న్యూఢిల్లీ: పాలిస్టర్ లేదా యంత్రంపై తయారైన భారత జాతీయ జెండా అమ్మకంపైనా ఇకపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) మినహాయింపు లభించనుంది. ఆర్థికశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది.
చేతితో నేసిన లేదా అల్లిన పత్తి, పట్టు, ఉన్ని లేదా ఖాదీ జాతీయ జెండాలు ఇప్పటికే జీఎస్‌టీ నుండి మినహాయింపు పొందుతున్నాయి. అయితే పాలిస్టర్, యంత్రంపై తయారైన జాతీయ పతాకాన్నీ జీఎస్‌టీ నుంచి తాజాగా మినహాయిస్తున్నట్లు తెలిపింది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కింద నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగ’ కార్యక్రమం నేపథ్యంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి తాజా వివరణ వెలువడింది.
Comments
Please login to add a commentAdd a comment