సాక్షి, న్యూఢిల్లీ: మరికొన్ని గంటల్లో కేంద్ర ఆర్థికబడ్జెట్ పార్లమెంటు ముందుకు రానుంది. ఎన్నికల ముందు బీజేపీ సర్కార్ తీసుకొస్తున్న మధ్యంతర బడ్జెట్పై వివిధ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా వేతన జీవులకు ఊరట లభించనుందనే మాట వినిపిస్తోంది. రేపు( ఫిబ్రవరి 1)న ప్రకటించనున్న మధ్యంతర బడ్జెట్‌లో ప్రధాన సంస్కరణలను ప్రకటించకపోయినా, మరింత జనాకర్షితంగా ఉండవచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు.ఆదాయపు పన్ను పరిమితిలో భారీ పెంపు ఉంటుందని భాస్తున్నారు. ఈ మినహాయింపును దాదాపు రెట్టింపు చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం వ్యక్తిగత పన్ను మినహాయింపు రూ.2.5 లక్షలుగా ఉంది. అయితే పరితిమిని రూ. 5లక్షలకు పెంచ వచ్చని అంచనా. ప్రస్తుతం 80 ఏళ్లకు పైబడ్డ వృద్ధులకు మాత్రమే రూ.5 లక్షల మినహాయింపు ఉంది.
మరోవైపు రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) ఇప్పటికే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక, సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపును రూ.1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షల మేరకు పెంచాలని సిఐఐ కోరింది. అంచనాలకనుగుణంగా ఈ పరిమితి రెట్టింపు అయితే రిటైల్ పెట్టుబడిదారులను ఉత్సాహపరుస్తుందని మార్కెట్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment