న్యూఢిల్లీ: పాఠశాలలే నేరుగా విద్యార్థులకు సరఫరా చేసే ఆహార పదార్థాలు, పానీయాలపై జీఎస్టీ విధించబోమని ఆర్థిక శాఖ తెలిపింది. అలాగే విద్యా సంస్థల్లోని క్యాంటీన్, మెస్‌లలోని ఆహార పదార్థాలకు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా జీఎస్టీని 5 శాతమే వర్తింపజేస్తామని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ఆర్థిక శాఖ ఒక ప్రకటనను జారీచేసింది. ‘హైయర్ సెకండరీ స్థాయి వరకు పాఠశాలలే నేరుగా ఆహార పదార్థాలను సరఫరా చేస్తే వాటికి జీఎస్టీని మినహాయిస్తాం. విద్యా సంస్థల్లోని మెస్, క్యాంటీన్‌లలోని ఆహార పదార్థాలపై ఇన్‌పుట్ క్రెడిట్ ట్యాక్స్ లేకుండా పన్ను 5 శాతమే ఉంటుంది’అని అందులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment