రెండే.. రెండు నిమిషాల కాల్‌.. 200 మంది ఉద్యోగాలు ఊడాయ్‌! | Frontdesk Lays Off 200 Employees Over 2 Minutes Google Meet Call | Sakshi

రెండే.. రెండు నిమిషాల కాల్‌.. 200 మంది ఉద్యోగాలు ఊడాయ్‌!

Published Thu, Jan 4 2024 8:40 AM | Last Updated on Thu, Jan 4 2024 9:10 AM

Frontdesk Layoff With 2 Minutes Google Meet Call - Sakshi

రెండే రెండు నిమిషాల కాల్‌.. రెండు వందల మంది ఉద్యోగుల భవిష్యత్‌ను అంధకారంలోకి  నెట్టింది. ఆర్ధిక మాంద్యం కారణంగా ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా ఓ కంపెనీ రెండు నిమిషాల వ్యవధిలో వందల మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.  

అమెరికా కేంద్రంగా ఫ్రంట్‌డెస్క్‌ అనే సంస్థ తన 150 బిల్డింగ్‌లలో స్వల్పకాలానికి 1000 పోర‍్షన్‌లను అద్దెకు ఇస్తుంటుంది. ఫ్రంట్‌డెస్క్‌కు చెందిన బిల్డింగ్‌లో అద్దెకు ఉండే కస్టమర్లు అందులో ఉండొచ్చు. ఆఫీస్‌ వర్క్‌ చేసుకోవచ్చు. ట్రావెలింగ్‌ ఇష్టపడే వాళ్లు సైతం రెంట్‌ తీసుకోవచ్చు. 

అయితే ఈ సంస్థ 7నెలల క్రితం జెన్‌సిటీ అనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీని కొనుగోలు చేసింది. ఆ తర్వాత వరుస పరిణామాలతో ఫ్రంట్‌ డెస్క్‌ నిధులు మంచులా కరిగిపోయాయి. దీంతో ఇన్వెస్టర్ల నుంచి ఫండ్‌ సేకరించే ప్రయత్నాలు చేసింది. అక్కడా విఫలమైంది. చేసేది లేక కంపెనీ దివాళా తీయకుండా ఉండేలా రిసీవర్‌షిప్‌ కోసం కోర్టు మెట్లు ఎక్కుంది. ఆ వ్యవహారం కొనసాగుతుండగా.. పొదుపుపై దృష్టి సారించింది. ఇప్పటికే ఉన్న నిధులు ఖర్చు కాకుండా ఉండేలా సంస్థ మాస్‌ లేఆఫ్స్‌ తెరతీసింది. 

ఇందులో భాగంగా ఫ్రంట్‌డెస్క్ సీఈఓ జెస్సీ డిపింటో ఉద్యోగులతో రెండు నిమిషాల్‌ గూగుల్‌ మీట్‌ కాల్‌ మాట్లాడారు. సంస్థను షట్‌డౌన్‌ చేయకుండా  ఫ్రంట్‌డెస్క్ స్టేట్ రిసీవర్‌షిప్ కోసం దాఖలు చేస్తుందని అన్నారు. అనంతరం 200 మంది ఫుల్‌టైమ్‌, పార్ట్‌టైమ్‌ ఉద్యోగులు, కాంట్రాక్టర్స్‌తో పాటు మిగిలిన అన్నీ విభాగాల ఉద్యోగులపై వేటు వేస్తున్నట్లు తెలిపారు.   

రిసీవర్‌షిప్ అంటే ఏమిటి?
రిసీవర్‌షిప్ అనేది సంస్థలు మూత పడకుండా ఉండేలా న్యాయ స్థానం ఆదేశాలతో నిధులను సేకరించే ఓ పద్దతి. ఇన్వెస్టర్ల నుంచి నిధుల్ని సేకరించి దివాళా తీయబోయే సంస్థలకు అప్పగిస్తుంది. దీంతో ఆయా కంపెనీలు మూత పడకుండా సురక్షితంగా ఉంటాయి.

చదవండి👉 టీసీఎస్‌ సంచలన నిర్ణయం?, ‘ ఆ 900 మంది ఉద్యోగుల శాలరీ నిలిపేసిందా?’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement