రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో 795 మహిళా స్టార్టప్‌లు ఏర్పాటు
2019లో 92 కొత్త స్టార్టప్‌లు.. 2023లో 294 ఏర్పాటు
లోక్‌సభలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద వెల్లడి
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో మహిళా స్టార్టప్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఐదేళ్లలో ఏపీలో కనీసం ఒక మహిళ డైరెక్టర్‌గా ఉన్న స్టార్టప్‌లు కొత్తగా 795 ఏర్పాటయ్యాయని లోక్‌సభలో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద వెల్లడించారు. 2019లో ఏపీలో కొత్త స్టార్టప్‌లు 92 ఏర్పాటైతే.. ఏటా ఆ సంఖ్య పెరుగుతూ 2023లో 294 ఏర్పాటయ్యాయని తెలిపారు.
స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీం(ఎస్‌ఐఎస్‌ఎఫ్‌ఎస్) పథకం కింద 2024 అక్టోబర్ 31 నాటికి రాష్ట్రంలో 20 స్టార్టప్‌లకు రూ.4.53 కోట్ల నిధులను సమకూర్చారు. దేశవ్యాప్తంగా మొత్తం 1,278 మహిళా స్టార్టప్‌లకు ఎస్‌ఐఎస్‌ఎఫ్‌ఎస్ పథకం కింద రూ.227.12 కోట్లు సమకూర్చారు.
దేశంలో కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన స్టార్టప్‌లు 1,52,139 ఉండగా.. అందులో కనీసం ఒక మహిళ డైరెక్టర్‌గా ఉన్న స్టార్టప్‌లు 73,151 ఉన్నాయని మంత్రి తెలిపారు. 2023లో 2,916 స్టార్టప్‌ల ఏర్పాటుతో మహారాష్ట్ర దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment