ఇంతకు ముందే చెప్పాను. భారత్ అభివృద్ధి చెందాలంటే అందరినీ కలుపుకోవాలి. స్థానికంగా సంపదను సృష్టించబడాలి. నేడు, స్వదేశీ స్టార్టప్‌ల విజయంలో ఎక్కువ భాగం భారతదేశం వెలుపల ఉన్న పెట్టుబడిదారులకు వెళుతుంది. తగినంత నిధులు ఉండడం వల్ల విదేశీ పెట్టుబడి దారులపై ఆధారపడడం తగ్గుతుంది. ట్యాక్స్ కూడా అదా చేసుకోవచ్చు అని నితిన్ కామ్ తెలిపారు. I've said this earlier: for India to grow inclusively, wealth has to be created locally. Today, much of the success of homegrown startups goes to investors outside India. Staying in India and incorporating at home also saves the future hassle of paying huge taxes to flip back.… https://t.co/vSFmlKL2zj pic.twitter.com/ErVzldeymH — Nithin Kamath (@Nithin0dha) February 20, 2024 దేశంలో ఆవిష్కరణలు, స్టార్టప్‌ల కోసం బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి అవసరమైన చర్యలపై కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు నితిన్ కామత్ గత సంవత్సరం నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్లో చేరారు. స్టార్టప్‌ల కోసం భారత్ తన దేశీయ మూలధనాన్ని అన్‌లాక్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. విదేశీ మూలధనంపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు తాను కృషి చేస్తానని, స్వదేశంలో స్టార్టప్‌లకు మద్దతుగా భారతీయులను ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు. ఒక దేశంగా మనం చేయాల్సిన పని ఏమిటంటే స్టార్టప్‌లు/ఎంఎస్ఎఈల కోసం దేశీయ మూలధనాన్ని అన్‌లాక్ చేయడం, విదేశీ మూలధనంపై ఆధారపడటాన్ని తగ్గించడం, భారతీయ స్టార్టప్‌లకు భారతీయులు మద్దతునివ్వడమేనని అన్నారు. -
స్టార్టప్‌ల్లో రూ. 200 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఏంజెల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వెంచర్స్ (ఐపీవీ) అంకుర సంస్థల్లో ఈ ఏడాది సుమారు రూ. 150–200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్లు సంస్థ సీఈవో వినయ్ బన్సల్ తెలిపారు. డ్రోన్, స్పోర్ట్స్, హెల్త్, ఫిన్‌టెక్ సంస్థల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. తమ దగ్గర రూ. 1,200 కోట్ల నిధులు ఉండగా ఇప్పటివరకు రూ. 750 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. 2023లో 56 పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. వీటిల్లో 46 కొత్తగా ఇన్వెస్ట్ చేసినవి కాగా మిగతావి ఫాలో–ఆన్ పెట్టుబడులని బన్సల్ పేర్కొన్నారు. గతేడాది సగటున 61 శాతం మేర రాబడులతో 14 సంస్థల నుంచి వైదొలిగినట్లు చెప్పారు. 2023లో ఒక మీడియా స్టార్టప్, కూవర్స్, స్పోర్టిడో మొదలైన వాటి నుంచి ఐపీవీ పూర్తిగా నిష్క్రమించింది. మీడియా వెంచర్లో పెట్టుబడులపై దాదాపు 200 శాతం రాబడి అందుకున్నట్లు బన్సల్ వివరించారు. -
స్టార్టప్స్‌కు డెస్టినేషన్‌గా ఏపీ
సాక్షి, విశాఖపట్నం: స్టార్టప్స్ డెస్టినేషన్‌గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతోందని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) అడిషనల్ డైరెక్టర్(ఏడీ) సురేష్ బాత్రా అన్నారు. డీప్ టెక్ నైపుణ్య ఫౌండేషన్ (డీటీఎన్ఎఫ్) అధ్వర్యంలో విశాఖలోని వీఎంఆర్డీఏ చిల్ర్డన్స్ ఎరీనాలో శనివారం నిర్వహించిన ఏఐ క్లౌడ్ సమ్మిట్–2024ను సురేష్బాత్ర, విశాఖ నగర పోలీస్ కమిషనర్ డా.రవిశంకర్ ప్రారంభించారు. సురేష్ మాట్లాడుతూ ఏపీలో స్టార్టప్‌లకు ఎకోసిస్టమ్ అద్భుతంగా ఉందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవసరమైన అనుకూల వాతావరణం ఏపీలో ఉండటంతో కొత్త ఐటీ, ఐటీ అనుబంధ పరిశ్రమలు వస్తున్నాయని చెప్పారు. ఐటీ, అనుబంధ పరిశ్రమలకు విశాఖ కీలకంగా మారుతోందన్నారు. రాష్ట్రంలో ఉన్న స్టార్టప్స్‌లో మూడోవంతు విశాఖలోనే ఉన్నట్లు తెలిపారు. సీపీ రవిశంకర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అనేది నేరస్తులను గుర్తించేందుకే కాకుండా నేర నియంత్రణకు, పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసుకునేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఏపీ ఇన్నోవేటివ్ సొసైటీ సీఈవో అనిల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 44 ఇంక్యుబేషన్ సెంటర్లలో స్టార్టప్ సంస్థల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. డీప్‌టెక్ నైపుణ్య ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ శ్రీధర్ కొసరాజు మాట్లాడుతూ భారత్‌లో ఉన్న ఎంఎన్సీ, హైటెక్ కంపెనీలకు చెందిన నిపుణులను ఒకేచోట చేర్చి రాబోయే రోజుల్లో అందుబాటులోకి రానున్న సాంకేతికతపై అవగాహన కల్పించేందుకు ఈ సదస్సు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా డీటీఎన్ఎఫ్, ఏపీఐఎస్ మధ్య కృత్రిమ మేధకు సంబంధించిన ఎంవోయూ జరిగింది. సదస్సులో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ నిపుణులు ఆయా రంగాల్లో ఉన్న అవకాశాల గురించి వివరించారు. -
AP: రాష్ట్రంలో మూడు రెట్లు పెరిగిన స్టార్టప్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యువత నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సరికొత్త ఆలోచనలతో ఆవిష్కరణల దిశగా అడుగులు వేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు చర్యలు చేపట్టారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల ద్వారా అందిస్తున్న సహకారంతో రాష్ట్రంలో స్టార్టప్‌ల సంఖ్య భారీగా పెరిగింది. వీటి ద్వారా సాంకేతిక నిపుణులైన యువత స్వయం ఉపాధి పొందడమే కాకుండా, వేలాది మందికి ఉద్యోగాలూ వస్తున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో స్టార్టప్‌ల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగినట్లు డిపార్టమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) వెల్లడించింది. ఆ సంస్థ తాజా గణాంకాల ప్రకారం.. 2019లో రాష్ట్రంలో 161 స్టార్టప్‌లు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 586 దాటింది. వీటిలో పనిచేసే ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగింది. 2019లో 1,552 మంది వీటిలో పనిచేస్తుండగా, ఆ సంఖ్య ఇప్పుడు 5,669కు చేరింది. గత చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఇంక్యుబేషన్ సెంటర్ పేరుతో ప్రచారానికే పరిమితమవడంతో స్టార్టప్‌లలో రాష్ట్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. వైఎస్ జగన్ ప్రభుత్వం దానికి భిన్నంగా స్టార్టప్‌ల ప్రోత్సాహానికి అనేక చర్యలు చేపట్టింది. స్టార్టప్‌లకు మెంటార్షిప్, ఫండింగ్, ఇండస్ట్రీ కనెక్ట్‌లతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో అనిల్ తెంటు ‘సాక్షి’కి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలి నాలుగో తరం పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని కల్పతరువు పేరిట విశాఖలో ఏర్పాటు చేసింది. దీంతోపాటు నాస్కామ్ సహాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల స్టార్టప్‌ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను కూడా విశాఖలో ఏర్పాటు చేసింది. ఆంధ్రా యూనివర్సిటీలో ఏ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్‌టెక్ జోన్‌లోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా పలు స్టార్టప్‌లు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. -
స్టార్టప్‌లకు ఆదాయపన్ను మినహాయింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ గుర్తింపు కలిగిన 2,975 స్టార్టప్‌లకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు లభించింది. 2023 డిసెంబర్ 31 నాటికి 1,17,254 స్టార్టప్‌లు ప్రభుత్వ గుర్తింపును పొందినట్టు పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) జాయింట్ సెక్రటరీ సంజీవ్ తెలిపారు. ఆదాయపన్ను మినహాయింపు పొందిన స్టార్టప్‌లు 2023 మార్చి నాటికి 1,100గానే ఉన్నాయని, వాటి సంఖ్య ఇప్పుడు 2,975కు పెరిగినట్టు చెప్పారు. అర్హత సరి్టఫికెట్లు మంజూరు చేసేందుకు వీలుగా, దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించేందుకు ఒక ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (ఎస్వోపీ) రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సరి్టఫికెట్ ఆధారంగానే పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. పెండింగ్‌లో ఉన్న సుమారు 1,500 దరఖాస్తులను మార్చి 31లోపే పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. ‘‘స్టార్టప్‌లకు వ్యాపార నిర్వహణను మరింత సులభంగా మార్చేందుకు మొత్తం విధానాన్నే మారుస్తున్నాం. అవి ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా చూస్తున్నాం’’అని సంజీవ్ తెలిపారు. ఇప్పటికే 1,800 పేటెంట్లను స్టార్టప్‌లకు జారీ చేసినట్టు చెప్పారు. స్టార్టప్‌లకు నిధుల కొరతపై ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. ఇప్పుడు ఈ ధోరణిలో మార్పు వచి్చందని, స్టార్టప్‌లు సైతం డెట్ నిధుల కోసం చూస్తున్నట్టు తెలిపారు. ‘‘ఈక్విటీ రూపంలో నిధులు తగ్గి ఉండొచ్చు. అలా అని వాటికి నిధులు లభించడం లేదని చెప్పడానికి లేదు. స్టార్టప్‌లు ఐపీవో మార్గాన్ని కూడా ఎంపిక చేసుకుంటున్నాయి’’అని వివరించారు. స్టార్టప్‌ల కోసం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్, ఫండ్ ఆఫ్ ఫండ్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ తదితర పథకాలను కేంద్ర సర్కారు ప్రవేశపెట్టినట్టు చెప్పారు. -
రెండే.. రెండు నిమిషాల కాల్.. 200 మంది ఉద్యోగాలు ఊడాయ్!
రెండే రెండు నిమిషాల కాల్.. రెండు వందల మంది ఉద్యోగుల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టింది. ఆర్ధిక మాంద్యం కారణంగా ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఓ కంపెనీ రెండు నిమిషాల వ్యవధిలో వందల మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా కేంద్రంగా ఫ్రంట్‌డెస్క్ అనే సంస్థ తన 150 బిల్డింగ్‌లలో స్వల్పకాలానికి 1000 పోర్షన్లను అద్దెకు ఇస్తుంటుంది. ఫ్రంట్డెస్క్కు చెందిన బిల్డింగ్‌లో అద్దెకు ఉండే కస్టమర్లు అందులో ఉండొచ్చు. ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు. ట్రావెలింగ్ ఇష్టపడే వాళ్లు సైతం రెంట్ తీసుకోవచ్చు. అయితే ఈ సంస్థ 7నెలల క్రితం జెన్సిటీ అనే సాఫ్ట్వేర్ కంపెనీని కొనుగోలు చేసింది. ఆ తర్వాత వరుస పరిణామాలతో ఫ్రంట్ డెస్క్ నిధులు మంచులా కరిగిపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల నుంచి ఫండ్ సేకరించే ప్రయత్నాలు చేసింది. అక్కడా విఫలమైంది. చేసేది లేక కంపెనీ దివాళా తీయకుండా ఉండేలా రిసీవర్‌షిప్ కోసం కోర్టు మెట్లు ఎక్కుంది. ఆ వ్యవహారం కొనసాగుతుండగా.. పొదుపుపై దృష్టి సారించింది. ఇప్పటికే ఉన్న నిధులు ఖర్చు కాకుండా ఉండేలా సంస్థ మాస్ లేఆఫ్స్ తెరతీసింది. ఇందులో భాగంగా ఫ్రంట్‌డెస్క్ సీఈఓ జెస్సీ డిపింటో ఉద్యోగులతో రెండు నిమిషాల్ గూగుల్ మీట్ కాల్ మాట్లాడారు. సంస్థను షట్‌డౌన్ చేయకుండా ఫ్రంట్‌డెస్క్ స్టేట్ రిసీవర్‌షిప్ కోసం దాఖలు చేస్తుందని అన్నారు. అనంతరం 200 మంది ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్స్‌తో పాటు మిగిలిన అన్నీ విభాగాల ఉద్యోగులపై వేటు వేస్తున్నట్లు తెలిపారు. రిసీవర్‌షిప్ అంటే ఏమిటి? రిసీవర్‌షిప్ అనేది సంస్థలు మూత పడకుండా ఉండేలా న్యాయ స్థానం ఆదేశాలతో నిధులను సేకరించే ఓ పద్దతి. ఇన్వెస్టర్ల నుంచి నిధుల్ని సేకరించి దివాళా తీయబోయే సంస్థలకు అప్పగిస్తుంది. దీంతో ఆయా కంపెనీలు మూత పడకుండా సురక్షితంగా ఉంటాయి. చదవండి👉 టీసీఎస్ సంచలన నిర్ణయం?, ‘ ఆ 900 మంది ఉద్యోగుల శాలరీ నిలిపేసిందా?’ -
‘వాటిపై ఆసక్తి ఏది?’.. స్మృతి ఇరానీ ఆవేదన
ముంబై: మహిళల ఆధ్వర్యంలో నడిచే వినూత్నమైన స్టార్టప్‌లకు మద్దతుగా నిలవకపోవడం పట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ (వీసీ) తీరును కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రశ్నించారు. ‘నేటికీ పురుషుల ఆధ్వర్యంలోని కంపెనీలతో పోలిస్తే మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్ కంపెనీలపై వెంచర్ క్యాపిటలిస్ట్‌లు ఆసక్తి చూపడంలేదు’ అని మెంటార్ మైబోర్డ్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఇరానీ పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఎంతో మంది మహిళా ఆవిష్కర్తలు ఉన్నట్టు చెప్పారు. వారి ప్రయత్నాలు వాణిజ్య వెంచర్లుగా రూపాంతరం చెందడం లేదన్న ఆవేదనను ఆమె వ్యక్తం చేశారు. వినూత్నంగా ఉంటున్నప్పటికీ కార్పొరేట్ బోర్డుల్లో ఎంత మంది మహిళలకు చోటు లభించిందో పరిశీలించాలని సూచించారు. మహిళలకు నెలసరి సెలవులు ఇవ్వాల్సిన అవసరం లేదన్న మంత్రి స్మృతి ఇరానీ ఇటీవలి వ్యాఖ్యలపై విమర్శలు రావడం తెలిసిందే. అయితే తన వ్యాఖ్యలను ఆమె సమర్థించుకున్నారు. ‘‘మీ కంపెనీ హెచ్ఆర్ హెడ్ ప్రతి నెలా మీ నెలసరిని అడిగి తెలుసుకునే పరిస్థితిని ఊహించగలరా?’’అని ఆమె ప్రశ్నించారు. నెలసరి సెలవు ఇవ్వడం ప్రస్తుత చట్టాలకు సైతం విరుద్ధమన్నారు. ‘‘మహిళలు పెళ్లి చేసుకుంటే, పిల్లల కారణంగా పురోగతి చూపించలేరని గతంలో వారికి అవకాశాలు తిరస్కరించడాన్ని చూశాం. ఇప్పుడు నెలసరి రూపంలో వారికి ఉపాధిని నిరాకరించే పరిస్థితిని సృష్టించడం అవసరం అంటారా?’’అని ఇరానీ తన అభిప్రాయాలను పంచుకున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించే విషయంలో ఒకే విధానం సరికాదన్నారు. సంప్రదింపుల నైపుణ్యాలను విద్యార్థుల్లో, ముఖ్యంగా మహిళా విద్యార్థుల్లో కలి్పంచడంపై దృష్టి సారించాలని బిజినెస్ స్కూళ్లకు ఆమె సూచించారు. -
1.14 లక్షల స్టార్టప్‌లు..
ఈ ఏడాది అక్టోబర్ 31 నాటికి 1,14,902 సంస్థలను స్టార్టప్‌లుగా గుర్తించినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ తెలిపారు. 2016 జనవరిలో ప్రవేశపెట్టిన స్టార్టప్ ఇండియా యాక్షన్ ప్లాన్ కింద ప్రయోజనాలను పొందడానికి అర్హత కలిగిన సంస్థలకు అవకాశం కలి్పంచినట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు, అమెరికా, హాంకాంగ్, చైనా వంటి ఎగుమతి దేశాల్లో డిమాండ్ మందగించడం, ముడి పదార్థాల ధరల పెరుగుదల వంటివి రత్నాభరణాల పరిశ్రమకు సవాళ్లుగా మారాయని వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ చెప్పారు. 2022–23లో రత్నాభరణాల ఎగుమతులు అంతక్రితం ఏడాదిలో నమోదైన 39.27 బిలియన్ డాలర్లతో పోలిస్తే సుమారు 3 శాతం క్షీణించి 38.11 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు వివరించారు. -
ఐఐఎం వైజాగ్‌కు అరుదైన అవార్డు
సాక్షి, విశాఖపట్నం: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం (ఐఐఎంవీ) మరో అరుదైన అవార్డు దక్కించుకుంది. న్యూఢిల్లీలోని డా.బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ ఫెస్టివల్–2023లో ఐఐఎంవీకు అవార్డు ప్రకటించారు. మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహిస్తూ స్టార్టప్‌లకు చేయూతనందిస్తున్నందుకు గాను పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అందించిన ప్రతిష్ఠాత్మక అవార్డును ఐఐఎంవీ ప్రతినిధి ఎంఎస్ సుబ్రహ్మణ్యం అందుకున్నారు. ఐఐఎంవీలో మహిళా స్టార్టప్స్‌ని ప్రోత్సహించేందుకు ఐఐఎంవీ ఫీల్డ్(ఇంక్యుబేషన్ అండ్ స్టార్టప్స్)ను ఏర్పాటు చేశారు. ఇందులో మొదటి బ్యాచ్‌లో 20 మంది మహిళా పారిశ్రామికవేత్తలు సాగించిన విజయాలకు సంబంధించిన వివరాలతో ‘బ్రేకింగ్ బౌండరీస్’ అనే పుస్తకాన్ని ముద్రించారు. ఈ పుస్తకం ప్రీమియర్ బిజినెస్ స్కూల్ అవార్డును సొంతం చేసుకుంది. అవార్డు సాధించడంపై ఐఐఎంవీ డైరెక్టర్ ప్రొ.ఎం చంద్రశేఖర్ అభినందనలు తెలిపారు. ఐఐఎంవీ ఫీల్డ్‌లో 90 మందికిపైగా మహిళా పారిశ్రామికవేత్తలు తమ స్టార్టప్స్‌ను అభివృద్ధి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
Web Summit Lisbon: కలలను వదులుకోవద్దు...
ప్రపంచంలోనే అతిపెద్దదైన టెక్ కాన్ఫరెన్స్ వెబ్ సమ్మిట్ ఇటీవల పోర్చుగల్ రాజధాని లిస్బన్లో జరిగింది. ఈ వెబ్ సమ్మిట్‌కు 153 దేశాల నుండి 70 వేల మందికి పైగా సభ్యులు హాజరయ్యారు. వారిలో 43 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో మహిళలు పాల్గొన్న ఈవెంట్‌గా ఈ సదస్సు వార్తల్లో నిలిచింది. గ్లోబల్ టెక్ ఇండస్ట్రీని రీ డిజైన్ చేయడానికి ఒక ఈవెంట్‌గా వెబ్ సమ్మిట్‌ను పేర్కొంటారు. ఇందులో 2,608 స్టార్టప్‌లు పాల్గొన్నాయి. వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి, వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కొత్త టెక్నాలజీని అందుకోవడానికి, సార్టప్‌లను ప్రదర్శించడానికి ఈ సమ్మిట్ వేదికగా నిలిచింది. ఇందులో స్టార్టప్ కంపెనీల సీఈఓలు, ఫౌండర్లు, క్రియేటివ్ బృందాలు, ఇన్వెస్టర్లు.. పాల్గొన్నారు. ఇందులో విశేషం ఏమంటే ప్రతి మూడవ స్టార్టప్... మహిళ సృష్టించినదే అయి ఉండటం. వెబ్సమ్మిట్ సీఈవో కేథరీన్ మహర్ ఈవెంట్ ప్రారంభంలో ‘స్టార్టప్స్‌ని మరింత శక్తిమంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అత్యంత ముఖ్యమైన ప్రదేశం’గా పేర్కొన్నారు. స్టార్టప్స్.. నైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది తమ స్టార్టప్‌ల ద్వారా వెబ్ సమ్మిట్‌కు అప్లై చేసుకున్నారు. వాటిలో ఎంపిక చేసిన స్టార్టప్‌లను సమ్మిట్ ఆహ్వానించింది. కమ్యూనిటీ, పరిశ్రమలు, పర్యావరణ వ్యవస్థలపై సానుకూల ప్రభావం చూపే విధంగా పనిచేసే స్టార్టప్‌ల విభాగంలో 250 కంటే ఎక్కువ ఉన్నాయి. వంద మెంటార్ అవర్స్ సెషన్స్ ద్వారా 800 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఎక్స్పర్ట్స్ నుండి నైపుణ్యాలను నేర్చుకుంటారు. స్టార్టప్‌లలో ఎక్కువ ప్రాతినిధ్యం వహిస్తున్న పరిశ్రమలలో ఏఐ, మెషిన్ లెర్నింగ్, హెల్త్‌టెక్, వెల్నెస్, ఫిన్‌టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్, సస్టైనబిలిటీ, క్లీన్టెక్ .. వంటివి ఉన్నాయి. కార్యాలయాలలో వేధింపులు ఈవెంట్‌కు హాజరైన వారిలో మొత్తం 43 శాతం మంది మహిళలు ఉంటే, అత్యధికంగా 38 శాతం కంటే ఎక్కువ మంది మహిళా స్పీకర్లు ఉండటం విశేషం. అన్ని ఎగ్జిబిట్ స్టార్టప్ ఫౌండర్లలో దాదాపు మూడింట ఒక వంతు మహిళలే ఉన్నారు. ఈ సందర్భంగా వెబ్ సమ్మిట్ తన వార్షిక స్టేట్ ఆఫ్ జెండర్ ఈక్విటీ ఇన్ టెక్ నివేదికనూ విడుదల చేసింది. దాదాపు సగం మంది మహిళలు కార్యాలయంలో జెండర్ వివక్షను ఎదుర్కోవడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదన్నారు. 53.6 శాతం మంది గడిచిన ఏడాదిలో తమ తమ ఆఫీసులలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్టు తెలిపారు. 63.1 శాతం మంది పెట్టుబడిదారులు కృత్రిమ మేధస్సు, యంత్రాలని నమ్మి తమ స్టారప్‌లలో వృద్ధిని సాధించినట్టు తెలియజేస్తే 43.2 శాతం మంది మాత్రం తమ కంపెనీలలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచినట్టు పేర్కొన్నారు. అయినా, సీనియర్ మేనేజ్మెంట్ స్థానాల్లో మహిళల సంఖ్య గత ఏడాది కంటే 75 శాతం నుంచి 66.7 శాతానికి తగ్గినట్టు గుర్తించారు. ఈ సమ్మిట్... ప్రపంచంలో మహిళ స్థానం ఎలా ఉందో మరోసారి తెలియజేసింది. ప్రపంచానికి మహిళ పోర్చుగీస్ ఆర్థికమంత్రి ఆంటోనియా కోస్టా ఇ సిల్వా మాట్లాడుతూ ‘టెక్ ప్రపంచంలో ఎక్కువమంది మహిళలు అగ్రస్థానంలో ఉండాలి. వారి అవసరం ఈ ప్రపంచానికి ఎంతో ఉంది. మీ కలలను వదులుకోవద్దు. మహిళలకు అసాధారణమైన సామర్థ్యం ఉంది. సంక్షిష్టంగా ఉన్న ఈ ప్రపంచంలో మహిళల మల్టీ టాస్కింVŠ మైండ్ చాలా అవసరం’ అని పేర్కొన్నారు. ఆశలకు, స్నేహానికి, కొత్త ఆలోచనలను అభివృద్ధి చేయడానికి, మన కాలపు సమస్యలను సవాల్ చేయడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలను ఒక చోట చేర్చడానికి వెబ్ సమ్మిట్ గొప్ప వేదిక’ అన్నారు. ఇలాంటి అత్యున్నత వేదికలు ప్రపంచ మహిళ స్థానాన్ని, నైపుణ్యాలను, ఇబ్బందులను అందరి ముందుకు తీసుకువస్తూనే ఉంటాయి. మహిళలు తమ ఉన్నతి కోసం అన్నింటా పోరాటం చేయక తప్పదనే విషయాన్ని స్పష్టం చేస్తూనే ఉంటాయి. -
ఫ్యాషన్ స్టార్టప్స్‌లో అజియో పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 100 డైరెక్ట్ టు కస్టమర్ ఫ్యాషన్ స్టార్టప్స్‌లో పెట్టుబడి పెట్టాలని లైఫ్‌స్టైల్, ఫ్యాషన్ ఈ–కామర్స్ కంపెనీ అజియో భావిస్తోంది. ఈ స్టార్టప్స్ తయారు చేసే, విక్రయించే దుస్తులు, పాదరక్షలు, యాక్సెసరీస్ వంటి ఉత్పత్తులను డైరెక్ట్ టు కంన్జ్యూమర్ వేదిక అయిన అజియోగ్రామ్లో అందుబాటులో ఉంచనుంది. భారతీయ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ విభాగంలోని 200 బ్రాండ్స్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా అజియోగ్రామ్లో వచ్చే ఏడాదికల్లా చేర్చనున్నట్టు వెల్లడించింది. ఈ బ్రాండ్స్ విస్తరణకు, ఆదాయ వృద్ధికి పూర్తి సహకారం అందించనున్నట్టు అజియో ప్రకటించింది. -
అగ్రి - టెక్ స్టార్టప్‌లలో పెట్టుబడులు డౌన్ - మరింత తగ్గే అవకాశం!
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు, అనిశ్చితి పెరగడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటం తదితర అంశాల ప్రభావం దేశీ అగ్రి - టెక్ స్టార్టప్‌పైనా పడుతోంది. గత రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో (2021–22, 2022–23) వాటిలో పెట్టుబడులు 45 శాతం మేర పడిపోయాయి. అటు 2022, 2023 క్యాలెండర్ సంవత్సరాల్లో అంతర్జాతీయంగా అగ్రి - టెక్ పెట్టుబడులు 10 శాతం మేర తగ్గాయి. కన్సల్టింగ్ సంస్థ ఎఫ్‌ఎస్‌జీ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో కూడా ఫండింగ్ తగ్గుదల కొనసాగవచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరం తిరిగి పుంజుకోగలదని నివేదిక పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు నిలదొక్కుకునేందుకు అంకుర సంస్థలు లాభదాయకతపైనా దృష్టి పెట్టడం కొనసాగించే అవకాశం ఉందని తెలిపింది. ‘ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడం కొనసాగించవచ్చు. తమ దగ్గర పరిమిత స్థాయిలో ఉన్న నిధులను.. ఇప్పటికే నిలదొక్కుకున్న వ్యాపారాలవైపు మళ్లించే అవకాశం ఉంది‘ అని ఎఫ్‌ఎస్‌జీ వివరించింది. ‘పెట్టుబడుల తీరు మారిపోతుండటం.. అంతర్జాతీయ ఆర్థిక ధోరణుల ప్రభావం దేశీ అగ్రి–టెక్ రంగంపై ఎలా ఉంటాయనేది తెలియజేస్తోంది. పెట్టుబడులు మందగించిన ఈ తరుణాన్ని స్టార్టప్‌లు.. తమ వ్యాపార విధానాలను మెరుగుపర్చుకునేందుకు, లాభదాయకతవైపు మళ్లేందుకు ఉపయోగించుకోవాలి‘ అని సంస్థ ఎండీ రిషి అగర్వాల్ తెలిపారు. డీల్స్ పెరిగినా ఫండింగ్ తగ్గింది.. నివేదిక ప్రకారం.. 2022 ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల డీల్స్ 121 నమోదు కాగా, 2023 ఆర్థిక సంవత్సరంలో 140కి చేరాయి. కానీ, అగ్రి–టెక్ స్టార్టప్‌లు సమీకరించిన నిధుల పరిమాణం 2022 ఆర్థిక సంవత్సరంలో 1,279 మిలియన్ డాలర్లుగా ఉండగా, 2023 ఆర్థిక సంవత్సరంలో 706 మిలియన్ డాలర్లకు పడిపోయింది. మరోవైపు, 2022 ఆర్థిక సంవత్సరంలో అగ్రి–టెక్ అంకుర సంస్థల్లోకి పెట్టుబడుల బూమ్ వచ్చి, వాటి వేల్యుయేషన్స్ అసాధారణ స్థాయులకు ఎగిశాయి. కానీ మరుసటి ఆర్థిక సంవత్సరంలో కరెక్షన్ రావడంతో కొంత విచక్షణాయుతమైన పెట్టుబడుల వాతావరణం నెలకొంది. -
LinkedIn ranking: చేస్తే ఈ స్టార్టప్ కంపెనీలోనే పని చేయాలి..
ఇటీవల యునికార్న్‌గా మారిన ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ జెప్టో (Zepto) భారత్‌లో అత్యధిక మంది ప్రొఫెషనల్స్ ఇష్టపడే వర్క్‌ప్లేస్ పరంగా అగ్ర స్టార్టప్‌గా అవతరించింది. ప్రముఖ రిక్రూటింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డ్ఇన్ 'టాప్ 20 ఇండియన్ స్టార్టప్‌ల జాబితా'ను తాజాగా విడుదల చేసింది. తమకున్న దాదాపు కోటి మంది సభ్యుల డేటా ఆధారంగా నిపుణులు పని చేయాలనుకునే అభివృద్ధి చెందుతున్న కంపెనీల వార్షిక ర్యాంకింగ్ లింక్డ్ఇన్ రూపొందించింంది. ఉద్యోగుల వృద్ధి, ఉద్యోగార్థుల ఆసక్తి, కంపెనీలో మెంబర్ ఎంగేజ్మెంట్ తదితర అంశాల్లో పురోగతి సాధించి జెప్టో టాప్ ప్లేస్‌లో నిలిచింది. గతేడాది ఇదే లింక్డ్ఇన్ టాప్ కంపెనీల జాబితాలో 4వ స్థానంలో ఉన్న ఈ కంపెనీ ఈ ఏడాది మూడు స్థానాలు మెరుగుపర్చుకుని టాప్ ర్యాంక్‌ను సాధించింది. ఇక ఈ ర్యాంకింగ్‌లో జెప్టో తర్వాతి స్థానాలలో వరుసగా ఈవీ క్యాబ్ అగ్రిగేటర్ బ్లూస్మార్ట్, ఫిన్‌టెక్ కంపెనీ డిట్టో ఇన్సూరెన్స్, ఆడియో ఓటీటీ ప్లాట్‌ఫామ్ పాకెట్ ఎఫ్ఎం, స్కైరూట్ ఏరోస్పేస్ ఉన్నాయి. ఈ సంవత్సరం జాబితాలో ఉన్న 20 స్టార్టప్‌లలో 14 కొత్తగా చోటు దక్కించుకోవడం విశేషం. -
అతి నియంత్రణ అనర్ధదాయకం..
న్యూఢిల్లీ: ఓవర్–ది–టాప్ (ఓటీటీ) సర్విసులని, మరొకటని ఇంటర్నెట్ సేవలను వేర్వేరుగా వర్గీకరిస్తూ ’అతిగా నియంత్రించడం’ అనర్ధదాయకంగా మారే ప్రమాదముందని స్టార్టప్‌లు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనివల్ల వివిధ రకాల సేవలు అందించే సంస్థలు వివక్షకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాయి. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలాకు 129 అంకుర సంస్థల వ్యవస్థాపకులు ఈ మేరకు సంయుక్త లేఖ రాశారు. జిరోధాకు చెందిన నితిన్ కామత్, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తదితరులు వీరిలో ఉన్నారు. ఓటీటీలు భారీగా డేటాను వినియోగిస్తుండటం వల్ల తమ నెట్‌వర్క్‌లపై భారం పెరిగిపోతోందని, వ్యయాలను భర్తీ చేసుకునేందుకు సదరు ఓటీటీ సంస్థల లాభాల్లో కొంత వాటా తమకూ ఇప్పించాలని టెల్కోలు కోరుతున్న నేపథ్యంలో స్టార్టప్‌ల లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది. స్పీడ్, లభ్యత, వ్యయాలపరంగా ఏ యాప్‌పైనా టెలికం, ఇంటర్నెట్ సేవల ప్రొవైడర్లు వివక్ష చూపకుండా తటస్థంగా వ్యవహరించే నెట్ న్యూట్రాలిటీ విధానానికే తమ మద్దతని లేఖలో స్టార్టప్‌ల వ్యవస్థాపకులు తెలిపారు. ఓటీటీ వంటి సర్విసులు అందించే సంస్థలను టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్స్ (టీఎస్పీ) నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తేవడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఇంటర్నెట్ యాప్స్, సర్విసులకు టెలికం లైసెన్సింగ్ నిబంధనలను వర్తించేస్తే దేశీ స్టార్టప్ వ్యవస్థకు తీవ్ర హాని జరుగుతుందని వివరించాయి. ఇవన్నీ కూడా బడా బహుళజాతి సంస్థలకే లబ్ధి చేకూరుస్తాయని అంకుర సంస్థల వ్యవస్థాపకులు లేఖలో తెలిపారు. -
భారత్‌లో స్టార్టప్ కంపెనీల సరికొత్త రికార్డ్! ఏకంగా..
భారత్‌లో పారిశ్రామిక చైతన్యం పెరుగుతూ వస్తోంది. పరిశ్రమలు స్థాపించి తమకు చేతనైనంత మందికి ఉపాధి కల్పించాలన్న స్పృహ యువతలో బాగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా ప్రోత్సాహక విధానాలను అవలంభిస్తోంది. ఫలితంగా దీంతో దేశంలో స్టార్టప్ కంపెనీ సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్య 2016లో 450 ఉండగా ప్రస్తుతం లక్షకు పైగా పెరిగిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఓ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ విపరీతమైన వృద్ధిని సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. (High Severity Warning: ఐఫోన్లు, యాపిల్ ప్రొడక్ట్స్‌కు హై సివియారిటీ వార్నింగ్!) భారతదేశంలో పరిశ్రమల స్థాపన, వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం నిబద్ధతతో ఉందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. తద్వారా దేశంలో బిజినెస్ ప్రారంభించడం, నిర్వహించాడాన్ని సులభతరం చేసినట్లు వివరించారు.