దేశీయ స్టార్టప్‌లపై జెరోధా బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు | Indian Startups Success Goes To Investors Outside India Said Nithin Kamath | Sakshi
Sakshi News home page

దేశీయ స్టార్టప్‌లపై జెరోధా బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Wed, Feb 21 2024 7:42 AM | Last Updated on Wed, Feb 21 2024 8:10 AM

Indian Startups Success Goes To Investors Outside India Said Nithin Kamath - Sakshi

జెరోధా ఫౌండర్ నితిన్ కామత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశీయ స్టార్టప్ల విజయం విదేశీ పెట్టుబడి దారులకు సొంతం అవుతుందని అన్నారు. కాబట్టే భారత్ సమిష్టి కృషితో అభివృద్ధి చెందుతూ దేశీయంగా సంపదను సృష్టించాల్సిన అవసరం ఉందని అన్నారు.

‘నేను ఇంతకు ముందే చెప్పాను. భారత్ అభివృద్ధి చెందాలంటే అందరినీ కలుపుకోవాలి. స్థానికంగా సంపదను సృష్టించబడాలి. నేడు, స్వదేశీ స్టార్టప్‌ల విజయంలో ఎక్కువ భాగం భారతదేశం వెలుపల ఉన్న పెట్టుబడిదారులకు వెళుతుంది. తగినంత నిధులు ఉండడం వల్ల విదేశీ పెట్టుబడి దారులపై ఆధారపడడం తగ్గుతుంది. ట్యాక్స్ కూడా అదా చేసుకోవచ్చు అని నితిన్ కామ్ తెలిపారు.   

దేశంలో ఆవిష్కరణలు, స్టార్టప్‌ల కోసం బలమైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి అవసరమైన చర్యలపై కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు నితిన్ కామత్ గత సంవత్సరం నేషనల్ స్టార్టప్ అడ్వైజరీ కౌన్సిల్‌లో చేరారు. స్టార్టప్‌ల కోసం భారత్ తన దేశీయ మూలధనాన్ని అన్‌లాక్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. విదేశీ మూలధనంపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు తాను కృషి చేస్తానని, స్వదేశంలో స్టార్టప్‌లకు మద్దతుగా భారతీయులను ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు.

ఒక దేశంగా మనం చేయాల్సిన  పని  ఏమిటంటే స్టార్టప్‌లు/ఎంఎస్ఎఈల కోసం దేశీయ మూలధనాన్ని అన్‌లాక్ చేయడం, విదేశీ మూలధనంపై ఆధారపడటాన్ని తగ్గించడం, భారతీయ స్టార్టప్‌లకు భారతీయులు మద్దతునివ్వడమేనని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement