హఫీజ్‌పేట్: దేశంలోనే అత్యధిక స్టార్టప్‌లున్న మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని టీహబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు తెలిపారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని షర్టన్ హోటల్‌లో సీఐఓ క్లబ్ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో నేషనల్ టెక్నాలజీ కాంక్లేవ్–2023 శనివారం జరిగింది. ఈ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం 7,500 స్టార్టప్‌లున్నాయన్నారు.
వ్యాక్సినేషన్ ఉత్పత్తిలోనూ కొత్తగా ఏర్పడిన తెలంగాణే టాప్ రాష్ట్రంగా కొనసాగుతోందని తెలిపారు. ఈజీ ఆఫ్ బిజినెస్‌లో, బెస్ట్ ఇన్నోవేషన్ స్టేట్‌గానూ తెలంగాణ గుర్తింపు పొందిందన్నారు. ఇక ప్రపంచంలోనే అత్యుత్తమ ఐటీ కంపెనీలైన అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు.. అమెరికా తర్వాత తమ అతి పెద్ద కేంద్రాలను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు.
వ్యవసాయంలోనూ టెక్నాలజీని ఉపయోగిస్తూ తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు. సీఐఓ క్లబ్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు రామిరెడ్డి మాట్లాడుతూ 2018లో సీఐఓ క్లబ్ అసోసియేషన్ హైదరాబాద్ చాప్టర్‌ను ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో ఐఎస్‌బి అసోసియేట్ డైరెక్టర్ అజయ్ సింగ్, సీఐఓ క్లబ్ ప్రతినిధులు ఉమేష్ మెహతా, 14 చాప్టర్ల సీఐఓలు, సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment