exemption
-
అంకెలు మారాయి కానీ.. ప్రశ్న మారలేదు..
మూడు బడ్జెట్ల నుంచి ఇదే ప్రశ్న.. పాత పన్ను విధానమా? కొత్త పన్ను విధానమా? ఏది మంచిది. ఏది ఎక్కువ ఉపయోగకరం. ఏది ఎవరికి ఎక్కువ ప్రయోజనకరం. ఏది మంచిదని ప్రశ్నించే బదులు ఏది ఉపయోగం అనేది సరైన ప్రశ్న. మళ్లీ పాత ప్రశ్నే. ఇరవై ఏళ్లు లేదా అంతకన్నా ముందు నుంచి అస్సెస్సీలతో సేవింగ్స్ చేయించి, అలా చేసినందుకు ఆ మేరకు మినహాయింపును ఇస్తూ వచ్చేవారు. ఏయే సెక్షన్ల ప్రకారం సేవ్ చేస్తే మినహాయింపు వస్తుంది.. అని ఆలోచించి అడుగేసేవాళ్లు.ఉద్యోగస్తులకు కంపల్సరీగా పీఎఫ్ తప్పదు. అంతేకాకుండా, ట్యాక్స్ విధానంలో ‘మినహాయింపు’ను అతిగా వాడారు. డిపాజిట్ చేస్తే మినహాయింపు, విత్‌డ్రా చేస్తే మినహాయింపు, దాని మీద వడ్డీకి కూడా మినహాయింపు. సంక్షేమం అనుకోండి, పొదుపు అనుకోండి, అలవాటు అనుకోండి, ఆకర్షణీయం అనుకోండి.. పీఎఫ్‌ను అతిగా ఆశ్రయించారు. ఇలాగే ఎన్నో పథకాలు. 80సీని ప్రోత్సహిస్తూ ఇరవై పైచిలుకు పథకాలను ప్రవేశపెట్టారు. లిమిట్‌ని పెంచుతూ, 10 సంవత్సరాల పాటు రూ.1,50,000 గరిష్ట పరిమితిగా ఉంచారు. ప్రతి సంవత్సరం ఆ రూ.1,50,000 పరిమితి పెరుగుతుందని అందరూ ఎదురుచూస్తూ వచ్చారు. కానీ నిరాశే. ఎటువంటి మార్పూ లేదు. కనీసం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కూడా మార్పులు తేలేదు. ఇది. అన్యాయమే. అలాగే ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా ఇచ్చే వెసులుబాటైన స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపులో పెంపుదల.. రద్దు.. పునరుద్ధరణ .. పెంపుదల ఇలా మార్పులు తెచ్చారు. ఈ మినహాయింపుని అలాగే కొనసాగిస్తూ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మారిస్తే బాగుండేది. ఇలాంటివి ఎన్నో మినహాయింపులు ఉన్నాయి.ఇదీ చదవండి: ఆర్బిట్రేజ్ ఫండ్స్‌తో మెరుగైన రాబడులుపాతకాలం నాటి అంకెలు.. ఆంక్షలు.. వీటిని ఏమీ మార్చకపోవడాన్ని ‘పాలసీ’ అని సరిపెట్టుకోలేము. ప్రభుత్వపు అనిశ్చితి వైఖరి ఇది అనే చెప్పాలి. గత నెలలో ట్రంప్ గెలుపు, తీసుకురాబోయే విప్లవాత్మక మార్పులు, వాటి తీవ్ర ప్రభావం మన ప్రజల మీద ఉంటుంది అని తెలిసినా స్పష్టత లేదు. అలాంటి పరిస్థితుల్లో వచ్చింది మన సీతమ్మగారి పద్దు. ఒక ప్రశ్న మాత్రం మారలేదు. అదేమిటంటే.. ఏది బెటర్? పాత విధానమా లేక కొత్త విధానమా? అయితే, నిస్సందేహంగా ప్రభుత్వ జోరు, హోరు, వైఖరి, ధోరణి అంతా కొత్త విధానం వైపే మొగ్గు చూపుతోంది. ‘పొమ్మనలేక పొగబెట్టినట్లు’ పాత విధానాన్ని ప్రోత్సహించలేదు. అది ఉంటుందా అని అడిగితే కొనసాగిస్తున్నాం అని అన్నారు ఆర్థిక మంత్రి. అయితే, కొన్ని తేడాలు, సలహాలు, సూచనలను తెలుసుకోవాలి. అవేమిటంటే..భారీగా మినహాయింపు పొందాలనుకునే వారికి పాతది మంచిది. వినియోగం వైపు మొగ్గు చూపించే వారికి కొత్త విధానం ఆకర్షణీయంగా ఉంటుంది. నిలకడగా, నిర్దిష్టంగా, నిశ్చింతగా ఆలోచించే వారికి పాతదే బెటరేమో? స్వతంత్రంగా వ్యవహరించాలి. సులువుగా ఉండాలి. అనువుగా ఉండాలి. కమిట్మెంట్ వద్దనే వారికి కొత్త విధానం బెటరు. మీ ఆదాయాన్ని లెక్కించండి. కంపల్సరీ సేవింగ్స్‌ని పరిగణనలోకి తీసుకుని ఆలోచించండి. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రెడీమేడ్ కాల్క్యులేటర్స్ ఉన్నాయి. అప్పుడు సరైన విధానాన్ని ఎంచుకోండి. కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిపుణులు -
(అ)సాధారణ బీమా
కోల్‌కతా: సాధారణ బీమా (జీవిత బీమా కాకుండా) రంగం ఈ ఏడాది రెండంకెల వృద్ధిని చూడనుంది. నియంత్రణపరమైన అనుకూల వాతావరణానికి తోడు, వినూత్నమైన ఉత్పత్తుల ఆవిష్కరణ వృద్ధిని నడిపిస్తుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ మినహాయింపు కల్పించడం, మోటార్ ఇన్సూరెన్స్ థర్డ్‌పార్టీ ప్రీమియం రేట్ల సమీక్ష నిర్ణయాలు తమకు అనుకూలిస్తాయని భావిస్తోంది. ‘‘హెల్త్ ఇన్సూరెన్స్ రానున్న సంవత్సరాల్లోనూ వృద్ధిని నడిపించనుంది. నాన్ మోటార్, పెట్ ఇన్సూరెన్స్, లయబిలిటీ, ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ, హౌసింగ్ ఇన్సూరెన్స్ వంటి నాన్ హెల్త్ విభాగాల్లోనూ బీమా వ్యాప్తి గణనీయంగా పెరగనుంది’’అని ఫ్యూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఎండీ, సీఈవో అనూప్ రావు తెలిపారు. 14 శాతం మేర వృద్ధిని పరిశ్రమ అంచనా వేస్తున్నట్టు చెప్పారు. జీఎస్టీ, మోటార్ థర్డ్ పార్టీ రేట్ల విషయంలో పరిశ్రమకు సహకారం అవసరమన్నారు. ‘‘హెల్త్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీని తొలగిస్తే వాటి ధరలు మరింత అందుబాటులోకి వస్తాయి. దీంతో ఎక్కువ మందికి బీమా చేరువ అవుతుంది. దీనివల్ల ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి భారం తగ్గుతుంది. మోటార్ థర్డ్ పార్టీ ప్రీమియం రేట్లు ఐదేళ్లుగా ఎలాంటి మార్పులకు నోచుకోలేదు. వీటిని తక్షణమే సవరించాల్సి ఉంది’’అని రావు వివరించారు. వ్యయాలను తగ్గించుకుని, అత్యవసర బీమా ఉత్పత్తులను అందరికీ చేరువ చేసేందుకు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ను వినియోగించుకోవాల్సి ఉందన్నారు. బీమా సుగం, బీమా విస్తార్, బీమా వాహక్స్ చర్యలు ఇందుకు వీలు కల్పిస్తాయన్నారు. అందరికీ అందుబాటు.. బీమాను అందుబాటు ధరలకు తీసుకురావాల్సిన అవసరాన్ని హెచ్డీఎఫ్సీ ఎర్గో జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో అనుజ్ త్యాగి ప్రస్తావించారు. ‘‘ఉత్పత్తుల అభివృద్ధి, అండర్ రైటింగ్, కస్టమర్ సేవల్లో నూతనత్వం అన్నది బీమాను పౌరులకు మరింత చేరువ చేస్తుంది’’అని చెప్పారు. బీమా పరిశ్రమ పరిమాణాత్మక మార్పు వైపు అడుగులు వేస్తోందని బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తపన్ సింఘాల్ పేర్కొన్నారు. డిజిటల్ ఆవిష్కరణల ద్వారా వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన బీమా ఉత్పత్తులను అందించడాన్ని ప్రస్తావించారు. విపత్తుల నిర్వహణకు సంబంధించి పారామెట్రిక్ ఇన్సూరెన్స్‌తోపాటు సైబర్ ఇన్సూరెన్స్ సైతం ప్రాముఖ్యతను సంతరించుకోనున్నట్టు చెప్పారు. -
స్టార్టప్‌లకు ఆదాయపన్ను మినహాయింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ గుర్తింపు కలిగిన 2,975 స్టార్టప్‌లకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు లభించింది. 2023 డిసెంబర్ 31 నాటికి 1,17,254 స్టార్టప్‌లు ప్రభుత్వ గుర్తింపును పొందినట్టు పారిశ్రామిక ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) జాయింట్ సెక్రటరీ సంజీవ్ తెలిపారు. ఆదాయపన్ను మినహాయింపు పొందిన స్టార్టప్‌లు 2023 మార్చి నాటికి 1,100గానే ఉన్నాయని, వాటి సంఖ్య ఇప్పుడు 2,975కు పెరిగినట్టు చెప్పారు. అర్హత సరి్టఫికెట్లు మంజూరు చేసేందుకు వీలుగా, దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించేందుకు ఒక ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (ఎస్వోపీ) రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సరి్టఫికెట్ ఆధారంగానే పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. పెండింగ్‌లో ఉన్న సుమారు 1,500 దరఖాస్తులను మార్చి 31లోపే పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. ‘‘స్టార్టప్‌లకు వ్యాపార నిర్వహణను మరింత సులభంగా మార్చేందుకు మొత్తం విధానాన్నే మారుస్తున్నాం. అవి ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా చూస్తున్నాం’’అని సంజీవ్ తెలిపారు. ఇప్పటికే 1,800 పేటెంట్లను స్టార్టప్‌లకు జారీ చేసినట్టు చెప్పారు. స్టార్టప్‌లకు నిధుల కొరతపై ఎదురైన ప్రశ్నకు స్పందిస్తూ.. ఇప్పుడు ఈ ధోరణిలో మార్పు వచి్చందని, స్టార్టప్‌లు సైతం డెట్ నిధుల కోసం చూస్తున్నట్టు తెలిపారు. ‘‘ఈక్విటీ రూపంలో నిధులు తగ్గి ఉండొచ్చు. అలా అని వాటికి నిధులు లభించడం లేదని చెప్పడానికి లేదు. స్టార్టప్‌లు ఐపీవో మార్గాన్ని కూడా ఎంపిక చేసుకుంటున్నాయి’’అని వివరించారు. స్టార్టప్‌ల కోసం స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్, ఫండ్ ఆఫ్ ఫండ్, క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ తదితర పథకాలను కేంద్ర సర్కారు ప్రవేశపెట్టినట్టు చెప్పారు. -
ఎల్ఐసీకి ప్రభుత్వ మినహాయింపు
న్యూఢిల్లీ: పబ్లిక్కు కనీస వాటా విషయంలో ప్రభుత్వం మినహాయింపునిచ్చినట్లు బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ వెల్లడించింది. దీంతో పబ్లిక్కు కనీసం 25 శాతం వాటా(ఎంపీఎస్) కల్పించే అంశంలో పదేళ్ల గడువు లభించినట్లు తెలియజేసింది. 2022 మే నెలలో ఐపీవో ద్వారా ప్రభుత్వం ఎల్ఐసీలో 3.5 శాతం వాటా(22.13 కోట్ల షేర్లు)ను విక్రయించింది. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ వాటా 96.5 శాతంగా కొనసాగుతోంది. నిజానికి ఐపీవో తదుపరి నిర్ధారిత గడువులోగా లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్కు 25 శాతం వాటాను కల్పించవలసి ఉంది. అయితే ఆర్థిక వ్యవహారాల శాఖ ఒకేసారి పదేళ్లవరకూ మినహాయింపునిచ్చినట్లు ఎల్ఐసీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. వెరసి 2032 మే వరకూ పబ్లిక్కు 25 శాతం వాటా కల్పించే అంశంలో వెసులుబాటు లభించినట్లు తెలియజేసింది. కాగా.. ఈ ఏడాది(2023) మొదట్లో ప్రభుత్వం బ్యాంకులుసహా లిస్టెడ్ పీఎస్‌యూలు పబ్లిక్కు కనీస వాటా కల్పించే విషయంలో నిబంధనల్లో సవరణలు చేపట్టింది. తద్వారా ప్రైవేటైజేషన్ తదుపరి ప్రభుత్వ రంగ సంస్థలు ఎంపీఎస్‌ను అమలు చేయవలసిన అవసరాన్ని తప్పించింది. తొలుత పీఎస్‌యూలకు మాత్రమే ఇందుకు వీలుండగా.. ప్రభుత్వ వాటా విక్రయం తదుపరి సైతం వర్తించేలా ఈ ఏడాది జనవరిలో నోటిఫై చేసింది. దీంతో ప్రభుత్వ రంగ కంపెనీలలో వాటా కొనుగోలుకి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపేందుకు వీలు చిక్కింది. 2021 జూలైలోనే ప్రభుత్వం అన్ని పీఎస్‌యూలకూ ఎంపీఎస్ వర్తించేలా నోటిఫికేషన్‌ను జారీ చేసిన సంగతి తెలిసిందే. -
2 బిలియన్లు ఇన్వెస్ట్ చేస్తాం, కానీ..
ముంబై: అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత మార్కెట్లో ప్రవేశించడంపై మరింతగా కసరత్తు చేస్తోంది. భారత్‌లో ప్లాంటు ఏర్పాటుపై 2 బిలియన్ డాలర్ల వరకు (సుమారు రూ. 16,600 కోట్లు) ఇన్వెస్ట్ చేయడానికి తాము సుముఖంగానే ఉన్నామని, అయితే ఈ క్రమంలో తమకు రెండేళ్ల పాటు దిగుమతి సుంకాలపరంగా కొంత మినహాయింపునివ్వాలని కేంద్రాన్ని కోరుతోంది. సుంకాల మినహాయింపులకు, పెట్టుబడి పరిమాణానికి లంకె పెడుతూ కేంద్ర ప్రభుత్వానికి టెస్లా ఓ ప్రతిపాదన సమరి్పంచినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం దేశీ మార్కెట్లోకి ప్రవేశించాక రెండేళ్ల పాటు తాము దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలను 15 శాతానికే పరిమితం చేయాలని కంపెనీ ప్రతిపాదించింది. 12,000 వాహనాలకు తక్కువ టారిఫ్ వర్తింపచేస్తే 500 మిలియన డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేస్తామని, అదే 30,000 వాహనాలకు వర్తింపచేస్తే 2 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను పెంచుతామని టెస్లా పేర్కొన్నట్లు సమాచారం. జనవరి నాటికి నిర్ణయం.. ప్రధాని కార్యాలయం మార్గదర్శకత్వంలో టెస్లా ప్రతిపాదనను పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ), భారీ పరిశ్రమల శాఖ, రోడ్డు రవాణా.. జాతీయ రహదారుల శాఖ, ఆర్థిక శాఖ సంయుక్తంగా మదింపు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై వచ్చే ఏడాది జనవరి నాటికి నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నాయి. టెస్లాకు మరీ ఎక్కువ వెసులుబాటు ఇవ్వకుండా అదే సమయంలో గరిష్టంగా 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను దక్కించుకునేలా మధ్యేమార్గంగా పాటించతగిన వ్యూహంపై కసరత్తు జరుగుతోందని వివరించాయి. ఇదే క్రమంలో తక్కువ టారిఫ్‌లతో టెస్లా దిగుమతి చేసుకోవాలనుకుంటున్న వాహనాల సంఖ్యను కుదించడంతో పాటు పలు విధానాలు పరిశీలనలో ఉన్నట్లు పేర్కొన్నాయి. తక్కువ స్థాయి టారిఫ్‌లను, ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా అమ్ముడయ్యే మొత్తం ఎలక్ట్రిక్ వాహనాల్లో (ఈవీ) 10%కి పరిమితం చేయడం, రెండో ఏడాది దీన్ని 20% మేర పెంచడం వీటిలో ఉంది. భారత్‌లో ఈ ఆర్థిక సంవత్సరం 1,00,000 ఈవీలు అమ్ముడవుతాయన్న అంచనాల నేపథ్యంలో తక్కువ టారిఫ్‌లను, అందులో 10%కి, అంటే 10,000 వాహనాలకు పరిమితం చేయొ చ్చని తెలుస్తోంది. దేశీయంగా గత ఆర్థిక సంవత్సరం 50,000 పైచిలుకు ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. మరోవైపు, టెస్లా కూడా భారత్‌లో స్థానికంగా జరిపే కొనుగోళ్లను క్రమంగా పెంచుకునే అవకాశం ఉంది. తొలి రెండేళ్లలో మేడిన్ ఇండియా కార్ల విలువలో 20%, ఆ తర్వాత 4 ఏళ్లలో 40% మేర కొనుగోలు చేసేందుకు కంపెనీ అంగీకరించవచ్చని తెలుస్తోంది. -
ఆ ఒక్క రకం ఉల్లిపాయకే మినహాయింపు!
దేశంలో ఉల్లిపాయల లభ్యతను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం అన్ని రకాల ఉల్లిపాయల ఎగుమతులపై సుంకం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎగుమతుల సుంకం (export duty) నుంచి 'బెంగళూరు రోజ్' (Bangalore Rose) రకం ఉల్లికి కేంద్ర ప్రభుత్వం తాజాగా మినహాయింపునిచ్చింది. కొన్ని షరతులకు లోబడి 'బెంగళూరు రోజ్' ఉల్లికి ఎగుమతి సుంకం నుంచి మినహాయింపును మంజూరు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎగుమతిదారు ఎగుమతి చేయాల్సిన బెంగళూరు రోజ్ రకం ఉల్లి ఉత్పత్తులు, పరిమాణాన్ని ధ్రువీకరిస్తూ రాష్ట్ర ఉద్యాన కమిషనర్ నుంచి ఒక ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఉల్లి ధరలు భారీగా పెరిగిపోతూ ఉండడంతో వాటిని అదుపు చేయడానికి, దేశీయంగా లభ్యతను పెంచడానికి గత ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఉల్లిపాయలపై 40 శాతం ఎగమతి సుంకాన్ని విధించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉల్లి రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'బెంగళూరు రోజ్' రకం ఉల్లికి మాత్రం ఎగుమతి సుంకం మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. -
చివరి నెల వేతనం హుళక్కే!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో అందించే బెనిఫిట్స్ పూర్తిగా ఇవ్వకుండా ఆర్టీసీ కోత పెడుతోంది. గతేడాది సెప్టెంబరు వరకు పద్ధతిగానే చెల్లింపులు జరిగినా, ఆ తర్వాత నుంచి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వకుండా ఎగ్గొడుతోంది. దీంతో గత సెప్టెంబరు తర్వాత పదవీ విరమణ పొందిన వారంతా వాటి కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయబోతున్న నేపథ్యంలో, బకాయిలను చెల్లించిన తర్వాతే విలీనం చేయాలని వారంటున్నారు. లేకపోతే తాము నష్టపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఆ నాలుగింటిలో కోత.. ఆర్టీసీ ఉద్యోగులు పదవీ విరమణ పొందిన వెంటనే, సంస్థ నుంచి వారికి రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ అప్పటికప్పుడు చెల్లించే ఆనవాయితీ ఉండేది. కొన్నేళ్లుగా ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉండటంతో ఈ చెల్లింపుల్లో జాప్యం జరుగుతూ వచ్చింది. ఏడాదిగా కొన్నింటిని నిలిపేసి మిగతావి చెల్లించే విచిత్ర పద్ధతి ప్రారంభమైంది. పీఎఫ్, ఎస్ఆర్బీఎస్, ఎస్బీటీ, గ్రాట్యూటీ లాంటి వాటిని చెల్లి స్తున్నా... నాలుగింటి విషయంలో కోత తప్పటం లేదు. వేతన సవరణ బాండ్లు: 2013లో ఆర్టీసీ వేతన సవరణ జరగాల్సి ఉండగా, రాష్ట్రం విడిపోయాక దాన్ని 2015లో అమలు చేశారు. ఆ సమయంలో బకాయిలను సగం నగదు రూపంలో, మిగతా సగం బాండ్ల రూపంలో చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆ బాండ్ల రూపంలో చెల్లించే మొత్తాన్ని పదవీ విరమణ సమయంలో ముట్టచెబుతూ వస్తున్నారు. గతేడాది సెప్టెంబరు నుంచి వీటిని చెల్లించడం లేదు. లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్: గరిష్టంగా 300 వరకు ఆర్జిత సెలవుల మొత్తాన్ని పదవీ విరమణ సమయంలో చెల్లించటం ఆనవాయితీ. డ్రైవర్, కండక్లర్లకు రూ.4–5 లక్షల వరకు, అధికారులకైతే వారి స్థాయినిబట్టి రూ.10–15 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని కూడా ఏడాదిగా చెల్లించకుండా పెండింగులో పెట్టారు. చివరి నెల వేతనం: పదవీ విరమణ పొందిన నెలకు సంబంధించిన వేతనాన్ని కాస్త ఆలస్యంగా అందిస్తారు. ఏ రూపంలోనైనా సంస్థకు అతను చెల్లించాల్సిన మొత్తం ఏమైనా ఉంటే అందులో నుంచి మినహాయించి మిగతాది ఇస్తారు. ఈ లెక్కలు చూసేందుకు నాలుగైదు రోజుల సమయం తీసుకుని, రిటైరైన వారంలోపు చెల్లించేవారు. ఇప్పుడు దాన్నీ ఆపేశారు. కరువు భత్యం బకాయిలు: కొన్నేళ్లుగా డీఏలు సకాలంలో చెల్లించటం లేదు. దాదాపు 8 డీఏలు పేరుకుపోయాయి. వాటిని గత కొన్ని నెలల్లో క్లియర్ చేశారు. ఆ డీఏ చెల్లించాల్సిన కాలానికి ఉద్యోగి సర్వీసులోనే ఉన్నా, ఆలస్యంగా దాన్ని చెల్లించే నాటికి కొందరు రిటైర్ అవుతున్నారు. ఇలా ఆలస్యంగా చెల్లిస్తున్న వాటిని... సర్వీసులో ఉన్న వారికి మాత్రమే ఇస్తున్నారు, కానీ రిటైరైన వారికి ఇవ్వడం లేదు. ఇక సీసీఎస్ మాటేమిటి? ఆర్టీసీ ఉద్యోగుల సహకార పరపతి సంఘం (సీసీఎస్) నిధులను ఆర్టీసీ వాడేసుకుని వడ్డీతో కలిపి రూ.వేయి కోట్లు బకాయి పడింది. కార్మికుల వేతనం నుంచి ప్రతినెలా నిర్ధారిత మొత్తం కోత పెట్టి సీసీఎస్‌లో జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ మొత్తాన్ని రిటైరైన వెంటనే చెల్లించాలి. కార్మికులు వాటిని డిపాజిట్లుగా సీసీఎస్‌లో అలాగే ఉంచితే దానిపై వడ్డీ చెల్లించాలి. ఇదంతా సీసీఎస్ పాలక మండలి చూస్తుంది. కానీ, ఆ నిధులు ఆర్టీసీ వాడేసుకుని ఖాళీ చేయటంతో రిటైరైన వారికి చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. సర్వీసులో ఉన్న వారు వారి అవసరాలకు తీసుకుందామన్నా ఇవ్వటం లేదు. ఇది పదవీ విరమణ పొందిన వారితోపాటు సర్వీసులో ఉన్న వారికీ సంబంధించిన సమస్య. -
'ట్రయల్స్ నెగ్గింది కూర్చోవడానికి కాదు.. సుప్రీంకు వెళతాం'
న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్‌లకు సెలక్షన్స్నుంచి మినహాయింపునిస్తూ నేరుగా ఆసియా క్రీడలకు ఎంపిక చేయడంపై నమోదైన రిట్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ తీర్పునిచ్చారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని గంటలకే సెలక్షన్ ట్రయల్స్‌లో అంతిమ్ పంఘాల్ గెలిచింది. శనివారం నిర్వహించిన 53 కేజీల సెలక్షన్ ట్రయల్స్‌లో ఆమె విజేతగా నిలిచింది. అయితే ఇదే కేటగిరీలో వినేశ్‌ను ఇప్పటికే ఎంపిక చేయడంతో అంతిమ్ స్టాండ్‌బైగా మాత్రమే ఉండే అవకాశం ఉంది. కానీ తాను స్టాండ్‌బైగా కూర్చునేందుకు సిద్ధంగా లేనని ఆమె ప్రకటించింది. హైకోర్టులో ప్రతికూలంగా వచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో పోరాడతానని 19 ఏళ్ల పంఘాల్ తెలిపింది. ‘కష్టపడి ట్రయల్స్ నెగ్గిన నేను ఎందుకు స్టాండ్‌బైగా ఉండాలి. దర్జాగా మినహాయింపు పొందినవారే కూర్చోవాలి’ అని వినేశ్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది. బజరంగ్, వినేశ్‌లను రెజ్లింగ్ సమాఖ్య అడ్హాక్ కమిటీ ట్రయల్స్ లేకుండానే ఆసియా క్రీడలకు ఎంపిక చేసింది. దీనిని సవాల్ చేస్తూ యువ రెజ్లర్లు అంతిమ్ పంఘాల్, సుజీత్ కల్కాల్ ఈ నెల 19న కోర్టును ఆశ్రయించారు. EXCLUSIVE 🎥 "I will appeal to Supreme Court." said Antim Panghal After Vinesh Phogat, Bajrang Punia's Asian Games Trials Exemption Allowed By Delhi High Court. #AntimPanghal #wrestling #AsianGames2023 #AsianGames pic.twitter.com/v2XuiyVCAZ — nnis (@nnis_sports) July 22, 2023 చదవండి: #koreaOpen: సాత్విక్-చిరాగ్ జోడి సంచలనం.. కొరియా ఓపెన్ కైవసం -
విరాళం రూ.2 లక్షలకు మించితే తెలియజేయాలి..
న్యూఢిల్లీ: సామాజిక సేవా సంస్థలు వెల్లడించాల్సిన వివరాల నిబంధనలను ఆదాయపన్ను శాఖ సవరించింది. ఈ మార్పులు అక్టోబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఇక మీదట చారిటబుల్ సంస్థలు తమ కార్యకలాపాలు ధార్మికమైనవా లేదా మతపరమైనవా లేక మతపరమైన సేవా కార్యక్రమాల కిందకు వస్తాయా? అన్నది వెల్లడించాల్సి ఉంటుంది. ఒకరోజులో రూ.2 లక్షలకు మించి ఎవరైనా విరాళం ఇస్తే ఆ వివరాలను ఆదాయపన్ను శాఖకు తెలియజేయాలి. చెల్లించిన వ్యక్తి, చిరునామా, పాన్ నంబర్ ఇవ్వాలి. ఆదాయపన్ను చట్టంలో ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. స్వచ్ఛంద సంస్థలు, మతపరమైన ట్రస్టులు, వైద్య, విద్యా సంస్థల ఆదాయంపై పన్ను మినహాయింపు ఉంటుంది. అయితే ఈ సంస్థలు ఐటీ శాఖ నుంచి రిజిస్ట్రేషన్ పొందవలసి ఉంటుంది. -
Defamation Case: రాహుల్‌కి పరువు నష్టం కేసులో ఉపశమనం!
ఓ పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి మహారాష్ట్రలోని భివండీ కోర్టు ఉపశమనం కల్పించింది. ఈ మేరకు భివండీ కోర్టు రాహుల్‌కి విచారణకు హాజరుకాకుండా ఉండేలా శాశ్వత మినహాయింపు ఇచ్చింది. రాహుల్ తరుఫు న్యాయవాది దాఖలు చేసిన దరఖాస్తును పరిశీలించిన కోర్టు ఆయన శాశ్వత మినహాయింపుకు అర్హుడని పేర్కొంది. అంతేగాదు పరువు నష్టం కేసులో సాక్ష్యాధారాలను నమోదు చేయడానికి ఈ కేసును జూన్ 3కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మహాత్మ గాంధీ హత్యను ఆర్ఎస్ఎస్కి ముడిపెడుతూ.. రాహుల్ పలు ఆరోపణలు చేశారు. దీంతో థానే జిల్లాలోని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆ వ్యాఖ్యలు తమ ప్రతిష్టను కించపరిచేలా ఉందని పేర్కొంటూ.. రాహుల్‌పై రాజేష్ కుంతే అనే ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త 2014లో భివండీ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయమై 2018 జూన్‌లో రాహుల్ కోర్టు ముందు హాజరయ్యారు కూడా. తాను ఢిల్లీ వాసినని, లోక్‌సభ సభ్యుడిగా తన నియోజకవర్గంలో పర్యటనలు చేయాల్సి ఉంటుందన పేర్కొంటూ కోర్టులో హాజరు నుంచి మినహాయింపు కోరారు. అలాగే అవసరమైనప్పుడూ విచారణలో బదులుగా తన తరుఫున న్యాయవాదిని అనుమతించాలని కోరారు. ఈ క్రమంలోనే భివాండీ కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిందితుడు(రాహుల్ గాంధీ)కి కోర్టులో హజరు నుంచి మినహాయింపు ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. విచారణ తేదీల్లో రాహుల్ తరుఫు న్యాయవాది క్రమం తప్పకుండా హాజరు కావాలని, కోర్టు ఆదేశించినప్పుడూ నిందితుడు(రాహుల్) కూడా హాజరు కావాలని షరతులు విధించింది. కాగా, ఇటీవలే సూరత్ కోర్టులో 2019లో నమోదైన పరువు నష్టం కేసులో రాహుల్‌ని దోషిగా నిర్ధారిస్తూ..రెండేళ్లు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటుకి గురయ్యారు. (చదవండి: కర్ణాటక ఎన్నికలు: ఏం మాట్లాడతారో?.. రాహుల్ గాంధీ కోలార్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి) -
సీబీఎస్ఈకి ఆదాయ పన్ను మినహాయింపు
న్యూఢిల్లీ: పరీక్ష ఫీజులు, పాఠ్యపుస్తకాల విక్రయాలు మొదలైన వాటి ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)కి ఆర్థిక శాఖ మినహాయింపునిచ్చింది. 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరం వరకు ఇది వర్తిస్తుందని తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఈ మేరకు ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్ష ఫీజులు, అఫిలియేషన్ ఫీజులు, పాఠ్యపుస్తకాలు.. ప్రచురణల విక్రయం, రిజిస్ట్రేషన్ ఫీజు, స్పోర్ట్స్ ఫీజు, శిక్షణ ఫీజులు మొదలైన ఆదాయాలు ఈ పరిధిలోకి వస్తాయి. ఆయా ఆర్థిక సంవత్సరాల్లో సీబీఎస్ఈ ఎలాంటి వ్యాపార కార్యకలాపాల్లో పాలుపంచుకోకుండా ఉంటేనే ఈ పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. 2020 జూన్ 1 నుంచి పరిమిత కాలం పాటు మాత్రమే ప్రస్తుత నోటిఫికేషన్లో ప్రస్తావించినందున అంతక్రితం సంవత్సరాలకు కూడా దీన్ని వర్తింపచేసేలా, అప్పటికే కట్టిన ట్యాక్స్‌ల రీఫండ్లను క్లెయిమ్ చేసుకునేందుకు ప్రత్యేక అనుమతి కోసం సీబీడీటీకి సీబీఎస్ఈ దరఖాస్తు చేసుకోవాల్సి రావచ్చని ఏఎంఆర్‌జీ అండ్ అసోసియేట్స్ జాయింట్ పార్ట్నర్ ఓమ్ రాజ్‌పురోహిత్ తెలిపారు. -
49th GST Council Meeting: జీఎస్టీ ఫైలింగ్ ఆలస్య రుసుము తగ్గింపు
న్యూఢిల్లీ: జీఎస్టీ వార్షిక రిటర్నుల ఫైలింగ్ ఆలస్య రుసుమును హేతుబద్ధీకరిస్తూ జీఎస్టీ మండలి 49వ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరానికిగాను నమోదిత వ్యక్తులు ఫామ్ జీఎస్టీఆర్–9కు సంబంధించి రూ.5 కోట్ల వరకు టర్నోవర్ ఉంటే ఆలస్య రుసుము రోజుకు రూ.50, రూ.5–20 కోట్ల టర్నోవర్ ఉంటే రోజుకు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ రుసుము రూ.200 ఉంది. పన్ను చెల్లింపుదార్లకు ఉపశమనం కలిగించడానికి ఫామ్ జీఎస్టీఆర్–4, ఫామ్ జీఎస్టీఆర్–9, ఫామ్ జీఎస్టీఆర్–10లో పెండింగ్‌లో ఉన్న రిటర్నులకు సంబంధించి షరతులతో కూడిన మినహాయింపు లేదా ఆలస్య రుసుము తగ్గించడం ద్వారా క్షమాభిక్ష పథకాలను జీఎస్టీ మండలి సిఫార్సు చేసింది. రాష్ట్రాలకు పరిహార బకాయిలు.. 2022 జూన్‌కు సంబంధించి రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహార బకాయిలు రూ.16,982 కోట్లు, అలాగే ఆరు రాష్ట్రాలకు మరో రూ.16,524 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రకటించారు. కేంద్రం తన సొంత వనరుల నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకుందని, భవిష్యత్తులో పరిహార రుసుము వసూళ్ల నుంచి ఈ మొత్తాన్ని తిరిగి పొందుతామని ఆమె చెప్పారు. దీంతో జీఎస్టీ చట్టం 2017 ప్రకారం ఐదేళ్ల కాలానికి తాత్కాలికంగా అనుమతించదగిన మొత్తం పరిహార బకాయిలను కేంద్రం క్లియర్ చేస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన వెల్లడించింది. రాష్ట్రాలు వారి అకౌంటెంట్ జనరల్ నుంచి సర్టిఫికేట్లను ఇచ్చినప్పుడు పెండింగ్‌లో ఉన్న ఏవైనా పరిహార రుసుము మొత్తాలను వెంటనే క్లియర్ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. పరిహార బకాయి కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.689 కోట్లు, తెలంగాణకు రూ.548 కోట్లు సమకూరనున్నాయి. బెల్లం పానకంపై తగ్గింపు.. ఇక విడిగా విక్రయించే బెల్లం పానకంపై ప్రస్తుతం 18 శాతం ఉన్న జీఎస్టీ ఎత్తివేస్తూ మండలి నిర్ణయం తీసుకుంది. ప్యాక్, లేబులింగ్ చేసి బెల్లం పానకం విక్రయిస్తే 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. పెన్సిల్ షార్ప్నర్స్కు 18 శాతం నుంచి జీఎస్టీని 12 శాతానికి చేర్చారు. పన్ను ఎగవేతలను ఆరికట్టడంతోపాటు పాన్ మసాలా, గుట్కా, నమిలే పొగాకు వంటి వస్తువుల నుండి ఆదాయ సేకరణను మెరుగుపరచడానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన సిఫార్సులను జీఎస్టీ మండలి ఆమోదించింది. -
తెలంగాణ: పోలీస్ ఉద్యోగాల్లో గర్భిణీలకు శుభవార్త
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల్లో గర్భీణులకు శుభవార్త తెలిపింది రిక్రూట్మెంట్ బోర్డు. గర్బీణిలకు ఈవెంట్స్ మినహాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. బదులుగా గర్భీణీలకు నేరుగా మెయిన్స్ రాసేలా వెసులుబాటు కల్పించింది బోర్డు. అయితే.. మెయిన్స్ పాసైతే నెలరోజుల్లో ఈవెంట్స్‌లో పాల్గొనాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. -
పాలిస్టర్ జాతీయ జెండా అమ్మకాలపై జీఎస్టీ మినహాయింపు
న్యూఢిల్లీ: పాలిస్టర్ లేదా యంత్రంపై తయారైన భారత జాతీయ జెండా అమ్మకంపైనా ఇకపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మినహాయింపు లభించనుంది. ఆర్థికశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. చేతితో నేసిన లేదా అల్లిన పత్తి, పట్టు, ఉన్ని లేదా ఖాదీ జాతీయ జెండాలు ఇప్పటికే జీఎస్టీ నుండి మినహాయింపు పొందుతున్నాయి. అయితే పాలిస్టర్, యంత్రంపై తయారైన జాతీయ పతాకాన్నీ జీఎస్టీ నుంచి తాజాగా మినహాయిస్తున్నట్లు తెలిపింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కింద నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమం నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి తాజా వివరణ వెలువడింది. -
కరోనా పాజిటివ్ వచ్చినందుకే జకోవిచ్‌ను..
మెల్బోర్న్: కరోనా వ్యాక్సిన్ తీసుకోకున్నా... ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌కు ప్రత్యేక మినహాయింపు ఎందుకు ఇచ్చారనే కారణాన్ని ఫెడరల్ సర్క్యూట్ కోర్టుకు అతని తరఫు లాయర్లు వివరించారు. గత నెల డిసెంబర్ 16వ తేదీన జొకోవిచ్‌కు నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చిందని... ఆ సమయంలో అతనికి ఎలాంటి జ్వరంగానీ, శ్వాస సంబంధిత ఇబ్బందులుగానీ లేవని సెర్బియా స్టార్ తరఫు లాయర్లు శనివారం కోర్టుకు సమర్పించిన పత్రాలలో వివరించారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ నిబంధనల ప్రకారం ...గత ఆరు నెలల కాలంలో కరోనా బారిన పడి కోలుకున్న వారికి వ్యాక్సిన్ తీసుకోకున్నా... ప్రత్యేక మినహాయింపు ద్వారా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడేందుకు అవకాశం ఇస్తారు. జొకోవిచ్‌కు డిసెంబర్ 16న కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసినా... అదే రోజు, ఆ మరుసటి రోజు బెల్గ్రేడ్లో జరిగిన కొన్ని కార్యక్రమాల్లో అతను పాల్గొనడం గమనార్హం. 17వ తేదీన తన ముఖచిత్రంతో ముద్రించిన తపాళా బిళ్లను స్వయంగా జొకోవిచ్ విడుదల చేశాడు. 16వ తేదీన నొవాక్ జొకోవిచ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఒక సెమినార్‌లోనూ ఈ సెర్బియా స్టార్ పాల్గొన్నాడు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను జొకోవిచ్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ కూడా చేశాడు. ఈనెల 17న మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు 5వ తేదీన మెల్బోర్న్ వచ్చిన జొకోవిచ్ వద్ద అవసరమైన పత్రాలు లేవని ఆరోపిస్తూ ఆస్ట్రేలియా బోర్డర్ ఆఫీసర్లు అతడిని అడ్డుకున్నారు. అతనికి జారీ చేసిన వీసాను రద్దు చేశారు. బోర్డర్ ఆఫీసర్ల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జొకోవిచ్ కోర్టుకెక్కాడు. సోమవారం జొకోవిచ్ కేసు విచారణకు రానుంది. -
75 ఏళ్లు దాటినవారికి ఐటీ రిటర్నుల మినహాయింపు
న్యూఢిల్లీ: వచ్చే ఆరి్థక సంవత్సరం నుంచి 75 ఏళ్లు నిండిన వృద్ధులు ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన పనిలేదు. ఇందుకు సంబంధించి ఐటీ రిటర్నుల మినహాయింపు డిక్లరేషన్ ఫారమ్ ‘12బీబీఏ’ (వెల్లడి పత్రాలు)ను ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫై చేసింది. 2021–22 ఆరి్థక సంవత్సరానికి (అసెస్మెంట్ సంవత్సరం 2022–23) సంబంధించి ఐటీ రిటర్నుల మినహాయింపులను పొందే వృద్ధులు ఈ డిక్లరేషన్ పత్రాన్ని బ్యాంకులకు సమరి్పంచాలి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021–22 బడ్జెట్లో చేసిన ప్రకటనకు అనుగుణంగా తాజా నిర్ణయం వెలువడింది. -
అప్పడాలపై జీఎస్టీ !.. ట్విట్టర్లో రచ్చ రచ్చ
అప్పడాలపై జీఎస్టీ ఉందా? ఉంటే ఏ రకమైన అప్పడాలపై జీఎస్టీ ఉంది ? వేటికి మినహాయింపు ఉందనే అంశంపై సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన చర్చ జరుగుతోంది. చివరకు కేంద్రమే ఈ చర్చలో జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పాపడ్‌పై జీఎస్టీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆర్పీజీ ఇండస్ట్రీస్ చైర్మన్ హర్ష్ గోయెంకా ఇటీవల ట్విట్టర్లో ఓ పోస్ట్ చేశారు. అందులో గుండ్రంగా ఉన్న పాపాడ్ (అప్పడం), చతురస్రాకారంలో ఉన్న అప్పడాల ఫోటోలను షేర్ చేశారు. ఇందులో గుండ్రటి అప్పడాలకు జీఎస్టీ మినహాయింపు ఉందని, చతురస్రాకారపు అప్పడాలకు జీఎస్టీ విధిస్తున్నారు ? ఇందులో లాజిక ఏముంది ? ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్ ఈ సందేహానికి బదులివ్వాలంటూ అడిగారు. Did you know that a round papad is exempt from GST and a square papad attracts GST ? Can anyone suggest a good chartered accountant who can make me understand the logic? pic.twitter.com/tlu159AdIJ — Harsh Goenka (@hvgoenka) August 31, 2021 చర్చకు దారి తీసిన ట్వీట్ హర్ష్‌గోయెంకా ట్వీట్‌పై పెద్ద ఎత్తన నెటిజన్లు స్పందించారు. గుండ్రటి అప్పడాలు చేతితో చేస్తారు కాబట్టి వీటికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఉందని, చుతరస్రాకారపు అప్పడాలు మెషిన్ చేస్తారు కాబట్టి వాటికి జీఎస్టీ విధిస్తారంటూ చాలా మంది తమ అభిప్రాయం చెప్పారు. మరికొందరు చేతితో చేసే రౌండ్ షేప్ అప్పడాలు కుటీర పరిశ్రమ పరిధిలోకి వస్తాయని, స్క్వేర్ షేప్ అప్పడాలు భారీ పరిశ్రమ విభాగంలోకి వస్తాయంటూ స్పందించారు. ప్రభుత్వంపై విమర్శలు ఇక జీఎస్టీ చట్టం, అందులోని నిబంధనల జోలికి పోకుండా చాలా మంది నెటిజన్లు కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. అప్పడాలు రెండు ఒకటై అయినా రౌండ్ వాటికి మినహాయింపు ఇచ్చి, స్క్వేర్ షేప్ వాటికి పన్ను వేయడం పనికి మాలిన నిర్ణయమంటూ దుమ్మెత్తిపోయడం మొదలెట్టారు. ట్వీట్ పోస్ట్ చేసి 24 గంటల గడవక ముందే వేలాది మంది దీనిపై స్పందించడం, ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించారు. Papad, by whatever name known, is exempt from GST vide Entry No. 96 of GST notification No.2/2017-CT(R). This entry does not distinguish based on the shape of papad. This notification is available at https://t.co/ckIfjzg8hw https://t.co/19GbQJvYZe — CBIC (@cbic_india) August 31, 2021 జీఎస్టీ మినహాయింపు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు పెరిగిపోవడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ విభాగం స్పందించింది. పాపాడ్ (అప్పడం) ఎలాంటిదైనా సరే దానిపై ఎటువంటి జీఎస్టీ విధించడం లేదని ప్రకటించింది. పాపాడ్లను జీఎస్టీ నుంచి మినహాయించినట్టు పేర్కొంది. ఈ మేరకు హర్ష్ గోయెంకా ట్వీట్‌ని రీ ట్వీట్ చేస్తూ బదులిచ్చింది. ఆల్కహాల్, పెట్రోలు ఉత్పత్తులు తప్ప దాదాపు అన్ని రకాల ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలో ఉన్నాయి. చదవండి : సామాన్యుడికి షాక్.. మళ్లీ పెరిగిన గ్యాస్ ధర.. ఏడాదిలో ఐదోసారి -
ఆక్సిజన్, టీకాల దిగుమతికి ఊపు
సాక్షి, న్యూఢిల్లీ: మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, ఆక్సిజన్ సంబంధిత 15 పరికరాలపై దిగుమతి సుంకాన్ని మూడు నెలలపాటు కేంద్ర ప్రభుత్వం మినహాయించింది. వీటిపై హెల్త్ సెస్‌ను కూడా తొలగించింది. ఈ మినహాయింపు వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. అంతేకాకుండా కోవిడ్–19 టీకాల దిగుమతిపైనా మూడు నెలలపాటు దిగుమతి సుంకాన్ని మినహాయించింది. దేశంలో ఆక్సిజన్ లభ్యతను పెంచేందుకు తీసుకున్న చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్ సంబంధిత పరికరాలు, టీకాల దిగుమతిపై సుంకం మినహాయింపులు ఇవ్వాలని నిర్ణయించారు. ఆసుపత్రులు, ఇళ్లలో కరోనా చికిత్సకు మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ సరఫరాతోపాటు రోగుల సంరక్షణకు అవసరమైన పరికరాల సరఫరాను వెంటనే పెంచాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి సూచించారు. ఆక్సిజన్, వైద్య సామగ్రి లభ్యతను పెంచడానికి అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు సమన్వయంతో పని చేయాలన్నారు. కోవిడ్–19 వ్యాక్సిన్లపై.. కోవిడ్ వ్యాక్సిన్ల దిగుమతిపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 3 నెలల కాలానికి మినహాయించాలని నిర్ణయించారు. దీనివల్ల ఆక్సిజన్, వైద్య పరికరాల లభ్యత పెరుగుతుందని, చవకగా లభిస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆయా పరికరాల దిగుమతికి కస్టమ్స్ క్లియరెన్స్‌లో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని రెవెన్యూ శాఖను ప్రధానమంత్రి ఆదేశించారు. ఆయా పరికరాల కస్టమ్స్ క్లియరెన్స్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ కస్టమ్స్ జాయింట్ సెక్రెటరీ గౌరవ్‌ను నోడల్ అధికారిగా ప్రభ్వుత్వం నామినేట్ చేసింది. సాధారణంగా మెడికల్ ఆక్సిజన్‌పై 5 శాతం, వ్యాక్సిన్లపై 10 శాతం దిగుమతి సుంకం విధిస్తారు. దేశంలో కరోనా తాజా పరిస్థితి నేపథ్యంలో ఈ సుంకాల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆక్సిజన్ సంబంధిత పరికరాలపై 5 నుంచి 15 శాతం కస్టమ్స్ డ్యూటీ, 5 శాతం హెల్త్ సెస్ వసూలు చేస్తారు. వీటి నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చేసింది. మినహాయింపు లభించేవి ► మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ ► ఆక్సిజన్ జనరేటర్లు ► ఫ్లో మీటర్, రెగ్యులేటర్, కనెక్టర్లు, ట్యూబుల సహిత ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ► వాక్యూమ్ ప్రెజర్ స్వింగ్ అబ్సార్ప్షన్, ప్రెజర్ స్వింగ్ అబ్సార్ప్షన్ ఆక్సిజన్ ప్లాంట్స్, క్రయోజనిక్ ఆక్సిజన్ ఎయిర్ సెపరేషన్ యూనిట్స్ ► ఆక్సిజన్ కానిస్టర్ ► ఆక్సిజన్ ఫిల్లింగ్ సిస్టమ్స్ ► ఆక్సిజన్ నిల్వ ట్యాంకులు, ఆక్సిజన్ సిలిండర్స్, ట్యాంక్స్, క్రయోజెనిక్ సిలిండర్లు ► ఆక్సిజన్ రవాణా కోసం ఐఎస్వో కంటైనర్లు ► ఆక్సిజన్ రవాణా కోసం క్రయోజెనిక్ రోడ్ రవాణా ట్యాంకులు ► ఆక్సిజన్ ఉత్పత్తి, రవాణా, పంపిణీ లేదా నిల్వ కోసం పరికరాల తయారీకి విడిభాగాలు ► ఆక్సిజన్ ఉత్పత్తి చేయగల ఇతర పరికరాలు ► వెంటిలేటర్లు, కంప్రెషర్లు, విడిభాగాలు ► హై ఫ్లో నాజల్ కాన్యులా డివైజ్ ► నాన్–ఇన్వేసివ్ వెంటిలేషన్‌లో వాడే హెల్మెట్లు ► ఐసీయూ వెంటిలేటర్లకు నాన్–ఇన్వేసివ్ వెంటిలేషన్ ఓరోనాసల్ మాస్క్‌లు ► ఐసీయూ వెంటిలేటర్లకు నాన్–ఇన్వేసివ్ వెంటిలేషన్ నాసల్ మాస్క్‌లు -
పలు వస్తువులు, సేవలకు మినహాయింపు
సాక్షి, అమరావతి: లాక్ డౌన్ నేపథ్యంలో పలు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఇతరత్రా వస్తువుల సరఫరా, సేవలకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఆయా ఉత్పత్తులు, సేవలను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ కార్యదర్శి నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ పలు సిఫార్సులు చేసింది. వాటిని ఆమోదిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, శాంతిభద్రతల అధికారులను ఆదేశించారు. అధికార యంత్రాంగం విధులివీ.. ►సూపర్ మార్కెట్లు, అక్కడి నుండి వ్యాపారులు, చిల్లర వ్యాపారులు, కిరాణా దుకాణాలకు వస్తువులు సరఫరా అయ్యేలా చూడడం. ►ప్రజలకు అవసరమైన వస్తువులను హోం డెలివరీ చేసేలా సూపర్ మార్కెట్లను ప్రోత్సహించడం. ►సేవల బాధ్యతను చూసేందుకు జిల్లా, నగర, పట్టణ, మండల, పంచాయతీ, వార్డు స్థాయి కమిటీలు ఉంటాయి. ఒక్కో బాధ్యుడు ఉంటారు. వీరి పర్యవేక్షణలో వస్తువుల సరఫరా, రవాణా ఉంటుంది. ఎవరెవరు ఏయే బాధ్యతలు నిర్వహిస్తారో ఖరారైంది. ►ప్రతి కిరాణా షాపును విధిగా ఆన్లైన్లో ట్యాగ్ చేసి ఎలా నిర్వహిస్తున్నారో పర్యవేక్షించాలి. రెండు మూడు కిలోమీటర్ల వ్యాసార్థంలో ప్రతి ప్రాంతానికి ఒక స్టోర్ ఉండేలా చూడాలి. ►ఎక్కువ ప్రాంతాల్లో తాత్కాలిక రైతు బజార్లు ఏర్పాటు చేయాలి. సరుకులు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా, ధరలు పెరగకుండా చూడాలి. ►డెయిరీ, పాల కేంద్రాల ద్వారా నిత్యం పాల పాకెట్లు సరఫరా అయ్యేలా చూడాలి. ►శానిటైజర్లు, మాస్క్‌లు మామూలు ధరల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. ►నిత్యావసర వస్తువులు తీసుకువెళ్లే వాహనాలలో ప్రయాణికులను ఎక్కించుకోకూడదు. ►చెక్ పోస్టుల వద్ద ఈ తరహా వాహనాలను గుర్తించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ఏదైనా సమస్య వస్తే 1902కు ఫోన్ చేయొచ్చు. వీటి సరఫరా సవ్యంగా సాగాలి ►తాగునీరు, వాటర్ ట్యాంకర్లు, కూరగాయలు, పండ్లు, పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, పౌల్ట్రీ, మాంసం, చేపలు, కిరాణా సామగ్రి (పచారి సామాన్లు), బ్రెడ్, బిస్కెట్లు, బియ్యం, పప్పులు, ఆయిల్ మిల్లులు. ►ప్రజా పంపిణీ వ్యవస్థలోని రేషన్ దుకాణాలు, అన్ని గోడౌన్ల నుండి ఆహార ధాన్యాల లోడ్, అన్లోడ్.. పశుగ్రాసం, ఆక్వా ఫీడ్, ఇతరత్రా పదార్థాలు. ►బల్క్ డ్రగ్స్, ఫార్మాస్యూటికల్స్, ప్రాణాల్ని కాపాడే మందులు, మాస్క్‌లు, శానిటైజర్లు, వైద్య పరికరాలు, ఆరోగ్య సేవలు, మెడికల్ షాపులు, పశువైద్య సేవలు. ►పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ, సీఎఎన్‌జీ గ్యాస్, ఫర్నేస్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, ఎల్ఎస్, హెచ్ఎస్, ఏవియేషన్ ఫ్యూయల్, ఇథనాల్ తదితరాలు. ►ఇంటర్నెట్, టెలికాం సర్వీసు ప్రొవైడర్లు, మరమ్మతులు, తపాలా కార్యాలయాలు, బ్యాంకులు, ఏటీఎంలు, బీమా సంస్థలు. ►ఆహార ధాన్యాల సేకరణ, నిల్వ, కూరగాయలు, పండ్ల సేకరణ, నిల్వ, పంటల్ని కప్పి ఉంచేందుకు అవసరమైన టార్పాలిన్లు, గోతాలు, పాలిథిన్, డబ్బాలు తదితరాలు. ►అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. తదితర ఇ–కామర్స్ సంస్థలు అందించే సేవలు, ఆహార వస్తువుల సరఫరా. స్విగ్గీ, జొమాటో వంటి సంస్థల ద్వారా ఆహార పదార్థాల పంపిణీ. -
బడ్జెట్లో ఆదాయపన్ను పరిమితి పెంపు రెట్టింపు?
సాక్షి, న్యూఢిల్లీ: మరికొన్ని గంటల్లో కేంద్ర ఆర్థికబడ్జెట్ పార్లమెంటు ముందుకు రానుంది. ఎన్నికల ముందు బీజేపీ సర్కార్ తీసుకొస్తున్న మధ్యంతర బడ్జెట్‌పై వివిధ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా వేతన జీవులకు ఊరట లభించనుందనే మాట వినిపిస్తోంది. రేపు( ఫిబ్రవరి 1)న ప్రకటించనున్న మధ్యంతర బడ్జెట్లో ప్రధాన సంస్కరణలను ప్రకటించకపోయినా, మరింత జనాకర్షితంగా ఉండవచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు.ఆదాయపు పన్ను పరిమితిలో భారీ పెంపు ఉంటుందని భాస్తున్నారు. ఈ మినహాయింపును దాదాపు రెట్టింపు చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం వ్యక్తిగత పన్ను మినహాయింపు రూ.2.5 లక్షలుగా ఉంది. అయితే పరితిమిని రూ. 5లక్షలకు పెంచ వచ్చని అంచనా. ప్రస్తుతం 80 ఏళ్లకు పైబడ్డ వృద్ధులకు మాత్రమే రూ.5 లక్షల మినహాయింపు ఉంది. మరోవైపు రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని రెట్టింపు చేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) ఇప్పటికే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక, సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపును రూ.1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షల మేరకు పెంచాలని సిఐఐ కోరింది. అంచనాలకనుగుణంగా ఈ పరిమితి రెట్టింపు అయితే రిటైల్ పెట్టుబడిదారులను ఉత్సాహపరుస్తుందని మార్కెట్ ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. -
కేరళను మినహాయించండి
న్యూఢిల్లీ: ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో విదేశీ సాయం తీసుకోరాదన్న పాలసీ నుంచి కేరళకు ఒక్కసారి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర మంత్రి అల్ఫోన్స్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) కేరళకు అందించాలనుకున్న రూ.700 కోట్ల సాయానికి కేంద్రం మోకాలడ్డటంపై ఆయన ఈ మేరకు స్పందించారు. ‘గత 50 ఏళ్లలో కేరళ కారణంగా దేశానికి భారీ విదేశీ మారకద్రవ్యం లభించింది. 2017లో మలయాళీలు స్వదేశానికి రూ.75,000 కోట్ల విదేశీ మారకాన్ని పంపారు. దేశంలో అతిపెద్ద పర్యాటక కేంద్రాల్లో కేరళ ఒకటి. ఈ కారణాలరీత్యా కేరళ వరదలను ప్రత్యేక పరిస్థితిగా పరిగణించి, విదేశీ సాయంపై ఒక్కసారి మినహాయింపు ఇవ్వాలని జూనియర్ మంత్రిగా నా సీనియర్లకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని అల్ఫోన్స్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దాదాపు 2 లక్షల కుటుంబాలు పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నాయనీ, వాళ్లకు కనీసం దుస్తులు, ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేదని పేర్కొన్నారు. ఇలాంటివారిని ఆదుకోవడానికి పెద్దమొత్తంలో నగదు అవసరమని వ్యాఖ్యానించారు. కాగా, అంతకుముందు కేరళ ఆర్థికమంత్రి థామస్ ఐజాక్ మాట్లాడుతూ.. తాము రూ.2,200 కోట్లు సాయం కోరితే కేంద్రం మాత్రం రూ.600 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం వ్యవహారశైలి ‘అమ్మ తాను అన్నం పెట్టదు. అడుక్కుని అయినా తిననివ్వదు’ రీతిలో ఉందని ఘాటుగా విమర్శిచారు. మరోవైపు, యూపీఏ హయాంలో జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్న శివశంకర్ మీనన్ మాట్లాడుతూ.. దీర్ఘకాలిక పునరావాస కార్యక్రమాలకు విదేశీ సాయం స్వీకరించడంపై ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. కేవలం సహాయ కార్యక్రమాలకు విదేశీ సాయం తీసుకోకూడదని మాత్రమే 2004లో మన్మోహన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. విదేశీ సాయం స్వీకరించొచ్చు: ఎన్డీఎంఏ అత్యవసర పరిస్థితుల్లో విదేశాలు మానవతా దృక్పథంతో అందించే ఆర్థిక సాయాన్ని కేంద్రం ఆమోదించొచ్చని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) 2016లో రూపొందించిన ఓ పత్రం వెల్లడించింది. కేరళ వరద బాధితులకు యూఏఈ సాయం ప్రకటించడంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో ఈ విషయం వెలుగుచూసింది. జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక(ఎన్డీఎంపీ) పేరిట తెచ్చిన ఆ పత్రంలో ‘ఏదైనా విపత్తు తలెత్తినప్పుడు విదేశీ సాయానికి అర్థించకూడదనేది జాతీయ విధానంలో భాగం. కానీ విదేశాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విపత్తు బాధితులకు అండగా ఉంటామంటే, ఆ సాయాన్ని కేంద్రం ఆమోదించొచ్చు’ అని ఉంది. దానిలో ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌ల సందేశాలు ఉన్నాయి. విదేశీ సాయాన్ని ఎలా వినియోగించుకోవాలో విదేశాంగ శాఖతో కలసి హోం శాఖ నిర్ణయిస్తుందని పత్రం తెలిపింది. ఎన్‌డీఎంపీపై వ్యాఖ్యానించేందుకు హోంశాఖ అధికారులు నిరాకరించారు. -
ఇంటి రుణం.. వడ్డీ మినహాయింపు
ఇంటి రుణాలపై పన్ను మినహాయింపు ఎలా ఉంటుంది? ఏ మేరకు వర్తిస్తుంది? ఎంత పొదుపు చేయొచ్చు? ఇవన్నీ ఈ సారి ట్యాక్స్ కాలమ్‌లో చూద్దాం... సెక్షన్ 80 ఈఈ ప్రకారం రూ.50,000... 1–4–2017 నుంచి అమల్లోకి వచ్చిన నియమాల ప్రకారం ఇంటి రుణం మీద వడ్డీ రూ.50,000 వరకు మినహాయింపు ఉంటుంది. అయితే కొన్ని నిబంధనలకు లోబడి ఈ మినహాయింపు ఉంటుంది. అవి... 1. ఇది వ్యక్తులకు మాత్రమే. 2. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం ఏర్పడ్డ బ్యాంకుల నుంచే రుణం తీసుకోవాలి. 3.ఇంటి రుణం మంజూరు కోసం ఏర్పడిన పబ్లిక్ కంపెనీ అయినా ఫరవాలేదు. 4. ఇంటి నిమిత్తం రుణం తీసుకోవాలి. 5. 1–4–2016 నుంచి 31–3–2017 మధ్య మంజూరై... ఖర్చయిన రుణాలకు మాత్రమే వర్తిస్తుంది. 6.రుణం రూ.35,00,000పైగా ఉండకూడదు. 7. ఇంటి విలువ యాభై లక్షలు దాటకూడదు. 8.రుణం తీసుకున్న రోజు నాటికి వ్యక్తికి సొంతిల్లు ఉండకూడదు. 9. ఈ వడ్డీ మినహాయింపు మరే ఇతర సెక్షన్ ప్రకారం పొందకూడదు. 10. ఇది 1–4–2016 తర్వాత ఇల్లు కట్టుకున్న లేదా కొనుగోలు చేసిన వారికే వర్తిస్తుంది. పట్టణాల్లో ఈ బడ్జెట్ల ఇల్లు లోబడ్జెట్ ఇల్లనే చెప్పాలి. అయితే అంతకు ముందు కొన్న ఇల్లు విషయంలో తీసుకున్న రుణాల విషయంలో సెక్షన్ 24 ప్రకారం ఇచ్చిన వడ్డీ తగ్గింపులు అలాగే ఉన్నాయి. ఒకప్పుడు సెల్ఫ్ ఆక్యుపైడ్ ఇంటి విషయంలో వడ్డీ రూ.2,00,000 దాటి ఇచ్చే వారు కాదు. అలాగే అద్దెకిచ్చిన ఇంటి రుణం విషయంలో వడ్డీ మీద ఎలాంటి ఆంక్షలు లేవు. కానీ సెక్షన్ 71బి కొత్తగా తెచ్చి, కొన్ని ఆంక్షలు పెట్టారు. ఎన్ని ఇళ్ల మీద రుణాలున్నా వడ్డీ మొత్తాన్ని రూ.2,00,000 దాటి సర్దుబాటు చేయరు. సర్దుబాటు కాని వడ్డీ ఆ తర్వాత ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేసి సర్దుబాటు చేస్తారు. ఉదాహరణకు... ఒక వ్యక్తి నికర జీతం రూ.15,00,000 అనుకోండి. సొంత ఇల్లుంది. అప్పు కూడా ఉంది. రుణం మీద వడ్డీ రూ.1,00,000 అనుకోండి. ఇది కాకుండా మరో ఇల్లును రుణం మీద కట్టించాడు. అది అద్దెకిచ్చాడు. అద్దె నెలకు రూ.10,000. రుణం మీద వడ్డీ రూ.3,00,000 అనుకోండి. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్‌ను లెక్కిస్తే.. ఈ కేసులో ఒకప్పుడు రూ.3,18,600 పూర్తిగా సెటాఫ్ చేసేవారు. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మొత్తం నష్టంలో కేవలం రూ.2,00,000 సర్దుబాటు చేస్తారు. మిగిలిన సర్దుబాటు కాని మొత్తాన్ని రూ.1,18,600 తర్వాతి ఆర్థిక సంవత్సరానికి (2018–19) సర్దుబాటు చేస్తారు. ఈ మార్పు వ్యక్తులకు పన్నుభారం పెంచుతుంది. ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని ఇన్కమ్ ట్యాక్స్‌ను లెక్కించండి. -
పాఠశాలల్లో ఆహారానికి జీఎస్టీ మినహాయింపు
న్యూఢిల్లీ: పాఠశాలలే నేరుగా విద్యార్థులకు సరఫరా చేసే ఆహార పదార్థాలు, పానీయాలపై జీఎస్టీ విధించబోమని ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే విద్యా సంస్థల్లోని క్యాంటీన్, మెస్‌లలోని ఆహార పదార్థాలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా జీఎస్టీని 5 శాతమే వర్తింపజేస్తామని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఆర్థిక శాఖ ఒక ప్రకటనను జారీచేసింది. ‘హైయర్ సెకండరీ స్థాయి వరకు పాఠశాలలే నేరుగా ఆహార పదార్థాలను సరఫరా చేస్తే వాటికి జీఎస్టీని మినహాయిస్తాం. విద్యా సంస్థల్లోని మెస్, క్యాంటీన్లలోని ఆహార పదార్థాలపై ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ లేకుండా పన్ను 5 శాతమే ఉంటుంది’అని అందులో పేర్కొంది. -
గిఫ్టులకు జీఎస్టీ మినహాయింపు
న్యూఢిల్లీ: కంపెనీలు తమ ఉద్యోగులకు ఇచ్చే గిఫ్టులకు సంబంధించి రూ. 50,000 దాకా విలువ ఉండే బహుమతులు.. వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పరిధిలోకి రావని కేంద్రం పేర్కొంది. అలాగే కంపెనీలు తమ సిబ్బందికి క్లబ్‌లు, హెల్త్.. ఫిట్నెస్ సెంటర్లలో ఉచిత సభ్యత్వం కల్పించినా.. జీఎస్టీ వర్తించదని స్పష్టం చేసింది. ఉద్యోగరీత్యా కంపెనీకి ఉద్యోగి అందించే సేవలు కూడా వస్తు, సేవల పన్నుల విధానం పరిధిలోకి రావని పేర్కొంది. ఒక ఏడాదిలో కంపెనీ తమ ఉద్యోగులకు రూ. 50,000కు లోబడి ఇచ్చే గిఫ్టులకు జీఎస్టీ నుంచి మినహాయింపునిస్తున్నట్లు ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ’బహుమతి’ని ఉద్యోగి దీన్ని తన హక్కుగా భావించడానికి లేదని స్పష్టం చేసింది. అద్దె ఆదాయం రూ. 20 లక్షలు దాటితే జీఎస్టీ వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ప్రాపర్టీలపై వచ్చే అద్దె ఆదాయం వార్షికంగా రూ. 20 లక్షలు మించితే జీఎస్టీ వర్తిస్తుందని కేంద్ర రెవెన్యూ విభాగం కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. జీఎస్టీ మాస్టర్ క్లాస్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. నివాస గృహాల అద్దె ఆదాయాలకు ప్రస్తుతం వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) నుంచి మినహాయింపు ఉంది. మరోవైపు, 69.32 లక్షల పైచిలుకు రిజిస్టర్డ్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ చెల్లింపుదారులు జీఎస్టీఎన్ పోర్టల్‌కి మళ్లినట్లు జీఎస్టీ నెట్వర్క్ సీఈవో ప్రకాశ్ కుమార్ తెలిపారు. ఇందులో ఇప్పటికే 38.51 లక్షల మంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకున్నట్లు, వారికి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు జూన్ 25 నాటి నుంచి 4.5 లక్షల దాకా కొత్త అసెసీలు జీఎస్టీఎన్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నట్లు కుమార్ చెప్పారు. -
రైల్వే ఈ టికెట్లపై గుడ్‌న్యూస్
న్యూడిల్లీ: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. డీమానిటైజేషన్ తరవాత డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో రైల్వే ఈ టికెట్లపై ఉపసంహరించుకున్న సర్వీసు చార్జ్‌ను గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. ప్రయాణికుల సౌలభ్యంకోసం భారత రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు వరకు బుక్ చేసుకున్న టిక్కెట్లపై సర్వీసు చార్జ్ మినహాయింపు కొనసాగనుందని రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఐఆర్సీటీసీలో రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్నవారికి సర్వీస్ చార్జ్ మినహాయింపు సెప్టెంబర్ 2017వరకు కొనసాగనుంది. తాజా ఆదేశాలప్రకారం సెప్టెంబరు 30 వరకు ఆన్లైన్లో రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి సర్వీస్ ఛార్జ్ ఉండదు. తద్వారా తమకు రూ.500కోట్ల నష్టం వాటిల్లనుందని రైల్వే శాఖ అంచనా వేసింది ఈ మేరకు ఈ నష్టాన్ని తిరిగి చెల్లించాలని కోరుతూ రైల్వే మంత్రిత్వశాఖ ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్టు వెల్లడించింది. పెద్దనోట్ల రద్దు అనంతరం మొదట 2016 నవంబర్ 23 నుంచి సర్వీస్ చార్జ్ మినహాయింపు ప్రకటించింది. ఆ తర్వాత ఈ అవకాశాన్ని ఏడాది మార్చి 31 వరకు కల్పించారు. అనంతరం ఈ గడువును మరో మూడు నెలలపాటు అంటే 2017, జూన్ 30వరకు పొడిగించింది. సాధారణంగా ఐఆర్సీటీసీలో టికెట్ బుక్ చేసుకుంటే రూ. 20 నుంచి రూ. 40 వరకు సర్వీస్ చార్జ్ అయ్యే సంగతి తెలిసినదే. -
పార్టీలకు పన్ను మినహాయింపు
రాజ్యాంగ విరుద్ధం కాదు న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడమనేది పాలనా పరమైన నిర్ణయమని, ఇది రాజ్యాంగ విరుద్ధం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) తోసిపుచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్, న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ బుధవారం ఉత్తర్వులిచ్చింది. సాధారణ పన్ను చెల్లింపుదారులతో పోల్చుకుంటే రాజకీయ పార్టీలకు రాజ్యాంగంలో ఎలాంటి మినహాయింపులు లేవని న్యాయవాది పిల్ దాఖలు చేశారు. సామాన్యులకు లేని మినహాయింపు రాజకీయ పార్టీలకు ఎందుకని ప్రశ్నించారు. -
ట్యూషన్ ఫీజుకు పన్ను మినహాయింపు ఎంత?
నేను బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలున్నారు. ఒక్కొక్కరికి రూ.1,200 చొప్పున రూ.2,400 ట్యూషన్ ఫీజు పన్ను మినహాయింపు (ఒక ఆర్థిక సంవత్సరంలో) లభిస్తోంది. నా సోదరుడు ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు ట్యూషన్ ఫీజులో ఇలాంటి పరిమితులు లేవని చెప్పాడు. ఆదాయపు పన్ను విషయంలో ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు ఈ తేడాలు ఎందుకు? - భాస్కర్, బెంగళూరు ఆదాయపు పన్నుకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఎలాంటి తేడాలు ఉండవు. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, పిల్లల ట్యూషన్ ఫీజు విషయమై రెండు సెక్షన్ల కింద పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. సెక్షన్ 10 కింద ఒక్కో పిల్లవాడికి రూ.1,200 (నెలకు రూ.100) చొప్పున గరిష్టంగా ఇద్దరు పిల్లలకు అంటే రూ.2,400 పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇక సెక్షన్ 80సి కింద ట్యూషన్ ఫీజు కింద రూ.1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే జీవిత బీమా ప్రీమియం, పీపీఎఫ్(పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్) ఈఎల్ఎస్ఎస్(ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్), ఎన్ఎస్సీ(నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్)ల్లో పెట్టుబడులన్నింటికీ కలిపి గరిష్టంగా రూ.లక్షన్నర వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇవేమీ లేకుంటే కేవలం ట్యూషన్ ఫీజుకే రూ. లక్షన్నర వరకూ పన్ను మినహాయింపు పొందవచ్చు. నేను ఇటీవలనే రిటైరయ్యాను. పన్ను ఆదా చేయడం కోసం ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)లో పెట్టుబడులను కొనసాగించవచ్చా? - విద్యా దేవి, విశాఖపట్టణం రిటైరవ్వడం వల్ల ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌ల్లో ఇన్వెస్ట్ చేయకూడదని ఏమీ లేదు. మీ పెట్టుబడులను ఈఎల్ఎస్ఎస్ల్లో నిరంభ్యతరంగా కొనసాగించవచ్చు. ఇతర పన్ను ఆదా స్కీమ్‌లతో పోల్చితే ఈఎల్ఎస్ఎస్ల్లోనే లాక్-ఇన్ పీరియడ్ తక్కువగా(మూడేళ్లు) ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడులు వస్తాయి. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులు పొందవచ్చు. లాక్ ఇన్ పీరియడ్ పూర్తయిన తర్వాత ఎలాంటి పన్నుల బాదరబందీ ఉండదు. నా వయస్సు 43 సంవత్సరాలు. హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ ఫండ్-హైబ్రిడ్ ఈక్విటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నాకు 60 ఏళ్లు రాగానే ఈ హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ ఈక్విటీ ప్లాన్ యూనిట్లను విక్రయిస్తే, నేను ఏమైనా పన్నులు చెల్లించాల్సి ఉంటుందా ? అలా కాకుండా నాకు 58 సంవత్సరాలు వచ్చే వరకూ హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ ఈక్విటీ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసి, ఆ తర్వాత వాటిని హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ డెట్ ఫండ్‌కు బదిలీ చేసి, నాకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ డెట్ ఫండ్ యూనిట్లను విక్రయించిన సందర్భంలో పన్ను బాధ్యత ఎలా ఉంటుంది? - చిన్నారావు, విజయవాడ హెచ్డీఎఫ్సీ రిటైర్మెంట్ ఫండ్-హైబ్రిడ్ ఈక్విటీ ప్లాన్ అనేది ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్. ఇతర ఈక్విటీ ఫండ్లకు వర్తించే పన్ను నియమాలే ఈ ఫండ్‌కు కూడా వర్తిస్తాయి. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి, మీకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ యూనిట్లను విక్రయించాలనుకుంటున్నారు. అంటే మీరు 17 ఏళ్లపాటు ఈ ఫండ్‌లో మీ ఇన్వెస్ట్మెంట్స్ కొనసాగిస్తారు. దీంతో ఈ ఫండ్ ద్వారా పొందే రాబడులను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా వ్యవహరిస్తారు. ప్రస్తుత నియమనిబంధనల ప్రకారం, ఈక్విటీ ఫండ్స్‌లో ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సిన పనిలేదు. మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించి, మీకు 60 ఏళ్లు వచ్చిన తర్వాత ఈ యూనిట్లను ఉపసంహరించుకుంటే మీరు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం రాదు. అయితే మీరు హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ ఈక్విటీ యూనిట్లను మీకు 59 సంవత్సరాల రాకముందే ఉపసంహరించుకుంటే మీరు 1 శాతం ఎగ్జిట్‌లోడ్‌ను చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీరు హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ ఈక్విటీ యూనిట్లను హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ డెట్ ఫండ్‌కు బదిలీ చేసి, 60 ఏళ్ల తర్వాత ఉపసంహరించుకోవాలని భావిస్తే, హెచ్డీఎఫ్సీ హైబ్రిడ్ డెట్ యూనిట్ల విక్రయంపై మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫండ్‌కు 58వ ఏట బదిలీచేసి 60 ఏళ్ల తర్వాత ఉపసంహరించుకోవాలనేది మీ ప్రణాళిక. అయితే డెట్ ఫండ్‌లో మీ ఇన్వెస్ట్మెంట్స్ రెండేళ్ల వరకే ఉంటాయి. మీ డెట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మూడేళ్లలోపే ఉంటాయి కాబట్టి స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ లాభాలను మీ ఆదాయానికి జత చేసి మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి పన్ను విధిస్తారు. మ్యూచువల్ ఫండ్ టర్నోవర్ రేషియో అంటే ఏమిటి? ఒక ఫండ్ విశ్లేషణలో ఈ టర్నోవర్ రేషియో ఎంతవరకు ఉపయోగపడుతుంది? - సరళ, హైదరాబాద్ ఒక మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఆ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోలోని షేర్లను ఎంత తరచుగా మార్చాడనేది మ్యూచువల్ ఫండ్ టర్నోవర్ రేషియో ద్వారా తెలుస్తుంది. టర్నోవర్ రేషియో అధికంగా ఉంటే, మీ ఫండ్ మేనేజర్ ఫండ్ పోర్ట్‌ఫోలియో షేర్లను అధికంగా మార్చాడని అర్థం. ఉదాహరణకు ఒక ఫండ్ టర్నోవర్ రేషియో రేట్ వంద శాతంగా ఉందనుకోండి. అంటే ఫండ్ పోర్ట్‌ఫోలియో షేర్లను ఫండ్ మేనేజర్ పూర్తిగా మార్చివేశాడని అర్థం. ఫండ్ నిర్వహణ తీరు ఎలా ఉందనేది టర్నోవర్ రేషియో సూచిస్తుంది. తక్షణం లభించే అవకాశాలు, త్వరిత లాభాల కోసం ఫండ్ పోర్ట్‌ఫోలియోలో షేర్లను తరచుగా మారిస్తే టర్నోవర్ రేషియో అధికంగా ఉంటుంది. మరోవైపు షేర్లను కొనుగోలు చేసి, అలాగే హోల్డ్ చేస్తే టర్నోవర్ రేషియో తక్కువగా ఉంటుంది. టర్నోవర్ రేషియో అధికంగా ఉందంటే, లావాదేవీలు అధికంగా జరిగాయని అర్థం, దీంతో సహజంగానే లావాదేవీల వ్యయాలు పెరుగుతాయి. ఫండ్ వ్యయాల పేరుతో ఈ భారం ఇన్వెస్టర్లపైననే పడుతుంది. భారీగా లాభాలు వస్తేనే ఈ వ్యయాలకు అర్థం ఉంటుంది. అలారాని పక్షంలో ఫండ్ల పనితీరు ప్రభావితమవుతుంది. -
'హెల్మెట్ నిబంధనపై మినహాయింపు ఇవ్వండి'
హైదరాబాద్ : ద్విచక్ర వాహనచోదకులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలనే నిబంధన నుంచి సిక్కులకు మినహాయింపు ఇవ్వాలంటూ సిక్కు అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్.. ట్రాఫిక్ చీఫ్ జితేందర్‌ను కోరింది. శుక్రవారం ట్రాఫిక్ కమిషనరేట్‌లో ఆయన్ను కలిసిన అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రతినిధులు ఎస్.జస్పాల్ సింగ్, కొండారెడ్డి, తిరుపతి వర్మ, చింతల కృష్ణ, హర్మేంద్ర సింగ్, గుర్నమ్ సింగ్ ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 129 ప్రకారం సిక్కులకు హెల్మెట్ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉందంటూ జితేందర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన ఆదేశాలు ఇవ్వడం ద్వారా అమలయ్యేలా చూడాలని కోరారు. -
నిబంధనలనుంచి మినహాయింపు కోరిన 'యాపిల్'
అమెరికాకు చెందిన ఐఫోన్, ఐ ప్యాడ్ తయారీ సంస్థ యాపిల్ విడిభాగాల సమీరకణ నిబంధనలపై మరోసారి మినహాయింపును కోరింది. ఈ నేపథ్యంలో యాపిల్.. పారిశ్రామిక విధాన ప్రోత్సాహక మండలి (డిప్) కు ఓ ప్రదర్శన ఇచ్చింది. దేశంలోని దుకాణాలతోపాటు, ఆన్ లైన్ విక్రయాలకు అనుమతి కోరిన సంస్థ.. డీఐపీపీకి వివరణ ఇచ్చింది. భారత్ లో వస్తువులను విక్రయించాలంటే 30 శాతం విడి భాగాలను దేశీయంగా సమీకరించాలన్న నిబంధన నుంచి యాపిల్ సంస్థ మినహాయింపు కోరుతూ మరోసారి వివరణ ఇచ్చింది. అమెరికా ఆధారిత సంస్థ దేశంలో సింగిల్ బ్రాండ్ రిటైల్ దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వంనుంచి ఆమోదం కోరింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డీ ఐ) నిబంధనల ప్రకారం అత్యున్నత సాంకేతికత ఇమిడి ఉండే సింగిల్ బ్రాండ్ ఉత్పత్తులకు నిబంధనలు తప్పనిసరి చేసే అవకాశం లేకపోవడంతో యాపిల్ కు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డిప్ త్వరలోనే యాపిల్ సంస్థ ధరఖాస్తును స్వీకరించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. దీనిపై సమీక్షించేందుకు ప్రభుత్వం ఓ ప్రత్యేక కమిటీని కూడ ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి డీఐపిపి శాఖ కార్యదర్శి రమేష్ అభిషేక్ నేతృత్వం వహిస్తారు. ప్రస్తుతం సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగంలో ఎఫ్‌డీఐ అనుమతి 100 శాతం ఉంది. కానీ కంపెనీలు 49 శాతం మించి ఉన్నపుడు ఎఫ్ ఐపిబి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే యాపిల్ కంపెనీ తన ఉత్పత్తులను తమ స్వంత రిటైల్ దుకాణాల ద్వారా చైనా, జర్మనీ, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల్లో విక్రయిస్తోంది. అయితే ఇండియాలో మాత్రం యాపిల్ స్వంత దుకాణాలను తెరవలేదు. రెడింగ్టన్, ఇన్ గ్రామ్ మైక్రో వంటి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా విక్రయిస్తోంది. ప్రస్తుతం యాపిల్ తో పాటు చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ గ్జియామీ కూడ భారత్ లో సింగిల్ బ్రాండ్ విక్రయశాలల ప్రారంభానికి అనుమతికోసం ధరఖాస్తు చేసుకుంది. -
రాయితీపై డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని వార్షికాదాయం రూ. 6 లక్షలలోపు ఉన్న ప్రభుత్వ.. ప్రైవేటు ఉద్యోగులకు శుభవార్త. వీరికి రాయితీపై ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సహకారం అందించాల్సిందిగా శుక్రవారం ఢిల్లీ వెళ్లిన మంత్రి కేటీ రామారావు, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కోరారు. దీనికి ఆయన సానుకూల సంకేతాలిచ్చినట్లు మేయర్ రామ్మోహన్ తెలిపారు. ఆయన జీహెచ్ఎంసీలో విలేకరుల తో మాట్లాడుతూ... సంవత్సరాదాయం రూ. 6 లక్షల లోపు ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ఇతరుల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కు గృహ నిర్మాణ పథకం కింద నిధులివ్వాల్సిందిగా కోరామన్నారు. నగరంలో నిర్మిస్తు న్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాలన్నింటితో కలిపి దాదాపు రూ.9 లక్ష లు ఖర్చవుతోంది. వార్షికాదా యం రూ.6 లక్షలలో పు ఉన్న దిగువ మధ్య తరగతి వారికి ఒక్కో ఇంటికి కేం ద్రం రూ.2.50 లక్ష లు ఇస్తే.. జీహెచ్ఎం సీ రూ.2 లక్షలు సా యం చేస్తుందని చెప్పారు. లబ్ధిదారుల వాటాగా రూ. 2 లక్షలు చెల్లిస్తే.. మిగతా వ్యయాన్ని బ్యాంకు రు ణాల ద్వారా అందించే యోచన ఉందన్నారు. దీనికి విధి విధానాలు రూపొందించాల్సి ఉందన్నారు. లబ్ధిదారులకు జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు నగరంలో నిర్మాణం పూర్తయి... ఖాళీగా ఉన్న జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని మేయర్ చెప్పారు. ఈ ఇళ్లలో అక్రమంగా ఉంటున్న వారిని ఖాళీ చేయిస్తామని చెప్పారు. మరుగుదొడ్లు లేనివారు వాటిని నిర్మించుకునేందుకు యూనిట్‌కు రూ.12 వేల వంతున ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. స్మార్ట్‌సిటీ ద్వారా అందే రూ.100 కోట్లు నగరానికి చాలవని... వేరే పథకం ద్వారా పెద్దమొత్తంలో నిధులివ్వాల్సిందిగా మంత్రి కేటీఆర్ కోరారన్నారు. నిర్మాణం పూర్తయిన స్లాటర్ హౌస్‌లను వందరోజుల ప్రణాళికలో భాగంగా వినియోగంలోకి తెస్తామన్నారు. వాటిపై ఉన్న వివాదాలను పరిష్కరించుకుంటామని... స్లాటర్ హౌస్‌లకు సంబంధించి ఢిల్లీలో జరిగిన సదస్సులోనూ ఈ అంశం ప్రస్తావనకొచ్చింద ని ఆయన తెలిపారు. త్వరలో వ్యర్థాల రీ సైక్లింగ్... ఢిల్లీ తరహాలో నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడం ద్వారా వివిధ పరిమాణాల్లో కంకర, ఇసుక, మట్టి తదితరమైనవి వెలువడే యూనిట్‌ను హైదరాబాద్‌లో త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. నాలుగైదు ప్రాంతాల్లో ఇలాంటివి ఏర్పాటుకు యోచిస్తున్నామని చెప్పారు. దీనికి త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. ఘన వ్యర్థాల(చెత్త) నిర్వహణ కేంద్రాలను కూడా వీలైనన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసే యోచన ఉందన్నారు. -
మహిళలకు ప్రత్యేక సదుపాయం!
పాట్నాః మహిళల ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ బీహార్ ప్రభుత్వం వారికి ప్రత్యేక సదుపాయం కల్పించింది. వాణిజ్య వాహనాలు కొనుగోలు చేసే వారికి వందశాతం పన్ను మినహాయింపును ప్రకటించింది. ప్రజా రవాణా వ్యాపారం చేపట్టాలనుకునే మహిళలు, వికలాంగులను ప్రోత్సహించడంలో భాగంగా వారికి వాణిజ్య వాహనాల కొనుగోళ్ళలో వందశాతం ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ''జీవనోపాధికోసం ప్రజా రవాణా వ్యాపారాన్ని చేపట్టి తద్వారా వాణిజ్య వాహనాలను కొనుగోళ్ళు చేపట్టే మహిళలు, వికలాంగ ప్రజలకు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం పన్ను మినహాయింపును అందిస్తుంది'' అని ట్రాన్స్ పోర్ట్ మంత్రి చంద్రికా రాయ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంలో వెల్లడించారు. లభ్దిదారులు డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించి పన్ను మినహాయింపు పొందవచ్చని ఆయన ఈ సందర్భంలో తెలిపారు. రవాణా శాఖ ప్రతిపాదించిన పన్ను మినహాయింపు బడ్జెట్ డిమాండ్ ను మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. తాజా ప్రతిపాదనల్లో భాగంగా కొత్త వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను తప్పనిసరి చేస్తున్నట్లు కూడ ఈ సందర్భంలో మంత్రి చంద్రికా రాయ్ వెల్లడించారు. ప్రయాణీకుల భద్రతకు రాష్ట్ర రోడ్ సేఫ్టీ అథారిటీ ద్వారా రోడ్ సేఫ్టీ ఫండ్ కోసం కూడ రాయ్ ప్రతిపాదించారు. రోడ్ సేఫ్టేకి సంబంధించిన విషయాలను విద్యార్థులకు ఆరవ తరగతినుంచీ ఎనిమిదవ తరగతి మధ్య పాఠ్యాంశాలుగా బోధించాల్సిన అవసరం ఉందని, ఇలా చేస్తే భవిష్యత్తులో డ్రైవింగ్ సమయంలో ముందు జాగ్రత్తలను పాటించి ప్రమాదాలను నివారించగల్గుతారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇ-రిక్షాలు, ఇ-కార్లకు కూడ అనుమతులు మంజూరు చేయనున్నట్లు రాయ్ ఈ సందర్భంగా తెలిపారు. -
సోనియా, రాహుల్ కు ఊరట..
నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ఊరట లభించింది. వీరిద్దరూ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కానక్కర్లేదని ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు తెలిపింది. సోనియా, రాహుల్ సహా మరో ముగ్గురికి ఈ మినహాయింపును ఇస్తున్నట్లు పాటియాలా హౌజ్ కోర్టు ప్రకటించింది. గతంలో ఇదే కేసులో సోనియా, రాహుల్ వ్యక్తిగతంగా హాజరు కానవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. అప్పట్లో అది పెద్ద ఊరటగా భావించారు. అయితే, దిగువ కోర్టు న్యాయమూర్తి అవసరం అనుకుంటే మాత్రం వాళ్లిద్దరినీ కోర్టుకు పిలవచ్చని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొంది. ఇప్పుడు దిగువ కోర్టు కూడా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వడంతో కోర్టు మెట్లు ఎక్కాల్సిన అవసరం రాహుల్, సోనియాలకు రాలేదు. అలాగే నేషనల్ హెరాల్డ్ కేసులో నిందితుడిగా ఉన్న శ్యామ్ పిట్రోడాకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కేసులోని సోనియా, రాహుల్ సహా ఇతరులు ఇంతకుముందే బెయిల్ పై ఉండగా.. తాజాగా పిట్రోడాకు బెయిల్ మంజూరు చేసినట్లు పేర్కొంది. అనంతరం కేసు విచారణను మార్చి 21 కి వాయిదా వేసింది. -
అపరాధ రుసుం రద్దు
మార్చి 31 వరకు చెల్లించిన వారికే అవకాశం గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వర్తింపు హన్మకొండ : విద్యుత్ వినియోగదారులకు అపరాధ రుసుం నుంచి ప్రభుత్వం మినహా యింపు ఇచ్చాయి. 2016 మార్చి 31వ తేదీ లోపు చెల్లించే వారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. గృహ వినియోగదారులకు, ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాలకు అపరాధ రుసుం నుంచి మినహాయింపు కల్పించారు. 2015 డిసెంబర్ 31వ తేదీ వరకు ఎంత బకా యి ఉన్నదో.. ఆ మొత్తాన్ని ఈ సంవత్సరం మార్చి 31వ తేదీలోపు చెల్లిస్తేనే అపరాధ రుసుం నుంచి మినహాయింపు కలుగుతుంది. ప్రస్తుతమున్న బకాయిలు చూస్తే.. దాదాపు మూడొంతుల బకాయిల్లో రెండు వంతులు అసలు ఛార్జీ కాగా.. ఒక వంతు అపరాధ రుసుం ఉంది. అపరాధ రుసుం రద్దుతో గృహ వినియోగదారులకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఎంతో మేలు జరుగనుంది. మొండి బకాయిలు వసూలు చేసుకోవడానికి విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 2015 డిసెంబర్ 31వ తేదీ వరకు జిల్లాలో గృహ వినియోగదారుల బకాయిలు అపరాధ రుసుం కలుపుకుని రూ.104 కోట్లు ఉన్నాయి. ఇందులో విద్యుత్ వినియోగించుకున్నందుకు చెల్లించాల్సిన మొత్తం రూ.73 కోట్లు కాగా.. ఈ బకాయిలకు రూ.31 కోట్లు అపరాధ రుసుము ఎన్పీడీసీఎల్ విధించింది. మార్చి 31లోపు రూ.73 కోట్లు చెల్లిస్తే రూ.31 కోట్ల అపరాధ రుసుం రద్దు కానుంది. ప్రభుత్వరంగ సంస్థ కార్యాలయాలకు సంబంధించిన బకాయిలు రూ.105 కోట్లు కాగా.. ఇందులో విద్యుత్ విని యోగించుకున్నందుకు చార్జీ రూ.79 కోట్లు. అపరాధ రుసుము రూ.26 కోట్లు ఉంది. -
దేశాదినేతలకు మాత్రమే కేసులనుండి ఊరట
-
ఆదాయ పన్ను కేసులో షారుక్‌కు ఊరట
ముంబై: బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్‌కు ఆదాయ పన్ను చెల్లింపు కేసులో ఊరట లభించింది. గతంలో షారుక్ భార్య గౌరి ఇంటిని కొనుగోలు చేసేందుకు వడ్డీలేని రుణం తీసుకున్నారు. దీనికి సంబంధించి పన్ను చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ నోటీసులు పంపింది. షారుక్ దీనిపై ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి, తనకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఇన్కమ్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ విచారణ జరిపి షారుక్‌కు మినహాయింపునిచ్చింది. -
జగన్ హాజరుకు మినహాయింపు
సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో ఉన్న దృష్ట్యా ఈనెల 21న కోర్టులో తన వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యర్థనను సీబీఐ ప్రత్యేక కోర్టు అంగీకరించింది. తన కంపెనీల్లో పెట్టుబడుల కేసులో ఈనెల 21న జగన్ సీబీఐ కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో హాజరు మినహాయింపు కోరుతూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను అనుమతిస్తూ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి ఎన్.బాలయోగి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. -
నేను చట్టానికి అతీతుడిని కాను: ప్రధాని మన్మోహన్
-
నేను చట్టానికి అతీతుడిని కాను: ప్రధాని మన్మోహన్
న్యూఢిల్లీ: తాను చట్టానికి అతీతుడిని కానని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ బొగ్గు కుంభకోణంలో సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. బొగ్గు గనుల కేటాయింపులో దాచవలసింది ఏమీలేదన్నారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ వైఖరిపై ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనపై ఆయన వివరణ సంతృప్తికరంగా లేదన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి రక్షణ కల్పిస్తామని ప్రధాని చెప్పారు. బొగ్గు గనుల కేటాయింపులపై ప్రధానిని కూడా ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్న విషయం తెలిసిందే. గనుల కేటాయింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ కూడా ప్రధాని మన్మోహన్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గనుల కేటాయింపులో కుట్ర జరిగిందని సీబీఐ భావిస్తే, తుది నిర్ణయం తీసుకున్న ప్రధాని కూడా కుట్ర దారేననని ఆయన అన్నారు. శాఖను నిర్వహించిన మన్మోహన్‌నూ దోషిగా పరిగణించి కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో తాను చట్టానికి అతీతుడేమీకానని, సిబిఐ విచారణకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. -
రాయితీలకు ‘ఆధార్’ తప్పనిసరి కాదు
న్యూఢిల్లీ: ప్రభుత్వ పథకాల ద్వారా వంటగ్యాసుతోపాటు ఇతర రాయితీలు పొందేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదని కేంద్రం శుక్రవారం రాజ్యసభకు వెల్లడించింది. ఏవైనా ప్రభుత్వ శాఖలు ఆధార్‌ను తప్పనిసరి చేస్తే గనక.. దానిని తాము సరిచేస్తామని ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి రాజీవ్ శుక్లా తెలిపారు. బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు, పాఠశాలల్లో ప్రవేశాలకు, పాస్‌పోర్టు పొందేందుకు ఆధార్ తప్పనిసరి కాకున్నా.. కొన్ని ప్రభుత్వ శాఖలు ఒత్తిడి చేస్తున్నాయన్న సభ్యుల ఆందోళనకు మంత్రి సమాధానమిచ్చారు. ఉల్లి ఎగుమతుల నిషేధాన్ని పరిశీలించడం లేదు... ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించడంపై ఎలాంటి ప్రతిపాదననూ ప్రభుత్వం పరిశీలించడంలేదని ఆహార మంత్రి కేవీ థామస్ రాజ్యసభకు తెలిపారు. ఉల్లి ధరలకు ఎగుమతులు కారణం కాదని, నిషేధాన్ని పరిశీలించడం లేదన్నారు. దభోల్కర్కు నివాళులు : పుణేలో ఇటీవల హత్యకు గురైన సామాజిక కార్యకర్త, మూఢనమ్మకాల వ్యతిరేక ఉద్యమకారుడు నరేంద్ర దభోల్కర్కు రాజ్యసభ నివాళులు అర్పించింది. సభ సమావేశం కాగానే దభోల్కర్ హత్యను చైర్మన్ హమీద్ అన్సారీ ప్రస్తావిస్తూ విచారం వ్యక్తంచేశారు. సైబర్ డాటా భద్రతకు చర్యలు... ఇంటర్నెట్ వినియోగదారులపై పర్యవేక్షణ చేపట్టడంపై భారత ఆందోళనను అమెరికాకు తెలియజేసినట్టు ఐటీ మంత్రి కపిల్ సిబల్ రాజ్యసభకు తెలిపారు. అలాగే దేశంలో సైబర్ డాటా భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నట్లు ఆయన చెప్పారు. -
పలు పరిశ్రమలకు రాయితీలు: పీకే మహంతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు పరిశ్రమలకు రాయితీలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్ఐపీసీ) పచ్చజెండా ఊపింది. పారిశ్రామిక విధానం 2010-15 మేరకు వ్యాట్‌తో పాటు విద్యుత్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి రాయితీలు ఇచ్చేందుకు అంగీకరించింది. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి వద్ద బ్రెజిల్‌కు చెందిన గెర్డావ్ కంపెనీ రూ. 1,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే స్టీలు ప్లాంటుతో పాటు రూ. 300 కోట్లతో చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్‌లో ఏర్పాటుకానున్న కోల్గెట్ కంపెనీ టూత్‌పేస్టుల తయారీ యూనిట్, మహబూబ్‌నగర్ జిల్లాలో రూ. 400 కోట్లతో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ యూనిట్, ఖమ్మం జిల్లాలో భద్రాచలం వద్ద 800 కోట్లతో ఐటీసీ విస్తరణ ప్లాంటుకు ఎస్ఐపీసీ రాయితీలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిసింది. అయితే మెదక్ జిల్లా జహీరాబాద్ వద్ద మహీంద్రా అండ్ మహీంద్రా నెలకొల్పనున్న ట్రాక్టర్ల యూనిట్, మోహన్ స్పిన్టెక్స్, నల్లగొండ జిల్లాలో ఏర్పాటైన విశాఖ ఆస్బెస్టాస్ పరిశ్రమలకు ఇచ్చే వ్యాట్ రాయితీలపై పూర్తి సమాచారం ఇవ్వాలని ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమలను ఎస్ఐపీసీ ఆదేశించింది.