న్యూఢిల్లీ: ప్రభుత్వ గుర్తింపు కలిగిన 2,975 స్టార్టప్‌లకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు లభించింది. 2023 డిసెంబర్ 31 నాటికి 1,17,254 స్టార్టప్‌లు ప్రభుత్వ గుర్తింపును పొందినట్టు పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) జాయింట్ సెక్రటరీ సంజీవ్ తెలిపారు. ఆదాయపన్ను మినహాయింపు పొందిన స్టార్టప్‌లు 2023 మార్చి నాటికి 1,100గానే ఉన్నాయని, వాటి సంఖ్య ఇప్పుడు 2,975కు పెరిగినట్టు చెప్పారు.
అర్హత సరి్టఫికెట్‌లు మంజూరు చేసేందుకు వీలుగా, దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించేందుకు ఒక ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (ఎస్‌వోపీ) రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సరి్టఫికెట్ ఆధారంగానే పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. పెండింగ్‌లో ఉన్న సుమారు 1,500 దరఖాస్తులను మార్చి 31లోపే పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. ‘‘స్టార్టప్‌లకు వ్యాపార నిర్వహణను మరింత సులభంగా మార్చేందుకు మొత్తం విధానాన్నే మారుస్తున్నాం.
అవి ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా చూస్తున్నాం’’అని సంజీవ్ తెలిపారు. ఇప్పటికే 1,800 పేటెంట్‌లను స్టార్టప్‌లకు జారీ చేసినట్టు చెప్పారు. స్టార్టప్‌లకు నిధుల కొరతపై ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. ఇప్పుడు ఈ ధోరణిలో మార్పు వచి్చందని, స్టార్టప్‌లు సైతం డెట్ నిధుల కోసం చూస్తున్నట్టు తెలిపారు. ‘‘ఈక్విటీ రూపంలో నిధులు తగ్గి ఉండొచ్చు. అలా అని వాటికి నిధులు లభించడం లేదని చెప్పడానికి లేదు. స్టార్టప్‌లు ఐపీవో మార్గాన్ని కూడా ఎంపిక చేసుకుంటున్నాయి’’అని వివరించారు. స్టార్టప్‌ల కోసం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్, ఫండ్ ఆఫ్ ఫండ్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ తదితర పథకాలను కేంద్ర సర్కారు ప్రవేశపెట్టినట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment