ముంబై : మీ సీవీకి కాస్త మెరుగులు దిద్దండి.. లింక్‌డిన్ పేజీలో అప్‌డేట్ చేసేయండి. ఎందుకంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు స్టార్టప్‌లు గుడ్‌న్యూస్ అందిస్తున్నాయి. భారీ ప్యాకేజీలతో ఉద్యోగవకాశాలను ఆఫర్ చేస్తున్నాయి. కోట్ల రూపాయల వేతనం, వేరియబుల్స్, స్టాక్ ఆప్షన్లతో సీనియర్ స్థాయి ఉద్యోగులకు స్టార్టప్ కంపెనీలు ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయని తాజా రిపోర్టులు తెలిపాయి. ఎమర్జింగ్ రంగంలో వచ్చే కొన్ని నెలల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఆఫర్లు పెరుగనున్నాయని తాజా రిపోర్టులు పేర్కొన్నాయి.
అప్‌గ్రాడ్, సింప్లీలెర్న్, టాపర్, పియర్సన్, ఎమెరిటస్ వంటి కంపెనీలు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నియామకాలు పెంచాయి. ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ అప్‌గ్రాడ్‌ను ప్రమోట్ చేస్తున్న ఎంటర్‌ప్రిన్యూర్ రోనీ స్క్రూవాలా ఇటీవలే నలుగురు సీనియర్ ఉద్యోగులను నియమించుకుంది. వారికి రూ.50 లక్షలకు పైగా ప్యాకేజీని ఆఫర్ చేసినట్టు తెలిసింది. మరో ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ ఎమెరిటస్ కూడా సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో ముగ్గురు ఉద్యోగులను నియమించుకుందని, వారికి కూడా భారీగా వేతనాలు ఆఫర్ చేసినట్టు రిపోర్టులు తెలిపాయి.
ఎడ్యుకేషన్ టెక్నాలజీ స్పేస్‌లో నిధులు 2014లో 101.7 మిలియన్ డాలర్లుండగా.. 2015లో 126.4 మిలియన్ డాలర్లు, 2016లో 186.1 మిలియన్ డాలర్లకు పెరిగిందని ట్రాక్షన్ డేటా తెలిపింది. స్టార్టప్‌ల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్యోగాల ఆఫర్‌తో పాటు బ్యాంకింగ్, మానుఫ్రాక్ట్ర్చరింగ్, ఈకామర్స్ వంటి రంగాల్లో డేటా అనాలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ఎక్కువ ఉద్యోగాలు ఉండనున్నాయని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment